Monday, 27 April 2026

Blog

భక్తి

సాఫీల్గూడలోని శ్రీ దుర్గా జ్యోతిష్యాలయంలో కార్తీక మాస పూజలు ఆరంబం.

అక్టోబర్ 20, హైదరాబాద్ (పున్నమి ప్రతినిధి) పురోహితులు శ్రీ మూగు నాగరాజు శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక మాస మాహ్ోత్సవ కార్యక్రమం ఈ నెల 22 అక్టోబర్ 2025 న ప్రారంబమయీ వచ్చే నెల 20 నవంబర్ 2025 నా ముగుస్తాయి. శ్రీ దుర్గా జ్యోతిష్యాలయంలో ప్రతి రోజు ఉదయం 6:00 గ||లకు శివాభిషేకం జరుగును, ప్రతి సోమవారం మరియు మాస శివ రాత్రి రోజులలో ఉదయం 7:30 ని||లకు రుద్ర హ్ోమం జరుగును. అదే విదంగా 02 నవంబర్ 2025 రోజున ఉదయం 8:30 ని||లకు గోపూజ, ఉదయం 9:30 ని||లకు మహాలింగార్చన మరియు మద్యానం 12:30 ని||లకు అన్నప్రసాదా వితరణ జరుపబడును. కావున ఆసక్తిగల భక్తులు తమ గోత్ర నామాలు ముందుగానే నమోదు చేసుకోవాల్సివుంటుంది. రుసుము, గోత్ర నామాల నమోదుకు మరియు ఇతర వివరాలకు ఈ నెంబర్లను 9866472571 & 9441125475 సంప్రదించాలి అని శ్రీ మూగు నాగరాజు శర్మ గారు తెలియచేసారు. సురేష్ (జర్నలిస్ట్ ) End

విశాఖపట్నం

15 సంవత్సరాల లో JanaSena Party ఎక్కడ ఉంటుందో మీ మీ ఊహలకే వదిలేస్తున్నా

నా అంచనా ఐతే, ప్రతీ విషయం పరిగణించబడుతుంది, పరిశీలించబడుతుంది, ప్రక్షాళన కూడా జరుగుతుంది. 25 సంవత్సరాల ముందస్తు ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే బుర్రలో ఉంటాయి అనుకుంటే? పొరపాటే ! పదవుల కోసం వచ్చిన వాడు కాదు, అప్పనంగా అప్పచెప్పటానికి . కష్టసుఖాలు, భావోద్వేగాలు, అన్నీ కాచి వడ బోసి, రాజకీయంలోకి అడుగు పెట్టిన వాడు.. అమ్ముడు పోడు, నన్ను నమ్మమని అడగడు, పని చేసుకుంటూ పోతాడు, ఉండే వాడే ఉంటాడు, ఎందుకంటే ఇది వారసత్వ party కాదు, మరో 15 సంవత్సరాల లో JanaSena Party ఎక్కడ ఉంటుందో మీ మీ ఊహలకే వదిలేస్తున్నా. Pawan Kalyan చెప్పింది వినటం, పాటించడమే, ఎందుకు అంటే? అది ఎప్పుడూ పది మందికి ఉపయోగం గానే ఉంటుంది కాబట్టి.

ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఖమ్మం దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “చీకటిని తొలగించే దీపం, వెలుగులు పూయించే సమయం, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన దీపావళి పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, అష్టైశ్వర్యాలు నింపాలని” ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా దీపావళి గుర్తుండిపోవాలని మంత్రి పేర్కొన్నారు.

ఖమ్మం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ని కలసి న బీజెపి నేతలు

పున్నమి ప్రతినిధి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, ఖమ్మం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు కలిసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల సాధన కోసం పార్టీ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నేతలు నిర్ణయించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అంతరాలయ దర్శనం రద్దు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసము సందర్భంగా అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఈ.ఓ బాపి రెడ్డి తెలియజేశారు. కార్తీక మాసంలో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు దేవస్థానమునకు విచ్చేయు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభతర దర్శనం కల్పించుటకు ప్రతి కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున అంతరాలయ దర్శనం నిలుపుదల చేయడమైనదని వారు తెలిపారు.ఈ నెల 22 వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.కావున భక్తులు సహకరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరడమైనదన్నారు.

అల్లూరి సీతారామరాజు

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, బాణాసంచాను చేతిలో కాకుండా దూరంగా ఉంచి కాల్చాలని అరకు ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్ డా. రాము సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలని, దగ్గరలో ఇసుక, నీరు ఉండేటట్లు చూసుకోవాలని పేర్కొన్నారు. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చేలా చూడాలన్నారు. మహిళలు దీపాలు వెలిగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాలిన గాయాలకు వెంటనే చల్లనీటితో శుభ్రం చేయాలన్నారు.

E-పేపర్

కంపానియన్ షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న సయ్యద్ మెహతాజ్ బేగం..

