Thursday, 23 April 2026

Blog

రంగారెడ్డి

సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్ పద్మశాలి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మహేశ్వరం గ్రామ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *పెద్దమ్మ పెంటయ్య పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి *కౌకుంట్ల శ్రీనివాస్ పద్మశాలి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డు కృష్ణ యాదవ్, తెల్జీరి శ్రీశైలం యాదవ్, జెల్ల నాగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

రంగారెడ్డి

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి కరోనా లాంటి ప్రమాదకరం –ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఏఐసీసీ, టీపీసీసీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్లో ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, కాంటెస్టేడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య ఆధ్వర్యంలో* ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఉన్న ఓట్లని తీసేసి లేని ఓట్లని చేర్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి జనాలని తీసుకొచ్చి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడ దొంగ ఓట్లను చేర్చుతున్నారు అని ఎద్దేవా చేశారు. కావున ఎన్నికల సంఘం మొత్తం బిజెపి కనుసన్నల్లో పనిచేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ నాలుగు నెలల్లోనే ఒక కోటి దొంగ ఓట్లను చేర్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని అని ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్నింగని జంగయ్య విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే వారిని అనడం జరిగింది. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ప్రజలందరూ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమంలో భాగం కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్,సీనియర్ నాయకులు నిరుడు శ్రీరాములు,జనరల్ ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రెటరీ కప్పటి ఆంజనేయులు,బి.ఎమ్.సి ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ ఎర్ర సురేందర్,జనరల్ సెక్రెటరీ బోర్ర రమేష్,మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మొంథా (Montha) తుఫాను హెచ్చరిక ల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కలెక్టర్ హరేందిర ప్రసాద్.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 విశాఖపట్నం మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు.శనివారం జిల్లా, మండల,జోనల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు , పంట నష్టం జరగ కుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే (హెడ్ క్వార్టర్స్ లో) ఉండాలని, హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు.ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే ఎవరైనా సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున నది ఒడ్డులో, కొండ వాలులలో, నీటిమంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని. చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యుత్ కి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, డీజిల్ అందుబాటు లో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పి హెచ్ సి లలో డాక్టర్లు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్. టీమ్ లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 0891-2590102, 0891- 2590100 నెంబర్లతో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని నియమించామని, తుఫాను సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలుపు ఖాయం : సంగిపేట్ నరేష్ కుమార్,

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని సంగిపేట్ నరేష్ కుమార్,అన్నారు శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతు చేశారు.ఉపఎన్నిక నేపథ్యంలో డివిజన్ పరిధిలోని బూత్‌లలో నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం అని తెలిపారు. వారి వెంట నల్ల నాగిరెడ్డి ,బిక్షపతి చారి ఉన్నారు

తిరుపతి

ఎమ్మెల్సీ ని సత్కరించి వై.సి.ఫై. టౌన్ యూత్ ప్రెసిడెంట్

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి వై.సి.ఫై. టౌన్ యూత్ ప్రెసిడెంట్ మల్లెంబాకం మునికృష్ణారెడ్డి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం యువతను ఉద్దేశించిమాట్లాడుతూ….యువకులంతా ఉత్సాహంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నిర్వహించే మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పిపిపి విధానంతో ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న మెడికల్ కళాశాల ప్రైవేటీకరం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ పి పి పి విధానాన్ని రద్దు పరచాలని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నియోజవర్గంలోని అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన వన్నె కుల క్షత్రియులను గుర్తించి నామినేట్ పదవులను ఇచ్చిందని ఆయన గుర్తిచేశారు. ఈ కూటమి ప్రభుత్వం వన్నె కుల క్షత్రియులను వాడుకొని నామినేట్ పదవులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గపు వైఎస్ఆర్సిపి న్యాయ సలహాదారుడు సున్నపు లక్ష్మీపతి రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి సుధాకర్ రెడ్డి సురేష్ రెడ్డి జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మా డిమాండ్ల పరిష్కారం లేకపోతే — జిల్లా వ్యాప్తంగా షాపులు మూసి వేస్తాం*

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు .మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు 2024 – 2026 సంవత్సరాల మద్యం పాటదారులైన తమకు ప్రభుత్వం గెజిట్ ప్రకారం 20 శాతం కమిషన్ ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ కు విన్నప పత్రం అందజేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమిషన్‌తో షాపులు నిర్వహించటం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు.అలాగే గెజిట్‌లో లేని పర్మిట్ రూములపై వసూలు చేస్తున్న రూ.7.5 లక్షల మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను 15 రోజులలోపు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు.కోనసీమ లిక్కర్ అండ్ వైన్ డీలర్ అసోసియేషన్ తరఫున ఈ విన్నపం సమర్పించారు.తాడి నరసింహారావు, లింగోలు పెద్ద అబ్బులు,మామిడి గురవయ్య నాయుడు,నల్లమిల్లి సుబ్బారెడ్డి,పార్వతిని బాలయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఖమ్మం

రేపు ఖమ్మం కీ రానున్న బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

పున్నమి ఖమ్మం రేపు (ఆదివారం ) ఖమ్మం జిల్లాకు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి రానున్నారు. ఆయన ప్రధాని “మాన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం కార్యక్రమం ముగిసిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి వెళ్తారని భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

పంచారామాల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి విశేష స్పందన విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి యాత్రకు ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 25 పున్నమి ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ, విశాఖపట్నం రీజియన్ ఆధ్వర్యంలో పంచారామాల యాత్ర బస్సు సర్వీస్‌ను విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ద్వారకా బస్ స్టేషన్ (9959225602) మరియు విశాఖపట్నం డిపో మేనేజర్ కార్యాలయం (9959225594) ను సంప్రదించవచ్చని సూచించారు. భక్తుల సౌకర్యార్థం శబరిమల యాత్రలకు కూడా ప్రత్యేక టూర్లు అందుబాటులో ఉన్నాయని, కావలసిన టూర్ ప్యాకేజీలను పై నెంబర్ల ద్వారా తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు

E-పేపర్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.. ఎప్పటి నుంచంటే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.. ఎప్పటి నుంచంటే తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి

E-పేపర్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్..

పున్నమి ఆలంపల్లి దుర్గయ్య 9133469506 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్.. ఉప్పల్ ,రామంతపూర్ లో ఇందిరానగర్ లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో మాస్ కాపీయింగ్.. గత నెల సెప్టెంబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వన్ టైం ఛాన్స్ ప్రారంభమైన డిగ్రీ ఎగ్జామ్స్ లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తమ చేతివాటం చూపించింది.. వాగ్దేవి డిగ్రీ కాలేజీ సెంటర్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గర నుండి మాస్ కాఫీంగ్ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.. 15వేల రూపాయల్లోని ఒక రూపాయి తగ్గినా సరే మాస్ కాపీకి అంగీకరించని యాజమాన్యం.. ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయలు చెల్లిస్తేనే మాస్ కాపీయింగ్ కి అనుమతి అంటూ విద్యార్థుల నుంచి వసూలు… ఈ మాస్ కాఫీంగ్ పేరుతో కొన్ని లక్షలు వసూలు చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం… డబ్బులు చెల్లించిన విద్యార్థులను సపరేట్ రూమ్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ రాయి పిచ్చినా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం.. ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి డిగ్రీ విద్యార్థులు NSUI(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని ఆశ్రయించారు… అక్కడ జరుగుతున్న ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి వివరాలన్నీ యడవల్లి వెంకటస్వామికి వివరించడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్య మండలి మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇలాంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ రద్దు చేసి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు చేయాలి అంటూ ఎడవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.