Thursday, 23 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యులు గా కోలా విశాలాక్షి,వి.గుర్రపు శెట్టి,గాదిపాకుల గోపినాథ్, లక్ష్మమ్మ లు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి సభ్యురాలు ఉదయము ప్రమాణస్వీకారం చేయగా,టిడిపి సభ్యులు సాయంత్రం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి,ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం,ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న “భారత్ ట్యాక్సీ”

కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న “భారత్ ట్యాక్సీ” – దేశపు తొలి సహకార టాక్సీ యాప్ కేంద్ర ప్రభుత్వం “భారత్ ట్యాక్సీ” పేరుతో దేశపు మొదటి సహకార టాక్సీ యాప్‌ను ప్రారంభిస్తోంది. ఓలా, ఉబర్‌లకు పోటీగా, డ్రైవర్లు యజమానులు, కమిషన్ లేకుండా, డిజిటల్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌తో లింక్. ట్రయల్ నవంబర్‌లో ఢిల్లీ, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభం.

తెలంగాణ

దృవ పత్రాల జారి కేంద్రాన్ని సందర్శించిన :కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునికరించిన వికలాంగుల దృవపత్రాల జారీ కేంద్రాన్ని (సదరం) సుందరంగా తీర్చిదిద్దడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే వికలాంగుల ధృవపత్రం జారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇదివరకు ఉన్న వికలాంగుల దృవపత్రం జారీ కేంద్రాన్ని 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించడం జరిగింది. ఇంకా మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అరుణకుమారి, డిప్యూటీ సూపరిండెంట్ నగేష్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం*

*తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం* *అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ* తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ క్రమంలో అడవి భూసర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి రానున్నాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో అమలు చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది….

నాగర్‌కర్నూల్

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే.. ఎస్సై కురుమూర్తి

వెల్దండ,అక్టోబర్ 24, పున్నమి న్యూస్ : వెల్దండ మండల కేంద్రంలో ఇన్ఫోసిమెంట్ విధులలో భాగంగా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందర నేషనల్ హైవేపై వాహనాలు తనిఖీ చేయుచుండగా ఎంజి కాలనీ తండా కు చెందిన రాత్లావత్. రవి s/o బాలకృష్ణ వయసు 33 సంవత్సరాలు అను వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా వెల్దండ పోలీసులు ఆపి టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అనంతరం శుక్రవారం రోజున కల్వకుర్తి జెఎఫ్ సిఎం కోర్టు నందు ప్రవేశపెట్టగా జడ్జి జాడ కావ్య అతనికి ఒకరోజు సాధారణ జైలు శిక్ష విధిస్తూ రూ.600 రూపాయలు జరిమానా విధించారని వెల్దండ ఎస్సై కురుమూర్తి తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీ కాలనీలో లార్వా సర్వే

ఉదయగిరి బీసీ కాలనీలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు లార్వా సర్వే ఫీవర్ సర్వే నిర్వహించారు , మలేరియా, డెంగ్యూ , చికెన్ గున్యా ఫైలేరియా వ్యాధులు కలుగ చేసే దోమల అభిహృద్దికి చెందుటకు అవకాశం ఉన్న పరిస్థితి లా పై అవగాహన కల్పించారు ప్రతీ శుక్రవారం ఫ్రైడే కార్యక్రమాన్ని నిబద్దతతో నిర్వహించాలన్నారు

E-పేపర్

ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల బదిలీకి సహకరించండి

పున్మమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గయ్య ఆంధ్రా స్థానికత గల హోంగార్డుల బదిలీకి సహకరించండి.. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెంది తెలంగాణా లో పనిచేస్తున్న హోమ్ గార్డులను సొంత రాష్ట్రానికి బదిలీ చేసేలా ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని సంఘం ప్రతినిధులు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కలసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోం గార్డు ఉద్యోగాలకు సెలక్ట్ అయ్యామని, రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత మేము తెలంగాణలో ఉండిపోవలసి వచ్చిందని వారు ఆయనకి వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగింది. కాని హోంగార్డులను మార్చలేదు. మా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దీనివలన మేము ఉద్యోగం తెలంగాణలో, కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటికి రవాటానికి రవాణపరంగా మరియి ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, మేము వారిని చూసుకోలేకపోతున్నాము. వారు..ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణలో ఉంటున్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రామకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలియజేశారు.

