Monday, 27 April 2026

Blog

అల్లూరి సీతారామరాజు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్యులకు వైద్య విద్య అందని ద్రాక్ష కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:19 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అరకులోయ నియోజకవర్గం, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపూట్, కొర్రాయి గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించింది. దీనిలో భాగంగా ఆదివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆద్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గత మా వైసీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నగదుతో నిర్మిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్న ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమని అన్నారు. ప్రజల పన్నులతో కడుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్న తరుణంలో, పేద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే సామాన్య, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాలు మరియు రచ్చబండ కార్యక్రమం ఉద్దేశ్రమని ఎమ్మేల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల ప్రజలు పంచాయితీలలో పలు సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందించడం ఈ కార్యక్రమంలో వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం, డుంబ్రిగూడ మండలం వైస్ ఎంపీపీలు పంచాడి లలిత కుమారి గారు,శెట్టి ఆనంద్, మండల సర్పంచులు ఫోరం అధ్క్షులు కిముడు హరి, గుమ్మ నాగేశ్వరరావు, పట్టేదొర రామ్మూర్తి, డుంబ్రిగూడ మండల సూపర్ జడ్పీటీసీ చాటారీ కృష్ణారావు, డుంబ్రిగూడ మండల సూపర్ ఎంపీపీ బాకా సింహాచలం, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి పాంగి నరసింగరావు, వైసీపీ డుంబ్రిగూడ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చిక్కుడు మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి మట్టం శంకర్, దశమి, గ్రామస్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కేకే రైల్వే లైన్లో పడిన బండరాయి… హుటాహుటిన పుణరుద్దరణ పనులు

అనంతగిరి(పున్నమి ప్రతినిధి) మండలం లోని కేకే రైల్వే లైన్లోని తైడా-చిముడుపల్లి స్టేషన్ల మధ్య ట్రాకపై ఆదివారం తెల్లవారు జామున పెద్ద బండరాయి విరిగిపడింది. అదే టైంలో విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజను దెబ్బతిని పట్టాలు తప్పి రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై బండరాయి తొలగించి ట్రాక్ పుణరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం విశాఖ నుండి బయలుదేరే విశాఖ-కిరండూల పాసింజర్ రైలు రద్దు చేశారు. ట్రాక్ పుణరుద్ధరణ పనులు ఆదివారం మధ్యాహ్నంకు పూర్తవడంతో రైళ్ళ రాకపోకలను అనుమతించారు.

అల్లూరి సీతారామరాజు

హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా గుమ్మకోట లో బహిరంగ సభ ప్రాజెక్ట్ లను, జీవో నెం. 2,13,51లను రద్దు చేయాలని గిరిజనుల డిమాండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో గిరిజన ప్రాంతం జల సమాధి చేయొద్దు: సీపీఎం కేందర కమిటీ సభ్యులు పుణ్యావతి

హైడ్రో పవ అనంతగిరి (పున్నమి), అక్టోబర్ :19 గుజ్జేలి హైడ్రోపార్ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యతిరేక కమిటీ ఆధవర్యంలో అనంతగిరి మండలం గుమ్మకోట లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య వక్త గా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి హజరై మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల వలన ఆదివాసీలకు కలిగే ప్రయోజనం ఏమి లేదని, ప్రాజక్టులతో గిరిజన ప్రాంతాన్నిశజల సమాధి చెయ్యవద్దని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అటవీ పర్యావరణ అనుమతులు జిఓ నెంబర్ 51,13, 2 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం నిర్మించి కొనసాగిస్తున్న సీలేరు, మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రాల వలన ఎంత మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామి ప్రకారం జీవో నెం. 3ని పుణరుద్దరించి స్ధానిక గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పాచిపెంట అప్పలనరస, పొద్దు బాలదేవ్, టోకూరు సర్పంచ్ కిల్లో మొస్య తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

లాస్య రెడీమేడ్స్ అండ్ దీపావళి లక్కీ డ్రా

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక ఎంజి రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ మిద్దె పైన ఉంటున్న లాస్య రెడీమేడ్ శారీస్ దీపావళి లక్కీ డ్రా తీయడం జరిగినది అని షాపు యజమానీ గాదేల నాగరాజ తెలిపారు. అలాగే లక్కీ డ్రా లో మొదటి ప్రైజ్ విజేత జోష్ణ ,రెండో ప్రైస్ విజేత బైసాని సుజాత, మూడో ప్రైస్ విజేత నరసింహులు వీరందరికీ గిఫ్ట్ ప్యాక్ టపాసులు అందించడం జరిగినది. ఖాతాదారులు మాట్లాడుతూ మీ దగ్గర రెడీమేడ్ అండ్ సారీస్ కొనడం చాలా సంతోషంగా ఉన్నదని అంతేకాకుండా ఇలాంటివి ఖాతాదారులకు చాలా గమ్మత్తుగా ఉంటుందని వారు తెలిపారు. ఖాతాదారులకు లాస్య రెడీమేడ్ అండ్ సారీస్ యజమాని గాదెల నాగరాజా ఖాతాదారులు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

