Wednesday, 6 May 2026

Blog

విశాఖపట్నం

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి!

సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మార్గశిర పౌర్ణమి! *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి* పూర్ణ మార్కెట్ ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో గురువారం నాడు మార్గశిర పౌర్ణమి వైభవంగా జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ ప్రధాన అర్చకులు పి నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి ఐదు ప్రదక్షణలు చేసినంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 167 సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగాయి. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, స్వామి వారి ఫోటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

విశాఖపట్నం

ఏ యూ లో విద్యార్థులు విలవిల : కాంగ్రెస్*

*ఏ యూ లో విద్యార్థులు విలవిల : కాంగ్రెస్* *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అధ్యక్షతన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి సునీల్ అహిరా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు చోట్ల పర్యటించారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రీడింగ్ రూమ్ లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు, విద్యార్థుల తమ గోడును ఆయనతో విన్నవించున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని, ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తునామని మా వయసు అయిపోతే మేము అర్హత కోల్పోతామని మా కలలు కలలుగానే మిగిలిపోతాయని, మా తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని మమల్ని చదివిస్తున్నారని, మాకు ఉద్యోగాలు రాకపోతే వారికి గుండే కోత మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు, మా సమస్యల పై పోరాడమని వారు విజ్ఞప్తి చేసారు. యూనివర్సిటీలో సదుపాయాలుతో క్లినిక్ లేకపోవడం, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి మరణం జరిగిందని పలువురు విద్యార్థులు చెప్పారు, దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతున్న మన రాష్ట్రంలో ఆంక్షలు విధించడం దుర్మార్గమని, విద్యార్థి సంఘం నాయకులు ఉంటే యూనివర్సిటీలో సమస్యల పై పలువురు విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు మార్టిన్ లూథెర్, అమర్ జహన్ భైగ్, పీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్, డీసీసీ కోఆర్డినేటర్ ఎల్ ఎన్ హాసిని వర్మ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఆలీ, సీనియర్ నాయకులు చిన్నబాబు, డా విజయ్ చంద్రా, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్, సీనియర్ నాయకులు ఉమ్మిడి భాస్కర్, కాకినాడ చిన్నబాబు,అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రశ్నిస్తే చంపేస్తారా

– ప్రశ్నిస్తే చంపేస్తారా – బీసీ నాయకుడు విజయ్ భాస్కర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – విశాఖ వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబియాల విజయభాస్కర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు రవీంద్ర భరత్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలపైన అనేక దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపకపోగా దాడులకి ప్రోత్సహించడం ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు బీసీలు నోరెత్తకూడదు అనే విధంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, చంపేస్తాం అని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా రాష్ట్రంలో బీసీలను అనగ తొక్కాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రానున్న రోజుల్లో తిప్పికొడతామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం గళం వినిపిస్తూ ఉంటామని, ప్రభుత్వం ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలని హితవు పలికారు ఇటువంటి చర్యలు ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఉదాహరణగా చెప్పొచ్చని భావించారు, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరు ప్రశ్నించినా ప్రచారం చేసిన వారిని టార్గెట్ చేసి ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం బీసీ అధ్యక్షులు బోండాడ వెంకటరమణ, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కంటుముచ్చు సాగర్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ చోడిపల్లి శివ, 37వ వార్డు ఇన్చార్జి గనగళ్ళ రామరాజు, దక్షిణ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆకుల శ్యామ్, 38వ వార్డు యువజన అధ్యక్షులు చాపల నూకరాజు, యలమంచిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

చీటింగ్ కేసులో సదరం శివ( రిటైర్డ్ రైల్వే TTE) సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

చీటింగ్ కేసులో సదరం శివ( రిటైర్డ్ రైల్వే TTE) సదరం ప్రేమ్ సాగర్ తండ్రి కొడుకులు అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * డబ్బులు ఆశ చూపి మాయమాటలతో మభ్యపెట్టి కే రమ్య రాజు అనే మహిళను ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఒక కోటి 97 లక్షలు నమ్మించి పెట్టుబడి పెట్టించారు. అవి వెనక్కి రాకపోగా ఆమె ఆ డబ్బులు కోసం సదరం ప్రేమ్ సాగర్ ని అడగగా ఇంకొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు వెనక్కి వస్తాయని ఆమెను నమ్మించారు. ఆమె నా దగ్గర ఇంకా డబ్బులు లేవని చెప్పగా ఇంట్లో బంగారం ఉంటే తీసుకురమ్మని చెప్పగా ఆమె వారి మాటలు నమ్మి 75 తులాల బంగారం వారిద్దరూ ఆనంద్ అనే వ్యక్తి ద్వారా తాకట్టు పెట్టి మరల ఆ డబ్బుల్ని కాజేశారు. ఆమె పలుమార్లు డబ్బులు కోసం అడగగా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసేవారు. విషయం తెలుసుకున్న ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సదరం శివ, సదరం ప్రేమ్ సాగర్ ను రిమాండ్ కి తరలించారు.