తిరుపతి

ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం*

*ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం* *శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల* *ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన G. గోపినాధ్ గారు, వి గుర్రప్ప శెట్టి గారు మరియు D లక్ష్మమ్మ గారు* *ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈ ఓ బాపిరెడ్డి గారు, కోలా ఆనంద్ గారు నరసింహ యాదవ్ గారి సమక్షంలో ఘనంగా జరిగింది* *సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపి ఆలయ ప్రతిష్టతను కాపాడుతూ ఆలయ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపిన ఎమ్మెల్యే*

తిరుపతి

ముక్కంటి పాలకమండలి సబ్యులుగా మాలలు అనర్హులా…పులి శ్రీకాంత్

శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పాలమండలి ఏర్పాటులో మాలలకు అవకాశం కల్పించకపోవడంపై శ్రీకాళహస్తి నియోజికవర్గ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు అడ్వకేట్ పులి శ్రీకాంత్ మాట్లాడుతూ..శివయ్య సేవకు మాలలు అనర్హులని తేల్చిన కూటమి పార్టీలని విచారం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి క్రమం తప్పకుండా మాలలకు అవకాశం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చేవారని అటువంటి ఆనవాయితీని కూటమి పార్టీలు తుంగలో తొక్కి మాలలు ట్రస్ట్ బోర్డ్ మెంబర్ కి పనికిరారని పార్టీల నేతలు తేల్చిని కీర్తిశేషులు వల్లూరు ప్రకాష్ రావు ఎంతో శ్రమించి దళితులకు శివరాత్రికి మొదటి పూజ ఉండాలి అనే ఒక దీర్ఘ ఆలోచనతో ఎంతో శ్రమించి, ఎన్నో పోరాటాలు చేసి శివుడికి మొదటి పూజ మాలలు చేయాలనే ఒక నిర్ధారణ చేసి, ఈ దక్షిణ కైలాస వాసిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీకాళహస్తిశ్వరుడికి శివరాత్రి రోజు మొదట మాలల ద్వారానే పూజ జరుగుతున్న విషయం అందరికి తెసిన విషయమే, అటువంటి తరుణంలో నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం లో దాదాపు 50 వేల మంది పైచిలుకు మాలలు ఉన్నప్పటికీ, మాలలు శ్రీకాళహస్తిశ్వరునికి శివరాత్రికి మొదటి పూజ చేస్తున్నప్పటికీ నిన్న మొన్న విడుదల చేసిన పాలకమండలి సబ్యులుగా కూటమి పార్టీల్లో ఏ ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. మాలలు అంటే వీరికి కేవలం ఊడిగాలు చేసే దానికి మాత్రమే పనికొస్తారని తేల్చి చెప్పినందుకు సంతోషమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటి నుంచి మాలలకు అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయం కూడా రాలేదన్న విషయం బోర్డు నియమాకాంలో తేటతెల్లమైనదని మాలలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎన్నో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కకు నేటి కూటమి పాలకులు మాలల్ని నట్టేట ముంచారన్నారు. ఈ విషయం గుర్తించుకుని మనుగడ సాగించాలని కోరుకుంటున్నానని అయన పేర్కొన్నారు.

తిరుపతి

వర్షాలకు ఉపాధి కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలి-తాలేటి రామచంద్రయ్య

శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: రాష్ట్రంలో పాలు జిల్లాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాలలో ప్రజలు వారి దైనందిన జీవనానికి నష్టం కగడంతో అధికశాతం రోజువారి కూలీనాలీ చేస్తూ బ్రతికే పేదవారికి భృతి లేకుండా పోయిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి తాలేటి రామచంద్రయ్య ప్రకటనలో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, గిరిజనులకు తక్షణసాయంగా 10.000 రూపాయలు ఇవ్వాలని, వాటితో పాటు ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పేదల గుడిసెలను తిరిగి నిర్మించుకునేందుకు సాయం అందించాలనీ, అందుకోసం జిల్లాలోని మండల తహసిల్దార్ నేతృత్వంలో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.