Thursday, 23 April 2026

Blog

విశాఖపట్నం

సింహాచలం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుజాత

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: సింహాచలం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుజాత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం కార్యనిర్వహణాధికారిగా (FAC) బాధ్యతలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎన్. సుజాత గారు శుక్రవారం అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఇఓ శ్రీమతి సుజాత మొదటగా శ్రీ అప్పన్న స్వామివారిని దర్శించుకుని, ఆలయ పరిధిలో కప్పస్థంభం ఆలింగనం చేసి, బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని వేదపండితుల వేదాశీర్వచనాలు స్వీకరించారు. అనంతరము ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు గారు మరియు అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి , ఈ ఓ శ్రీమతి సుజాత గారికి స్వామివారి పటము, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారులు, వైదిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం నాగుల చవితి సందర్భంగా నగర వాసుల సౌకర్యార్ధం శనివారం (25 – 10 – 2025) వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగుల చవితి పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. బీచ్ రోడ్ లోని వి ఎం ఆర్ డి ఎ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లలో ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అందరికీ నాగుల చవితి సందర్భంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నియోకవర్గంలోని అన్ని పంచాయతీల నుంచి కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

దుబాయ్‌ మూడో రోజు పర్యటనలో చంద్రబాబు

*దుబాయ్* *దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ* • యూఏఈ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ • ప్రస్తుతం భారత్- యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించిన నేతలు • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశం భేటీలో చర్చ • సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై చర్చించిన యూఏఈ ఆర్ధిక శాఖ మంత్రి. • స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చ • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం • ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు, కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ప్రస్తావించిన యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి. • లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై చర్చించిన సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి.

ఆంధ్రప్రదేశ్

2047నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్!*

ఆస్ట్రేలియా *2047నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్!* *$2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు* *జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు* *ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్* ఆస్ట్రేలియా (మెల్బోర్న్): ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చడమే మా లక్ష్యం. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Austrade) ఎగ్జిక్యూటివ్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య సేవా నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి శ్రీమతి ఎలోడీ జర్నెట్ అధ్యక్షత వహించగా, లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతోంది, గత 16నెలల్లోనే $117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. సుదీర్ఘమైన పాలనానుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వల్లే ఇది సాధ్యమైంది. ఏరోస్పేస్ & డిఫెన్స్‌, అగ్రిటెక్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, డీప్‌టెక్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌, లాజిస్టిక్స్‌, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విశేష పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. బలమైన విధాన వ్యవస్థ, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్‌, మూడు ఆర్థిక కారిడార్లు, భవిష్యత్ సిద్ధమైన శ్రామిక శక్తి, క్వాంటం కంప్యూటింగ్‌, డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ వ్యాలీ వంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్నాయి. అధునాతన సాంకేతికత, ఏఐ ఆధారిత గవర్నెన్స్ వేగవంతమైన అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0తో పాటు 24 థీమెటిక్ పాలసీలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ వంటి అధునాతన సాంకేతిక రంగంతోపాటు డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. 1053 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 6 ఆపరేషనల్ పోర్టుల ద్వారా ఏటా 193 మిలియన్ మెట్రిక్ టన్నులు సరుకు రవాణా అవుతోంది. వచ్చే ఏడాదికల్లా 350 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ప్రారంభం కానున్నాయి. తూర్పు తీర సముద్ర కార్గో రవాణాలో 40శాతం ఏపీ నుంచే సాగుతోంది. ప్రస్తుతం $20 బిలియన్లుగా ఉన్న ఎగుమతులను 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్, డేటా హబ్‌గా తయారవుతోంది. విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ హబ్ నిర్మించబోతోంది. అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.35లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతోంది. భారీ పెట్టుబడులకు విశాఖపట్నం గేట్ వేగా మారింది. విశాఖ మహానగరం 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధిస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలు ప్రారంభించబోతున్నాం. ఇది భారత సాంకేతికరంగంలో గేమ్ ఛేంజర్ కాబోతుంది. అమరావతి Quantum Valley లో స్టేట్ డేటా లేక్‌, అవేర్ హబ్‌, ఇంటెలిజెన్స్ లేయర్‌, డిజిటల్ గవర్నెన్స్ వంటివి అంతర్భాగాలుగా ఉంటాయి. ప్రస్తుతం $180 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ… 2047నాటికి $2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికబద్ధంగా, వేగవంతంగా ముందుకు సాగుతోంది, నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో తాము ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025కు ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలు హాజరై ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. *****

