Thursday, 23 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెలే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు

రంగారెడ్డి

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ పరిధిలోని 294, 295, 296 బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో కరచాలనం చేస్తూ, మాగంటి సునీత అభ్యర్థికి ఓటు వేయాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలలో మాగంటి సునీత గోపీనాథ్ పట్ల గట్టి విశ్వాసం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి స్థిరత్వం కోరుకునే ప్రతి ఒక్కరు కేసీఆర్ పరిపాలననే తిరిగి రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజలు విసిగిపోయారు. అభివృద్ధి నిలిచిపోయింది, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదే కారణంగా జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు,అని ఆమె పేర్కొన్నారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎవరినీ అడిగినా ఒకే మాట చెబుతున్నారు – కారు గుర్తుకే ఓటేస్తాం… మాగంటి సునీత గోపీనాథ్ నే గెలిపిస్తాం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి జూబ్లీహిల్స్ నుండి అభివృద్ధి యాత్రను మళ్లీ ప్రారంభించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

కర్నూలు

బస్సు ప్రమాదం.. సజీవదహనమైన ఫ్యామిలీ ఇదే

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతులను నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) లుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారని కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

గురువారం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మలికిపురం మార్కెట్ రోడ్డులోని ఓ భవనం వద్ద చొప్పెల్ల శివ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేశవదాసుపాలేనికి చెందిన శివ, స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ 2020లో ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

లక్కవరం సెంటర్లో ఆంబోతుల బీభత్సం: వాహనాలకు నష్టం, ప్రజల్లో భయాందోళన

అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం లక్కవరం సెంటర్లో రాత్రి 7 గంటల సమయంలో రెండు ఆంబోతులు దెబ్బలాడుకుంటూ వీరంగం సృష్టించాయి. ఈ ఘటనలో ప్రజలు, వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లపై తిరిగే ఆంబోతుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

E-పేపర్

పోతురాజు” వారి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బత్యాల✍️*

*✍️”పోతురాజు” వారి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బత్యాల *ఈరోజు 23-10-2025 తేది గురువారం నాడు రైల్వేకోడూరు పట్టణం మద్రాస్ రోడ్డులో సిద్దేశ్వర థియేటర్ ఎదురుగా తన మిత్రుడు పోతురాజు అమరేంద్ర గారి “నయారా పెట్రోల్ బంక్” ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారిని వారి కుటుంబసభ్యులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు.* *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్ల మన్నలను పొంది ఆ దేవదేవుడు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు………., ఈ కార్యక్రమంలో అమరేంద్ర గారి కుమారులు పోతురాజు నవీన్, పోతురాజు సుమన్ మరియు టీడీపీ నేతలు మాజీ ఉప సర్పంచ్ నార్జాల హేమరాజ్, శ్రీకారం శివయ్య, సురేష్ యాదవ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.*

ఖమ్మం

శబరి మళ కి ప్రత్యేక బస్సు లు

పున్నమి ప్రతి నిధి మాలధారుల సౌకర్యార్థం తక్కువ చార్జీలతో శబరిమల యాత్రికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ. సరిరామ్ తెలిపారు. రీజియన్లోని ఏడు డిపోల నుంచి పుష్‌బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేశారు. ఐదు, ఏడు రోజుల యాత్రలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణం లభిస్తుందని పేర్కొన్నారు. బస్సు బుకింగ్ కోసం ఖమ్మం (99592 25958, 99592 25962), కొత్తగూడెం (99592 25959), భద్రాచలమ్ (99592 25960), మధిర (99592 25961) డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.