జనగాం

_దాతల సహాయం కోసం ఎదురుచూపు_*

*మిదికొండ గ్రామానికి* చెందిన జోగు కళ్యాణ్ గారు రోడ్డు యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలైన జోగు కళ్యాణ్ మెదడులో రక్తం గడ్డ కట్టడం జరిగింది..అతను ఎంజీఎమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..దాతలు మానవతావాదురు తోచినంత ఆర్థిక సహాకారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలి అని తల్లితండ్రులు వేడుకుంటున్నారు..ఫోన్ పే మరియు గూగుల్ పే నంబర్ 7989034797 పేరు జోగు కళ్యాణ్… ERO JANGOAN BRANCH 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

E-పేపర్

లాస్య రెడీమేడ్స్ అండ్ దీపావళి లక్కీ డ్రా

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక ఎంజి రోడ్ లో యాక్సిస్ బ్యాంక్ మిద్దె పైన ఉంటున్న లాస్య రెడీమేడ్ శారీస్ దీపావళి లక్కీ డ్రా తీయడం జరిగినది అని షాపు యజమానీ గాదేల నాగరాజ తెలిపారు. అలాగే లక్కీ డ్రా లో మొదటి ప్రైజ్ విజేత జోష్ణ ,రెండో ప్రైస్ విజేత బైసాని సుజాత, మూడో ప్రైస్ విజేత నరసింహులు వీరందరికీ గిఫ్ట్ ప్యాక్ టపాసులు అందించడం జరిగినది. ఖాతాదారులు మాట్లాడుతూ మీ దగ్గర రెడీమేడ్ అండ్ సారీస్ కొనడం చాలా సంతోషంగా ఉన్నదని అంతేకాకుండా ఇలాంటివి ఖాతాదారులకు చాలా గమ్మత్తుగా ఉంటుందని వారు తెలిపారు. ఖాతాదారులకు లాస్య రెడీమేడ్ అండ్ సారీస్ యజమాని గాదెల నాగరాజా ఖాతాదారులు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

జనగాం

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు

*హన్మకొండ* *తేదీ:20.10.2025* *దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……* దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని పేర్కొన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయ‌డం కూడా దీపావళి పండగ యొక్క విశిష్టత అని తెలిపారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు. మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందని వెల్లడించారు. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకాంక్షించారు. పటాకులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా, అనందంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజాసంఘాలు ఉద్యమం ఉదృతం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఆర్టీసీ బస్టాండ్ లో ఆక్రమణులు తొలగించాలని తక్షణమే ప్రయాణికులకు బస్టాండ్ ను అందుబాటులోకి తీసుకురావాలని, రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకిరిమిల్లి రవికుమార్ కు మద్దతుగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ,యువజన సంఘాలు మహిళా సంఘాలు ,మాల మహానాడు ప్రజా సంఘాలు ఈనెల 21న మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. స్థానిక సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ⁷స్టాండ్ ను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ,లీజిదారుడు యొక్క లీజును రద్దుచేసి రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ,బస్టాండ్ స్థలంలోని ఫంక్షన్ హాలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నిర్వహించాలని బస్సు స్టాండ్ లోకి బస్సులు రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ,బస్టాండ్ లోని కౌంటర్ ను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లు శుభ్రం చేసి సరైన ఏర్పాట్లు చేయాలని అనే డిమాండ్లతో రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాలు ,వామపక్ష సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు పిడిఎస్ నాయకులు ,రేవు తిరుపతిరావు, మాల మహానాడు నాయకులు మెండి కృష్ణబాబు ,నీలం చిన్నబాబు, గిడ్డి ప్రసాద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు

జనగాం

ధాన్యం కొనుగోలు ప్రారంభం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 20.10.2025* *కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి ప్రభుత్వం…..* *రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు…..* *ధాన్యం కొనుగోలుకు 23వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం….* *ఈ సీజన్ నుండి మద్దతు ధరతో పాటే బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమ….* *రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి…..* *దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జూలూకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి గారు తెలిపారు.* చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను లావణ్య శిరీష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త్రాగు నీరు, విద్యుత్ లైట్లతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా డబ్బులు అడిగితె తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి 2389రూపాయలు, రెండవ గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో వారం రోజుల లోపలనే జమ కానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొవాలని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని కోరారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లో 9వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఒక చరిత్ర అని కొనియాడారు. సన్నాలకు 500రూపాయల బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలబడుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు 23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, సీజన్ కు 4నుండి 5వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కూడా రైతులకు పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డమీది సురేష్ గారు, మాజీ ఎంపీపీ సరిత బాలరాజు గారు,ఘనపూర్ మండల అధ్యక్షులు శీరిష్ రెడ్డి గారు,మండల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఊరడి రాజు గారు, లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఏదునూరి రవీందర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు కంకటి నరేందర్ గారు, మండల్ బీసీ సెల్ అధ్యక్షులు కండ్లకోలు బాలరాజు గారు, PACS చేర్మెన్, PACS డైరెక్టర్లు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.