Thursday, 23 April 2026

Blog

నాగర్‌కర్నూల్

రోడ్డు కిరువైపున పెరిగిన మొక్కలను తొలగించిన ..మాజీ సర్పంచ్

రోడ్డు కిరువైపున పెరిగిన మొక్కలను తొలగించిన ..మాజీ సర్పంచ్ వెల్దండ ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్: వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామం నుండి గొల్లోని పల్లి రహదారికి ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం వలన వాహనదారులకు ప్రమాదకరంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దృష్టిలో పెట్టుకొని జెసిబి సహాయంతో తన సొంత ఖర్చులతో కుప్పగండ్ల మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్ చెట్లను తొలగించారు. బీఆర్ఎస్ నేత సేవా దృక్పథంతో స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు , గొల్లోనిపల్లి గ్రామ పెద్దలు, మరియు యువకులు పాల్గొన్నారు.

తిరుపతి

దొడ్ల మునిరాజ దాతృత్వం గిరిజనులకు కూరగాయలు బ్రెడ్లు,బిస్కెట్స్ పంపిణీ

శ్రీకాళహస్తి పట్టణంలో గత నాలుగు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈశ్వరయ్య కాలనీలోని ఇళ్ల పై కప్పులు ఉరుపుల తో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు.వర్షాల కారణంగా ఎటువంటి పనులు లేక 25 కుటుంబాలు ఇళ్లకే పరిమితమైనాయి.ఈ గిరిజ కాలనీ వాసులకు రెండవ వార్డు కేఎం పల్లికి చెందిన దొడ్ల మునిరాజా దాతృత్వంతో సిపిఐ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీలు కూరగాయలు, పిల్లలకు బ్రెడ్లు,బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య,పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి,పాడేటి రవి పట్టణ నాయకులు జనార్ధన్,మునిరాజా మహిళా సంఘం నాయకులకు మునెమ్మ,గంగమ్మ,మహిళలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి*

*టెట్ పరీక్ష పై ప్రభుత్వం పునః సమీక్షించాలి* *కొండూరు శ్రీనివాస్ రాజు నోబుల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు* రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ద్వారా ఎన్నికయి దాదాపు 25 సంవత్సరాల పైబడి సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం చాలా ఇబ్బందిగాను కష్టంగానూ ఉంటుందని దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాయచోటి నందు శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సుప్రీంకోర్టులో టెట్ పరీక్ష పై రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మన వాదనలు వినిపించాలని కోరారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు విద్యాశాఖ మoత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉపాధ్యాయులలో ఉన్న గందరగోళ పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో సెప్టెంబర్ ఒకటో తేదీన జారి చేసిన టెట్ పరీక్షల తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి వాదించి తదుపరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇలాంటి వ్యవహారం నుండి ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని నోబెల్ టీచర్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. 50 సంవత్సరాల వయస్సు పైబడిన ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఎంతో ఆందోళనలకు గురవుతున్న విషయాన్ని గుర్తించి ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించాలన్నారు .2003 డీఎస్సీ ద్వారా నియామకాలు పొందిన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో పాత పెన్షన్స్ అమలుకు నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హాషిం, పాలెం రాజా,వెంకటరమణ శ్రీనివాసులు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహణ

పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని లక్ష్మణ చందా మండలం పోలీస్ స్టేషన్ లో పోలీస్ జెండా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ కేసులో నమోదు భద్రత లైంగిక వేధింపులు డ్రగ్స్ వినియోగం తదితర అంశాల పైన విద్యార్థులకు పోలీస్ సిబ్బంది విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

కొత్త క్రికెట్ అసోసియేషన్ అభినందనీయం.

కొత్తగా ఎన్నికైన తెలం గాణ క్రికెట్ అసోసియేషన్ నాయకత్వంతో తెలంగాణకు కొత్త ఉత్సాహం తెచ్చిందని జిల్లా కోచ్ రామరాజు పత్రికా ప్రకటనలో అన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్గా డీకే అరుణ, అధ్యక్షుడిగా బీబీ పాటిల్ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పారదర్శకత విశ్వాసం నేత సమగ్రతతో ముందుకు సాగుతుందన్నారు.

