Thursday, 23 April 2026

Blog

Blog

ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్యసమితి కృషి విశిష్టమైనది: డాక్టర్ రవి కృష్ణ.

నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్ రవి కృష్ణ ,డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని యుద్ధాల బారి నుండి తప్పించి, శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిందని, వివిధ విభాగాల ద్వారా ప్రపంచ ప్రజల సమగ్ర అభివృద్ధికి,ఆరోగ్య రక్షణకు,బాలల సంరక్షణకు,మానవ హక్కుల పరిరక్షణకు,దేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్యసమితి చేసిన కృషి విశిష్టమైనదన్నారు. ఈ సందర్భంగా “ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి కృషి” అన్న అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కశెట్టి చంద్రశేఖర్ సౌజన్యంతో బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణయ్య, పాఠశాల కమిటీ ప్రతినిధులు చెన్నకేశవులు, వసుంధర, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. విజేతల వివరాలు: వ్యాసరచన పోటీలో మీనాక్షి,చందు,జగదీష్ వరసగా ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించగా,గౌరీ, మహమ్మద్ స్పెషల్ జ్యూరీ బహుమతులు అందుకున్నారు. వక్తృత్వపు పోటీలో తరుణ్,శశాంక్,అష్రఫ్ వరుసగా ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించగా, స్పెషల్ జూరి బహుమతులు అఫాన్, మానస అందుకున్నారు.

నంద్యాల

కర్నూలు బస్ ప్రమాదంపై మన్నేటి వెంకటరెడ్డి తక్షణ స్పందన – DNA పరీక్షలకు చర్యలు

కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మన్విష్, మన్విత్ దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయగిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు సమాచారం అందించి, ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో సంప్రదించి మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. “ఒకే కుటుంబం నిండుగా నష్టపోవడం హృదయవిదారకమైన విషయం. ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది,” అని వెంకటరెడ్డి అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా వారికి అండగా నిలుస్తుంది,” అని ఆయన హామీ ఇచ్చారు.

రంగారెడ్డి

పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటాం.. కేఎల్ఆర్ –మహేశ్వరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు.. సమత ప్రకాష్

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 24 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ లో.. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే, కేఎల్ఆర్ ఆదేశాల మేరకు.. నియోజకవర్గము మహిళా అధ్యక్షురాలు సమత ప్రకాష్.. పహడి షరీఫ్ కి చేరుకొని.. భర్తను కోల్పోయిన నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ సయ్యద్ తపస్సు నీ పరామర్శించడం జరిగింది. పార్టీని నమ్ముకుని సేవలందించే ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే.. ప్రజల పార్టీ.. ప్రజా ప్రభుత్వం. నియోజకవర్గంలో ఎన్నో సేవలు అందించినటువంటి మహిళ జనరల్ సెక్రటరీ సయ్యద్ తపస్సు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తూ.. ఈ కార్యక్రమంలో.. బడంగ్పేట్ మున్సిపల్ అధ్యక్షురాలు అమృత నాయుడు మీర్పేట్ అధ్యక్షరాలు పద్మశ్రీ జలపల్లి అధ్యక్షురాలు నజీం సుల్తానా మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కర్నూలు బస్ ప్రమాదంపై మన్నేటి వెంకటరెడ్డి తక్షణ స్పందన – DNA పరీక్షలకు చర్యలు

కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మన్విష్, మన్విత్ దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయగిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు సమాచారం అందించి, ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో సంప్రదించి మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. “ఒకే కుటుంబం నిండుగా నష్టపోవడం హృదయవిదారకమైన విషయం. ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది,” అని వెంకటరెడ్డి అన్నారు. మృతుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా వారికి అండగా నిలుస్తుంది,” అని ఆయన హామీ ఇచ్చారు.