ఆంధ్రప్రదేశ్

ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది*

ఆస్ట్రేలియా *ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది* *మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్* *ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే* *దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది* *విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది* *మెల్ బోర్న్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో లో మంత్రి నారా లోకేష్* *విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం* మెల్ బోర్న్(ఆస్ట్రేలియా): ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో మెల్ బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు ఆహ్వానించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో మీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు పరిగణించాలో మూడు ప్రధాన కారణాలు చెబుతాను. ఏపీలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. దీనివల్ల దేశంతో పాటు ఏపీలో కూడా సాఫీగా పెట్టుబడులు పెట్టేందుకు మీకు సహకారం లభిస్తుంది. ఏపీలో 50శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు మేమంతా కసితో పనిచేస్తున్నాం. *మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్* రెండో కారణం.. ఏపీ స్టార్టప్ స్టేట్. చేపట్టిన పనులు పూర్తిచేయాలనే ధృడసంకల్పంతో ఉన్నాం. మీరు ఒకసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. మొదటగా మేం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆయా ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులు, నాయకులతో నిరంతరం ప్రాజెక్ట్ పురోగతిపై రోజువారీ పద్ధతిలో చర్చిస్తాం. ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో, ఏం చేయాలో తెలుసుకుంటాం. ఉదాహరణకు ఆతిథ్య సేవల రంగంలో ఈ రోజు ఉదయం ఓ కంపెనీకి భూమి కేటాయింపు ప్రస్తుత పరిస్థితి, ఫైల్ ఎక్కడ ఉందో, క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందో అన్న వివరాలు పంపించాం. ఇచ్చిన హామీని అమలుచేయడం మాకు చాలా ముఖ్యం. మీ ప్రాజెక్ట్ ను నిరంతరం ఫాలో అప్ చేస్తాం. మీరు నిర్దేశించిన సమయం కంటే వేగంగా పూర్తిచేయడమే మా లక్ష్యం. *ఏపీకి గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉంది* ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారు. దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉంది. ఆ సంస్థ నాయకత్వం మొదట వచ్చినప్పుడు నేను స్వయంగా వాళ్లను తీసుకెళ్లి ప్రాజెక్ట్ వచ్చే స్థలాన్ని చూపించాను. తర్వాత నేను వారి కార్పోరేట్ కార్యాలయానికి వెళ్లి ఎందుకు ఏపీని ఎంచుకోవాలనే అంశంపై వారిని ఒప్పించాను. తర్వాత గూగుల్ నాయకత్వం వచ్చి ముఖ్యమంత్రి గారిని ఏపీలో కలిశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కొన్ని మార్పులు చేయాలని వారు కోరారు. ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారితో మాట్లాడి అవసరమైన విధానపరమైన సవరణలు చేశాం. దీంతో గూగుల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. భారతదేశం గ్లోబల్ డేటా సెంటర్ హబ్ గా ఎదిగేందుకు మార్గం సుగమమైంది. ఆ ప్రాజెక్ట్ ను మేం 13 నెలల్లోనే పూర్తిచేశాం. మేం చెప్పిన సమయం కంటే ఒక నెల మాత్రమే ఆలస్యమైంది. నెల ఆలస్యంపై ఇప్పటికీ మేం బాధపడుతుంటాం. ఆదిత్య మిట్టల్ గారు, నాకు మధ్య ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెల్లర్ మిట్టల్ ఏపీకి వచ్చింది. ఇందుకు కావాల్సిన అనుమతులపై ప్రధాని మోదీ గారితో చర్చించి మార్గం సుగమం చేశాం. నవంబర్ లో ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నాం. 15 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ఏపీకి వ్చచింది. *ఏపీకి 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే* గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. దేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ కు మేం మీ వెంటే ఉంటాం. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో మీ ప్రతి ఆలోచన, ప్రాజెక్ట్ కు మేం పూర్తి మద్దతు ఇస్తాం. మీ పెట్టుబడుల గమస్థానంలో ఏపీని ఎందుకు ఎంచుకోవాలనేందుకు మూడో కారణం.. మాది జాతీయ దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీ. రెండు రాష్ట్రాల్లో ఉన్నాం. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం. దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా మేం ఎప్పుడూ జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపాం. ఈ ప్రక్రియలో ఏపీకి కూడా ప్రయోజనం లభించింది. గతంలో చంద్రబాబునాయుడు గారి హయాంలో కూడా టెలికాం, విమానయాన రంగం, డిజిటల్ చెల్లింపులు వంటి సంస్కరణల్లో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు డేటా సెంటర్ విధాన సంస్కరణల్లో కీలకపాత్ర పోషించారు. *ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం* ప్రస్తుత ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలి. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర, కేంద్ర స్థాయిలో చేయాల్సిన విధానపరమైన మార్పులు గుర్తించి, వాటిని అమలుచేసే పనిలో ఉన్నాం. ఇందుకు ఉదాహరణ కార్మిక సంస్కరణలు. 9 సంస్కరణల్లో మార్పులు చేయాలని సూచించారు. 8 సంస్కరణలను 15 రోజుల్లోనే మేం పూర్తిచేశాం. మేం ప్రస్తుతం 180 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం. దీనిని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తీసుకెళ్తాం. మేం కేవలం ఒకటి, రెండు రంగాలపైనే దృష్టిపెట్టలేదు. 15 రంగాలపై దృష్టి కేంద్రీకరించాం. క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తాం. ఆటోమోటివ్, సిమెంట్, పునరుత్పాదక రంగం, ఎలక్టానిక్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఫార్మా, స్టీల్, ఆక్వా, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం. దేశంలో తయారవుతున్న ఏసీల్లో సగం ఏపీలోని తయారవుతున్నాయి. దీనిని 70శాతానికి తీసుకెళ్తాం. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. *దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది* దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా త్వరలోనే నెం.1 అవుతాం. మేం కేవలం ఎంవోయూల కుదుర్చుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషిచేస్తున్నాం. విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఇదో అద్భుతమైన నగరం. పార్ట్ నర్ షిప్ సమ్మిట్ క్ హాజరై పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలి. బెంగళూరు, గోవా నగరాల కలయిక విశాఖపట్నం. దేశంలోనే 9వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖ ఉంది. త్వరలోనే టాప్-3 లో నిలవనుంది. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) నేషనల్ ఛైర్ దీపక్ రాజ్ గుప్తా, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(మెల్ బోర్న్) డాక్టర్ సుశీల్ కుమార్, సీఐఐ(కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ) డైరెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. *****

