Tuesday, 28 April 2026

Blog

అన్నమయ్య

బొప్పాయి విత్తనాల బ్లాక్‌లపై అరికట్టాలి – రైతు సంఘాల డిమాండ్

బొప్పాయి విత్తనాలను బ్లాక్‌లో అమ్మకాలు అరికట్టి, ప్రభుత్వ సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పంది కాళ్ల మణి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో బొప్పాయి సాగు విస్తృతంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు కొరత కారణంగా, దళారులు రెట్టింపు ధరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాలుగు లక్షలకే లభించిన కిలో విత్తనాలు, ఇప్పుడు ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారని, నర్సరీ మొలక ధరలు 11 నుంచి 20 రూపాయలకు పెరిగాయని తెలిపారు. నకిలీ విత్తనాల ముప్పు ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వం అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల ద్వారా నాణ్యమైన విత్తనాలను సబ్సిడీతో సరఫరా చేయాలని కోరారు. నర్సరీలపై పర్యవేక్షణ పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ

శ్రీవారి సేవలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల

పున్నమి ప్రతి నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ ఈటల రాజేందర్ గారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈటల రాజేందర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎంపీ ఈటల రాజేందర్ గారికి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విశాఖపట్నం

కౌలు రైతుల కష్టాలపై ద్రుష్టిసారించిన MLA

కౌలు రైతుల కష్టాలపై ద్రుష్టిసారించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరిగారు కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ను తయారు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు చొరవ చూపి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించమని కోరారు.

తెలంగాణ

మద్యం దుకాణలా లైసెన్స్ ల దరఖాస్తు లకి గడువు అక్టోబర్పెం 23 పు

పున్నమి ప్రతి నిధి తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23 వరకు పొడిగించింది. బ్యాంకులు సెలవుల కారణంగా పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగింపుతో లక్కీ డ్రా తేదీ కూడా వాయిదా పడింది. ఇకపై లక్కీ డ్రా అక్టోబర్ 27న నిర్వహించనున్నారు. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

దీపావళి కి ప్రభుత్వ ఉద్యోగుల కి తీపి కబురు

పున్నమి ప్రతి నిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర ఉద్యోగులకు ఒక డీఏ (మహంగాయితీ భత్యం) పెంచుతూ నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి రూ.160 కోట్ల వ్యయం ఉంటుందని తెలిపారు. పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్‌లో ఒక ఇంస్టాల్‌మెంట్‌ను క్లియర్ చేస్తామని, దీన్ని రెండు విడతల్లో చెల్లింపులు చేస్తామని సీఎం తెలిపారు. ఇందుకు రూ.210 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం 60 రోజుల్లోగా అన్ని సంఘాలతో చర్చించి హెల్త్ కార్డులను పూర్తిగా స్ట్రీమ్‌లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల కోసం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్‌ను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ వయోపరిమితి తొలగించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు చెందిన భవనాలపై ఉన్న ప్రాపర్టీ టాక్స్‌ను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదనంగా, ఉద్యోగుల గౌరవాన్ని పెంచే విధంగా రీ-డిజిగ్నేషన్ ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆనందం నింపాయి.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో కార్పొరేటర్ అల్లు శంకరరావు

విశాఖపట్నం, అక్టోబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, 49వ వార్డు బూత్ నెం.25 పరిధిలో స్థానిక నాయకులు నిర్వహించిన సంతకాల సేకరణలో ప్రధాన అతిథిగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రజల సంతకాలను స్వయంగా సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కాలేజీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేటీకరణతో వైద్యం ఖరీదై, సామాన్యులకు అందని ద్రవ్యమవుతుంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలి,అని ఆయన పిలుపునిచ్చారు. అలాగే “కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని, నిరసనను బలంగా తెలియజేయడం మన కర్తవ్యమని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పల్లా చైతన్య, వార్డు కార్యదర్శులు ఆర్. వెంకటరావు, జెడ్. ప్రసాంత్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, బీసీ సెల్ అధ్యక్షుడు కోన డిల్లీరావు, యువత అధ్యక్షుడు ఇగలపాటి రాజేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురపల్లి ఆనంద, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గల్ల రాంబాబు, మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడు లంక వెంకట సుధాకర్, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, సీనియర్ నాయకులు ఎస్. రాజు, ఎస్. హైమా, బి. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో కార్పొరేటర్ అల్లు శంకరరావు

