Thursday, 23 April 2026

Blog

జనగాం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి గారి పైన జరిగిన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలి

ప్రెస్ నోట్ 24-10-2025… జనగామ జిల్లా… స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం.. *నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి*… *-బోడ సునీల్ మాదిగ* MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారు మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కె.ఆర్ (K.R) గార్డెన్ లో స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి MRPS మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలకు గిట్టడం లేదు అందుకే ఈ దాడికి పాల్పడ్డారు ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు యావత్తు న్యాయ వ్యవస్థ దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటాం అన్నిటికన్నా భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది ఈ ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాకేష్ కిషోర్ అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ప్రతి మండల, గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవిందర్ మాదిగ MRPS జిల్లా నాయకులు బోట్ల మహేష్ నలిమెల నాగరాజు, రాడపాక ఆదాం, చాడ ఏలీయ్య, మంద శ్రీను, దండు రామచంద్రు సంపత్, MRPS జిల్లా నాయకులు గుర్రం అశోక్ గుర్రం నవీన్, గాదెపాక మహేందర్, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేత ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం – రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో గోపాలకృష్ణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత ఆయన జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ను కలిసి రైతుల సమస్యలపై చర్చించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, “రెండు మూడు రోజుల్లో తేమ శాతం ఆధారంగా మిల్లర్ల తో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, “రైతుల శ్రమకు తగిన మన్నన లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు జరుగుతుం దని” తెలిపారు. ఈ కార్యక్రమం లో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & గౌరవరం సొసైటీ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, జగ్గయ్యపేట LSCS చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, జగ్గయ్యపేట సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్, కాచవరం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, గ్రామ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఎమ్మెల్యేగా ఎన్నికైన 2ఏళ్లలోనే 1388కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు….*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం* *తేదీ: 24.10.2025* *ఎమ్మెల్యేగా ఎన్నికైన 2ఏళ్లలోనే 1388కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు….* *ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు రావడం సాధారణ విషయం కాదు…..* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవ, సహకారం వల్లే సాధ్యం అవుతోంది…..* *నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు…..* *ఈ 5ఏళ్లతో పాటు వచ్చే 5ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి…..* *అప్పుడే అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలుస్తుంది….* *తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు.* స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల అభివృద్ధికి మొదటి విడతలోనే 310కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….. రానున్న రెండు ఏళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రూపు రేఖలు మార్చనున్నట్లు తెలిపారు. నా ఆలోచన ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి పైననే ఉంటుందని అన్నారు. నా ఆలోచనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తొడవడం వల్లే నియోజకవర్గ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు సాధ్యం అవుతుందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు ఏళ్లలోనే 1388కోట్లు మంజూరు అయ్యాయని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఇంత మొత్తం నిధులు ఏ నియోజకవర్గానికి మంజూరు కాలేదని పేర్కొన్నారు. వచ్చే రెండు ఏళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, ఇందుకు నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద పీట వేస్తున్నారని వెల్లడించారు. ఆదర్శవంతమైన పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 5ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ, బిఆర్ఎస్ ఎన్ని పసలేని విమర్శలు చేసినా దేశంలో బిసి రిజర్వేషన్ల అమలు జరిగితే దాని పూర్తి క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 6 రోజులపాటు సాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రిన్సిపల్ టి .గోపాల్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సమాజంలో జీవించటం నేర్చుకుంటారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు కృష్ణయ్య, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆరు రోజుల ప్రత్యేక క్యాంపులో విద్యార్థులు గ్రామాల్లో ఉండే సమస్యలను తెలుసుకున్నారని, పరిష్కార మార్గాలను కూడా నేర్చుకున్నారని అన్నారు. గ్రామ ప్రజలు విద్యార్థులు తమకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, డి. ఆంజనేయులు, శ్రీరాములు, హనుమంతు, లింగస్వామి, జ్యోతి శ్రీ, కోకిల, ప్రేమానందం, కాలేజీ పూర్వ విద్యార్థులు పొలం శివ, ఎం. తులసిరామ్, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