కంపానియన్ షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డు అందుకున్న సయ్యద్ మెహతాజ్ బేగం.. విజయవాడ అక్టోబర్ పున్నమి ప్రతినిధి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన కంపానియన్ షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డులు – 2025 కార్యక్రమంలో మానవతా మరియు సామాజిక సేవ విభాగంలో సయ్యద్ మెహతాజ్ బేగం గారికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. సామాజిక సేవ పట్ల అంకితభావంతో, మానవతా విలువలను జీవన విధానంగా మార్చుకొని, ప్రజల సమస్యలను తనవిగా భావించి సేవా మార్గంలో నడుస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం ఈ అవార్డుల ఉద్దేశమని కంపానియన్ షిప్ బృందం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది నామినీలలోంచి అర్హులను ఎంపిక చేయడం చాలా కష్టసాధ్యమైన ప్రక్రియగా ఉందని వారు వివరించారు. బృంద సభ్యులు మాట్లాడుతూ — “సయ్యద్ మెహతాజ్ బేగం గారి లోని సామాజిక స్పృహ, మానవతా దృక్పథం, ప్రజల పట్ల ఉన్న కరుణాభావం, మరియు సేవా నిబద్ధత ఆమెను నిజమైన మార్పు సృష్టికర్తగా నిలబెట్టాయి” అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సయ్యద్ మెహతాజ్ బేగం గారు — “ఈ అవార్డు నాకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను గుర్తు చేస్తోంది. సేవ అంటే మాటల్లో చెప్పదగినది కాదు, అది మనసులో పుట్టే తపన. ప్రతి బాధితుడి చిరునవ్వే నా నిజమైన బహుమతి” అని భావోద్వేగంగా అన్నారు. మెహతాజ్ బేగం సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సహాయం చేస్తూ, బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, మానవతా విలువలను విస్తరింపజేయడంలో ఆమె నిరంతర కృషి కొనసాగిస్తున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, తన సేవలతో ఎంతోమందికి ప్రేరణగా మారిన సయ్యద్ మెహతాజ్ బేగం గారికి ఈ అవార్డు మరొక మైలురాయిగా నిలిచింది. స్థానిక ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సమాజంలో మానవతా విలువలను పరిరక్షిస్తూ, సేవా భావంతో ముందుకు సాగుతున్న మెహతాజ్ బేగం గారి సేవలు చిరస్మరణీయంగా నిలవాలని అందరూ ఆకాంక్షించారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ నేత తాండ్ర వినోద్ రావు

పున్నమి ప్రతినిధి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బీజేపీ నాయకుడు తాండ్ర వినోద్ రావు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, సంతోషం నింపాలని, చీకటిని తొలగించి వెలుగుని ప్రసరించే దీపాల వలె ప్రజల జీవితాల్లో సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) పోతుల చంద్రశేఖర్ కూడా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఐక్యత, సానుకూలత, సద్భావనకు ప్రతీకగా నిలవాలని వారు కోరుకున్నారు.

జనగాం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు…..*

*హన్మకొండ* *తేది: 20.10.2025* *స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు…..* *రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం……* *స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి గారిని కోరారు.* హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని శనివారం ఆయన కలిసి వివిధ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ… నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తరచుగా విద్యుత్ ఒత్తిడి తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కొత్త ఆపరేషన్ విభాగాలు, సబ్‌స్టేషన్ల మంజూరు అత్యవసరమని కోరారు. *కొత్త ఆపరేషన్ విభాగాల ఏర్పాటుకు ప్రతిపాదన* జనగాం జిల్లాలోని జాఫర్‌గఢ్, లింగాల ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల్లో ఒక్క ఆపరేషన్ విభాగం మాత్రమే ఉండడం వల్ల సేవలు సమయానికి అందడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే కొత్త విభాగాల మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. 1. కునూర్ ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (జాఫర్‌గఢ్ విభజన) 2. మల్కాపూర్ ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (రాజవరం విభజన) 3. వాడిచెర్ల ప్రధాన కేంద్రంగా కొత్త ఆపరేషన్ విభాగం (లింగాల ఘన్‌పూర్ విభజన) *జాఫర్‌గఢ్‌లో 132/33KV సబ్‌స్టేషన్ ప్రతిపాదన* జాఫర్‌గఢ్ మండలంలో 7 సబ్‌స్టేషన్లు ఉన్నప్పటికీ, లోడ్లు వేగంగా పెరుగుతున్నందున కొత్త 132/33KV సబ్‌స్టేషన్ అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక మరియు గృహ లోడ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. కొత్త సబ్‌స్టేషన్ ఏర్పడితే విద్యుత్ సరఫరా నాణ్యత పెరుగుతుంది, లో వోల్టేజ్ సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరించారు. *కొత్త 33/11KV సబ్‌స్టేషన్ల మంజూరుకు విజ్ఞప్తి* స్టేషన్ ఘనపూర్ మండలంలోని నారాయణపూర్, చిల్పూర్ మండలంలోని నష్కల్, పల్లగుట్ట గ్రామాల్లో తక్కువ వోల్టేజ్ సమస్యలు తీవ్రమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు మోటార్లు కాలిపోవడం, పంటలకు నీటి సరఫరా అంతరాయమవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో నారాయణపూర్, నష్కల్, పల్లగుట్ట గ్రామాల్లో 33/11KV సబ్‌స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే లో వోల్టేజ్ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి అన్నారు. ఎమ్మెల్యే గారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఎన్పీడిసిఎల్ సీఎండి వరుణ్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించి, నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు.

జనగాం

తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసిన స్టేషన్గన్పూర్ BRS పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్ గారు

తెలంగాణ ఉద్యమ కారుడు తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి తండ్రి ఎర్రోళ్ల విజ్ఞయ్య గారి దశదిన కర్మలో తెలంగాణ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీశ్ రావు గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు కందుకూరి ప్రభాకర్, స్టేషన్ ఘనపూర్ మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, మునిసిపల్ అధ్యక్షులు కనకం గణేష్, యూత్ అధ్యక్షులు గుండె మల్లేష్, విద్యార్థి నాయకులు మాచర్ల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.