Monday, 27 April 2026

Blog

అన్నమయ్య

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము అని.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

అన్నమయ్య

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము అని.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

అన్నమయ్య

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధికి ఉరుసు ఆహ్వాన పత్రిక అందించిన మగ్దుంషా దర్గా చిన్న పీఠాధిపతి

నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డికి మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు చెన్నయ్యగారిపల్లిలోని వారి స్వగృహములో నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం నాగరాజు, టిడిపి ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,షేక్ మొహమ్మద్ యూసుఫ్, షేక్ షానవాజ్ తదితరులు పాల్గొన్నారు,

అన్నమయ్య

ఘనంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు

రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అత్యంత వైభవంగా నందలూరులో ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ మరియు గంటా గోపి వారి ఆధ్వర్యంలో 300 మందికి పైగా స్థానికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి మరియు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, రెడ్డయ్య ఉప్పు శెట్టి, వెంకటసుబ్బయ్య బుశెట్టి, మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, వెంకటయ్య, సుబ్బ నరసయ్య, తాటి సుబ్బరాయుడు, నారప శెట్టి శివ,, గాడిదల రాజా, దాసరి మోహన్, కృష్ణ కుమార్ గండికోట, రెడ్డయ్య నీలపల్లి, కన్నా, ధన, ప్రసాద్ ఉప్పుశెట్టి, హరికృష్ణ ఉప్పు శెట్టి, పవన్, పవన్ కళ్యాణ్, మనీ తదితరులు పాల్గొన్నారు,

అన్నమయ్య

దళితుల భూములను ఆక్రమిస్తే సహించం: జనసేన నేతలకు సీపీఐ హెచ్చరిక

చిట్వేల్ అక్టోబర్ 20 (పున్నమి ప్రతినిధి) ఎన్డీఏ కూటమి దళిత ఎమ్మెల్యే కనుసైగల్లోనే జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దళితుల భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ అక్రమాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా హెచ్చరించింది. దళితుల భూముల జోలికి వస్తే దశలవారీ ఉద్యమాలతో తగిన బుద్ధి చెబుతామని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు.ఈరోజు, భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో, సీపీఐ నేతలు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ సెలవులను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ అధికారులు లేరనే ఉద్దేశంతో మైసూర్ వారి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 2085లో దళితులకు చెందిన దాదాపు 2 ఎకరాల 20 సెంట్ల భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.అదే గ్రామపంచాయతీకి చెందిన జనసేన పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన శాసనసభ్యులు అరవ శ్రీధర్ కనుసైగల్లో ఈ ఆక్రమణకు పాల్పడటం, ఫెన్సింగ్ వేయడమే కాకుండా మామిడి చెట్లు నాటడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమణి, భారత కమ్యూనిస్టు పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ జ్యోతి చిన్నయ్య మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో, కోడూరు నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందిన బడా రాజకీయ నాయకులు, పెత్తందారులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి అనుభవిస్తుంటే, రెవెన్యూ యంత్రాంగం వారు ఇచ్చిన ముడుపులు తీసుకుని గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని వారు రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలోని దళితులు జనసేన పార్టీకి ఓట్లు వేసి, అదే పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేను గెలిపించుకుంటే, నేడు జనసేన పార్టీకి చెందిన అగ్రవర్ణాల నాయకులే దళితుల భూములను ఆక్రమించడం, దళితులు తమ చేతులతోనే తమ కళ్లను పొడుచుకున్నట్లుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే, నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమించి అనుభవిస్తున్న అగ్రవర్ణాలకు చెందిన వారి జోలికి వెళ్లి, ఆ భూములను ఆక్రమించి నిరుపేదలకు పంచే దిశలో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ నాయకులు సవాల్ విసిరారు. అగ్రవర్ణాల ఆక్రమణల జోలికి వెళ్లలేని పరిస్థితుల్లో దళితుల భూముల జోలికి రావద్దని, వస్తే దశలవారీ పోరాటాలతో తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్, సహాయ కార్యదర్శి గంగాపురి తేజతో పాటు మైసూర్ వారిపల్లికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

