Thursday, 23 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

కొలికపూడి అసత్య ఆరోపణ లను ఖండించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య — ఎంపీ కేసినేని చిన్నితో విభేదాలు లేవు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యక్తిగత వివాదా లను సమర్థించుకోవడానికి నందిగామ నియోజకవర్గం, ప్రజాప్రతినిధులను అనవసరం గా వివాదాల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నందిగామ ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రకటన విడుదల చేశారు. తన ఒంటికి అంటిన బురదను ఇతరులకు రుద్దాలని చూడటం రాజకీయ అపరిపక్వతకు పరాకాష్ట అని వ్యాఖ్యానించిన ఆమె, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ ఆరోపణలు చేయకుం డా సమస్యలను అధిష్టానం వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) తో ఎలాంటి విభేదాలు లేవని, నందిగామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. వంద పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, ఆయుష్ హాస్పిటల్, రైల్వే అభివృద్ధి వంటిపలు ప్రాజెక్టులు ఎంపీ చిన్ని సహకారంతో సాధ్యమ య్యాయని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ఎన్నికలు, ఇసుక అంశాలపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలునిరాధారమని, పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఎంపీతో సంపూర్ణ ఏకాభిప్రాయం తో నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యక్తిగత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడా నికి ఇతరులను వివాదాల్లోకి లాగడాన్ని వెంటనే నిలిపివేయా లని ఆమె హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం*

*పత్రికా ప్రకటన*::::: *నెల్లూరు జిల్లాను అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలుపుదాం* ➖ *మంత్రి ఆనం రామనారాయణరెడ్డి* *జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం* నెల్లూరు, అక్టోబర్ 24: అన్ని రంగాల్లో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన కలెక్టర్ హిమాన్షు శుక్లా కు సూచించారు. శుక్రవారం నెల్లూరు సంతపేటలోని దేవాదాయ శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే గత ఐదు రోజులుగా జిల్లాలో కురిసిన భారీవర్షాల ప్రభావం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న తక్షణ చర్యల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల ప్రాజెక్ట్ ,తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు డ్రైన్స్ పూడికతీయడంతో వాహనదారులు, పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కలెక్టర్ కు సూచించారు.

విశాఖపట్నం

పాముల్ని చంపొద్దు..ప్లీజ్‌!

పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దు స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ రొక్కం వెల్లడి .. విశాఖపట్నం నాగుల చవితి సందర్భంగా విశాఖలోని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ కుమార్‌ రొక్కం ఒక ప్రకటన విడుదల చేశారు. పాముల్ని చంపొద్దని హితవు పలికారు. పాములు కనిపిస్తే తమకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దని, పుట్టల్లోకి తొంగిచూడొద్దని, పుట్టల్లో సామగ్రి మొత్తం పడేయొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూం 100/112తో పాటు 88663 68899 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయొచ్చని కిరణ్‌ కోరారు.

E-పేపర్

జర్నలిస్టుల విధులు – ప్రధాన విధులు.

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గయ్య 24/10/2025 జర్నలిస్టుల విధులు – ప్రధాన విధులు. జర్నలిస్టుల విధులు, అందులో ప్రధానమైన విధులు, బాధ్యతలు అనేవి ఈ సమాజంలో చాలా కీలకమైనవి. వారి ప్రధాన లక్ష్యం ప్రజలకు సరైన, నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించడం. ఆ విధులు, ప్రధాన విధులు వివరణ. వార్తల సేకరణ (Reporting) సంఘటనలు, పరిణామాలు, సమస్యలపై సమాచారాన్ని సేకరించడం. ఇందుకోసం వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయడం, ప్రదేశాలను సందర్శించడం, అధికారిక పత్రాలను పరిశీలించడం వంటివి చేస్తారు. వార్తల రచన (Writing) సేకరించిన సమాచారాన్ని స్పష్టంగా, సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా వార్తలు, కథనాలు, వ్యాసాల రూపంలో రాయడం. ఎడిటింగ్ (Editing) వార్తల ఖచ్చితత్వాన్ని, స్పష్టతను, వ్యాకరణ లోపాలు లేకుండా చూసుకోవడం. వాస్తవాలను ధృవీకరించడం. (Fact-checking) కూడా ఇందులో భాగం. ప్రసారం/ప్రచురణ (Dissemination) వార్తలను పత్రికలు, టీవీ, రేడియో, ఆన్‌లైన్ మీడియా వంటి వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందించడం. పరిశోధనాత్మక జర్నలిజం (Investigative Journalism) అవినీతి, అక్రమాలు, సామాజిక సమస్యల వెనుక ఉన్న నిజాలను లోతుగా పరిశోధించి వెలుగులోకి తీసుకురావడం. ప్రధాన బాధ్యతలు. నిష్పాక్షికత మరియు నిబద్ధత (Objectivity and Impartiality) వార్తలను ఎటువంటి పక్షపాతం లేకుండా, నిజాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు అందించడం. వ్యక్తిగత అభిప్రాయాలను, సంస్థాగత ప్రయోజనాలను వార్తల్లో చొప్పించకుండా చూసుకోవడం. ఖచ్చితత్వం (Accuracy) వార్తల్లోని ప్రతి వివరము, వాస్తవము నిజమైనవని నిర్ధారించుకోవడం. తప్పు సమాచారం ప్రజలకు చేరకుండా జాగ్రత్త వహించడం. సామాజిక బాధ్యత (Social Responsibility) ప్రజలకు ఉపయోగపడే, సమాజానికి మేలు చేసే వార్తలను ప్రచురించడం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయడం. నైతిక విలువలు (Ethical Values) గోప్యతను గౌరవించడం, పరువు నష్టం కలిగించకుండా ఉండటం, సంచలనం కోసం నిరాధారమైన వార్తలను ప్రచురించక పోవడం వంటి నైతిక విలువలను పాటించడం. ప్రజాస్వామ్యానికి రక్షణ (Safeguarding Democracy) ప్రజలకు సరైన సమాచారం అందుబాటులో ఉంటేనే వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. జర్నలిస్టులు ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వారధిగా, ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తారు. పారదర్శకత (Transparency) తమ వార్తా మూలాల ను, సమాచార సేకరణ పద్ధతులను వీలైనంత వరకు పారదర్శకంగా ఉంచడం. భద్రత (Safety) క్లిష్ట పరిస్థితుల్లో, ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా వార్తలు సేకరించే ధైర్యం కలిగి ఉండాలి. తమ భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, నేటి కాలంలో జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వ్యాపార ధోరణి, రాజకీయ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ప్రభావం వంటివి జర్నలిస్టుల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనది, వారి బాధ్యతలు మరింత పెరిగాయి ఆలంపల్లి దుర్గయ్య

