Monday, 27 April 2026

Blog

Blog

పరమాత్ముని మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారం

పరమాత్ముని ఆజ్ఞలను ప్రవక్త పద్ధతులలో అవలంబించి మనిషి మనశ్శాంతి పొందగలుగుతాడని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మౌలానా అబ్దుల్ వహీద్ నవమని పేర్కొన్నారు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మౌలానా అబ్దుల్ వహీద్ నౌమని వేంచేశారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష నంద్యాల రోడ్డులో గల మక్కా మసీదు నందు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని పలువురు ప్రముఖ ముస్లిం సోదరులు ఆయనను కలిసి తమ సమస్యల పరిష్కారం కోరారు. మనిషి ఎప్పుడైతే ఆ పరమాత్మని ఆజ్ఞలను ప్రవక్త అడుగుజాడల్లో అమలు చేస్తారో అలాంటి చోట శాంతి సుఖాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు తాము తమ కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు భయాలను ఆయన ముందర ప్రస్తావించారు. సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కారం ఒకటేనని అది ఆ పరమాత్ముని మార్గమేనని అందుకు అనుసరించాల్సిన జపాలను, పద్ధతులను వారికి వివరించారు. మనిషి అత్యాశకు పోయి స్వార్థంతో ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా నేను ఒక్కడినే బాగుంటే చాలు అన్న ధోరణి విడవాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ప్రవక్త ప్రవచనాలనుఅనుసరించినప్పుడు సమస్యలు వాటికై అవే సమస్య పోతాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి పరోపకారం ఇధం శరీరం అన్న సూక్తిని అనుసరించాలన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రముఖ పుర ప్రముఖులు వలి షేక్ హర్షద్ అబ్దుల్ ఖాదర్ బాబా షేక్ దస్తగిరి అమీర్ భాష గౌస్ పీర్ ఆటో గౌస్ మసీదుల్లా నాయక్ సిమెంట్ పని మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Blog

అక్టోబర్ 20 వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలిక రద్దు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ IPS

అక్టోబర్ 20 వ తేదీ దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగవలసిన” ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS)కార్యక్రమము తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ IPS నేడు ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్పీ PGRS కార్యక్రమమునకు రావొద్దని తెలిపారు జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు వచ్చే సోమవారం(అక్టోబర్ 27 వ తేది ) నుండి జిల్లా పోలీసు కార్యాలయంలో “ పోలీసు PGRS కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు-టూ టౌన్ సిఐ

శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన టపాకాయల దుకాణాలను పరిశీలించి,వారు ఫైర్ స్టేషన్ సిబ్బందితో కలిసి టపాకాయలు కాల్చేటప్పుడు చేయవలసిన మరియు చేయకూడని కొన్ని సూచనలకు సంబంధించి బ్యానర్ అక్కడ ఏర్పాటు చేశారు.ముఖ్యంగా చిన్నపిల్లలు టపాకాయలు కాల్చే ముందు తల్లిదండ్రులు దగ్గరుండి జాగ్రత్తలు పాటిస్తూ కాల్చాలన్నారు.ముఖ్యంగా పేలని మరియు సగం కాలిన టపాకాయలను నీళ్లతో గాని మట్టితో ఆరుపాలని సూచించారు.ఈ లైసెన్సు లేకుండా టపాసులు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేడ బుడగ జంగం ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు BJHPS సీనియర్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గగనం మన్యం

పున్నమి అక్టోబర్ 19 తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా: ఈదీపావళి పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపుతూ, సంతోషం, ఆరోగ్యం, విజయాలు, శాంతి, ఐక్యత మీ ఇంటిలో నెలవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు పలువురు ప్రేమగా పంపే దీపావళి సందేశాలు‘‘దీపావళి యొక్క అందం మీ ఇంటిలో సంతోషాన్ని నింపాలని, ఏడాది పొడవునా నవ్వులు, ఆనందం ప్రతిధ్వనించాలని. దీపావళి శుభాకాంక్షలు! ఈ దీపావళి పండుగ, మీ జీవితంలో కొత్త ఆశలకు, విజయాలకు, శ్రేయస్సుకు మార్గాన్ని చూపాలి. మీకు హ్యాపీ దీపావళి. దీపపు వెలుగులో చీకట్లు తొలగినట్లే, ప్రేమ వెలుగులు మనసులో విరజిమ్మాలనుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!అష్టలక్ష్మితో కూడిన అద్భుతమైన సుఖసంపదలు, సంతోషాలు, ఆరోగ్యాన్ని మీ ఇంటికి వరం కలగాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

E-పేపర్

హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ మృతికి మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూఖ్ నివాళులు*

జమియత్ ఉలేమా ఎ హింద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ మరియు హజ్ కమిటీ చైర్మన్ హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూఖ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంలో ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హజ్రత్ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ గారు మరణం ముస్లిం సమాజానికి మరియు రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. మతపరమైన, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా, హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని, మైనార్టీల సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ దివంగత మౌలానా పీర్ షబ్బీర్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు మరియు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Blog

నంద్యాల జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ”ఈ దీపావళి పర్వదినం నంద్యాల జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అన్నారు . ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సురక్షితంగా, అన్యోన్యంగా ఉంటూ, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని” ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని, ఈ పండుగ చీకట్లను పారదోలి వెలుగును, ఆశను నింపే గొప్ప పండుగ అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు

Blog

నంద్యాల జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ”ఈ దీపావళి పర్వదినం నంద్యాల జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి ఇంట సుఖసంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అన్నారు . ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సురక్షితంగా, అన్యోన్యంగా ఉంటూ, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని” ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని, ఈ పండుగ చీకట్లను పారదోలి వెలుగును, ఆశను నింపే గొప్ప పండుగ అని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు

హైదరాబాద్

లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకం -తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక :ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 3456 లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. రైతాంగానికి న్యాయం చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల కోసం నిజాయితీతో పనిచేయాలని, ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని సర్వేయర్లను ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Featured

అయోధ్య లో 26 లక్షల దీపాలతో అద్భుత దృశ్యం -రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించిన దీపోత్సవం :హాజరైన ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్

పున్నమి ప్రతి నిధి అయోధ్యలోని పవిత్ర సరయూ ఘాట్‌ వద్ద 26,17,215 దీపాలు వెలిగించి భక్తి, విశ్వాసం, సనాతన ధర్మం యొక్క మహిమను ప్రతిబింబించే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మహా దీపోత్సవం ఒకేసారి అత్యధిక దీపాలు వెలిగించడం మరియు భక్తులు దీప ప్రదక్షిణ చేయడం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకకు హాజరై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రాన్ని ప్రకాశవంతం చేసిన ఈ ఘట్టాన్ని సాక్షిగా చూశారు. భక్తి, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం వెలుగులు ఈ రాత్రి అయోధ్యను మంత్ర ముగ్ధం చేశాయి.

తిరుపతి

ముక్కంటిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచనలు మేరకు శ్రీజ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్రకి శ్రీకాళహస్తి బిజెపి నాయకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనము చేసుకున్న వారికి వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు,చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ మోహన్ పి.ఆర్.ఓ రవి, గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ గరికిపాటి రమేశ్,చందు రాయల్,రమేష్ నాయుడు తదితరుల పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.