Thursday, 23 April 2026

Blog

విశాఖపట్నం

సోషల్ వర్క్ ఉద్యోగ అవకాశాలు

ఆంధ్రవిశ్వవిద్యాలయం, సోషల్ వర్క్ విభాగంలో ‘సోషల్ వర్క్ ఉద్యోగ అవకాశాలు’ అనే అంశము పై అతిధి ఉపన్యాసం ఏర్పాటు చేసారు.పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. తవిట తులసి ఈ అంశము పై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.సోషల్ వర్క్ చదివిన వారికీ స్వచ్చంద సంస్థలలో, ట్రస్ట్ లలో, గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో వుంటాయని వివరించారు. సోషల్ వర్క్ విద్యార్థులు క్రమంగా చదువుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య ఎస్.హరనాథ్, ఆచార్యా ఆర్. స్వామిదాసు, డా. కోమలి సలోమి, డా. ముట్లూరి అబ్రహం, డా. జి. పుష్పలత, డా. ఆశ కిరణ్ రాజు పాల్గొన్నారు.

తెలంగాణ

వర్షాలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్న: కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ధాన్యం సేకరణ పై శుక్రవారం ఆమె రెవెన్యూ పౌరసపరాలు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ధాన్యం, సేకరణపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు మాట్లాడారు.

తెలంగాణ

నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గయ్య: తెలంగాణ: నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు

విశాఖపట్నం

పిట్టలదొరను తలపించిన జగన్ గూగుల్ డేటా సెంటర్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా గంటా విమర్శ

జగన్మోహన్ రెడ్డి గారు భ్రమ యుగంలో విహరిస్తూ రాష్ట్ర ప్రజలకు పిట్టల దొరను.. కొమ్మ దాసరి వాడిని.. గుర్తుకు తెస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రకటించి దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత ఆయన గాఢ నిద్రలో నుంచి లేచి ఆ ప్రాజెక్టు ముమ్మాటికీ తాను వేసిన విత్తనమే అంటూ ఈరోజు చేసిన హంగామా జబర్దస్త్ స్కిట్ ను తలపించింది. “అదానీకి, గూగుల్ కు వ్యాపార సంబంధాలున్నాయి.. వైసీపీ హయాంలో అదానీ డేటా సెంటర్ వచ్చింది.. దాని కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్.. ఈ ప్రాజెక్టులో అదానీ రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు.. అదానీ డేటా సెంటర్ నిర్మించి గూగుల్ కు అప్పగిస్తారు.. అదానీకి థాంక్స్ చెప్పండి.. వైసీపీకి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక సీఎం చంద్రబాబు నాయుడు విషయాలన్నీ దాస్తున్నారు..” అంటూ ఏవేవో చెప్పి ప్రజలకు ఉచిత వినోదాన్ని పంచారు. డేటా సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ నిన్నటి వరకూ గోబెల్స్ ప్రచారం చేసిన బ్లూ మీడియా జగన్మోహన్ రెడ్డి యూ టర్న్ మాటలతో విశాఖకు గూగుల్ తో పాటు టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. సత్వా.. సిఫీ.. వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా వైసీపీ తెచ్చిందేనంటూ ప్రచారం మొదలుపెట్టినా ఆశ్చర్యపొనక్కర్లేదు

జాతీయ అంతర్జాతీయ

కర్నూల్ జిల్లా శివారులో జరిగిన బస్సు ప్రమాదం ఘటన స్థలాని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కుమార్… దగ్గమైన బస్సు సంబంధించిన వివరాలకి టోల్ ఫ్రీ నెంబర్లు. కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ ‪‬ నం 9502271122 కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నం. 9100901599, 9100901598 కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం.9100901604.గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828 బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.

విశాఖపట్నం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ విశాఖ నగర దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు . ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు . అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ కి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రామయ్యను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని స్వామివారి దయతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సదరన్ ఇన్స్టిట్యూడ్స్ అధినేత సతీష్ పొన్నం తెలంగాణ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు….

జాతీయ అంతర్జాతీయ

కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం … ప్రమాదానికి ముందు చివరి ఫోటో ఇదే.

