Thursday, 23 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి కి విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి

శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి ని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది.దేవాలయాల అభివృద్ధిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది.అనంతరం వారికి ఎమ్మెల్యే స్వామివారి ప్రతిమ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా పోలీస్ పని తీరు భేష్ :బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా పోలీస్ విభాగం మాదక ద్రవ్యాల నియంత్రణలో విశేష శ్రద్ధ చూపుతూ మంచి ఫలితాలు సాధించినందుకు అభినందనలు పొందుతోంది. ఇటీవల గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి, సమయానికి చర్యలు తీసుకున్నారు. ఈ చర్య ద్వారా నేరాచారులు, అవినీతి పెరుగుదల ప్రమాదాలను తగ్గించడమే కాకుండా, ప్రజల భద్రతకు కూడా ముఖ్యమైన దోహదం చేసింది. అంతే కాక, ఖమ్మం జిల్లాలో రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలుతో అల్లరి చేయడం, రోడ్లలో బహిరంగంగా అల్లరి చేసే వ్యక్తులను పోలీసులు గుర్తించి, కట్టడి చేశారు. ఖమ్మం జిల్లా కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో పోలీసులు ఘన శ్రద్ధతో పని చేస్తున్నారు. వారి సకాలంలో తీసుకున్న నిర్ణయాలు మరియు విధానాలు మాదక ద్రవ్యాల రవాణా, రోడ్లపై అల్లరి చేసే వ్యక్తుల పై ప్రభావశీలంగా నిలిచాయి. ఈ సందర్భంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ వ్యక్తిగతంగా ఖమ్మం పోలీసులు మరియు కమిషనర్ సునీల్ దత్ పనితీరుకు అభినందనలు తెలిపారు. పోలీసుల కృషి వలన మాదక ద్రవ్యాల వ్యాప్తి తగ్గడం, రోడ్ల భద్రత పెరగడం వంటి అంశాలు సాధ్యమయ్యాయి. ప్రజల విశ్వాసం పెరగడం, నేరాచారులపై నియంత్రణ రావడం, రోడ్లపై సాధారణవాసుల భద్రతకు మద్దతుగా ఉండడం ఖచ్చితంగా ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.

తిరుపతి

ఎక్సైజ్ సురక్ష యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజిక వర్గ శ్యాసన సభ సబ్యులు రాష్ట్రంలో నకిలీ మద్యం నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను శనివారం నాడు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ యాప్ ను విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్క వినియోగదారు దీనిని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మద్యం వినియోగదారులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభత్వం ప్రజల ఆరోగ్య భద్రత ప్రథమ కర్తవ్యంగా భావించి నకిలీ మద్యం వ్యాపారులపై ఉక్కు పాదం మోపడానికి ఈ యాప్ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కూడా అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.

E-పేపర్

నేటి దినపత్రిక సూర్య ఇంచార్జనీ సన్మానించిన ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,

నేటి దినపత్రిక సూర్య ఇంచార్జనీ సన్మానించిన ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్, రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో కలం యోధులకు అభినందన మాల సన్మాన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బద్వేల్,వేంపల్లె,రైల్వే కోడూరు, పోరుమామిళ్ల,దువ్వూరు తదితర ప్రాంతాల ఆర్యవైశ్య జర్నలిస్టులు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులచేత అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతులు,హిందూ ధర్మ పరిరక్షకులు శివ స్వామీజీ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు సీఎస్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కుమార్,ఆంధ్రప్రదేశ్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం కన్వీనర్ రవికుమార్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు

E-పేపర్

రాయలసీమకు నీటి కరువు నేతలకు నీతి కరువు

రాయలసీమకు నీటి కరువు నేతలకు నీతి కరువు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు సొంత ఊరికి బ్రిడ్జి నిర్మించుట కోసం సంవత్సరాలుగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఆ గ్రామాల ప్రజలది ఇక విషయానికొస్తే రైల్వే కోడూరు మండలంలోని *రెడ్డివారి పల్లి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాలంటే చాలా దుర్భరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ వర్షాకాలంలో పాలకుల నిర్లక్ష్యంతో అధికారుల అలసత్వంతో* వర్షం వచ్చిందంటే చాలు తాత్కాలికమైన మట్టి రోడ్డు కొట్టుకుపోవాల్సిందే, నిర్మాణ దశలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండడంతో* మూడు కిలోమీటర్లు దూరం ప్రయాణించి సొంతగూటికి చేరుకోవలసిన దుస్థితి ఆప్రాంత ప్రజలది .కనుక నిర్మాణ దశలో ఉన్నటువంటి *బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేసి* ప్రజలకు మెరుగైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలి.రైల్వేకోడూరు మండల భారతీయ జనతా పార్టీ అధికారులకు, కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల అధ్యక్షులు సాయం శ్రీధర్, రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ కన్వీనర్ తోట శ్రీనివాసులు* మరియు కిసాన్ మోర్చా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ వర్మ మరియు వీహెచ్ పి దరిశ వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుప్పాల కిరణ్ మరియు మండల ఆఫీస్ సెక్రటరీ అందరివాడు సుబ్బారావు మరియు మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సమావేశం

విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు మరియు సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:25-10-25 @2PM ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ,విశాఖపట్నంకి 970 కి.మీ చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ,రేపటికి తీవ్ర వాయుగుండంగా ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీసు ప్రారంభం.