విశాఖపట్నం

సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలి స్వాతంత్ర్య పోరాటంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 23: సమాజ ప్రగతికి పత్రికలు దోహదపడాలని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు అన్నారు. ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల ఆధ్వర్యంలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏయూ శ తాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సదస్సులలో భాగంగా గురువారం ఎవల్యూషన్ ఆఫ్ జ ర్నలిజం 1950 టు 2020- ద ఎరా ఆఫ్ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ టు మోడరన్ ఇండియా ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమయంలో పత్రికలు కీలక భూమిక పోషించాయన్నారు* . ప్రజలను నిరంతరం చైతన్య వంతం చేయడం, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంచడంలో ఇవి ఎంతో కీలకంగా నిలచాయన్నారు. ప్రతికా రంగానికి విశేష సేవలు అందించిన హరేకృష్ణ మహతాబ్ కృషిని వివరించారు. ఒడిసా పూర్వ ముఖ్య మంత్రిగా, ఒడిసా పూర్వపు సంస్థానాలను రాష్ట్రంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఒరియాలో ఆయన ప్రారంభించి నిర్వహించిన పత్రికలు సమాజంలో ఎంతో మార్పును తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇంచార్జి ఉపకులపతి ఆచార్య డి.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ భారత దేశంలో జర్నిలిజం రంగంలో వచ్చిన మార్పులను వివరించారు.* సమాచారం అందించడం ప్రధాన అంశంగా జర్నలిజం ఆరంభం అయిందని నేడు దీని స్థానంలో ఎంటర్టైన్మెంట్ చేరిందన్నారు. ప త్రికా రంగం, టెలివిజన్ రంగం, నేటి డిజిటల్ రంగాలలో జరిగిన ప్రగతి, మార్పులను వివరించారు. ప త్రికల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వచ్చిన పలు చట్టాలు, ఎమర్జెన్సీ సమయంలో పత్రికల ప రిస్థితులను తెలిపారు. వాస్తవాలు, నిజంకి మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారు. గాంధీజీ నడిపిన పత్రికల్లో అనేక సందర్భాలలో స్వాతంత్య్రం సాధించాలంటే సహనం అవసరమని చెప్పిన సందర్భాలను విద్యార్ధులకు వివరించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ప్రెస్ కమీషన్ల ఏర్పాటు, దేశ అభివృద్ధికి దోహద పడిన ప్రతికలు, నెహృ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా పనిచేసిన సమయంలో పత్రికలపై వచ్చిన ఆంక్షలు, వాటిపై జరిగిన పోరాటాలు, ప్రెస్ కమీషన్లు ఏర్పాటు తదితర అంశాలు తెలియ జేశారు. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్, ఇంధిరాగాంధీ మరణం, బోపాల్ గ్యాస్ దుర్ఘటనలు దేశంలో ఎంతో ప్రముఖంగా నిలచాయన్నారు. వార్తల్లో వాస్తవాలు తగ్గిపోతున్నాయన్నారు. నేడు వార్తల్లో ఏఐ ప్రభావం పెరిగిపోతోందని, ఖచ్చితమైన సమాచారం పొందడం ప్రధానమన్నారు. ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.నరసింహా రావు సభకు అధ్యక్షత వహించారు* . విద్యార్థులకు ఉపయుక్తంగా విభాగంలో తరచూ ఇటువంటి సమావేశాలు నిర్వహించడం, విభిన్న రంగాల నిపుణులను ఆహ్వానించడం శుభ పరిణామమన్నారు. చారిత్రక, వర్తమాన అంశాలపై లోతైన అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ది హిందూ దినపత్రిక పూర్వ పాత్రికేయులు సంతోష్ పట్నాయక్, పొలిటికల్ సైన్స్, జ ర్నలిజం విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం తదితరులు ప్రసంగించారు* . *కార్యక్రమంలో ఆర్ట్స్ క ళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ ఆచార్య వి.శ్రీమన్నారాయణ, డాక్టర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిధులను విభాగం తరపున సత్కరించారు.

తిరుపతి

నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన పేట బ్రదర్స్

తిరుపతి పర్యటనలో భాగంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నందు జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి, తేజ,మనీ,నవీన్,కల్లిపూడి వెంకటేష్, సాయి,వెంకటేష్,రాజా,పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.