అలంపూర్ : పున్నమి ప్రతినిధి :- హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ సమీపంలో పూర్తిగా దగ్ధమయింది. 20 మందికి మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర 2.14 నిమిషాలకు ఈ బస్సు వెళ్లినట్లు రికార్డ్ అయింది. చివరిగా ఇటు నుంచి వెళ్లిన తర్వాత కర్నూల్లో కాసేపు నిల్చొని బయలుదేరిన 10 నిమిషాలకే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన ప్రయాణికులకు కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటన జరగడం అందర్నీ కలవరపెడుతుంది. బస్సు పూర్తిగా దగ్ధం జరిగిన సంఘటన స్థలంలో కుటుంబ సభ్యుల రోదన అందరిని కంటతడి పెట్టిస్తుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ‘పాలెం’ ఘటన రిపీట్… ఇదే అక్టోబర్ మాసంలో… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో, పాలెం దగ్గర 2013లో బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి రాష్ట్రాలను కుదిపేసింది. కారును ఓవర్టేకింగ్ చేస్తూ కల్వర్టును ఢీ కొట్టడంతో అగ్ని ప్రమాదం సంభవించి బస్సులో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంత పెద్ద సంఘటన జరగడం ఇదే రెండోసారి.

హైదరాబాద్

హైదరాబాద్‌ ఇంపాక్ట్ లర్నర్స్ లయన్స్ క్లబ్‌ – మెంటల్ హెల్త్‌పై గ్లోబల్ అవగాహన స్ఫూర్తి! :కె:రామచంద్రుడు

ప్రపంచవ్యాప్తంగా మెంటల్‌ హెల్త్ అవగాహన కల్పించిన హైదరాబాదు ఇంపాక్ట్ లర్నర్స్ లయన్స్ క్లబ్-320H హైదరాబాద్, అక్టోబర్ 20: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్‌ – జిల్లా 320-హెచ్‌ (డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గంపా నాగేశ్వర్ రావు) పరిధిలోని హైదరాబాదు ఇంపాక్ట్ లర్నర్స్ లయన్స్ క్లబ్, అధ్యక్షుడు లయన్ రామచంద్రుడు కె నాయకత్వంలో అక్టోబర్ 4 నుండి 19, 2025 వరకు 16 రోజులపాటు గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్ వెల్‌బీయింగ్ అవగాహన కార్యక్రమంను ఆన్‌లైన్‌లో విజయవంతంగా నిర్వహించింది. ప్రతిరోజూ ఒక గంట పాటు సాగిన ఈ ఆన్‌లైన్‌ సెషన్లలో అమెరికా, యుఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దుబాయ్ మరియు భారతదేశం నలుమూలల నుండి పాల్గొన్నారు. ప్రసిద్ధ సైకాలజిస్టులు, కౌన్సిలర్లు మరియు మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ సమతుల్యం వంటి అంశాలపై విలువైన సూచనలు పంచుకున్నారు. ఈ కార్యక్రమం నేరుగా (జూమ్) మరియు పరోక్షంగా (YouTube లైవ్) కలిపి మొత్తం 11,000కి పైగా వ్యక్తులను చేరింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాల్గొనేవారి నుండి అభినందనల వర్షం కురిసింది. పాల్గొన్నవారు లయన్స్ ఇంటర్నేషనల్‌ మరియు జిల్లా 320-హెచ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ తరహా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తాయని పేర్కొన్నారు. “మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంలాగే ముఖ్యమని అవగాహన కల్పించడం మా లక్ష్యం,” అని లయన్ రామచంద్రుడు కె అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను గ్లోబల్ స్థాయిలో కొనసాగించాలనే ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు.

భక్తి

ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త.. శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం డిపో నుండి చక్కని అవకాశం ఉందని డిపో మేనేజర్ వెంకట నర్సప్ప తెలపడం జరిగింది