హైడ్రో భూతాన్ని దహనం చేసిన ఆదివాసీలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:20, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో ఆదివాసీ ప్రాంతం జల సమాధి అవుతుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ లతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు ఆదివాసీల దృష్టిలో నరకాసురిడితో సమానమని పేర్కొని, హైడ్రో భూతం దిస్టి బొమ్మను సోమవారం అరకులోయ మండలం, తాంగులగుడ లో దహనం చేశారు. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టు లు, వాటి నిర్మాణాల కొరకు జారీ చేసిన జీవో లు 2,13,51లను రద్దు చేయాలని బాలదేవ్ డిమాండ్ చేశారు.

అన్నమయ్య

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు: చిట్వేలి ఎస్సై నవీన్ బాబు హెచ్చరిక

-దీపావళి సందర్భంగా నిబంధనలు మరింత కఠినతరం -కఠినతరం కానున్న నిబంధనలు -కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోండి చిట్వేలి, అక్టోబర్ 20 (మీ స్పందన ప్రతినిధి) దీపావళి పండుగ సందర్భంగా వాహనదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఎలాంటి ఉపేక్ష ఉండబోదని చిట్వేలి ఎస్సై నవీన్ బాబు కఠినంగా హెచ్చరించారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే, దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఎస్సై నవీన్ బాబు వెల్లడించారు. రోడ్డు భద్రత, ప్రజల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం కేవలం చట్టరీత్యా నేరం మాత్రమే కాదని, అది నిండు జీవితాలను బలి తీసుకునే ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, యువత మరియు వాహనదారులు సంయమనం పాటించాలని కోరారు.ఈ పవిత్రమైన పండుగను ప్రజలు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఎస్సై నవీన్ బాబు సూచించారు. తాత్కాలిక ఉల్లాసం కోసం నిబంధనలు ఉల్లంఘించి, తమ కుటుంబాన్ని, తోటి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.చివరిగా, చిట్వేలి మండల ప్రజలందరికీ ఎస్సై నవీన్ బాబు తమ తరపున మరియు పోలీసు శాఖ తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

దీపావళికి అసలైన అర్ధం – ఫూలే దంపతుల స్పూర్తితో వెలిగిన దీపాలు

చింతలమానేపల్లి, కొమురం భీం జిల్లా: డబ్బా బారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా మాలి కులస్తులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, జ్ఞాపకార్థంగా ఉద్యమ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాలి సంఘం నాయకులు మాట్లాడుతూ, ఫూలే దంపతులు స్థాపించిన విద్యాసంస్థల వల్లే బహుజనులు పదవుల వరకు ఎదగగలిగారని స్పష్టం చేశారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నీకోడే బాపురావు, యువజన నేతలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ కి ఆహ్వాన పత్రిక

నందలూరు ఎంతో ప్రసిద్ధి చెందిన మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈ నెల 31- 10- 2025 హాజరుకావాలని నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ కి మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ బాషా,ఉప్పుశెట్టి రెడ్డయ్య, తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఘనంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు

రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అత్యంత వైభవంగా నందలూరులో ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ మరియు గంటా గోపి వారి ఆధ్వర్యంలో 300 మందికి పైగా స్థానికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి మరియు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, రెడ్డయ్య ఉప్పు శెట్టి, వెంకటసుబ్బయ్య బుశెట్టి, మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, వెంకటయ్య, సుబ్బ నరసయ్య, తాటి సుబ్బరాయుడు, నారప శెట్టి శివ,, గాడిదల రాజా, దాసరి మోహన్, కృష్ణ కుమార్ గండికోట, రెడ్డయ్య నీలపల్లి, కన్నా, ధన, ప్రసాద్ ఉప్పుశెట్టి, హరికృష్ణ ఉప్పు శెట్టి, పవన్, పవన్ కళ్యాణ్, మనీ తదితరులు పాల్గొన్నారు,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.