Thursday, 23 April 2026

Blog

ఖమ్మం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా బీజేపీ

ఖమ్మం జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అక్రమ అరెస్టును ఖండించిన జిల్లా బీజేపీ అంబేద్కర్‌ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి తొత్తుల వ్యవహరిస్తుంది గోరక్షకులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేపీ సీఎం రేవంత్‌ రెడ్డి ఎంఐఎం గుండాలకు లైసెన్స్‌ ఇవ్వడం వలనే ఇంత దైర్యంగా వ్యవహరిస్తున్నారు నిన్న ప్రశాంత్‌ అనే గోరక్షకుడిపై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరపడంపై డిజీపీ ఆఫీస్‌ వద్ద ధర్నాకు పిలుపునిచిన రాంచంద్రరావు అరేస్ట్ అనైతికం

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బంగాళాఖాతంలో అల్పపీడనం: రాజోలులో భారీ వర్షం, జనజీవనం స్తంభించింది

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాజోలు నియోజకవర్గంలో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.

హైదరాబాద్

వేమూరి కావేరి యాజమాన్యం కీలక ప్రకటన

పున్నమి ప్రతి నిధి కర్నూలు జిల్లాలో జరిగిన వీకావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, వాలిడ్ పర్మిట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. యాజమాన్యం తెలిపిన ప్రకారం, వేగం కారణంగా కాకుండా, అగ్ని ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు పరిపూర్ణ సహాయం అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.

ఖమ్మం

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు

*కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు* *సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం* *స్థలం కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం* ఖమ్మంబుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం కేటాయింపు* సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు* ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ప్రభుత్వ 3 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పాత భవనం కావడం, అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు చేయాలని మంత్రి తుమ్మలకు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 21 ఫిబ్రవరి 2024 న వినతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఖమ్మం నగరంలోని బురాన్ పురం లో గల ఎన్ఎస్పి స్థలం సర్వేనెంబర్ 93 లో ప్రభుత్వ భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపారు.

ఖమ్మం

*ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు?*

*పున్నమి Daily న్యూస్ ప్రతినిప్రతినిధి :ఖమ్మం T.Ravinder ఖమ్మం అక్టోబర్ 24 తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరా రైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి, ఇంటర్​బోర్డు ప్రతిపాదిత షెడ్యూల్​కు ఆమోదం తెలిపారు. గత విద్యా సంవత్సరం మార్చి 5 నుంచి పరీక్షలు మొదలయ్యాయి. కాగా ఈ సంవత్సరం 8 రోజులు ముందుగానే పరీక్షలు జరగనున్నాయి.పూర్తి షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించ నుంది. ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 26న ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్​లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న మొదలై, మార్చి 24తో ముగియనున్నాయి. అదే తరహాలో మన రాష్ట్రం లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ కంటే కొంత ఆలస్యంగా తెలంగాణలో పరీక్షలు ముగియనున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెల చివరి తేదీల్లోనే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యేవి. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా మార్చిలోకి షెడ్యూల్ మారింది. ఫిబ్రవరి నెలలో పరీక్షలు మొదలుపెడితే జేఈఈ మెయిన్, ఎప్​సెట్, నీట్​ వంటి పరీక్షలకు సన్నద్ధ మయ్యే విద్యార్థులకు చదువుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఉదాహరణకు గత ఏడాది మార్చి 5న ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ తుది విడత ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైంది. దాంతో విద్యార్థులకు 12 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండేది. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే 8 రోజుల ముందుగా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు మొత్తం కలిపి 9.50 లక్షల మందికి పైగా పరీక్షలు రాయను న్నారు.ఇదిలా ఉండగా, ఇంటర్ పరీక్షల ఫీజు పెంచాలని ఇంటర్​బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రయోగ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతో పాటు ఒకేషనల్ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ బలోపేత దిశగా పాదాలు వేస్తున్న నేతలు

తాడేపల్లి – విజయవాడ, అక్టోబర్ 24 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో పలు కీలక భేటీలు, సమావేశాలు శుక్రవారం విజయవాడ, తాడేపల్లిలో నిర్వహించబడ్డాయి. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన వైయస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ. తరువాత రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ, ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రటరీ లక్ష్మణ్, శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుమూర్తి తదితరులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఇక విజయవాడలోని సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టి.జె.ఆర్. సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఎస్సీ సెల్ సమావేశంలో కూడా రెయ్యి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తత్వసారం ప్రజల సంక్షేమమని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల సాధికారత పార్టీ ప్రాధాన్య లక్ష్యమని ఈ సందర్భంలో నాయకులు పునరుద్ఘాటించారు.

నిర్మల్

ఖానాపూర్ సబ్ రిజిస్టార్ గారికి ఆర్‌టీఐ చట్టాల పుస్తకం అందజేత – సహా చట్ట పరిరక్షణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్.

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ అక్టోబర్ 24 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని, సమాచార హక్కు చట్ట (ఆర్‌టీఐ) పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్ ఆధ్వర్యంలో ఈరోజు ఖానాపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ స్వామీదాస్ గారికి మరియు పీఐఓ కపిల్ గారికి (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) సమాచార హక్కు చట్టాల పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. ఆర్‌టీఐ చట్టంపై అవగాహన కల్పించడం, దాని అమలును పర్యవేక్షించడం తమ కమిటీ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహా చట్ట హక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఉప్పల్వాయిలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

కామారెడ్డి, అక్టోబర్ 24: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయ్ గ్రామంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు మున్నూరు కాపు సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల ఆరోగ్య సమస్యతో మరణించిన ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కాల శ్రీనివాస్ కుటుంబానికి రూ.4,000 ఆర్థిక సహాయం అందజేశారు రామారెడ్డి మండల మున్నూరుకాపు మాజీ కమిటీ సిండికేట్ సభ్యులు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. .ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు బండి ప్రవీణ్, మాజీ గౌరవ అధ్యక్షులు తోట భూమయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి గోపు నర్సింలు, మాజీ ప్రచార కార్యదర్శి మద్దికుంట బండి ప్రవీణ్ తదితర కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

కోలా విశాలాక్షి కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యురాలిగా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి కోలా విశాలాక్షి శుక్రవారం ఉదయం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై కోలా విశాలాక్షి కి శుభాకాంక్షలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

రోడ్డు కిరువైపున పెరిగిన మొక్కలను తొలగించిన ..మాజీ సర్పంచ్

రోడ్డు కిరువైపున పెరిగిన మొక్కలను తొలగించిన ..మాజీ సర్పంచ్ వెల్దండ ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్: వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామం నుండి గొల్లోని పల్లి రహదారికి ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం వలన వాహనదారులకు ప్రమాదకరంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దృష్టిలో పెట్టుకొని జెసిబి సహాయంతో తన సొంత ఖర్చులతో కుప్పగండ్ల మాజీ సర్పంచ్ ముక్తాల శేఖర్ చెట్లను తొలగించారు. బీఆర్ఎస్ నేత సేవా దృక్పథంతో స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు , గొల్లోనిపల్లి గ్రామ పెద్దలు, మరియు యువకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.