Thursday, 23 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరిగింది – సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల ఉత్సాహం ఉరకలెత్తింది!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నాగుల చవితి పర్వదినం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఫైర్‌ స్టేషన్ ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్య రియల్‌ ఎస్టేట్‌ కాలనీలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగ ప్రతిమలకు ఆవుపాలు, కుంకుమ, పసుపుతో అభిషేకాలు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ పరిసరాలు భక్తి గీతాలతో మార్మోగాయి. పూజారి శ్రీ లక్ష్మణాచార్యులు భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు జరిపి స్వామి అనుగ్రహం కోసం పూజలు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలి వచ్చి సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకున్నారు. నాగుల చవితి సందర్భంగా భక్తులు స్వామివారిని వేడుకొని తమ మనోకాంక్షలు నెరవేరాలని ప్రార్థించారు.అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి భక్తులకు స్వామి వారి అనుగ్రహ దీవెనలు అందించారు. ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు భక్తులకు తెలియజేసినది ఏమనగా ది.26.11.2025న బుధవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం జరుగుతుంది. కావున భక్తులు తమ శక్తి కొలది స్వామివారికి ఆర్ధిక మరియు వస్తువులు ధాన్య రూపేన సహకరించగలరు. సంప్రదించవలసిన నెంబర్ 9866308251 భక్తులు వచ్చి తీర్ధ ప్రసాదాలు అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అని తెలిపినారు.

E-పేపర్

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో కలం యోధులకు అభినందన మాల సన్మాన కార్యక్రమాన్ని

రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో కలం యోధులకు అభినందన మాల సన్మాన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బద్వేల్,వేంపల్లె,రైల్వే కోడూరు, పోరుమామిళ్ల,దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులచేత అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు,హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ శివ స్వామీజీ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు సీఎస్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు.విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బద్వేల్,వేంపల్లె,రైల్వే కోడూరు, పోరుమామిళ్ల,దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులచేత అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు,హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ శివ స్వామీజీ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు సీఎస్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు.

నిర్మల్

నిర్మల్ జిల్లా కలెక్టర్ కు ఘనంగా సన్మానించిన – ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం.

నిర్మల్ అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, ఇటీవల జిల్లా కలెక్టర్ గారు జాతీయస్థాయిలో నీతియోగ్ జల్ శక్తి విభాగంలో గుర్తింపు పొంది కేంద్ర మంత్రితో అవార్డు తీసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని ఈ రోజు ఘనంగా సన్మానించారు. వారు జలశక్తి కార్యక్రమంతో పాటు బాలశక్తి అనే విద్యార్థుల కోసం నిర్మల్ జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వారిని ప్రత్యేక గుర్తింపునిచ్చి వారికి గౌరవించింది. ఈ సందర్భంగా ఈ అంశాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజానా అహ్మద్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జిల్లా నాయకులు తుంగూర వెంకట రాజ్యం, మరియు జాడి శ్రీనివాస్, సన్న పూరి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ – రూ.78,000 వరకు సబ్సిడీతో పీఎం సూర్య ఘర్ పథకం

దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన” పేరుతో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఒక కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రధాన ప్రయోజనం: ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది. దీని వలన విద్యుత్ బిల్లులు తగ్గడం మాత్రమే కాకుండా, పునరుత్పత్తి శక్తి వినియోగం పెరుగుతుంది. ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేక ప్రయోజనం: ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని జగ్జీవన్ జ్యోతి యోజనతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి, ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. మహారాష్ట్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న స్మార్ట్ పథకం (SMART Scheme) కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనంగా 30% సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ వివరాలు (కేంద్ర ప్రభుత్వం): 1-2 కిలోవాట్ల వరకు: ₹30,000 నుండి ₹60,000 వరకు 2-3 కిలోవాట్ల వరకు: ₹60,000 నుండి ₹78,000 వరకు 3 కిలోవాట్లకు మించి ఉన్న సిస్టమ్స్‌కు: గరిష్టంగా ₹78,000 వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అర్హత ప్రమాణాలు: దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ అమర్చడానికి తగిన స్థలం ఉండాలి. తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్ ఉండాలి. ఇతర సోలార్ సబ్సిడీ పథకం పొందని వారు మాత్రమే అర్హులు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. తదుపరి, DISCOM అనుమతి (Feasibility Approval) తీసుకుని, నమోదిత విక్రేత (Vendor) ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయించాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత సబ్సిడీ మొత్తం నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అవసరమైన పత్రాలు: తాజా విద్యుత్ బిల్లు, ఆధార్, పాన్ కార్డు, ఆస్తి యాజమాన్య రుజువు, బ్యాంక్ పాస్‌బుక్, దరఖాస్తుదారుని ఫోటో, రూఫ్‌టాప్ ఫోటో. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలు విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా తమ వంతు పాత్ర పోషించవచ్చు.

తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వెల్దండ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దండ, అక్టోబర్ 25 పున్నమి న్యూస్: హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని దండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రషీద్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీకాంత్ చారి, వెల్దండ కమాన్ నిర్మాణదాత బొల్లంపల్లి సిలివేరు రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రాజీవ్ నగర్ లోని పట్టాలపై విచారణ

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ నందు నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని,ఎవరైతే గతంలో రాజీవ్ నగర్ లో స్థలాలు పొంది ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి పట్టాలు అధికారులకు చూపి ఈకేవైసి చేయించుకోవాలని కోరారు.లేని యెడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డ్రోన్ నిఘాతో నేర నియంత్రణలో ముందంజలో నెల్లూరు పోలీసులు — జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS

SPS నెల్లూరు జిల్లా వార్తా ప్రకటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రోన్ నిఘా కొనసాగుతోంది. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) సూచనలతో, సంబంధిత DSPల ఆధ్వర్యంలో ఆయా CI, SIల సమక్షంలో డ్రోన్ కెమెరాలతో పట్టణం, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు సమగ్రంగా పరిశీలించబడుతున్నాయి. ఉదయం 9 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు, మరియు రాత్రి 7 నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ నిఘా కొనసాగుతోంది. నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టిన నెల్లూరు పోలీసులు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓపెన్ డ్రింకింగ్‌పై ఇప్పటికే కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా, ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లను కూడా డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న పాడుబడిన బంగ్లాలు, తోటలు, పార్కులు, నదీ తీరాలు వంటి ప్రదేశాలను ముందుగానే గుర్తించి, డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డా. అజిత వేజెండ్ల, IPS గారు పేర్కొంటూ — “జిల్లాలో సాంకేతికతను వినియోగించి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడం మా ప్రధాన లక్ష్యం” అన్నారు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు ప్రజలను అభ్యర్థించారు.

కామారెడ్డి

పట్టా భూమికే రక్షణలేకుంటే… రైతు న్యాయం ఎవరూ కాపాడతారు? – లవని వివాదం గ్రామీణ భూహక్కుల అసలైన చిత్రాన్ని బయటపెడుతోంది.

