Tuesday, 28 April 2026

Blog

E-పేపర్

చెరువును తలపిస్తున్న నెల్లూరు సండే మార్కెట్

నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్:19. నెల్లూరు సిటీ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గర సండే మార్కెట్ గత నాలుగు రోజులు గా కురుస్తున్న వర్షాలకు సైడ్ కాలువలు పొంగి పొర్లి గాంధీ బొమ్మ దగ్గర నుండి సాయిబాబా గుడి, సండే మార్కెట్ సుబ్రహ్మణ్యం స్వామి గుడి తదితర ప్రాంతం అంతా జలమై పోయింది. చిన్న పాటి చెరువు ను తలపిస్తూ ఉన్నది. ప్రజలు సండే మార్కెట్ తదితర ప్రదేశాలు కు వెళ్లాలంటే అనేక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా శ్రద్ద వహించి వర్షాకాలం లో ప్రజలు కు ఇబ్బంది లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పారిశుధ్యం మెరుగు పరిచి అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుచున్నారు.

హైదరాబాద్

బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తూ నివాళులు అర్పించిన

పున్నమి అక్టోబర్ 19 హైదరాబాద్: తార్నాక చింతల్ బస్తిలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అరుణిత్యం ప్రజల కోసం తపించిన మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం రోజున పూలమాల వేస్తూ నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి స్ఫూర్తి ముందుకు తీసుకెళ్లాలని బహుజనులు ఏకమై రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వాడవాడలో అంబేద్కర్ కి పూలమాలలు వేస్తూ నివాళులర్పించాలని రేపు రాబోయే రాజ్యం బహుజన్లది అని తెలియజేస్తున్న చింతల్ బస్తి పెద్దలు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు ఎండి అప్సర్ బై టీ నర్సింగ్ రావు ఇది 225వ వారం అని చింతల్ బస్తి కాలనీవాసులు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపం తొలగించాలంటూ రిలే నిరాహార దీక్ష

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో బస్టాండ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపాన్ని తొలగించాలం టు రిలే నిరాహార దీక్ష చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకరుమిల్లి రవికుమార్. ఈ దీక్ష ఆదివారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. బస్టాండ్ స్థలం ఆక్రమాకు గురైన కనీసం ఆర్టిసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చర్యలు తీసుకోకపోవడం దారుణమని కళ్యాణ మండపం లీజుదారుడకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు .బస్టాండ్ ను పునరుద్ధరించి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రవికుమార్ దీక్షకు పిడిఎస్ యు నాయకులు రేవు తిరుపతిరావు మాల మహానాడు నాయకులు వెండి కృష్ణ బాబు గిడ్డి ప్రసాద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

విశాఖపట్నం

అవతరణ దినోత్సవానికి నోచుకోని ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం అక్టోబర్ పు న్నమి ప్రతినిధి: తెలుగుదండు ఆధ్వర్యవంలో, మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద..”అక్షతులైరి… ఆంధ్రులు” అంటూ..పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులతో తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి తెలుగు తల్లికి పూలమాల సమర్పించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖాంశాలు.. అయ్యా..!ఈ సంవత్సరం నుంచి అయినా “నవంబరు-1″న మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి. కనీసం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేని మీరు ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తామంటే ఎలా నమ్మగలం..? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందేగాని, మన రాష్ట్రం కాదు. కాబట్టి.. నవంబరు-1వ తేదీ యథావిధిగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇందులో ఎటువంటి తబ్బిబ్బు లేదు. గతంలో కూడా మీరు మీమాట నెగ్గించుకొనుటకు ఆంధ్రప్రదేశ్ కు అవతరణ దినోత్సవం నిర్వహించకుండానే..మీరు కూడా నిష్క్రమించారు. ఇప్పటికైనా.. భేషజాలకు పోక మామాట మన్నించండి, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరిపించండి. మరొక్క మనవి.. అధికార భాషా సంఘం స్థానంలో “మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ”ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి, తెలుగుభాషను కాపాడగలరని ప్రార్థన. గతంలో అంటే..2014 నుండి 2019 వరకూ కనీసం అధికార భాషా సంఘాన్ని కూడా నియమించక, తెలుగు భాషను అనాథను చేశారు. ఇప్పటికైనా.. భాషావేత్తల , భాషాభిమానుల సూచనలు మన్నించి తెలుగు భాషాభివృద్ధికి బాటలు వేయండి. కావున మాయందు దయయుంచి, మా మాటలలోని పారుష్యాన్ని మన్నించి.. రేపటి నవంబరు-1న మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించగరని, మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయగలరని నమ్ముతున్నాము.