విశాఖపట్నం, అక్టోబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, 49వ వార్డు బూత్ నెం.25 పరిధిలో స్థానిక నాయకులు నిర్వహించిన సంతకాల సేకరణలో ప్రధాన అతిథిగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, జి.వి.ఎమ్.సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి ప్రజల సంతకాలను స్వయంగా సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కాలేజీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రైవేటీకరణతో వైద్యం ఖరీదై, సామాన్యులకు అందని ద్రవ్యమవుతుంది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలి,అని ఆయన పిలుపునిచ్చారు. అలాగే “కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయాన్ని, నిరసనను బలంగా తెలియజేయడం మన కర్తవ్యమని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పల్లా చైతన్య, వార్డు కార్యదర్శులు ఆర్. వెంకటరావు, జెడ్. ప్రసాంత్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు రిసు చిన్నరావు, బీసీ సెల్ అధ్యక్షుడు కోన డిల్లీరావు, యువత అధ్యక్షుడు ఇగలపాటి రాజేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురపల్లి ఆనంద, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గల్ల రాంబాబు, మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడు లంక వెంకట సుధాకర్, పబ్లిసిటీ విభాగం అధ్యక్షురాలు సోమరపాటి కనకమహాలక్ష్మి, సీనియర్ నాయకులు ఎస్. రాజు, ఎస్. హైమా, బి. దుర్గ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

బీసీ బంద్ సంపూర్ణంగా బంద్.. బేడ బుడగ జంగం నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్ల వెంకటేష్

పున్నమి అక్టోబర్ 19 దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బంద్ పిలుపు మేరకు శనివారం రోజున షాద్నగర్ నియోజకవర్గం లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్ల వెంకటేష్, రాష్ట్ర నాయకులు సిరిగిరి శీను, ఆధ్వర్యములో స్వచ్ఛందంగా మండలం బంద్ లో వివిధ కుల సంఘాలు నాయకులు ,ప్రజలు పాల్గోన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్సీలకు ఎస్టీలకు బీసీ లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అన్నారు బీసీ లను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి అన్నారు బీసీ లు లేవకుండా అనగా నొక్కుతున్నాయి అని తెలిపారు బీసీ బందు సంపూర్ణంగా బందు కావడంతో బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం నాయకులు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్య – బోరుబావి శంకుస్థాపన

విశాఖపట్నం, అక్టోబర్ 19: శనివారం 90వ వార్డ్ బుచ్చిరాజుపాలెం ఎస్సీ కాలనీ నివాసులు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ ని కలసి విన్నవించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సూచనల మేరకు కార్పొరేటర్ బొమ్మిడి రమణ వెంటనే జీవీఎంసీ నిధులతో బోరుబావి మంజూరు చేయించి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వాటర్ సప్లై డిఇ వీరయ్య, ఏఇ, గోవింద్, సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బొత్స రాజు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. — కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ రమణ స్పందన విశాఖపట్నం: APSEB కాలనీ, సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఏడాకుల చెట్ల నుంచి వచ్చే గాలి ప్రమాదకరమని కాలనీ వాసులు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కి విన్నవించగా, ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గణబాబు సూచనలతో ఆర్టీకల్చర్ శాఖ అధికారులతో మాట్లాడి ప్రమాదకరమైన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని కార్పొరేటర్ తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ 4 వ రోజు డివిజన్ ల పర్యటన -బూత్ స్థాయి లో ప్రజా సమస్య లపై సమీక్ష, పార్టీ బలోపేతమే లక్ష్యం

పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు, ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల ప్రకారం ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ గారు 4వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు 49వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ సీనియర్ నాయకులు ఈశ్వర పనుల రామారావు ఆధ్వర్యంలో, శక్తి కేంద్ర ఇన్‌చార్జి మరియు టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఈశ్వర్ ప్రగడ లలిత సమక్షంలో 126, 127, 128 పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. బూత్ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. వెంకటనారాయణ గారు మాట్లాడుతూ, బూత్ స్థాయి బలమైనప్పుడు పార్టీ మరింత శక్తివంతమవుతుందని, ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పార్టీ పైనికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ప్రజల మద్దతుతో ఖమ్మం నగరంలో పార్టీ ఆధిపత్యం పెంపొందించాలనే సంకల్పంతో పర్యటన కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ప్రధాన కార్యదర్శులు రుద్రగాని మాధవ్, కన్నే కంటి కృష్ణచారి, పాశం శ్రీనివాసరెడ్డి, భూక్య వెంకట్, ఇనుగుర్తి ఉపేంద్ర, దాసరి వీరభద్రం, సీనియర్ నేతలు దాసరి మధు, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.