విశాఖపట్నం

విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* మన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (AI) ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను అమలుపరిచి విశాఖపట్నం నగర పరిధిలో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించుటకు గాను దేశం లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలను గతంలో ఆహ్వానించడం జరిగింది. సదరు కంపెనీలు ఇదివరకు పలుమార్లు గౌరవ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ M. భారత్ గారు, విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చీ IPS, విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ M.N.హరేంధిర ప్రసాద్ IAS మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్ శ్రీ కేతన్ గార్గ్ IAS గార్ల ముందు వారి వారి ప్రెజెంటేషన్ లను ఇవ్వడం జరిగింది. ఈ రోజు అనగా తే.24-10-2025 ది నాడు విశాఖపట్నం కలెక్టర్ వారి కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ క్రింది అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది.  నగరంలోని ముఖ్యమైన 101 ట్రాఫిక్ కూడళ్ళలో మరియు మరికొన్ని ముఖ్యమైన కూడళ్ళలో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ (ATCS) విస్తరణ ద్వారా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం, నగర పౌరులకు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడం మరియు పౌరుల ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్ ద్వారా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం (రైడర్ & పిలియన్ రైడర్), ట్రిపుల్ రైడింగ్, రెడ్ లైట్ ఉల్లంఘన, ప్రామాణికం కాని నంబర్ ప్లేట్లు / నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించడం, వ్యతిరేఖ మార్గంలో డ్రైవింగ్ చేయడం, వేర్వేరు వాహనాలకు ఒకే నంబర్ ప్లేట్‌ను ఉపయోగించడం, అనధికార పార్కింగ్ మొదలగు ట్రాఫిక్ ఉల్లంఘలను కనిపెట్టి ట్రాఫిక్ చలానాలను ఆటోమేటిక్ గా జారీ చేయడం జరుగుతుంది. నగరంలోని ముఖ్యమైన రహదారులలో మరియు నిర్మానుష్య రహదారులలో అతివేగంగా, రేసింగ్ మరియు స్టంట్స్ చేస్తూ వాహనం ను నడుపుతున్న వాహనాలను గుర్తించి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ చలానాలను జారీ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాహనం పై పెండింగ్ ఉన్న చలాన్ల సంఖ్యను గుర్తించి వాహన యజమానికి అప్రమత్తం చేయడం జరుగుతుంది.  నగరంలోని ముఖ్యమైన 25 ప్రదేశాలలో మరియు మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (AI) ఆధారిత కెమెరాలను అమర్చి ముఖ ఆధారిత గుర్తింపు (FACIAL RECOGNITION) అను కొత్త సాంకేతికతను నగరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సాంకేతికత ద్వారా నేర చరిత్ర గల వ్యక్తులు, అనుమానితులను, రియల్ టైం లో నగరంలో సంచరించినప్పుడు గుర్తించి, పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని వెంటనే చేరవేయడం జరుగుతుంది.  ప్రయాణ సమయాలను తగ్గించడానికి ట్రాఫిక్సిగ్నలింగ్ వ్యవస్థలో synchronization ను తీసుకురావడం జరుగుతుంది.  VVIP/VIP/అత్యవసర ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడానికి 3 గ్రీన్ కారిడార్లను (1) నగరంలోని జాతీయ రహదారి, (2) రైల్వే స్టేషన్ రోడ్ (3) బాజీ జంక్షన్ BRTS రోడ్ నుండి పెందుర్తి వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పై అంశాలపై GVMC అధికారుల సహాయంతో 05 సంవత్సరాల కాలపరిమితికి గాను విధివిధానాలను (Request for proposals – RFP) రూపొందించి టెండర్స్ ను ఆహ్వానించుట కొరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తం గా విశాఖపట్నం ట్రాఫిక్ సిస్టమ్ ను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా సరికొత్తగా నవీకరించడం జరుగుతుంది.

