Monday, 27 April 2026

Blog

తిరుపతి

పురవీదులల్లో విహరించిన శివపార్వతులు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : పట్టణ పురవీదుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సోమవారం నాడు అమావాస్య సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లను పురవీధుల ఊరేగించడం జరిగినది. ముందుగా ఆలయంలోని అలంకార మండవం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి వేదమంత్రల నడుమ ఆలయంలో పూజలు నిర్వహించి పట్టణ నాలుగు మాడ వీధులలో విహరించారు. స్వామి, అమ్మవార్లు ఉరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు, దీప ధూపలను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రజల భాగస్వామ్యం తొ సురక్ష యాప్ విజయవంతం

నకిలీ మద్యం నియంత్రణలో ఎక్సైజ్‌ శాఖ కఠిన చర్యలు – “ఏపీ సురక్ష” యాప్‌కి అద్భుత స్పందన పారదర్శకతకు పెద్దపీట– మద్యం విక్రయాల్లో స్కాన్‌ తప్పనిసరి చేసిన ఎక్సైజ్‌ శాఖ అమరావతి, అక్టోబర్‌ పున్నమి ప్రతినిధి (విశాఖ) నకిలీ మద్యం నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ మధ్య నిషేధ, ఎక్సైజ్‌ శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల ప్రారంభించిన “ఏపీ ఎక్సైజ్‌ సురక్ష” మొబైల్‌ యాప్‌ ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమకు అందిన మద్యం బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి దాని ప్రామాణికతను నిర్ధారించునే అవకాశం కలిగింది. మరోవైపు స్కాన్ చేసిన తరువాతే మద్యం విక్రయాలు జరపాలని ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 13 నుండి 19 వరకు యాప్‌ను 79 వేల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ కాలంలో దాదాపు రెండు లక్షల స్కాన్లు జరిగాయి. సురక్ష యాప్‌ ద్వారా సేకరించిన సమాచారం నకిలీ మద్యం కదలికలను గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ యాప్‌ వినియోగదారుల ద్వారా వచ్చిన నివేదికలను విశ్లేషిస్తూ, అధికారులు ప్రతి ప్రాంతంలో లేబుల్స్‌ను ధృవీకరిస్తున్నారు. నకిలీ లేదా చెల్లని కోడ్‌ కనుగొనబడిన వెంటనే సిస్టమ్‌ స్వయంచాలకంగా అలర్ట్‌ ఇస్తుందని అధికారులు పేర్కొన్నారు. యాప్‌ ‌ పారదర్శకతను పెంచడమే కాకుండా, వినియోగదారుల అవగాహనను కూడా పెంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం దందా నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 5000 శాంపిల్స్ ను ఎక్సైజ్‌ శాఖ తనిఖీ చేసింది. అన్ని సక్రమంగానే ఉన్నట్లు గుర్తించారు. మొలకల చెరువు , ఇబ్రహీంపట్నం కు సంబంధించి గుంటూరులోని ప్రయోగశాలకు 45 మద్యం శాంపిళ్లను పంపించింది. ల్యాబ్‌లో నిర్వహించిన రసాయన పరీక్షల్లో కొన్ని నమూనాలు నాణ్యత ప్రమాణాలు అందుకోలేకపోయినట్లు తేలింది. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా మరింత లోతుగా పరిశోధనలు కొనసాగుతాయని, నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించిన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శాఖ ప్రకటించింది. అధికారికంగా సీల్‌ చేయబడిన బాటిల్స్‌ మాత్రమే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద బాటిల్‌ కనిపించినప్పుడు వెంటనే సురక్ష యాప్‌ ద్వారా స్కాన్‌ చేయాలని సూచించింది. నకిలీ లేదా చెల్లని కోడ్‌ గుర్తిస్తే దాన్ని వెంటనే తిరస్కరించాలని ప్రజలను కోరింది. నకిలీ మద్యం తయారీ, నిల్వ, సరఫరా లేదా అమ్మకాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకతను పెంచే దిశగా ఎక్సైజ్‌ శాఖ తీసుకున్న ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. సురక్ష యాప్‌ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెరగడం, వ్యవస్థపై నమ్మకం మరింత బలపడడం మద్యం నియంత్రణలో పెద్ద ముందడుగుగా పరిగణించబడుతోంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎస్.ఎస్.సి మార్చి -2026 సమాచారం