అన్నమయ్య

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన పటాసుల యాజమాన్యులు

దీపావళి సందర్భంగా టపాసులు విక్రయానికి లైసెన్స్ లో దక్కించుకున్న పటాసుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా అంగళ్లు నిర్వహించారు. పటాసుల దుకాణాలకు అంగడికి మూడు మీటర్లు గ్యాప్ ఉండాల్సిందిగా నిబంధనలో ఉంది. కానీ నందలూరులో మాత్రం దీనికి వ్యతిరేకంగా అంగళ్లు నిర్వహించడం జరిగినది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే షాపులన్నీ దగ్ధమయ్యే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

విశాఖపట్నం

డ్రోన్లు సహాయం తొ హరిత విశాఖ సాధిద్దాం డి వీ రమణ మూర్తి అదనపు కమీషనర్ జీవీఎంసీ

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: డ్రోన్లు సహాయంతో హరిత విశాఖ సాధిద్దాం. – స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలి – జీవ వైవిద్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలి – దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి – డివి రమణమూర్తి, అదనపు కమిషనర్, జివిఎంసి డ్రోన్లు సహాయంతో విత్తనాలు జల్లి హరిత విశాఖ సాధిద్దాం అని జివిఎంసి అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పిలుపునిచ్చారు. స్వచ్చంద్ర స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పార్క్ లో స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్లు సహాయంతో సమస్త జీవరాసకి ఆహారాన్ని ఇచ్చే, పక్షులు గూళ్ళు పెట్టుకునే, ఔషధ గుణాలు ఉన్న, దేశీయ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు జల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిద్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి అన్నారు. స్వచ్చాంధ్రా స్వర్ణాంధ్రలో భాగంగా జీవీఎంసీతో కలసి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో తెల్ల వంగ, నల్ల వంగ, పచ్చిమిర్చి ,టమాటా , బంతి నారు రెండు లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సగం ప్రభుత్వ వసతి గృహాలకు అందజేయడం జరిగింది. 25 వేల రూపాయల దేశీయ కూరగాయ విత్తనాలు కొండలపై చల్లడానికి అందజేయడం జరిగింది, గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు అందజేయడం జరిగింది. సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం వారు 30 వేల సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. మిషన్ గ్రీన్ భీమిలి 25000 సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఎపి పిసిబి, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచులు 400 పంపిణీ చేశారు. జివిఎంసి తో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ, మిషన్ గ్రీన్ భీమిలిల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి మొక్కల విత్తనాలు, దేశీయ కూరగాయ, ఆకుకూరల మొక్కల విత్తనాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎం ఒ డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, టిడిపి నాయకులు గంటా నూకరాజు, జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు, ఎస్ ఆర్ యు-జివిఎంసి ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ ప్రతినిధులు జెవి రత్నం, రాజేశ్వరి, మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధి డాక్టర్ ఆదిత్య, విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రాణదాతలను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తా* ఎం ల్ ఎ వెలగపూడి

*ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి* *పలువురు వైద్యులు.. గురువులకు ఘనంగా సత్కారం* విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి: సమాజంలో ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైద్యులను తన చేతుల మీదుగా సత్కరించుకోవడం అభినందనీయమని విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఆదివారం ఇక్కడ ఎంవిపి కాలనీలో ప్రముఖ పలమనాలజిస్ట్ కేత ఫణిందర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వైద్యులను.. గురువులను రామకృష్ణ బాబు చేతుల మీదుగా సత్కరించారు.. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన ఘనత డాక్టర్ ఫణీందర్ కు దక్కుతుందన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రత్యక్ష ..పరోక్ష పద్ధతిలో అనేకమంది రోగులకు ఆయన సేవలు అందించారు అన్నారు. అందుకు ఆయనకు అనేక అవార్డులు లభించినట్లు చెప్పారు… అలాగే ఇప్పుడు తన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రక్తదాన శిబిరం.. మందులు పంపిణీ కూడా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.. తన చేతుల మీదుగా ఎంతోమంది సీనియర్ ప్రముఖ వైద్యులను అలాగే గురువులను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. శిబిరం నిర్వహకులు డాక్టర్ కే ఫణిందర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం లివర్.. లంగ్స్ ఫంక్షన్. ఎకో .. గుండెకి సంబంధించిన 16 రకాలు పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు మెడికవర్ .. ఇండస్ ఆసుపత్రిలు తమ వంతు సహకారం అందించినట్లు చెప్పారు.. అలాగే పలువురు వైద్యులు కూడా ఉచితంగానే తనిఖీలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రికి వచ్చే వారికి వీలైనంత మేరకు వైద్య సహాయం అందిస్తున్నట్లు వివరించారు . గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులుకు డాక్టర్ ఫణిందర్ సహకారం అందించారన్నారు.. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సునీత. డాక్టర్ జి సుధారాణి.. డాక్టర్ శ్వేత.. డాక్టర్ మాఊరు కృష్ణమోహన్ . వైద్యులు మాధవి లత.. విద్యాసాగర్. తనకు విద్య నేర్పిన గురువులు వసుంధర,రోహిణి తదితరులు అందరినీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుగత సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, వార్డ్ అధ్యక్షులు సత్తిబాబు,. జానాపురం హోల్సేల్ మార్కెట్ కమిటీ సభ్యులు కోరుబిల్లి ప్రసాద్, యువ వైద్యులు నీరజ్ ప్రసాద్, రవి, శ్రీనివాస్ తదితరులంతా పాల్గొన్నారు