కామారెడ్డి

పోసానిపేటలో వ్యక్తి ఉరివేసుకుని మృతి

కామారెడ్డి, 24 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, పోసానిపేటకు చెందిన మంగలి బాలయ్య (50) హైదరాబాద్‌లోని వెల్నెస్ హాస్పిటల్‌లో వాచ్‌మన్‌ గా పనిచేస్తున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, బాలయ్య కొంత కాలంగా మద్యా నికి అలవాటై తరుచుగా మద్యం సేవించటం వల్ల ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన జీవితం పట్ల విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జి.జి.హె చ్)కి తరలించారు. మృతునికి భార్య మంగలి సవిత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ వివాహ జీవితంలో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

తెలంగాణ

బహుమతులు ప్రధానం చేసిన : భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా కే రాజ్ కుమార్ రెడ్డి

పున్నమి: అక్టోబర్ 24 రంగారెడ్డి జిల్లా: జాతీయ స్థాయి ఛాలెంజర్ కప్లో మెరిసిన మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు హైదరాబాద్ లో శుక్రవారం రోజున భీష్మ రాజ్ ఫౌండేషన్ కార్యాలయం కాశీనాథేశ్వర కాలనీ శాంసన్ పల్లి రోడ్లో జాతీయ స్థాయి 22వ ఛాలెంజర్ కప్ 2025 కరాటే పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది,ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త,భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డా కే రాజ్ కుమార్ రెడ్డి విజేత విద్యార్థులకు మెడల్స్ బహుకరించి అభినందించారు, మాస్టర్ షోటోకాన్ కరాటే డూ ఇండియా విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు, ఈ పోటీల్లో స్రవంతి,బృంధా,మహేశ్వరి, అభిరామ్ బంగారు పతకాలు గెలుచుకోగా, బవేష్ రజత పతకం,కార్తీక్ కాంస్య పతకం సాధించి తమ కోచ్లకు, తల్లిదండ్రులకు గర్వకారణమయ్యారు, ఈ విజయానికి మార్గదర్శకులుగా కేశవ్ మాస్టర్ కరాటే అకాడమీ అశోక్ మాస్టర్ నారాయణపేట కీలక పాత్ర పోషించారు,ఈ సందర్భంగా డా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పునాది వేస్తాయి, ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ఫౌండేషన్ గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్రాజ్,అశోక్, మహేష్ వంటి సీనియర్ బ్లాక్ బెల్ట్ మాస్టర్లు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

తెలంగాణ

జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన : డిప్యూటీ డైరెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) 2025 -26 సంవత్సరానికి గాను వర్షాకాలం పంటకు సంబంధించి పంటల విస్తీర్ణం, పంటల రకాలు,నీటి వసతి, తదితర అంశాలను అధ్యయనం చేసే నిమిత్తం జాతీయ గణాంక విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు జాతీయ గణాంక కార్యాలయం (నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్) తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్. అజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా ఆన్నెపర్తి గ్రామంలో సుమారు 20 సర్వే నెంబర్లు పంట పొలాలను పరిశీలించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.