రంగారెడ్డి

న్యూ మధురాపురి కాలనీలో పార్కు స్థలాన్ని కాపాడండి

–పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత ప్రభుత్వానిదే కెఎల్ఆర్ రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి అక్టోబర్ 24 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్ గూడ గ్రామ పరిధి 4 వ డివిజన్ న్యూ మధురాపురి కాలనీలో ప్రజా అవసరాల కోసం వదిలేసిన పబ్లిక్ స్థలాన్ని కొంత మంది అక్రమార్కులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తూన్న విషయాన్నీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి కలనివాసులతో కలసి మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లటంజరిగింది గతంలో మధురాపురి కాలనీ అమరావతి కాలనీకి సంబంధించి దాదాపు 8 నుండి పది ఎకరాల ల్యాండ్ ప్లాట్లుగా లే అవుట్ చేసి ప్లాట్లు సేల్ చేయటం జరిగింది అయితే ఈ లే అవుట్ కి సంబంధించి న ల్యాండ్ లో ఒక నీటి బావి స్థలం ఉండేది అట్టి స్థలాన్ని దాదాపు 800 చదరపు అడుగుల స్థలాన్ని ఓపెన్ ల్యాండ్ గా చూపెట్టి ఈ స్థలం ఈ లే అవుట్ కి సంబందించిన ప్లాట్ల యజమానులు పార్క్ స్థలంగా ఉపయోగించు కోవచ్చని గతంలో బిల్డర్లు చెప్పారని ఇప్పుడేమో ఎవరో కొంతమంది భూకబ్జాదారులు వచ్చి మా కాలనీకి చెందాల్సిన పార్క్ స్థలాన్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తు ఇంతవరకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ కాలేదు కానీ ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇంటి నంబర్ కోసం మున్సిపాల్టీ లో ప్రయత్నిస్తు ఉన్నారని కాబట్టి ఇట్టి పార్క్ స్థలం మా కాలనీకి అప్పగించే విదంగా మీరు చొరవ చూపాలని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది స్పందిస్తూ తప్పకుండా పార్క్ స్థలాలని కాపాడతామని అదే విదంగా పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత ప్రభుత్వానిదే అని ఈ విషయం కమీషనర్ తో మాట్లాడి కాలనీకి సంబందించిన స్థలాలను తక్షణం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని పార్క్ స్థలాలు అభివృద్ధి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని చెబుతానని కాలనీ వాసులకు హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లా రెడ్డి , బోయపల్లి గోవర్ధన్ రెడ్డి పాటు న్యూ మధురా పురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.నవీన్ రెడ్డి మరియ సంతోష్ చారి ,వంశీ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదికి పూజలు

శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వర్ణముఖి నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా కార్తీక అమావాస్య సందర్భముగా 19.11.2025 వ తేదీ బుధవారము సాయంత్రం 7.00 గంటలకు స్వర్ణముఖి నదీమ తల్లికి కలశ పూజలు,ధూప,దీప నైవేద్యములు మరియు మహా దీపారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బాపిరెడ్డి తెలియజేశారు.కావున ఈ కార్యక్రమం లో భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని వారు కోరారు.

క్రైమ్

నఖిలి రిపోర్టర్. జగ్గయ్యపేట లో జరిగిన సంఘటన

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిధి ) న్యూస్ రిపోర్టర్ ముసుగులో మోసాలు – జగ్గయ్యపేటలో చర్చ. జగ్గయ్యపేట పట్టణంలో న్యూస్ రిపోర్టర్‌గా చెబుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ, మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి విషయం బయటకు రావడంతో ప్రజల్లో ఎవర ఫేక్ రిపోర్టర్ అంటూ చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే — పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తాను న్యూస్ రిపోర్టర్‌ని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. న్యూస్ రిపోర్టర్ పేరుతో ప్రజలను భయపెట్టుతూ, మోసాలకి పాల్పడుతున్నాడు . మళ్ళీ జర్నలిజం మీద పెద్ద పెద్ద లెక్చర్లలు ఇస్తూ తానే పెద్ద నీతిమంతుడుని అని చెప్పుకుంటాడు ఈ క్రమంలో జగ్గయ్యపేటకు చెందిన ఓ మైనార్టీ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగి, ఆమె నమ్మకాన్ని వాడుకుని, ఆమె పేరులో ఉన్న ఆస్తులను తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలానికి మోసానికి గురయ్యానని గుర్తించిన ఆ మహిళ, జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఆ వ్యక్తి మొదట తప్పుడు సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసుల వాళ్ళ స్టయిల్ లో విచారించగా, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తర్వాత ఆ మహిళ పేరులో ఉన్న ఆస్తులను తిరిగి ఆమె పేరుమీదకు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ విషయం బయటకు రావడంతో జగ్గయ్యపేటలో చర్చ మొదలైంది. స్థానిక మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి నకిలీ రిపోర్టర్లు జర్నలిజం పేరుతో తిరిగి జర్నలిజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా “ఇలాంటి ఫేక్ రిపోర్టర్లు ఎవరో బయటపెట్టి శిక్షించాలి” అంటూ చర్చించుకుంటున్నారు

హైదరాబాద్

ప్రైవేటు బస్ ల మీద కధనం.