ఎస్.ఎస్.సి మార్చి–2026 పరీక్షల వయస్సు మరియు వయస్సు మినహాయింపు (Age Condonation) వివరాలు తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించవలసిన ముఖ్య సమాచారం: ఎస్.ఎస్.సి (10వ తరగతి) మార్చి–2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా 31/08/2011 లోపు జన్మించి ఉండాలి. అంటే 31.08.2025 నాటికి విద్యార్థుల వయస్సు కనీసం 14 సంవత్సరాలు నిండాలి. వయస్సు తక్కువగా ఉన్న విద్యార్థులు Age Condonation (వయస్సు మినహాయింపు) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నమెంట్ / లోకల్ బాడీ పాఠశాల విద్యార్థులకు: 18 నెలల వరకు తక్కువ వయస్సు — Gazetted హెచ్‌.యం గారికి అధికారం 2 సంవత్సరాల వరకు తక్కువ వయస్సు — DGE గారికి అధికారం ప్రైవేటు / Aided పాఠశాల విద్యార్థులకు: 18 నెలల వరకు తక్కువ వయస్సు — DEO గారికి అధికారం 2 సంవత్సరాల వరకు తక్కువ వయస్సు — DGE గారికి అధికారం వయస్సు మినహాయింపు కోసం అవసరమైన పత్రాలు: ₹300/- చలానా మెడికల్ సర్టిఫికేట్ జననతేది ఆధార పత్రం (Date of Birth Proof) ఈ పత్రాలను జతచేసి డి.ఈ.ఓ గారికి దరఖాస్తు చేయాలి. ఫీజు తేదీ ప్రకటించగానే వెంటనే దరఖాస్తు చేయడం అత్యంత అవసరం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమాచారం ముందుగానే తెలుసుకొని చర్యలు తీసుకోవాలి.

విశాఖపట్నం

అఖిల భారత విద్యార్ధి సమాఖ్య

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి *అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)* **ఆంధ్ర యూనివర్సిటీ కమిటీ** ఏ.ఐ.ఎస్.ఎఫ్ బస్సు యాత్ర గోడ పత్రికలు ఆవిష్కరణ. *విశాఖలో 24, 25 తేదీలలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు.* విద్యారంగ సమస్యలు పరిష్కారానీకై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర. *ఆంధ్ర యూనివర్సిటీ* : ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ శాతవాహన హాస్టల్ వద్ద ఏ.ఐ.ఎస్.ఎఫ్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏ.ఐ.ఎస్.ఎఫ్ ) కార్యదర్శి జెట్టి.అభిషేక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగా సమస్యలు పరిష్కారానికై ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్ర ఈ నెల 22 తారీకుర శ్రీకాకుళంలో మొదలై 24 ,25 వ తారీఖులలో విశాఖపట్నంలో పర్యటిస్తుందని 24 సాయంత్రం 3గంటలకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర నాయకత్వం పాల్గొంటారని అలాగే 25 వ తారీఖున గాజువాకలో కూడా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్రంలో పి.పి.పి పేరుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల , పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలని, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు ఎదుర్కొంటున్న తదితర సమస్యలపై మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. కావున విద్యార్థులందరూ 24, 25వ తేదీలలో జరగబోయే బస్సు యాత్రను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్, హరి,చింటూ, రాజేష్,దిలీప్ ,సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అల్లూరు జిల్లా జెడ్ పి టి సి వార నూకరాజు హత్య

పున్నమి ప్రతినిధి అక్టోబర్ విశాఖపట్నం అల్లూరు జిల్లా జడ్పిటిసి వారా నూకరాజు హత్య కొయ్యూరు మండలం వైసిపి జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్య గురయ్యారు. రోలుగుంట మండలం చటర్జీ పురం వద్ద ఆయనకు పది ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజులపాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండోవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జడ్పిటిసి నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంటం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు.