రాజన్న సిరిసిల్ల

సమాజ సేవలో పీపుల్స్ హాస్పిటల్

ముస్తాబాద్‌లో 60 మంది టీబీ బాధితులకు ఆహార సహాయం – పీపుల్స్ హాస్పిటల్ దత్తతతో టీబీ ముక్త్ భారత్ వైపు అడుగు” రాజన్న సిరిసిల్ల , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముస్తాబాద్ మండల వైద్యాధికారిణి డాక్టర్ అఫీజ ఆధ్వర్యంలో టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ యూనిట్ గంభీరావుపేట క్లస్టర్ పరిధిలోని 60 మంది టీబీ బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డా. రజిత పిలుపు మేరకు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ డా. శంకర్ 60 మంది క్షయ వ్యాధిగ్రస్తులను ఆరు నెలల పాటు దత్తత తీసుకుని, నెలకు రూ.600 విలువైన బియ్యం, పప్పు, నూనె, పల్లి, గుడ్లు, ప్రోటీన్ పౌడర్ అందించనున్నట్లు డా. అఫీజ తెలిపారు. కార్యక్రమంలో డా. రజిత, టీబి పీఓ డా. అనిత, డా. సంపత్, డా. రామకృష్ణ, టీబి సూపర్వైజర్ మహిపాల్, నోడల్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శాంతమనే ఆయుధంతో విజయాలను సాధించవచ్చు.- కులమతాలు వేరైనా, మనమంతా ఒక్కటే – లయన్స్ డా.పైడి.సింధూర (శ్రీకాకుళం – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

కులమతాలు, మాతృ భాషలు వేరైనా మనమంతా ఒక్కటేనని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్స్ డా.పైడి.సింధూర అన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు, స్థానిక భాష్యం పాఠశాలలో పీస్ పోస్టర్ పోటీలను, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగముగా డా.పైడి.సింధూర మాట్లాడుతూ శాంతి అనే ఆయుధంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని, కోపం వద్దు, శాంతే ముద్దని అన్నారు. కోపం అనర్థాలకు దారితీస్తుందని, శాంతం నిజా నిజాలను తెలుసుకునే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తుందని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి శాంతం తోడ్పడుతుందన్నారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న పీస్ పోస్టర్ కంటెస్ట్ జిల్లా చైర్మన్ ఎం.ఎస్ఎన్.మూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ విషయంలోనూ తొందరపడొద్దని, శాంతియుతమైన జీవన విధానాన్ని అనుసరించడమే అన్ని విధాలా మంచిదని, ఎవరైతే కోపతాపాలను ప్రదర్శిస్తారో వాళ్లకి అందరూ దూరమైపోతుంటారన్నారు. శాంతంగా వుంటే అందరూ బంధువులుగా మారిపోతారని, ఎవరైతే శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకుంటారో, అలాంటివారి జీవితం ప్రశాంతంగా సాగిపోతూ వుంటుందని, శాంతం ఎక్కడ వుంటుందో అక్కడ సంతోషం, సంతృప్తి వుంటాయన్నారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ ఇంటర్నేషనల్ బహుమతులను అందించి, పాల్గొన్న ప్రతీ విద్యార్థికీ ప్రశంసాపత్రాలను, భాష్యం పాఠాశాల ప్రిన్సిపాల్ సురేష్, రవీంద్రభారతి పాఠశాల డిఐ రమేష్, నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ లతో కలసి అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, మెంటార్, జిల్లా చైర్మన్ నటుకుల.మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవికుమార్, ఉపాధ్యక్షులు బోగెల ఉమా మహేశ్వర రావు, సీనియర్ సభ్యులు నారా.ఈశ్వర రావు, అంధవరపు.ప్రసాద్, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వాడపల్లికి రూ.6 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెలే బండారు సత్యానందరావు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు

రంగారెడ్డి

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ పరిధిలోని 294, 295, 296 బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ప్రజలతో కరచాలనం చేస్తూ, మాగంటి సునీత అభ్యర్థికి ఓటు వేయాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలలో మాగంటి సునీత గోపీనాథ్ పట్ల గట్టి విశ్వాసం నెలకొంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి స్థిరత్వం కోరుకునే ప్రతి ఒక్కరు కేసీఆర్ పరిపాలననే తిరిగి రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజలు విసిగిపోయారు. అభివృద్ధి నిలిచిపోయింది, ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదే కారణంగా జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు,అని ఆమె పేర్కొన్నారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎవరినీ అడిగినా ఒకే మాట చెబుతున్నారు – కారు గుర్తుకే ఓటేస్తాం… మాగంటి సునీత గోపీనాథ్ నే గెలిపిస్తాం. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించి జూబ్లీహిల్స్ నుండి అభివృద్ధి యాత్రను మళ్లీ ప్రారంభించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

కర్నూలు

బస్సు ప్రమాదం.. సజీవదహనమైన ఫ్యామిలీ ఇదే

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతులను నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) లుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారని కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.