Thursday, 23 April 2026

Blog

విశాఖపట్నం

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు విశాఖ విచ్చేసిన బస్సు యాత్ర విజయవంతం

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విశాఖపట్నం జిల్లా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ.* *రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. *ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధానాన్ని విరమించుకోవాలి.* *ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలి.* పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయ్యాలి. పున్నమి ప్రతినిధి, అక్టోబర్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రవ్యాప్త బస్సు జాతా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న సందర్భంగా మూడవ రోజు విశాఖపట్నం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లం.నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కుల్లాయిస్వామి, మస్తాన్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పిపిపి పేరుతో ప్రైవేట్ , కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకువస్తే నానా గగ్గోలు పెట్టి యువగలం పాదయాత్రలో ఆ జీవోలను రద్దు చేస్తాం. పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ నేడు వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు కరణ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల మరణాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకి 50 లక్షలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ 6400 కోట్లు రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.ప్రభుత్వ పాఠశాలలు గతంలో 4,500 పాఠశాలలు మూతపడ్డాయని వాటిని వెంటనే పునః ప్రారంభించాలన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీనీ అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3480 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి.ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ , కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి ఒక్క జూనియర్ కళాశాలను నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల బస్సుజాత ముగిసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల లోకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ బహిరంగ సభలో ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షులు అభిలాష్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, బందెల నాసర్ జీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, కొళ్లాయ్యి స్వామి జిల్లా అధ్యక్షులు శేఖర్, మౌనిక కిరణ్, అభిషేక్, గ్రేష్ ప్రకాష్, గణేష్, శివ, గోపి,కంజీరా, పవన్ కళ్యాణ్, ఆదర్శ్, నాయకులు సందీప్, రమణ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు విచ్చేసిన జాతీయ రాష్ట్ర నాయకత్వానికి విశాఖ జిల్లా ఏఐవైఎఫ్ వై రాంబాబు, కే అచ్యుతరావు ఘనంగా పూలమాలలతో స్వాగతం పలికారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో పడమటిపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు మంద సత్యనారాయణ అధ్యక్షతన “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పడమటిపాలెం గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, గుబ్బల మనోహర్, మోకా సురేష్ , చింత ప్రసాద్, చింత శ్రీను, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల, నల్లి శరత్ స్థానిక గ్రామ నాయకులు: తాడి శివాజీ, మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన 11 మంది అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకు న్నారు. వారి వైద్య ఖర్చులను గమనించి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసారు. ఈ దరఖాస్తు ఫలితం గా, ₹3,43,234 మొత్తం ఆ 11 మందికి మంజూరు చేయబడిం ది. ఎమ్మెల్యే స్వయంగా చిల్లకల్లు గ్రామానికి వెళ్లి చెక్కులను బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, ముత్తినేని అశోక్, రావూరి శ్రీనివాసరావు, షేక్ సుభాని, మల్లెబోయిన జ్వాల, డోగుపర్తి నాగభూషణం, పసుమర్తి మహేష్, ఆల్లూరి రమణ, నాయిని రజిని, జిల్లపల్లి రాంబాబు, గొర్రెపాటి జాన్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా విశాఖ 49వ వార్డులో ప్రత్యేక సమావేశం

విశాఖపట్నం, అక్టోబర్ 24: రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ — “పేదవాడికి వైద్యం, విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానం ప్రజావ్యతిరేకమైందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుందని” అన్నారు. ఈ సమావేశం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 49వ వార్డు కార్పొరేటర్ అళ్ళు శంకరరావు ఆధ్వర్యంలో, బాణాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించబడింది. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నలుమూలల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వార్డుల కార్పొరేటర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ

శ్రీకాళహస్తి: వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి సమన్వయకర్త మరియు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒకటివ వార్డు వీయం పల్లి నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

యాదాద్రి భువనగిరి

ఎంబీబీఎస్ సీటును సాధించిన నలుగురుపేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించిన.ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్