E-పేపర్

ఈరోజు మాల్ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గయ్య 24/10/2025 ఈరోజు మాల్ వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పి బ్రహ్మయ్య సిఐటియు మండల కన్వీనర్ ఎస్ చందు నాయక్ హాజరై మాట్లాడుతూ* కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలు కాలంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ముందుకు తీసుకువస్తున్నారని అన్నారు. దశాబ్ద కాలం కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్ లు తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మాల్ వ్యవసాయ మార్కెట్ లో హమాలీ కార్మికులకు కనీసం బాత్రూంలో లెట్ రూమ్ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా త్రాగడానికి నీళ్లు కూడా మార్కెట్ కమిటీ పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తక్షణమే హమాలి కార్మికులకు బాత్రూమ్ లెట్ రూమ్ సమస్యలను మరియు త్రాగడానికి మంచినీళ్లు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ హమాలి కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ప్రభుత్వం వర్తించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హమాలి కార్మికులందరికీ గుర్తింపు కార్డులు, డ్రస్సులు పండుగ సందర్భంగా బోనస్ లాంటివి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం మాల్ వ్యవసాయ మార్కెట్ హమాలి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కాయితీ యాదగిరి రెడ్డి అధ్యక్షులుగా బట్టు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా రెడ్డ మోని నరసింహ ఉపాధ్యక్షులుగా రెడ్డి మౌని మహేష్, సుజాత సహాయ కారదర్శులుగా కాగు నరసింహ, అబ్బయ్య కోశాధికారిగా గునుగంటి చిన్న జంగయ్య సలహాదారులుగా ఉడుగుడ్ల రాములు మొత్తం 41 మంది తోటి వ్యవసాయ హమాలి కార్మికుల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

కర్నూలు

కర్నూలు బస్సు ప్రమాదం: 19 మృతదేహాల వెలికితీత.. ప్రాణాలతో బయటపడింది వీరే!

కర్నూలు బస్సు ప్రమాదం: 19 మృతదేహాల వెలికితీత.. ప్రాణాలతో బయటపడింది వీరే! కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం బైక్‌ను ఢీకొట్టడంతోనే ప్రమాదం కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 19 మంది ప్రయాణికుల మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పూర్తిగా దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘోర ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం. సత్యనారాయణ, హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన జయసూర్య, హయత్‌నగర్‌కు చెందిన నవీన్‌ కుమార్‌, బెంగళూరుకు చెందిన సరస్వతీ నిహారిక ఉన్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేశ్‌, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్‌, అలాగే నెల్లూరుకే చెందిన కాపరి అశోక్‌, కాపరి శ్రీహర్ష ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు కూడా సురక్షితంగా ఉన్నారని, వారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఖమ్మం

భూక్యా విజయ్ మీద దాడి.. కేంద్ర మంత్రి కి పిర్యాదు చేసిన బీజేపీ నేతలు

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) అక్టోబర్ 18న బీసీ బంద్ సందర్భంగా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి, అక్రమ కేసులపై బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావ్ ఘటన వివరాలు మంత్రికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్, రాష్ట్ర డిజిపి గారితో మాట్లాడి దాడి కేసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడికి న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన విచారణ జరగాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

కర్నూలు

కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు… 20 మందికి పైగా మృతి!*

*కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు… 20 మందికి పైగా మృతి!* పున్నమి ప్రతినిధి: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 పై అగ్ని ప్రమాదానికి గురైంది.* బస్సు ప్రయాణికుల జాబితా* అశ్విన్‌రెడ్డి(36), జి.ధాత్రి(27), కీర్తి(30) పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు(22) తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు(48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా(27) పిల్వామిన్‌ బేబి(64), కిశోర్‌ కుమార్(41) రమేష్‌, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు రమేష్‌(30), అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌(51), దీపక్‌ కుమార్‌ 24 అన్డోజ్‌ నవీన్‌కుమార్(26), ప్రశాంత్‌(32) ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌(25) వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23) సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28) సూర్య(24) హారిక(30), శ్రీహర్ష(24) శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26) కె.అశోక్‌(27), ఎం.జి.రామారెడ్డి(50) ఉమాపతి(32), అమృత్‌ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24)

విశాఖపట్నం

వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి :ఈరోజు తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు* మరియు *వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని* మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*. 👉 ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ ఇన్చార్జి మరియు 51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు అలాగే శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణ మూర్తి గారు, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రెటరీ లక్ష్మణ్ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుమూర్తిగారు తదితరులు పాల్గొన్నారు . ఈరోజు విజయవాడ CSR ఫంక్షన్ హాల్ లో స్టేట్ ఎస్సీ సెల్ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు TJR సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.

ఆంధ్రప్రదేశ్

బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌ మృతి

బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌(20) మృతి శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు బైక్‌ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లిన బస్సు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో శివ మృతిపై కుటుంబంలో విషాదం ఎందుకు బయటకు వెళ్లాడో తెలియదని చెప్పిన కుటుంబసభ్యులు వివరాలు ఇంకా తెలియవలసి ఉంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.