Thursday, 23 April 2026

Blog

ఖమ్మం

జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి పూజలు

పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నాగుల చవితి ఉత్సాహంగా జరిగింది. వేకువజామున నుంచే మహిళలు, భక్తులు నాగేంద్రుని పుట్టల వద్ద బారులు తీరి పూజలు నిర్వహించారు. నాగరాజు దర్శనం కోసం భక్తులు చల్లగా చూడమని వేడుకోగా, మొక్కలు తీర్చుకున్నారు. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు వైభవంగా సాగాయి.

E-పేపర్

ఎదిరించే వాడు లేకపోతె బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 Tg &ap ఎదిరించే వాడు లేకపోతె బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది 10 సంవత్సరాల ముందు సాధాసీదా ఉద్యోగం చేసుకునేవాడికి ఇప్పుడు 10 ఇండ్లు, 5 లగ్జరీ కార్లు, 100 కోట్లు.. ఒకప్పుడు సిటీ బస్సుల్లో తిరిగిన వాడు ఇపుడు bmw కారులో తిరుగుతున్నాడు.. ఒక బినామి పేరు మీద ఇన్ని ఆస్తులుంటే ఆ రాజకీయ నాయకుని దగ్గర ప్రజల సొమ్ము ఎన్ని వేల, లక్షల కొట్లో రోడ్లు వేస్తాం, ఇండ్లు కడతాం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కడతాం అని ప్రజల దగ్గర నుండి టాక్స్ ల రూపంలో వసూలు చేసి రాజకీయ నాయకులు దోచుకున్న సొమ్ము కొన్ని లక్షల కోట్లు.. లేని వాడు ఇంకా లేని వాడిగా, ఉన్నవాడు ఇంకా బలిసినోడిలా మారిపోతున్నారు. ఏ ఎమ్మెల్యే ను చూసినా 100 కోట్లకు తక్కువ ఆస్తులు ఎవరికీ లేవు..? ఎంపీ 1000 కోట్లు, సెంట్రల్ మినిష్టర్ 10 వేల కోట్లు, ఇక సీఎం అయితే లక్ష కోట్లు అంటూ టార్గెట్ పెట్టుకొని మరీ ప్రజా ధనాన్ని లూటి చేస్తున్నారు.. అలా లూటి చేసిన సొమ్ము బినామీల పేరు మీద కొన్ని వందల కోట్లు ఉన్నాయి.. మనమే టాక్స్ లు కట్టి మరీ వాళ్ళ ఆస్తులు పెంచుతున్నాము

తెలంగాణ

తెలంగాణలో మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు

పున్నమి అక్టోబర్ 25 తెలంగాణ: 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో 29,420 దరఖాస్తులు అత్యల్పంగా ఆదిలాబాద్‌ డివిజన్‌లో 4,154 దరఖాస్తులు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు డ్రా

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా గాదిపాకుల గోపీనాధ్ ప్రమాణస్వీకారం

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా గాదిపాకుల గోపీనాధ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గాదిపాకుల గోపీనాథ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం గోపీనాధ్ మాట్లాడుతూ శివయ్యకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ,ఆలయ ప్రతిష్టతను కాపాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,ఆలయ ఈ ఓ బాపిరెడ్డి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నరసింహ యాదవ్ పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం

ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్

ఐదు సంవత్సరాల క్రితం కిడ్నాప్ కేసును చేదించిన ఫోర్త్ టౌన్ పోలీసులు ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్ *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం…… డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్నేని రామ్ రెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి బోయిన విష్ణు ఎండి లాయక్ కలిసి కిడ్నాప్ చేసి జాన్ సురేష్ ను ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరగా 70 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన దగ్గర అంత డబ్బు లేదని జామ్ సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద ఉన్న గోల్డ్ ను తీసుకొని సీతంపేట లో గల ఐ ఎఫ్ ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు. సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని 100 డైలు చేసి తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వీరంతా పరారిపోయారు. ఈ విషయంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.నిందితులు పల్లపు ప్రసాదు ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అదే ఏడాది జులై 10వ తేదీన అరెస్టు చేసారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు విష్ణు ఎండి లాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి స్పెషల్ టీం ను నియమించారు. విష్ణు కోసం వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాలో విష్ణును పట్టుకున్నారు. నాలుగో ముద్దాయి లాయక్ గురించి విచారించిన 2021లో ఇతను ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. కేసు విషయంపై ముద్దాయిలని పట్టుకోవడంలో నాలుగో ముద్దాయిలనిపట్టణ పోలీసులు తీరును నగర పోలీస్ కమిషనర్ డీసీపీ సీను పోలీసులను అభినందించినట్లు ఏసిపి లక్ష్మి మూర్తి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఉమాకాంత్ ఎస్సైలు వెంకట్రావు, బాలకృష్ణ, చిన్నమ్మ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి

శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ఐక్యరాజ్యసమితి 80.వ వార్సిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్బంగా శుక్ర వారం రాంనగర్ లో గల లయన్స్ కమ్యూనిటీ సెంటర్ లో లయన్స్ క్లబ్ అఫ్ విశాఖపట్నం మరియు బాల వికాస ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో UN సంబరాలు ఘనంగా నిర్వహించారు. లయన్ డి. ప్రసాద రాజు అధ్యక్ష త వహించగా బాలవికాస వికాస ఫౌండేషన్ వ్యవస్తాపక కార్యదర్సి నరవ ప్రకాశ రావు స్వాగతం పలికి ఐక్యరాజ్య సమితి పనితీరు వివరించ్చారు UNICEF మాజీ అధికారిని .సుధా గంధం ముఖ్య అతిధి గా.పాల్గొని మాటలాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పి.అన్ని దేశాల.లో సుస్తిరితను కాపాడడం లో సమితి విశేషంగా కృషి చేస్తోంది అని రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాపతంగా శాంతి ని నెలకొల్పడం కోసం ఏఏర్పాటు చేసిన సమితి లో భారత దేశం కూడా సభ్యత్వం కలిగి సమితి బలోపేతానికి తమ సహకారము అందిస్తోన్నున్నదని అన్నారు 80.ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యం లో అవసరాలకు అనుగుణంగా సమితి పనిచేయవలసి న అవసరం ఉందని.అన్నారు ..తరువాత విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచ శాంతిని.కోరుతూ శాంతి ప్రతజ్ఞ చేశారు సమావేశం లో అడ్వకేట్ సి.ఎం.ఎస్.పి కృష్ణ రావు ఆచార్య కె.రవి.డాక్టర్ కె.వి ఎస్ ఎం.మూర్తి తదితరులు పాల్గొన్నారు ……………..

తిరుపతి

స్కిట్ కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికి ఇంతవరకు తరగతులు జరగకపోవడంపై విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలను బయట ప్రాంతాల లో హాస్టల్లో ఉంచడం ఇష్టం లేక దగ్గరలో స్కిట్ జేఎన్టీయూ కళాశాల ఉంటుందని భావించి ఈ కళాశాల నందు అడ్మిషన్లు తీసుకున్నామని,అయితే ఇప్పుడు విద్యార్థులను కలికిరి జేఎన్టీయూ కు పంపాలని అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.స్కిట్ కళాశాల నందు విద్యార్థులకు తరగతుల ప్రారంభించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖపట్నం

సింహాచలం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుజాత

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: సింహాచలం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుజాత శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం కార్యనిర్వహణాధికారిగా (FAC) బాధ్యతలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎన్. సుజాత గారు శుక్రవారం అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఇఓ శ్రీమతి సుజాత మొదటగా శ్రీ అప్పన్న స్వామివారిని దర్శించుకుని, ఆలయ పరిధిలో కప్పస్థంభం ఆలింగనం చేసి, బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని వేదపండితుల వేదాశీర్వచనాలు స్వీకరించారు. అనంతరము ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు గారు మరియు అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి , ఈ ఓ శ్రీమతి సుజాత గారికి స్వామివారి పటము, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారులు, వైదిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం నాగుల చవితి సందర్భంగా నగర వాసుల సౌకర్యార్ధం శనివారం (25 – 10 – 2025) వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగుల చవితి పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. బీచ్ రోడ్ లోని వి ఎం ఆర్ డి ఎ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లలో ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అందరికీ నాగుల చవితి సందర్భంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నియోకవర్గంలోని అన్ని పంచాయతీల నుంచి కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.