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతినిధి) స్లీపర్ బస్సుల సేఫ్టీ నిర్లక్ష్యం ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణం: కర్నూల్ దగ్గర జరిగిన బస్ ప్రమాదం నేపథ్యంలో కర్నూల్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం ద్విచక్ర వాహన దారుడు బస్ డ్రైవర్ తప్పిదం మాత్రమే కాక, బస్సు యజమాని మరియు రవాణా శాఖల నిర్లక్ష్యంతో కూడినదని నిపుణులు పేర్కొంటున్నారు. 2023లో ఓ ప్రయాణికుడు వివరించినట్లుగా, పాత స్కానియా మల్టీ ఆక్సిల్ సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చినప్పుడు సేఫ్టీ ఫీచర్లు – పెద్ద అద్దాలు, పగలకొట్టే హేమర్లు, ఫైర్ ఎక్సటింగిషర్స్, ఎమర్జెన్సీ డోర్లు – తొలగించబడ్డాయి లేదా పనిచేయట్లేదు. పైబెంచ్ ఎ.సి బస్సుల FRP ముందు భాగం వెంటనే మంటకు లోనవుతుంది, కిటికీలు లేకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. స్కానియా, వోల్వో బస్సులు ఫైర్ సేఫ్టీ ప్యాకేజీతో వస్తున్నా, వేమూరి కావేరి ట్రావెల్స్ పాత సీటర్ బస్సులను స్లీపర్‌లోకి మార్చి భద్రతను లాక్కి పెట్టారు. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖలు పర్మిట్లు ఇచ్చినప్పటికీ నిబంధనలు పట్ల నిర్లక్ష్యం చేశారు. రవాణా మంత్రి పరిపాలనా బాధ్యతను తప్పించుకుంటూ, “మనకేం సంబంధం” అని పేర్కొన్న విషయం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అనేక ట్రావెల్స్ కూడా ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులు పరిపాలనలోనుండే బదులుగా రోడ్డుపై తిరుగుతున్నాయి. పూర్వపు ఘటనలు – జబ్బర్ ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ – చెబుతున్నాయి రవాణా శాఖ క్రమంగా చర్యలు తీసుకుంటే ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చును. ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రవాణా శాఖల మంత్రి మరియు అధికారులు తక్షణమే ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, సీటింగ్, పర్సనల్ సేఫ్టీ ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం కొంత మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇక నుంచి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు నవంబర్ 1 నుంచి అమలు

బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ, ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబరు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. మన దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం, లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగు తోంది. దీంతో కుటుంబ సభ్యులు, డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు, లాకర్లకూ వర్తిస్తాయి. ఒకేసారి నలుగురి నామినేషన్: మీరు మీ ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా పేర్కొన వచ్చు. అంతేకాదు, ఎవరికి ఎంత వాటా (శాతం) వెళ్లాలి అన్నదీ మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామికి 50 శాతం, మిగతాది పిల్లలకు అన్నట్లు పంపకాలు చేయొచ్చు. *ఒకరి తర్వాత మరొకరు:* నలుగురు నామినీలను వరుస క్రమంలోనూ ఏర్పాటు చేయొచ్చు. అంటే, మొదటి నామినీ అందుబాటులో లేకపోతే, రెండో నామినీకి అర్హత వస్తుంది. వారూ లేకపోతే మూడో వారికి…ఇలా ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఉంటుంది. డిపాజిట్ ఖాతాలకు పైన చెప్పిన రెండు పద్ధతుల్లో మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. నామినీ పేర్లను నమోదు చేసేటప్పుడు, వారి ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ వంటి వివరాలూ ఇవ్వాలి. దీనివల్ల అవసరమైన సందర్భంలో బ్యాంకు వారిని సులభంగా సంప్రదించగలదు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కర్నూల్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావులపాలెం వ్యక్తి మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) క్రేన్ ఆపరేటర్ గా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ రెడ్డి.రెండు రోజుల క్రితం క్రేన్ పని నిమిత్తం హైదరాబాద్ కు, అక్కడినుంచి బస్సు పై బెంగళూరు వెళుతున్న గా ఈ ప్రమాదం..ఇతనికి భార్య లక్ష్మీ జ్యోతి గృహిణి, ఎనిమిదవ తరగతి చదువుతున్న కుమారుడు వెంకటరెడ్డి, మూడో తరగతి చదువుతున్న కుమార్తె దివ్య ఉన్నారు. ఈయన మృతి తో రావులపాలెం లో విషాదఛాయలు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.