Thursday, 23 April 2026

Blog

నిర్మల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో తేదీ 25 అక్టోబర్ 2025 నుండి తేదీ 31 అక్టోబర్ 2025 వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటేనే సామాజిక సేవ అంకితభావం క్రమశిక్షణ నిస్వార్థ సేవ అన్నది ముఖ్య ఉద్దేశమని నాకోసం కాదు మీకోసం అన్న నినాదంతో స్వచ్ఛందంగా వాలంటీర్లు వివిధ గ్రామాలకు వెళ్లి సేవ చేయడమఅనేటువంటిది అభినందనీయమని దీని ద్వారా విద్యార్థులు గ్రామాలలోని లోటుపాట్లను కనుగొంటూ వారిలో వివిధ అంశాల ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం అనేది ప్రశంసించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు క్యాంపస్ టు విలేజ్ అన్న నినాదంతో గ్రామ చైతన్యంలో భాగంగా ఈ బటోలు గ్రామాన్ని ఎన్నుకొని గ్రామంలో విద్యార్థుల సేవలు ఏ విధంగా అవసరము అని తెలుసుకొని స్వచ్ఛభారత్ తో పాటు నాటడం మరియు సర్వే ద్వారా గ్రామంలో యువతలో చైతన్యం కలిగిస్తూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్లాస్టిక్ నివారణతో పాటు నీ ఏడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ అత్యున్నత డాక్టర్లను మరియు మోటివేషన్ స్పీకర్లను అలాగే యోగా ఇన్స్పెక్టర్లను లీగల్ అవేర్నెస్ను లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివిధ సామాజిక సాంస్కృతిక అంశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అరె రాజు డాక్టర్ ఓం ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ అలాగే సీపీడీసీ ప్రెసిడెంట్ డాక్టర్ నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాజీరావు పాటిల్, మనోజ్ గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ ఈ కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు డా భీమ్రావు డా పిజిరెడ్డి ,యు రవికుమార్ ,డా శంకర్ ,గుంత సుధాకర్ ,డా సంతోష్ కుమార్ ,డా నహె దా ,డా కల్పన దివ్య ,రామ్మోహన్ ,సురేందర్ ,రాజయ్య మజర్, అబ్దుల్లా ,కిషన్ ,శ్రావణ్య ,అర్షియ ఉజ్మ ,వాహిద్ , ఇర్ఫాన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

తెలంగాణ

ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*

ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు* జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ…సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ రెడ్డి,దాస్యం వినయ్ భాస్కర్,బిసి కమిషన్ మాజీ మెంబెర్ కిషోర్ గౌడ్ తదితరులు.

E-పేపర్

బస్ ఘటన పై కర్నూల్ పోలీస్

కర్నూలు జిల్లా… కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు … (24.05.2025) శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి@ నాని గా గుర్తించాము. అతన్ని మేము పలు కోణాల్లో విచారించాము. ఎర్రిస్వామి మరియు బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరు కలిసి లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల కు బయలు దేరారు. ఎర్రిస్వామి ని వదలడానికి తుగ్గలికి బయలు దేరాడు. ఎర్రిస్వామిని వదలడానికి వెళ్ళిన పల్సర్ బైక్ మార్గం మధ్యంలో కియా షోరూం దగ్గర గల HP PETROL BUNK వద్ద సుమారు అర్ధరాత్రి దాటిన తర్వాత 2.24 గంటలకు రూ. 300 పెట్రోల్ పట్టించుకుని బయలు దేరాడు. బయలు దేరిన కొద్ది సేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్క్రిడ్ అయి రోడ్డు కు కుడి ప్రక్కన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టాడు . బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకాల ఉన్న ఎర్రిస్వామి @ నాని చిన్న గాయాలతో బయట పడ్డాడు. ప్రమాద ఘటన స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుండి శివశంకర్ ను ఎర్రిస్వామి బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడని అతను నిర్దార్ధించుకునే లోపే రోడ్డు పై పడి ఉన్న బైక్ ను తీద్దామనుకునే సమయంలో అంతలోనే బైక్ ను బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్ళింది. బస్సు క్రింద మంటలు రావడంతో అక్కడి నుండి ఎర్రిస్వామి @ నాని బయపడి తన స్వంత ఊరైనా తుగ్గలి కి బయలు దేరి వెళ్ళిపోయాడు. ఈ ప్రమాద విషయం పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు . తదుపరి విచారణ దర్యాప్తును కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

తిరుపతి

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నందు శనివారం శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే ప్రమాదం మరియు నివారణ,మహిళలు,పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడం లో విద్యార్థుల పాత్రపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు.అనంతరం వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

జోగులాంబ టెంపుల్ ఈ ఓ దీప్తి రెడ్డి పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు*