విశాఖపట్నం

మానవత్వం చూపించిన హోమ్ మినిస్టర్ అనిత

నక్కపల్లి అక్టోబర్ పున్నమి ప్రతినిధి (విశాఖపట్నం) అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఓ యువకుడు బైక్ ప్రమాదంలో గాయపడగా.. అదే సమయంలో నెల్లూరు వెళ్తున్న హోం మంత్రి అనిత వెంటనే స్పందించి తన కాన్వాయ్ ఆపి యువకుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతడిని తక్షణం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

విశాఖపట్నం

సేవ కార్యక్రమాలతోనే సమాజ ప్రగతి 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు

*సేవా కార్యక్రమాలతోనే సమాజ ప్రగతి* *చిన్నారులకు పట్టుచీరలు పసుపు కుంకమలు.. వెండి పట్టీలు* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: సమాజంలో ప్రగతి సాధించాలంటే అందుకు ఎవరికి తోచిన రీతిలో వారు సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే సాధ్యమవుతుందని జనసేన పార్టీ నాయకులు 32 వ వార్డు కార్పొరేటర్ కందులనాగరాజు అన్నారు.. ఆదివారం ఇక్కడ ఎల్లపు వారి వీధికి చెందిన ఆశ నేరెళ్ల కోనేరు కు చెందిన గాయత్రి లకు వారి శుభకార్యాల సందర్భంగా నూతన పట్టు చీరలు పసుపు కుంకుమలు వెండి పట్టీలు కానుకగా అందజేశారు . అలాగే ఇద్దరు చిన్నారులను కందుల ఆశీర్వదించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిధి మేరకు సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.. అందుకోసం ప్రత్యేకంగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశానన్నారు.. అనాధలకు నిరుపేదలకు నిరంతరం ఆపన్న హస్తం అందిస్తున్నట్లు చెప్పారు. నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు చిన్నారుల శుభకార్యాలకు పట్టు వస్త్రాలు ఇతర సామాగ్రి.. నిత్యవసర వస్తువులు పంపిణీ . చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇలా నిరంతరం అనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయా కార్యక్రమాలకు గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజ సేవలో కందుల ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. తన పరిధి మేరకు రోజు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపట్టడం అందరికీ సాధ్యం కాదన్నారు. దాతృత్వం కలిగి ఉంటేనే దానం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.. అనంతరం చిన్నారులును వారు తల్లిదండ్రులు తో కలిసి నాగరాజు .. గంట్ల శ్రీనుబాబు, శోభన్ బాబు ఫ్యాన్స్ సిటీ అధ్యక్షులు కనకరాజు. వార్డులో నేతలు కే కృష్ణ.. సిపిఐ బుజ్జి.. కే అప్పారావు.. నాగేంద్ర.. కుమారి ..వర ..శ్రీదేవి.. కొండమ్మ.. జానకి .mవై ఆది బాబు.. బాబులు శీను తత్తులంతా పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.. 32 వార్డులో కందుల నాయకత్వం వర్ధిల్లాలంటూ అక్కడ ప్రజలు జేజేలు పలికారు

ఖమ్మం

బీసీ బంద్ లో బీజేపీ నాయకులు మీద కాంగ్రెస్ నాయకులు దాడి. దాడి లో గాయపడిన వారిని పరమర్శించిన జిల్లా కమిటీ

పున్నమి ప్రతి నిధి బీసీ బంద్ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ దాడిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయ్, బీజేపీ నాయకుడు నాయుడు రాఘవ గాయపడినట్లు సమాచారం. గాయపడిన నాయకులను బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రిలో పరామర్శించి, వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనమవడంతో ప్రజల మద్దతు కోల్పోయింది. అందుకే భయంతో దాడులకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ఇది అంగీకారయోగ్యం కాదు. దాడికి పాల్పడిన వారిపై పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి రమేష్, సుదర్శన్ మిశ్ర, వీరమ్రాజు నంబూరి రామలింగేశ్వరరావు, దొంగల సత్యనారాయణ, గుత్త వెంకటేశ్వర్లు, బోయినపల్లి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, బీసీ హక్కుల కోసం జరుగుతున్న న్యాయమైన బంద్‌కి బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని, ప్రజల సమస్యలను అణగదొక్కే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా బంద్ నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు హింసకు తెగబడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడిచి, బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, ప్రజాస్వామ్య హక్కులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.