అమలాపురం నుండి రాజమండ్రి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అమలాపురం – రాజమండ్రి నాన్ స్టాప్ అల్ట్రా డీలక్స్ సర్వీసులను 27వ తేదీ సోమవారం నుండి ప్రారంభిస్తున్నారు.ఈ సదావకాశాన్ని వినియోగించికోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజారవాణాధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ కోరారు. బస్సు ప్రయాణ సమయం వివరాలు.. అమలాపురం నుండి రాజమండ్రి వైపు వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఉదయం 5.30,7.30,9:30,11.30 మధ్యాహ్నం 1:30,3:30,సాయంత్రం5.30 రాత్రి 7:30 గంటలకు.. రాజమండ్రి నుండి అమలాపురం వైపు వయా ముక్కామల, నడిపూడి మీదుగా ఉదయం 7.30,9:30,11.30,మధ్యాహ్నం 1:30,3:30,సాయంత్రం5.30 రాత్రి 7:30,9.30 గంటలకు.. ఉంటాదని మేనేజర్ తెలిపారు

తెలంగాణ

*జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం

💥 *జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ కార్యక్రమం*💥 దేవరకద్ర, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి: *దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జిఎంఆర్ గారి ఆదేశాల మేరకు, జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయిల్ సాగర్ గ్రామంలో డప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.* *గ్రామానికి చెందిన హరిజన్ ముక్కిడి బాలప్ప, ముక్కిడి లక్ష్మయ్య, బోడి కథలయ్య మరియు చిన్నప్ప గార్లు శుభ, అశుభ కార్యక్రమాల సందర్భాల్లో వాయించేందుకు డప్పులు అవసరమని జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కోన రాజశేఖర్ గారిని కోరగా, ఆయన వెంటనే స్పందించి డప్పులు అందజేశారు.* *ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, గ్రామీణ కళాకారులు తమ వృత్తి కొనసాగించేందుకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.* *ఈ కార్యక్రమంలో మండల నాయకులు తూట్ల వెంకట్ రాములు, చెన్నప్ప, గుంత కండ్ల ఎల్లప్ప, ఎద్దుల కృష్ణయ్య, మరియు ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.*

నిర్మల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో తేదీ 25 అక్టోబర్ 2025 నుండి తేదీ 31 అక్టోబర్ 2025 వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటేనే సామాజిక సేవ అంకితభావం క్రమశిక్షణ నిస్వార్థ సేవ అన్నది ముఖ్య ఉద్దేశమని నాకోసం కాదు మీకోసం అన్న నినాదంతో స్వచ్ఛందంగా వాలంటీర్లు వివిధ గ్రామాలకు వెళ్లి సేవ చేయడమఅనేటువంటిది అభినందనీయమని దీని ద్వారా విద్యార్థులు గ్రామాలలోని లోటుపాట్లను కనుగొంటూ వారిలో వివిధ అంశాల ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం అనేది ప్రశంసించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు క్యాంపస్ టు విలేజ్ అన్న నినాదంతో గ్రామ చైతన్యంలో భాగంగా ఈ బటోలు గ్రామాన్ని ఎన్నుకొని గ్రామంలో విద్యార్థుల సేవలు ఏ విధంగా అవసరము అని తెలుసుకొని స్వచ్ఛభారత్ తో పాటు నాటడం మరియు సర్వే ద్వారా గ్రామంలో యువతలో చైతన్యం కలిగిస్తూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్లాస్టిక్ నివారణతో పాటు నీ ఏడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ అత్యున్నత డాక్టర్లను మరియు మోటివేషన్ స్పీకర్లను అలాగే యోగా ఇన్స్పెక్టర్లను లీగల్ అవేర్నెస్ను లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివిధ సామాజిక సాంస్కృతిక అంశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అరె రాజు డాక్టర్ ఓం ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ అలాగే సీపీడీసీ ప్రెసిడెంట్ డాక్టర్ నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాజీరావు పాటిల్, మనోజ్ గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ ఈ కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు డా భీమ్రావు డా పిజిరెడ్డి ,యు రవికుమార్ ,డా శంకర్ ,గుంత సుధాకర్ ,డా సంతోష్ కుమార్ ,డా నహె దా ,డా కల్పన దివ్య ,రామ్మోహన్ ,సురేందర్ ,రాజయ్య మజర్, అబ్దుల్లా ,కిషన్ ,శ్రావణ్య ,అర్షియ ఉజ్మ ,వాహిద్ , ఇర్ఫాన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.