Thursday, 23 April 2026

Blog

కర్నూలు

టీడీపీ సీనియర్ నాయకుడు మృతి : అలువాల, గోనెగండ్ల

గోనెగండ్ల మండలం అలవాల గ్రామ నివాసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ వెంకటేశ్వర్లు (62)s/o కురువ శివన్న ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మరణించినాడు కావున ఆయన భౌతికాయానికి నివాళులర్పించిన గోనెగండ్ల మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు,ఎమ్మినూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కురువ మల్లయ్య, మరియు H కైరవాడి వ్యవసాయ కమిటీ చైర్మన్ తిమ్మారెడ్డి, మండల ఆర్గనైసింగ్ సెక్రటరీ రాజేష్, మల్లేష్ నాయుడు, అలువాల గ్రామ సర్పంచ్ భాష,అలువాల నూర,ఖాసీం సాహెబ్ లడ్డు, tnsf రమేష్ నాయుడు, itdp రాంపురం రఫీక్, itdp రవి, గోపాల్, నజీర్, చాంద్ భాష, అనుమంతు, రాజు తదితరులు.

E-పేపర్

కర్నూలు ఘోర ప్రమాదంలో ‘కడప జిల్లా వాసి ముృత్యుంజయుడు’

కర్నూలు ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పెద్దముడియంలోని నెమళ్లదిన్నెకు చెందిన జయసూర్య మృత్యుంజయుడయ్యాడు. 25 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్లో సెటిలయ్యారు. బీటెక్ పూర్తి చేసిన జయసూర్య బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి దూకి ప్రాణాలుకాపాడుకున్నాడు. కాగా రెండు కాళ్లు విరిగినట్లు తెలిపాడు.

E-పేపర్

ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.

E-పేపర్

ఆస్ట్రేలియా బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్, అర్షదీప్ స్థానంలో కుల్దీప్, ప్రసిద్ధ జట్టులోకి వచ్చారు. భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, సుందర్, ప్రసిద్ధ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్ (C), షార్ట్, రెన్షా, కారే, కొన్నోలీ, ఓవెన్, నాథన్ ఎల్లిస్, స్టార్క్, జంపా, హేజిల్ వుడ్.

అన్నమయ్య

దుబాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునీ కలిసిన ఏద్దల విజయసాగర్

దుబాయిలో నవంబర్ 14 విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ కు పెట్టుబడిదారులను అవేర్నెస్ ప్రోగ్రాం కోసం దుబాయ్ కి విచ్చేసిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడునీ రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు ఏద్దల విజయ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి ఆయనతోపాటు అబుదాబి లో ఉన్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ మందిరాన్ని సందర్శించారు. అనంతరం ఒక ప్రకటనలో విజయ సాగర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఒక అద్భుత ఆకర్షణగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని. రాష్ట్రానికి పెట్టుబడును ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగిందని. పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయినారని. శోభ గ్రూప్ షరాఫ్ గ్రూప్ ట్రాన్స్ వరల్డ్ బ్రిడ్జిల్ హెల్త్ కేర్ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపారని. ఈ చర్చలకు ఫలితంగా తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బురిజల్ హెల్త్ కేర్ అంగీకారం తెలిపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చైర్మన్ డాక్టర్ రవి,గల్ఫ్ ఎన్నార్టీ చైర్మన్ రవీరాధాకృష్ణ, దుబాయ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు వ్యాపారస్తులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రం కోసం చేస్తున కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Blog E-పేపర్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

పంచలోహ విగ్రహాపహరణ కేసులో కీలకమైన పురోగతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో సిద్ధాశ్రమం నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు కేసులో నరసన్నపేట పోలీసులు కీలకమైన పురోగతి సాధించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనం కేసును ఎస్సై గారు మరియు సిబ్బంది వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. తే18.10.2025దిన నరసన్నపేట గ్రామంలోని ఇందిరానగర్ కాలనీ లో గల సిద్ధాశ్రమం నుండి పంచలోహ విగ్రహాలు మరియు ఇతర ఆస్తులు దొంగతనం అయిన కేసులో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, తేదీ 24.10.2025 ఉదయం నరసన్నపేట ఎస్సై గారు తమ సిబ్బందితో కలిసి తామరపల్లి గ్రామదరి వద్ద రహదారి పై వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక వ్యక్తి గోనెసంచి మోసుకుంటూ అనుమానాస్పదంగా ప్రవర్తించడం తో పట్టుకొని విచారణ జరిపారు. పరిశీలనలో ఆ వ్యక్తి పేరు దుంపల సింహాచలం (24 సంవత్సరాలు), హడ్కో కాలనీ, నరసన్నపేట అని తేలింది. విచారణలో అతడు సిద్ధాశ్రమం లోజరిగిన పంచలోహ విగ్రహాల దొంగతనానికి తానే కారణమని ఒప్పుకున్నాడు. అదేవిధంగా, నిందితుడు గతంలో కూడా పలు నేరాలలో పాల్గొన్నట్లు దర్యాప్తులో బయటపడింది 2020లో ఒక మైనర్ బాలికపై వేధింపుల కేసు 2021లో ఇంటి దొంగతనం కేసు, ఆ సమయంలో మైనర్ కావడంతో జువైనల్ హెూమ్ కి తరలించినట్లు 2025 సెప్టెంబర్ లో మోటార్ సైకిల్ దొంగతనంకేసు కూడా నమోదు అయ్యింది. దర్యాప్తులో దుంపల సింహాచలం చిన్న వయసు నుంచే చెడు వ్యసనాలకు బానిసై, దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. పోలీసులు నిందితుడి వద్ద నుండి దొంగిలించిన పంచలోహ విగ్రహాలు మరియు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నరసన్నపేట పోలీసు వారు కొనసాగిస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘోర బస్సు ప్రమాదంతో అంతమంది చనిపోవడం చాలా బాధాకరం YSRCP జిల్లెల్ల ఉదయ్ కిరణ్

కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో అంతమంది చనిపోవడం, దేశమంతా ఉలిక్కిపడిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వైసిపి సోషల్ మీడియా నాయకుడు జిల్లెల్ల ఉదయ్ కిరణ్ వాపోయారు. ప్రయివేటు బస్సులు భద్రత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మల్కిపురం నుండి ప్రతిరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎపిఎస్ ఆర్టిసి ఇంద్ర బస్సు సర్వీసులను నడుపుతోందని, ఈ సర్వీసులో కొన్ని పాత వాహనాలు పలుమార్లు ప్రయాణం మధ్యలో రిపేర్లు గురవుతున్నాయన్నారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న కాలం చెల్లిన బస్సులను మార్చి, కొత్త బస్సులను ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

సాహితీ

26న అవార్డు ప్రథానోత్సవం

పాలమూరు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన రాజుకు 2024 సంవత్సరానికి అందజేయనున్నట్లు పాలమూరు సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ శనివారం తెలిపారు. డాక్టర్ గోవర్ధన రాజు రచించిన పెంకుటిల్లు కవితా సంపుటికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ హై స్కూల్ లో కాళోజీ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా సాహిత్య అభిమానులు, కవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.