Thursday, 23 April 2026

Blog

తిరుపతి

వర్షాలకు ఉపాధి కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలి-తాలేటి రామచంద్రయ్య

శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: రాష్ట్రంలో పాలు జిల్లాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాలలో ప్రజలు వారి దైనందిన జీవనానికి నష్టం కగడంతో అధికశాతం రోజువారి కూలీనాలీ చేస్తూ బ్రతికే పేదవారికి భృతి లేకుండా పోయిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి తాలేటి రామచంద్రయ్య ప్రకటనలో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, గిరిజనులకు తక్షణసాయంగా 10.000 రూపాయలు ఇవ్వాలని, వాటితో పాటు ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పేదల గుడిసెలను తిరిగి నిర్మించుకునేందుకు సాయం అందించాలనీ, అందుకోసం జిల్లాలోని మండల తహసిల్దార్ నేతృత్వంలో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

తిరుపతి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘనస్వాగతం పలికిన జనలైనికులు

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసైనికులైన పేట సోదరులు వారి మిత్రబృందం శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, మనీ, నవీన్, కల్లిపూడి వెంకటేష్, సాయి, వెంకటేష్, రాజా, పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రాజీవ్ నగర్ నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ..ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం నాడు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావలసిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డిఓ.. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పాల్గొంటారని, రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను ఈ కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు.ఎవరైనా పట్టాలు తీసుకురానీయడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పట్టాలని తీసుకుని వచ్చి ఈ కేవైసీ చేయించుకుని. వారి వారి స్థలాలను భద్రపరుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈనెల 29న వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ: మంత్రి ఆనం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వహస్తాలతో పూజా కార్యక్రమం

నెల్లూరు, అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 29న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వహస్తములతో శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం, ఆలయ పునర్నిర్మాణ పనులు సుమారు ₹16.7 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రణాళికలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. భూమి పూజ కార్యక్రమం అక్టోబర్ 29న ఉదయం 11.18 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. ఆలయ పూర్వ వైభవం పునరుద్ధరించడమే లక్ష్యమని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీవెనలు పొందాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈనెల 29న వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ: మంత్రి ఆనం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వహస్తాలతో పూజా కార్యక్రమం

నెల్లూరు, అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈనెల 29న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వహస్తములతో శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం, ఆలయ పునర్నిర్మాణ పనులు సుమారు ₹16.7 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రణాళికలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. భూమి పూజ కార్యక్రమం అక్టోబర్ 29న ఉదయం 11.18 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. ఆలయ పూర్వ వైభవం పునరుద్ధరించడమే లక్ష్యమని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీవెనలు పొందాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

దూసుకువస్తున్న మంతా తుఫాన్

*దూసుకువస్తున్న మంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు* *ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్* *అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు* *28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా* *ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే* *విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.* *సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు* *దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి* *బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు* *ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన* *దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి* *మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు చూస్తాం*

E-పేపర్

నూతన గృహప్రవేశం లో పాల్గొన్న టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ఇబ్రహీంపట్నం నియోజకవర్గం MNR యువసేన టీం సభ్యులు ఓరుగంటి మహేష్ గౌడ్ గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాపాల గ్రామానికి విచ్చేసి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన నా ఆరాధ్య దైవం, టిపిసిసి సభ్యులు, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ కార్యక్రమంలో నాయకులు టేకుల కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాగరాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు.

తూర్పు గోదావరి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా ఆకాశ దీపోత్సవం

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తి దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభసందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీకమాస ఆకాశ దీపోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆకాశదీ వం వేదపండితుల మత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలి గంచడం సాంప్రదాయం. ఈఓ టి బాపిరెడ్డి తోపాటు వలువురు ఆలయాధికారులు, భక్త జన సందడి మధ్యన శా స్తోక్తంగా దీసోత్సవాన్ని నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కనుక దేవతారాధనకు ఈ మాసం తో సమానమైన మాసం మరొకటి లేదని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఈ నెలలో వేలాదిమంది భక్తులు శ్రీకాళహస్వీరుని శ్రీజ్ఞానప్రసూన్నాంభికను దర్శించుకోవడం పరిపాటి.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో దీపోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా ఈ నెల 27న నారద పుష్కరిణి నందు దీపోత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా నవంబర్ 3న వైష్ణవ పుష్కరిణి నందు,10 వ తేదీన భరద్వాజ పుష్కరిణి నందు దీపోత్సవం జరుగునని ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో సుంకర సూర్యనారాయణ కు నివాళి

నందిగామ ప్రముఖ న్యాయవాది, పట్టణ ప్రముఖులు సుంకర సూర్యనారాయణ మృతికి మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి సూర్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల అర్పించి నివాళి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుంకర సూర్యనారాయణ నందిగామ ప్రాంతంలో ప్రజా సేవలో అచంచలమైన నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.