సింగం కృష్ణ, భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, మునుగోడు ప్రతినిధి,అక్టోబర్24,(పున్నమి ప్రతినిధి): ఎంబిబిఎస్ లో ర్యాంకు సాధించి పై చదువులకు పేదరికం వల్ల ఆటంకం ఏర్పడిన చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన ఎర్ర మధుశ్రీ,కి 50,000 యాభై వేల రూపాయలు,మర్రిగూడం మండల కేంద్రానికి చెందిన ఈద గిరి,కి 50,000 వేల రూపాయలు,కొండ మల్లేపల్లి మండలం ఎస్సి కాలనీ కి చెందిన అందుగుల తేజశ్రీ,అందుగుల ప్రవల్లిక,ల కు 50,000 వేల రూపాయలు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్,భాస్కర్ సూచన మేరకు డైరెక్టర్ అశోక్,చేతులమీదుగా మొత్తం 1,50,000 లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు.మునుముందు వారి ఎంబిబిఎస్ చదువుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్తులు,అభిమానులు, తదితరులు,పాల్గొన్నారు.

తెలంగాణ

అజిలాపూర్ లో వ్యక్తి దారుణ హత్య

అజిలాపూర్ లో వ్యక్తి దారుణ హత్య *హత్యకు కారణంపై పోలీసుల దర్యాప్తు దేవరకద్ర ప్రతినిధి, అక్టోబర్ 24 () మండలంలోని అడివి అజిలాపూర్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకున్నట్లు మహబూబ్నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు భోత్పూర్ సిఐ రామకృష్ణ తెలిపారు. డీఎస్పీ, సిఐ తెలిపిన వివరాల ప్రకారం అజిలాపూర్ లో ఓ వ్యక్తిని అతి దారుణంగా నరికి హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు (40) సంవత్సరాలు గల వ్యక్తి వృత్తిరీత్యా దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మైబు తన పని ముగించుకొని తన గురువారం రాత్రి తన స్వంత గ్రామానికి తన మోటార్ సైకిల్ పై వస్తుండగా అడవి అజిలాపూర్ గేటుకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివాహేతర సంబంధమే కారణమా! లేదా ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీస్పీ, సీఐ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరితో కలిసి మెలసి ఉండే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడంతో అడివి అజిలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కామారెడ్డి

ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి జన్మదినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, 24 అక్టోబర్ , పున్నమి ప్రతినిధి. : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మదిన వేడుకల సందర్బంగా పత్రిక విలేకరుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి జన్మదినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆలయ ప్రముఖులు, భక్తులు స్వామివారి జన్మది నాన్ని గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో శాంతియు తంగా, అంగరంగ వైభవంగా నిర్వహించాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రభు, ఆల య ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, జూనియర్ అసిస్టెంట్‌, ఆలయ సిబ్బంది, ఇరు గ్రామాల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

సమాజంలో జీవించటం నేర్పేందుకే ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు : ప్రిన్సిపల్

వంగూర్ మండలం తిరుమలగిరి గ్రామంలో దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 6 రోజులపాటు సాగిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రిన్సిపల్ టి .గోపాల్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సమాజంలో జీవించటం నేర్చుకుంటారని అన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు కృష్ణయ్య, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆరు రోజుల ప్రత్యేక క్యాంపులో విద్యార్థులు గ్రామాల్లో ఉండే సమస్యలను తెలుసుకున్నారని, పరిష్కార మార్గాలను కూడా నేర్చుకున్నారని అన్నారు. గ్రామ ప్రజలు విద్యార్థులు తమకు ఎంతో సహకరించాలని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, డి. ఆంజనేయులు, శ్రీరాములు, హనుమంతు, లింగస్వామి, జ్యోతి శ్రీ, కోకిల, ప్రేమానందం, కాలేజీ పూర్వ విద్యార్థులు పొలం శివ, ఎం. తులసిరామ్, విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పల్నాడు

బంగాళాఖాతంలో_మరో_అల్పపీడనం

👉 తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 👉 కోస్తాలో గంటకు 30-40 కి.మీ. నుంచి 50 కి.మీ. గరిష్ఠ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చని తెలిపింది. నీ రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మరో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వానలు పడొచ్చని చెప్పింది. నీ దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.