Monday, 27 April 2026

Blog

జోగులాంబ గద్వాల

హాస్టల్ విద్యార్థులకు వార్డెన్ రాంగోపాల్ దీపావళి సందేశం

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండలం షెడ్యూల్ కులాల ప్రభుత్వ బాలల వసతి గృహంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న HWO విద్యార్థులతో మాట్లాడుతూ, “పండుగలు ఆనందంగా జరుపుకోవడం మంచిది, కానీ చదువును దూరం చేయకూడదు. చదువుతోపాటు సాంప్రదాయాల ఆనందాన్ని పంచుకోవడం ద్వారా మన వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. దీపావళి వేళ మీ చదువును మరింత అర్థవంతంగా చేయండి,” అని సూచించారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ ఘనంగా జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇంటిలో వెలుగుల పండుగ అంబరాన్ని అంటిన వేడుకలతో సాగింది. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి దీపాలు వెలిగించి, పటాకులు కాల్చి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ తరఫున తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నేత తాండ్రా వినోద్ రావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ తరఫున నల్లమల్ల రంజిత్ (ఖమ్మం బాలయ్య), కేతినేని హరీష్ దీపావళి పండుగ ప్రజలకు సంతోషం, సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ నాయకులు తాత మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఒకరికొకరు పూలు, పటాకులు, మిఠాయిలతో దీపావళి శుభాకాంక్షలు పంచుకున్నారు. చిన్నారులు పటాకులతో, పెద్దలు కుటుంబ సమేతంగా దీపాల వెలుగులో ఆనందం పంచుకున్నారు. ఖమ్మం జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పువ్వాడ నాగేంద్ర కుమార్

పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

నెల్లూరు కోటేశ్వరరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ

పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రవి, పువ్వాడ నాగేంద్ర కుమార్ లు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బీజేపీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్య సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల ఆయన చూపుతున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

DSC లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు సన్మానం

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 21: నెల్లూరు రూరల్ మండలం పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మెగా DSC లో సెలెక్ట్ అయిన రూరల్ పరిధిలో ని ఉపాధ్యాయ లు 75 మందిని నెల్లూరు రూరల్ MLA తన కార్యాలయం లో పిలిపించి సన్మానం చేయటం జరిగింది. MLA విద్యార్థులు కు మంచి నాణ్యమైన విద్య అందించాలని కోరటం జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం DSC నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర పార్టి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని ఉపాధ్యాయులును ఘనంగా సన్మానించారు.

E-పేపర్

ఘనంగా దీపావళి సంబరాలు

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ 21: నెల్లూరు రూరల్ పరిధిలో నిన్న దీపావళి ప ర్వదినం పురస్కరించుకొని డైకసరోడ్డు, గాంధీనగర్, వేదాయపాలెం, పరిసర ప్రాంతాలలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. అన్ని ఇండ్లలో దీప జ్వాలాలాలతో వెదజల్లాయి. బాణా సంచాలు రంగురంగుల వెలుగులతో ఆ ప్రదేశాలు కలకల లాడాయి.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సామూహిక కేదారేశ్వరి వ్రతం

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో నెలకొని ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూన్నంబిక అమ్మవారి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక కేదారేశ్వర అమ్మవారి వ్రతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి నోములను ఆలయంలో నిర్వహించుకుని శ్రీ స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని అలయార్చకులు అన్నట్లు తెలిపారు.

తిరుపతి

తెదేపా నాయకుల ఆద్వర్యంలో ఘనంగా పట్టణాధ్యక్షుని జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి న్యూస్ : తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు జన్మదిన పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి విజయ్ కుమార్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించి, అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

తిరుపతి

పురవీదులల్లో విహరించిన శివపార్వతులు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : పట్టణ పురవీదుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సోమవారం నాడు అమావాస్య సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లను పురవీధుల ఊరేగించడం జరిగినది. ముందుగా ఆలయంలోని అలంకార మండవం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి వేదమంత్రల నడుమ ఆలయంలో పూజలు నిర్వహించి పట్టణ నాలుగు మాడ వీధులలో విహరించారు. స్వామి, అమ్మవార్లు ఉరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు, దీప ధూపలను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.