Thursday, 23 April 2026

Blog

తిరుపతి

ముక్కంటి ని దర్చించుకున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్

శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (FAC) ఛైర్మెన్ శశిధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి రాహు కేతు పూజలు,అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

డెల్లీలో ఏపీ భవన్‌లో డా.అర్జా శ్రీకాంత్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది

శుక్రవారం రాత్రి, డెల్లీ లోని ఏపీ భవన్‌లో డా.అర్జా శ్రీకాంత్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భా నికి Rtd IPS JD లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, వారి సతీమణి సామినేని విమలభాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు రాజకీయ, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.

E-పేపర్

న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా హైదరాబాద్ పెద్దఅంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ హయత్ నగర్ 9133469506 *న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు బోల్తా…* హైదరాబాద్ పెద్దఅంబర్పేట్ లోని ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి బోల్తాపడ్డ ఏపీకి చెందిన న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్సు… మియాపూర్ నుండి గుంటూరుకు వెళుతుండగా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుండగా ప్రమాదం… బస్సు బోల్తా పడిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు… గాయపడిన ఆరుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు… 9 మందికి స్వల్ప గాయాలు..

జనగాం

నేత్రదానంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన నూక అనసూర్య గారు*

తాను లోకాన్ని వీడినా, మరొకరికి దృష్టిని ప్రసరింపచేసిన అనసూర్య గారు – ధన్యజీవులు. శివునిపల్లి (ఘనపురం) వాస్తవ్యులైన శ్రీమతి నూక అనసూర్య గారు ( 85 ) ఈ రోజు 25.10.2025 శనివారం ఉదయం మరణించినారు. వారి అల్లుడు శ్రీ తెల్లాకుల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో – సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకొని, నూక అనసూర్య గారి కుమారుడు శ్రీ నూక రమేష్, కుమార్తెలు పద్మ, రేవతి గార్లు మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రదానానికి సమ్మతించినారు. L.V.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ , హైదరాబాద్ వారి టెక్నీషియన్ శ్రీ G.నరేందర్ గారు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రాలలోని రెండు కార్నియాలను సేకరించినారు. శ్రీమతి నూక అనసూర్య గారు తమ నేత్రదానంతో, బంధుమిత్రులకు, తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. అంధుల జీవితాలలో వెలుగును ప్రసరింపజేసే, ఈ సమాజహిత కార్యక్రమంలో శివునిపల్లి *లయన్స్ క్లబ్* ప్రెసిడెంట్ గౌరిశెట్టి అనిల్ గారు, *సదాలోచన ఫౌండేషన్, వరంగల్* సభ్యులైన పార్సి నవీన్ కుమార్, పార్సి కమల్ కుమార్ గార్లు తమ వంతు సహకారాన్ని అందించారు. 🙏🙏

ఎన్ టి ఆర్ జిల్లా

రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు

జగ్గయ్యపేట పోలీస్ అమర వీరుల వారోత్సవాలను పురస్క రించుకుని జగ్గయ్యపేట పట్టణం లోని ఉక్కు కళా వేదికలో రక్తదాన శిబిరం జగ్గయ్యపేట సర్కిల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించబడిం ది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు.అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించిన తర్వాత రక్తదాన శిబిరం ప్రారంభమైంది. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారి అడుగుజాడలో నడిచి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఆరోగ్య వంతుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఉత్సాహపరిచారు. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని, ఇది ప్రాణదానం తో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, డిసి వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, కౌన్సిలర్లు పేరం సైదేశ్వర రావు, మారేపల్లి శౌరి, బండారు రవి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

నాగుల చవితి: దత్తగిరి నారాయణ తపోవనంలో నాగదేవతలకు ప్రత్యేక పూజలు

లోక కల్యాణం కోసం ప్రార్థన: పీఠాధిపతి నాగేశ్వరమ్మ చిట్వేల్/అక్టోబరు 25: పున్నమి ప్రతినిధి నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయ ఆంజనేయ స్వామి ఆశ్రమంలో శనివారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీమతి నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి.ఆలయంలోని నాగ దేవతలకు పాలు, పసుపు, కుంకుమ, నూకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.. నాగుల చవితి రోజున నాగ దేవతలను ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని తెలిపారు. లోకంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మాతమ్మ, వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ తదితర ఆశ్రమంలోని పెద్దలు, పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన యలగాల వెంకట నరసమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తమ సిఫార్సు లేఖ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) నుండి ఆర్థిక సహాయం అందించవల సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రభుత్వం నుండి ₹2,00,000 రూపాయల L.O.C (Letter of Credit) మంజూరైంది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా తమ నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పింగళ రామకృష్ణారెడ్డి, కామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతారెడ్డి వెంకట నర్సిరెడ్డి, గొర్రెపాటి సుబ్బారావు, పులగంరాంబాబు, గోళ్ళ నాగరాజు, కనపర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మోడే శ్రీనివాస్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

పవన్ కళ్యాణ్ స్పూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మచ్చా గంగాధర్ కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ఆయన స్ఫూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన మోడే శ్రీనివాస్ ఇటీవల మృతి చెందగా, శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, తన సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉందని తెలుసుకుని, వారి కుటుంబానికి తన వంతు సహాయంగా 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ తన దాతృత్వం చాటుకుంటున్నారని, కుటుంబ పెద్ద మరణించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ 297 కుటుంబాలకు ఆయన అందించారని, తన సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సుజాత, బంటు లీల, మోనా, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

రైతుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు పట్టణ పరిధి లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు వ్యవసాయ శాఖ వారి సౌజన్యం తో, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆధ్వర్యంలో రైతుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొని రైతులకు మార్గదర్శక సూచనలు అందించారు. ఆమె మాట్లాడుతూ — రైతులు ఆధునిక పద్ధతుల్లోవ్యవసాయం చేయడం ద్వారా దిగుబడులు పెంచుకోవాలని, ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డాక్టర్ జగన్మోహనరావు

తిరుమల శనివారం నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించు కున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పారుపల్లి హరిబాబు, చిరుమామిళ్ల అశోక్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని డాక్టర్ జగన్మోహన రావు ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.