Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

కార్తికేయ స్వామి వారికి మార్గశిర మాస కృత్తిక విశేష పూజ

శ్రీకాళహస్తి పట్టణంలోని తేరి వీధిలో వెలిసినటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురువారం నాడు నెలవారి కీర్తిక విశేషమైన రోజుగా భావించి స్వామివారికి విశేషా అలంకరణ, ప్రత్యేక పూజలు, అన్నదానాలు హారతులు అభిషేకాలు నిర్వహించారు ఆలయ వేద అర్చకులు ప్రసాద్ స్వామి మాట్లాడుతూ.. ఈ యొక్క మార్గశిర మాసం వచ్చేటటువంటి కృత్తిక ఎంతో విశేషమైన రోజుగా మార్గశిర మాసం అంటే శివయ్య కుమారుడు అయినటువంటి సుబ్రమణ్యశ్వర స్వామి కనుక ఈనాడు యొక్క దేవాలయం ఎదుట మార్గశిర మాసం పౌర్ణమి దీపాలు వలిగేస్తామని అదేవిధంగా కృత్తిక నాడు స్వామివారికి శేష వస్త్రం దివ్య పత్రములతో అలంకరించి పూల మాలలతో అలంకరించామని స్వామివారికి భక్తులు తెచ్చినటువంటి తీర్థ ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్య రూపంలో సమర్పించామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం సేవకులుగా ప్రియాంక, భవ్య, యామిని, లక్ష్మమ్మ, సురేష్ , భువన, ఉమాపతి , శెట్టి గారు, బుజ్జమ్మ. సేవకులు భక్తులు ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

జనసేనానికి ఎమ్మెల్యే బొజ్జల ఘన స్వగతం

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్బంగ ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకారు.

తిరుపతి

భారీ వర్షాలతో నీటమునిగిన 100 ఎకరాల వరి పంట

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు గౌడు మాల, కత్తి వారి కండ్రిగ, బసవన్న గుంట, తిక్కల్తూరు గ్రామాలలో వారం రోజులగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 100 ఎకరాల పైన వరి నాట్లు మునిగిపోయిన పరిస్థితి.. అప్పులు చేసి నాటుకున్నామని, ఇప్పుడు మునిగిపోయిందని, రైతన్న లు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, మునిగిపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తెలియపరచి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

తిరుపతి

తుఫాన్ సెంటర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టిన టిడిపి నాయకులు

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా తుఫాను ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా..శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలుమేరకు శ్రీకాళహస్తి దేవస్థానం గిరిప్రదక్షిణ రోడ్డు సమీపంలో ఉన్న తుఫాన్ సెంటర్ కాలనీ వాసులకు జడ్పిటిసి సుబ్బారెడ్డి కాంట్రాక్టర్ చిట్టెం శ్రీకాంత్, యువ శేఖర్ ఆధ్వర్యంలో తుఫాన్ సెంటర్ కాలనీలోని సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తుఫాన్ సెంటర్ నివాసులు మాట్లాడుతూ.. వారం రోజుల కురుస్తున్న వర్షాలకు మమ్మల్ని గుర్తుపెట్టుకుని తమకు అన్నదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బారెడ్డి, కాంట్రాక్టర్ చిట్టెం శ్రీకాంత్, యువ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రాజీవ్ నగర్ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టనశివరుల్లోని రాజీవ్ నగర్ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంతంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమై సంతకాలు సేకరించి, తమ సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలవడానికి గురువారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోసం ప్రజలు అక్కడే ఎదురుచూస్తూ, తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సమస్యలను పరిష్కరించేందుకు ఆయన జోక్యం అవసరమని వారు కోరారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజల వినతి పత్రాన్ని పట్టణ PA ప్రవీణ్, మైనారిటీ అధ్యక్షుడు, రాజీవ్ నగర్ వాసి కరీం భాయ్ కి అందజేశారు. ఈ సమస్యను తప్పక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