విశాఖపట్నం

28న దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రజా ఉద్యమంతో దూసుకెళ్తాం! సంతకాల సేకరణలో ప్రజల నుండి విశేష స్పందన.. మకొద్దీ… ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పోస్టర్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్నీ నిరసిస్తూ జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులను ఉద్దేశించి వాసుపల్లి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. అశేష జన సమీకరణతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా కోటి సంతకాల సేకరణలో విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని వైయస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. చంద్రబాబు అరాచక అబద్దాల పాలనను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి వివరించాలని సూచించారు. డాక్టర్లు కావాలన్నా విద్యార్థుల కలను, పేదలకు మెరుగైన వైద్యం లభించాలని జగన్మోహన్ రెడ్డి ఆనాడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేశారన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారనీ మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు మార్చుకొని ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో అవినీతి రహితంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఆసియన్ యూత్ గేమ్స్ లో మెరిసిన ఇప్పగూడెం యువకుడు…*

ఇప్పగూడెం *ఆసియన్ యూత్ గేమ్స్ లో మెరిసిన ఇప్పగూడెం యువకుడు…* బహరెన్ లోని మనామా లో జరుగుతున్న 3వ ఆసియన్ యూత్ గేమ్స్ లో ఇప్పగూడెం గ్రామానికి చెందిన లోడెంగ రాము సత్తా చాటాడు… భారత్ తరపున 400మీటర్ల పరుగు విభాగంలో రాము బరిలోకి దిగారు… పోటీల్లో భాగంగా నిర్వహించిన హీట్స్ దశలో 49.62 సెకన్ల రికార్డ్ వేగంతో మూడవ స్థానంలో నిలిచి ఫైనల్స్ అర్హత సాధించాడు… నిరుపేద కుటుంబంలో జన్మించిన రాము చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు.. అయినా మొక్కవోని దీక్షతో అటు చదువులో.. ఇటు క్రీడల్లో రాణిస్తున్నాడు.. కోచ్ రాజేష్ శిక్షణలో ఇప్పటికే రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన రాము ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు… విదేశీ గడ్డపై కూడా తన ప్రతిభతో సత్తా చాటుతున్న రాము దేశానికి కచ్చితంగా పతకం తేవాలని కోరుకుంటున్నామని ఇప్పగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు…

విశాఖపట్నం

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పర్సా కుటుంబం అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన పర్సా కృష్ణ – ఉషా దంపతుల మనవడు, పర్సా గోపి –గాయత్రి దంపతుల కుమారుడు చి.జే.సాయి వెంకట్ అన్నప్రాసన వేడుకలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి దీవించిన ఆయన, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. తరువాత ఎమ్మెల్యే గ్రామంలోని మాజీ సర్పంచ్ బొల్లా బాబు ప్రసాద్ ను వారి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాచినేని పాలెం ఎంపీటీసీ బొల్లా వెంకటేశ్వర రావు, కట్టా వెంకట నరసింహా రావు, యానాల గోపీచంద్, కానూరి కిషోర్, సాధినేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

సత్తుపల్లి ఘటన మీద తెలంగాణ డిజిపి ని కలసిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈనెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ కార్యక్రమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతుండగా, తట్టుకోలేని కాంగ్రెస్ మూకలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి, అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ శాఖ ఏకపక్షంగా వ్యవహరించి న్యాయం పట్ల విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవి రమేష్, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు తదితరులతో కలిసి రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని కలిసి పూర్తి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై, అలాగే అన్యాయంగా కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ దాడులను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణగదొక్కే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు.

జనగాం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి గారి పైన జరిగిన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలి

ప్రెస్ నోట్ 24-10-2025… జనగామ జిల్లా… స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం.. *నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి*… *-బోడ సునీల్ మాదిగ* MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారు మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కె.ఆర్ (K.R) గార్డెన్ లో స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి MRPS మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ దళితులు ఉన్నత స్థానంలో కూర్చోవడం కొంతమంది అగ్రకులాలకు గిట్టడం లేదు అందుకే ఈ దాడికి పాల్పడ్డారు ఇది చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కాదు యావత్తు న్యాయ వ్యవస్థ దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటాం అన్నిటికన్నా భారత రాజ్యాంగ మీద దాడి జరుగుతుంది ఈ ఇలాంటి ఘటన పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాకేష్ కిషోర్ అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ప్రతి మండల, గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ తరలివచ్చి విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవిందర్ మాదిగ MRPS జిల్లా నాయకులు బోట్ల మహేష్ నలిమెల నాగరాజు, రాడపాక ఆదాం, చాడ ఏలీయ్య, మంద శ్రీను, దండు రామచంద్రు సంపత్, MRPS జిల్లా నాయకులు గుర్రం అశోక్ గుర్రం నవీన్, గాదెపాక మహేందర్, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.