కామారెడ్డి, 25 అక్టోబర్పు, (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా పరిధిలోగల గ్రామాలలో (లవని ) ఇప్పుడు భూమి హద్దుల యుద్ధానికి చిహ్నంగా మారింది. పాత పట్టాలు, కొత్త సర్వేలు, మాయం అయిన హద్దులు, రెవిన్యూ నిర్లక్ష్యంతో రైతుల మధ్య తగాదాలు రోజువారీ దృశ్యంగా మారాయి. పాత పెద్దమనుషుల తీర్పులు దూరమయ్యాయి, కొత్త సాంకేతికత రైతు పక్షాన నిలబడడంలేదు. ఒకప్పుడు నాగల్లు వేసిన పొల హద్దులు ఇప్పుడు జేసీబీల దెబ్బకు చెదిరిపోయాయి. పట్టా ఉన్నా రక్షణ లేదు…. రైతు చేతిలో ప్రభుత్వ గుర్తించిన పట్టా ఉన్నా, భూమిపై హక్కును కాపాడుకోవడం కష్టంగా మారింది. పక్క రైతులు లేదా పాత వేసిన పొలాల వారసులు హద్దులు చెరిపేసినా, అధికార విభాగా లు తలదూర్చడంలేదు. “పట్టా ఉంది కానీ మా పొలం లేదు” అంటున్న లవని రైతులు నిరాశతో ఉన్నారు.ఇలాంటి సంఘటనలు ఇప్పుడు అనేక గ్రామాల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. పట్టా రైతులు పోలీస్ స్టేషన్లకెళ్లినా ఇది రెవిన్యూ ఇష్యూ అని వారు చేతులు ఎత్తేస్తున్నారు. తాహాసిల్దార్ కార్యాలయాలు సైతం “సర్వేయర్‌ను కూలీ పెట్టు కోండి” అని కుదిపేస్తున్నాయి. ఇంతలో రైతు మధ్యలో చిక్కుకుంటూ, హక్కుకు హామీ లేకుండా మిగిలిపోతున్నాడు. రెవిన్యూ గందరగోళం… సత్యం ఎవరిదీ? సంవత్సరాల పాటు సాగుచేసిన పంట పొలాలు ఇప్పుడు రికార్డుల్లో వేరొకరి హద్దులుగా మారిపో తున్నాయి. పాత ‘ఫిర్కా మ్యాప్స్’లో ఒక దారి, కొత్త డిజిటల్ రికార్డుల్లో మరో దారి. ఈ వ్యత్యాసం వ్యవసాయంలోని ప్రశాంతతను కదిలిస్తోంది. (లవని) ఘటనలో రికార్డు అస్పష్టతే ఘర్షణకు కారణమైంది. భువనాలు క్షేత్రాల్లోనే కాదు… కోర్టుల్లో కూడా….. తగాదాలు పంచాయతీ స్థాయిలో పరిష్కారం కావడం లేదనే దీనికి పెద్ద విచారకార అంశం. పెద్ద మనుషుల తీర్పులు చట్టబద్ధత కోల్పోవ డంతో, చట్టపరమైన మార్గమే మార్గమైపోయింది.చిన్న హద్దు వివాదం నెలలకొద్దీ కోర్టుల్లో ఇరుక్కు పోతుం ది. రైతు ఒక పంట కాలం న్యాయం కోసం ఖర్చు చేస్తే, మరో పంట కాలం అప్పు తీర్చడానికి కష్టప డాల్సి వస్తోంది. సమగ్ర భూ సర్వే తప్పనిసరి… ఈ పరిస్థితికి పరిష్కారం ఒక్కటే — స్పష్టమైన భూ సర్వే. ప్రతి గ్రామంలో భూముల హద్దులను సాంకేతికంగా, ధృవీకృతంగా నిర్ధారించే “సమగ్ర సర్వే” మాత్రమే ఈ పునరావృత వివాదాలకు ముగింపు కావచ్చని రైతులు అభిప్రాయపడుతు న్నారు. పట్టాదారు రైతుల భూములు భద్రంగా ఉండేలా రక్షణ చట్టాలు పటిష్టం చేయాలి. రైతుల వాదన…. పట్టా రైతులు కష్టపడి భూమిని సాగుచేస్తారు.పట్టా పత్రం చేతిలో ఉండి పొలం చేరకపోవడం ప్రజాస్వా మ్య పరిపాలనకే సవాలు. లవని గ్రామం ఒక సంకే తం — రైతు హక్కు కాగితం మీద కాకుండా నేల మీద ఉండాలి.సర్వే ఆధునీకరణతో పాటు న్యా య వ్యవస్థ రైతు పక్షాన నిలబడితేనే ఈ మట్టి విలువ నిలుస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం భూమి హక్కు ల సంరక్షణను రైతు గౌరవానికి సమానంగా చూడా ల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.