E-పేపర్

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన

జిపి కాలనీ వాసులను పరామర్శించిన ప్రభుత్వ విప్ శ్రీధర్, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు గడచిన కొన్ని రోజులుగా రైల్వే కోడూరు ప్రాంతంలో భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాల వలన గురువారము పంచాయతీ వెనుక భాగంలో ఉన్న తోటి కార్మికుల ఇళ్లలోకి వర్షము నీరు అధికంగా ప్రవేశించడంతో ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి కోనేటి అమర్నాథ్ వెంటనే పిల్లలను, ముసలి వారిని తాత్కాలికముగా ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించి వారికి భోజన వసతి సదుపాయం కల్పించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్, సబ్ కలెక్టర్ భావన,ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ వీరికి ప్రభుత్వ పాఠశాల కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రి పైభాగం ఫ్లోర్అంతా ఖాళీగా ఉన్నదని అక్కడికి కొంతమందిని తరలించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. మరలా రేపు ఉదయం వచ్చి అందరు సమస్యలు తీరుస్తానని తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో వినతి పత్రం ఇచ్చానని తెలిపారు. రాజంపేట భౌగోళికంగా బ్రిటిష్ కాలం నాటి భవనాలు, బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం, దూరం తక్కువ రాజంపేట,రైల్వే కోడూరు ప్రజల రాజంపేట జిల్లా ఆకాంక్ష నెరవేర్చాలని ఉపముఖ్యమంత్రిని కోరానని ఆయన స్పందించారనితెలిపారు.సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ గత వై 60 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు మారిన, మా బతుకులు మారలేదని మాకు ఇక్కడే నివాసం ఉండేదానికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని వారిదృష్టికి వారితీసుకెళ్లారు. మండల రెవెన్యూ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ ఈ కాలనీ వారికందరికీ బయట ఇళ్ల స్థలం మంజూరు చేసి ఉన్నారని తెలిపారు. వీరు అక్కడికి వెళ్లే దానికి సుఖముఖముగా లేరని అన్ని వసతులు వసతులుకల్పిస్తామని తెలిపారు. నూతన పంచాయతీ కార్యాలయం నిర్మించుకునే దానికి కార్యాలయం నిర్మించుకునే ఈ స్థలమే అవసరమని అందువల్ల పట్టాల మంజూరు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏఎస్పి రామకృష్ణ హెగ్డే,తెలుగుదేశం ఏఎస్పినాయకులు బత్యాల యువసేన నాయకులు పోతురాజు నవీన్, నార్జాల హేమరాజు, మైనారిటీ నాయకులు పటాన్ మౌలా, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీదేవి, మాజీ జెడ్పిటిసి బండారు సుభద్రమ్మ, ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎన్నికల నియమ నిబంధనలు, నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలి

కామారెడ్డి, 04 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా గురువారం గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ను ఎన్నికల నియమ నిబంధన లు, నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా జరగనున్న పోలింగ్ ప్రక్రియలో ఎన్నిక ల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుము దిని అన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పోలింగ్ ప్రక్రియ నిర్వహణ ఎన్నికల కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడు తూ, 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాల ని, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాల ని తెలిపారు. 3వ విడతలో నిర్వహించే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలి పారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన, ఫారా లు జారీ చేయాలని, ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షం గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఫారం 14, 20 వినియో గం పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నామి నేషన్ల ప్రక్రియలో నెలకొన్న సమస్యలు, అందిన ఫిర్యాదుల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసు కోవాలని సూచించారు. నివేదికలు, టి – పోల్ ఎంట్రీలు, రికార్డులు, మిస్ మ్యాచ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ర్యాండమైజే షన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, స్టేజ్ 2 ఆర్. ఓ. ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని ,సర్పంచ్ స్థానాల ఎన్ని క మొదటి విడతలో (11 ) స్థానాలు ఏకగ్రీవం ,(156 ) స్థానాలలో పోలింగ్ నిర్వహించడం జరుగు తుందని కలెక్టర్ తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ మదన్ మోహన్ , పంచాయ తీ అధికారి మురళీ, ఆర్డీఓ వీణ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందర్, సంబంధి త అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

87వ వార్డ్ పరిధిలో ముఖ్య మంత్రి సహాయానిది అందజేత….

87వ వార్డ్ పరిధిలో ముఖ్య మంత్రి సహాయానిది అందజేత…. విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- ముఖ్య అతిధులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్). గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో గవరవీధి ప్రాంతానికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా సిఎం సహాయనిది అండగా నిలుస్తుందని అందులో భాగంగా గత కొద్దీరోజుల క్రితం అనారోగ్యానికి గురై చికిత్స పొందిన కాండ్రేగుల శ్రీనివాసరావు కు 41048/- రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రావు గారు ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసి ఆమోదం పొందేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు,ప్రగడ దానయ్య, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ,ఆనంద్ కుమార్, కడుపుట్ల శ్రీను, గండేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అదనపు పీపీగా ప్రార్ధసారథి

అదనపు పీపీగా ప్రార్ధసారథి *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి* ఈరోజు ఐదోవ అదనపు జిల్లా న్యాయమూర్తి కం ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది కర్రి పార్థసారథి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లా డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదవిలో మూడేళ్లు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా విశాఖ టిడిపి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి,విశాఖ లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్,తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గం నాయకులు మానం శోభనబాబు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ మొదలగున వారు పార్థసారథిని పుష్పగుచ్చము మరియు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసితిరి.

విశాఖపట్నం

పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్*

*పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్* *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కే అప్పలరాజు,తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.