పున్నమి ప్రతినిధి: ఇబ్రహీంపట్నం ఆలంపల్లి దుర్గయ్య, శ్రీశైలం సందర్శిని టూరు ప్యాకేజీ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు శుభవార్త.. శ్రీశైలం సందర్శించడానికి ఇబ్రహీంపట్నం డిపో నుండి చక్కని అవకాశం ఉందని డిపో మేనేజర్ వెంకట నర్సప్ప గారు తెలపడం జరిగింది మెట్రో డీలక్స్ లో పెద్దలకు కేవలం 1200/ పిల్లలకు కేవలం 1000/ రూపాయలు మాత్రమే చెల్లించి ….. నవంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి శ్రీశైలం డ్యాం సాక్షి గణపతి తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం తిరిగి ఉమామహేశ్వరం సందర్శించి తర్వాతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నం చేరుకొనును .. ముఖ్యంగా 35 మంది భక్తులు ఉన్నచో వారి దగ్గరికి బస్సు రావడం జరుగుతుంది….. ముఖ్యంగా ఈ యాత్రలో టీ, టిఫిన్ లు ఎవరికి వారే భరించుకోవలెను. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము … మరిన్ని వివరాలకు క్రింది నెంబర్ సంప్రదించగలరు……. మరియు ఆన్లైన్లో ఫోన్ పే ఆర్ గూగుల్ పే లో కూడా మీ యొక్క సీట్ రిజర్వేషన్ తీసుకోవాలంటే క్రింది నెంబర్ ను సంప్రదించగలరు… 8008822244 9866336621

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన, దురదృష్టకరం.. అత్యంత బాధ వారిపల్లె గ్రామానికి చెంద సజీవ దహనం..! గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..!

24-10-2025 వింజమూరు కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన, దురదృష్టకరం.. అత్యంత బాధాకరం.. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన నలుగురు మృతి..! ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త ఇద్దరు పిల్లలు సజీవ దహనం..! గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్..! జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మాట్లాడి, పార్దివ దేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే..! బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని సొంత కుటుంబంగా చూసుకుంటా .. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! వింజమూరు అక్టోబర్ 24 హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాద దుర్ఘటన.. దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన, గోళ్ల మాలకొండయ్య, సుశీల దంపతుల కుమారుడు గోళ్ల రమేష్(31) ఆయన భార్య అనూష (27) వారి కుమారుడు శశాంత్ (7) కుమార్తె మన్విత్ (4) బస్సు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, శుక్రవారం ఉదయం గోళ్ల వారిపల్లె గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంఘటన ఎలా జరిగింది. కుటుంబ వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడి, డీఎన్ఏ టెస్టులకు సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని తెలిపారు. ఇక్కడ నుండి కర్నూలుకు పంపించేందుకు ప్రభుత్వ వాహనంతో పాటు, పోలీస్ కానిస్టేబుల్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోళ్ళ మాలకొండయ్య, సుశీల దంపతుల, కుమారుడు, రమేష్ కోడలు అనూష ఇద్దరు పిల్లలు శశాంత్, మాన్విత్, ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాటులు చేసినట్లు తెలిపారు. మాలకొండయ్య కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కాగా కుమారుని కుటుంబం మొత్తం నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. గోళ్ల మాలకొండయ్య కుమార్తె ధనమ్మ కుమార్తె అనూషను తమ కుమారుడు రమేష్ కు ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. ధనమ్మకు కూతురు కొడుకు ఉండగా, కొడుకు అనారోగ్యం కారణంతో చనిపోయాడని, ఇటీవల భర్త గుత్తా శ్రీనివాసులు చనిపోగా, ఈరోజు బస్సు ప్రమాదంలో కుమార్తె కూడా మృతి చెందినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా మరియు నేను సొంత కుటుంబం లాగా చూసుకుంటానని తెలిపారు. రమేష్ వ్యాపార రీత్యా బెంగళూరులో ఉండగా, దీపావళికి సొంత గ్రామానికి వచ్చి, దీపావళి పండుగ చేసుకొని వెళ్లారని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం, అత్యంత బాధాకరమన్నారు. దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్, కుటుంబంతో కలిసి, ఈ కుటుంబం, టూర్ కు వెళ్లారని, టూరు ముగించుకొని బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కొత్తపేటకు చెందిన రమేష్ భార్య ఇద్దరు బిడ్డలు బస్సులో నుండి దూకారని, వీరిని కూడా కాపాడే క్రమంలో, ఒక్కసారిగా బస్సులో తొక్కిసలాట జరగడంతో కాపాడలేకపోయినట్లు రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిగిన బస్సు ప్రమాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వారితో కూడా నేను మాట్లాడడం జరిగిందని, కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, చాకలి కొండ గ్రామ నాయకులు, స్థానిక నాయకులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.