జోగులాంబ గద్వాల్ 25 అక్టోబర్, (పున్నమి ప్రతినిధి): *జోగులాంబ టెంపుల్ ఈ ఓ దీప్తి రెడ్డి పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు* జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో దీప్తి రెడ్డి పై కేసు నమోదు.. కూరగాయల టెండర్ దారు అన్య మతస్తురాలు కారణంగా… కూరగాయల టెండర్ రద్దు చేసిన నేపథ్యంలో..ప్రజా సంఘాల నాయకుల తో కలసి అలంపూర్ పోలీస్ స్టేషన్ లో కూరగాయల టెండర్ దారు శ్రీలత పిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

తిరుపతి

శ్రీకాళహస్తి లో శాస్త్రోక్తం గా నాగుల చవితి వేడుకలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు శనివారం నాగుల చవితి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమంజన గోపురం వద్ద ఉన్న స్వామివారి రుద్ర పాదాల వద్ద గల నాగశిలలకు వేద పండితులు శాస్త్రోక్తంగా అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దూప,దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని ఆలయ ప్రాంగణంలోని నాగ దేవతలను పూజించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్,సూపర్డెంట్ నాగభూషణం,టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పౌరోహితుడు అర్ధగిరి మరియు దేవస్థానం అధికారులు,సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చివరి మ్యాచ్‌లో భారత్‌దే విజయం

అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి) సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (121*) విరాట్‌ కోహ్లీ (74*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ ఇప్పటి వరకు 33 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై ఇది ఆరోది.

తెలంగాణ

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి* *అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు*

జోగులాంబ గద్వాల్,25 అక్టోబర్, (పున్నమి ప్రతినిధి): *అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్ డి వేముల శ్రీనివాస్ లు గారికి అనంతరం విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని కోరారు.*

నిర్మల్

విద్యార్థులు, క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో తేదీ 25 అక్టోబర్ 2025 నుండి తేదీ 31 అక్టోబర్ 2025 వరకు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటేనే సామాజిక సేవ అంకితభావం క్రమశిక్షణ నిస్వార్థ సేవ అన్నది ముఖ్య ఉద్దేశమని నాకోసం కాదు మీకోసం అన్న నినాదంతో స్వచ్ఛందంగా వాలంటీర్లు వివిధ గ్రామాలకు వెళ్లి సేవ చేయడమఅనేటువంటిది అభినందనీయమని దీని ద్వారా విద్యార్థులు గ్రామాలలోని లోటుపాట్లను కనుగొంటూ వారిలో వివిధ అంశాల ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం అనేది ప్రశంసించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కళాశాల విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు క్యాంపస్ టు విలేజ్ అన్న నినాదంతో గ్రామ చైతన్యంలో భాగంగా ఈ బటోలు గ్రామాన్ని ఎన్నుకొని గ్రామంలో విద్యార్థుల సేవలు ఏ విధంగా అవసరము అని తెలుసుకొని స్వచ్ఛభారత్ తో పాటు నాటడం మరియు సర్వే ద్వారా గ్రామంలో యువతలో చైతన్యం కలిగిస్తూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్లాస్టిక్ నివారణతో పాటు నీ ఏడు రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం వివిధ అత్యున్నత డాక్టర్లను మరియు మోటివేషన్ స్పీకర్లను అలాగే యోగా ఇన్స్పెక్టర్లను లీగల్ అవేర్నెస్ను లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుందని అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివిధ సామాజిక సాంస్కృతిక అంశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అరె రాజు డాక్టర్ ఓం ప్రకాష్ , వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ అలాగే సీపీడీసీ ప్రెసిడెంట్ డాక్టర్ నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బాజీరావు పాటిల్, మనోజ్ గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ ఈ కార్యక్రమంలో ఇంకా అధ్యాపకులు డా భీమ్రావు డా పిజిరెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా సంతోష్ కుమార్ డా నహె దా డా కల్పన దివ్య రామ్మోహన్ సురేందర్ రాజయ్య మజర్ అబ్దుల్లా కిషన్ శ్రావణ్య అర్షియ ఉజ్మ వాహిద్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థిని , విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు SD principal

తెలంగాణ

కర్నూలు బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు

కర్నూలు బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు తృటిలో తప్పించుకున్న చంద్రయాన్ పల్లి యువకుడు కడారి అశోక్ అక్టోబర్ 25 పున్నమి న్యూస్ మాడుగుల : ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన అగ్నికి ఆహుతై ప్రైవేటు ట్రావెల్ బస్సు ఘటనలో నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు తృటిలో బయటపడ్డాడు ప్రమాదానికి గురైన బస్సులో నుంచి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం చంద్ర ఆన్పల్లి గ్రామానికి చెందిన యువకుడు కడారి అశోక్ మృత్యుంజయుడుగా బయటపడ్డాడు అనంతపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన పండుగకు స్వగ్రామానికి వచ్చాడు అనంతపురం విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో గురువారం అనంతపురం కు బయలుదేరి వెళ్లాడు తెల్లవారుజామున జరిగిన బస్సు బస్సు ప్రమాదాన్ని పసిగట్టిన యువకుడు అద్దాలు పగలగొట్టి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఆయన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందాడు ప్రమాదంలో తనకు ఏం జరగలేదని క్షేమంగా ఉన్నానని యువకుడు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.