Blog

నంద్యాల సమద్ కు మరో పురస్కారం*”ధార్మిక సేవా రత్న” ప్రదానం చేసిన భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్

నంద్యాల జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ కి భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి పర్వదిన సంధర్భాన జాతీయ లెజెండరీ పురస్కారాలు-2025 , “ధార్మిక సేవా రత్నా” ప్రదానం చేసారు. హైదరాబాద్, రవింద్రభారతిలో సంస్థ ఛైర్మన్ కళారత్న డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ డి.మునిరత్నం నాయుడు, ప్రముఖక ఆధ్యాత్మిక వేత్త, రిటైర్డ్ ఇన్కంటాక్స్ ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ వై.నర్సింహప్ప,ఐఆర్ఎస్; కంఠమనేని శివశంకర్, రాజధాని ఫిల్మ్ చిత్రనిర్మాత, తెలుగువన్ వ్యవస్థాపకులు, వై ఎస్ ఆర్ శర్మ, ఆ.ఫ్రభ ఎడిటర్, డా.వాసిరెడ్డి మల్లేశ్వరి, గజల్ రచయిత్రి, డా.పి.విజయలక్ష్మి పండిట్ , డా.జల్ది విధ్యాదర్ ఐఆర్ఎస్ తదితరులు పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలు చేసిన ప్రముఖులను గుర్తించి పురస్కారాలు ప్రదానం చేసారు. సమద్ కి ఇప్పటికే ఎన్టిఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ప్రశంసా పత్రం, మహాత్మా జ్యోతిరావు పూలె జీవితరత్నా సాఫల్య పురస్కారం , ఆంధ్రరత్నా, రాష్ట్ర ఉత్తమ పౌర సత్కారం, శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం, కరున సమయ సేవలకు పలు పురస్కారాలు పొంది ఉన్నారు. ముస్లిం రచయితల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తూ, పలు సాహితి సంస్థల పురస్కారాలు అందుకున్నారు. మూడు పుస్తకాలు ప్రచురించి ఇప్పటికి రచనా సాంగత్యం కొనసాగిస్తున్నారు. సమద్ కు రాష్ట్ర, జిల్లా మురసం నాయకులు ప్రముఖులు అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చందన బ్రదర్స్’ అధినేత చందన మోహన్ రావు కన్నుమూత

విశాఖపట్నం: ప్రముఖ రిటైల్ వ్యాపారవేత్త, చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు (82) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. 1971లో సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో చందన బ్రదర్స్ సంస్థను ప్రారంభించి, తన దూరదృష్టి, కృషితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు. ఆయన మరణం వ్యాపార రంగానికి తీరని లోటు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

22 తేదీన ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోనీ పలు గ్రామాల్లో ఆనం పర్యటన

ఈ నెల 22 తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డీ పర్యటిస్తునట్లు ఒక ప్రకటనలో తెలిపారు ఉదయం 11:30 కు వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో సీతారాముల విగ్రహ, ప్రతిష్ట అనంతరం ప్రజలతో సమావేశం , నిర్వహించనున్నారు ఆనంతరం దుత్తలూరు మండలం నర్రవాడ లో శ్రీ శ్రీ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం సందర్శించినట్లు పేర్కోన్నారు.

భక్తి

అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో గ్రామోత్సవం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం నందు సోమవారం అమావాస్య సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు.ముందుగా శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయంలోని అలంకార మండపం నందు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు.అనంతరం స్వామి అమ్మవార్లు పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి మండలం పరిధిలోని పరిశ్రమలకు భూములు కేటాయించడం దుర్మార్గం

ఉదయగిరి మండలం లోనీ శకునాలపల్లి , పుల్లాయపల్లె గ్రామ పంచాయతీ లలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించడం దుర్మార్గం అని రైతు సంఘం జిల్లా నాయకులు కాకు వెంకటయ్య పేర్కోన్నారు మండలం పరిధిలోనీ కుర్రపల్లి బీసీ కాలనీలో ఆయా పంచాయతీల రైతులతో సమావేశం నిర్వహించారు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా పంచాయతీలలో గ్రామాల సమీపాన గల ప్రభుత్వం భూములకు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించడం దుర్మార్గంమన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.