విశాఖపట్నం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:-* విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు, కార్యకర్తలను కలిసి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేష్ అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగిన మంత్రి విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామానికి వెళ్లనున్న మంత్రి లోకేష్ సాయంత్రం భామిని గ్రామంలో పాలకొండ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి అనంతరం పాలకొండ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

విశాఖపట్నం

లోకో రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది”

“లోకో రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది” *విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-* అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) కేంద్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు, లోకో రన్నింగ్ సిబ్బంది తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 02-12-2025 ఉదయం 10 గంటల నుండి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని క్రూ లాబీలు, డీఆర్‌ఎం కార్యాలయాల ఎదుట నిర్వహించారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్‌లో డీఆర్‌ఎం కార్యాలయం, వాల్తేరు వద్ద ఈ నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. రన్నింగ్ సిబ్బంది రైళ్ల విధుల్లో పాల్గొంటూ “నేను 48 గంటల నిరాహార దీక్షలో ఉన్నాను” అనే బ్యాడ్జీలు ధరించి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్షను కొనసాగించారు. ప్రధాన డిమాండ్లు: 1. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించాలి. 2. 01-01-2024 నుండి TA రేట్లు పెరిగిన తరహాలో కిలోమీటరేజ్ భత్యాన్ని 25% పెంచాలి. 3. కిలోమీటరేజ్ అలవెన్సులో 70%ను ఆదాయపు పన్ను నుండి మినహాయించాలి. 4. ALP భర్తీ ప్రక్రియ (RRB–2025) మరియు శిక్షణ ప్రక్రియ (RRB–2024)ను వేగవంతం చేయాలి. 5. రన్నింగ్ స్టాఫ్ టర్న్ అరౌండ్ / హెడ్‌క్వార్టర్స్ అబ్సెన్స్ 48 గంటల లోపు ఉండేలా చేసి, దానిని మరింతగా 36 గంటలకు తగ్గించాలి. 6. క్రూ నైట్ డ్యూటీని వరుసగా రెండురాత్రులకే పరిమితం చేయాలి. 7. సిబ్బంది దీర్ఘకాల పని గంటలను నిలిపివేసి, సైనింగ్ ఆన్ నుండి సైనింగ్ ఆఫ్ వరకు గరిష్టంగా 10 గంటలకే పరిమితం చేసి, దానిని 8 గంటలకు తగ్గించాలి. 8. పీరియాడికల్ రెస్ట్ 16+30 గంటలు అంటే మొత్తం 46 గంటలు తప్పనిసరిగా అమలు చేయాలి. 9. లోకో క్యాబ్‌లలో టూల్ బాక్స్ మరియు FSD సదుపాయం ఏర్పాటు చేయాలి. వాల్తేరు డివిజన్‌లో లోకో రన్నింగ్ సిబ్బంది స్థానిక సమస్యలు: • లోకో పైలట్లను 12 గంటల డ్యూటీకి బలవంతంగా వినియోగించడం, అలాగే 16 గంటల విశ్రాంతికి బదులుగా కేవలం 12 గంటల ట్రిప్ రెస్ట్ మాత్రమే ఇవ్వడం తక్షణం నిలిపివేయాలి. • సింహాచలం నార్త్, విజయనగరం వద్ద హెడ్‌క్వార్టర్స్ లేదా రిలీఫ్ పాయింట్‌లను అండర్ యుటిలైజేషన్, యార్డ్ కాంగెషన్ పేరుతో బైపాస్ చేయడం నిలిపివేయాలి. • DPWCS (లోటస్) లోకో పేరిట అసిస్టెంట్ లోకో పైలట్ లేకుండా లోకో పైలట్‌ను పని చేయమని బలవంతం చేయడం ఆపాలి. • లోకో పైలట్‌తో కలిసి పని చేసిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌కు రిలీవ్ ఇవ్వకుండా వివక్ష చూపడం ఆపాలి. • సైడింగ్స్ నుండి GDR చెక్స్ లేకుండా, TXR సిబ్బంది పరీక్ష లేకుండా లాంగ్ హాల్ రైళ్లను క్లియర్ చేయడం నిలిపివేయాలి. • ఒకే ట్రైన్ ఆర్డర్‌లో బహుళ రైళ్లను నడపమని సిబ్బందిపై ఒత్తిడి చేయడం ఆపాలి. • పూర్తిగా అసురక్షితమైన K.K లైన్‌లో డౌన్‌లోడెడ్ లాంగ్ హాల్ రైళ్లను నడపడం నిలిపివేయాలి. • MIPM, SCMN, VZM అవుట్ స్టేషన్ సిబ్బందిని PSA & RGDA వద్ద విశ్రాంతి తీసుకున్న తర్వాత షార్ట్ ట్రిప్స్ లేదా షటిల్ ట్రైన్లకు వినియోగించడం వల్ల హెడ్‌క్వార్టర్స్ నుంచి ఎక్కువగా దూరమవుతున్నారు – ఇది నిలిపివేయాలి. • డ్యూటీ గంటల కుదింపు, విడగొట్టడం పూర్తిగా ఆపాలి. • అన్ని హ్యాండిక్యాప్డ్ సెక్షన్లలో కనీస గ్యారంటీ కిలోమీటర్ అలవెన్స్ 120 కిలోమీటర్లు ఇవ్వాలి. • RGDA రన్నింగ్ రూమ్‌లో కాంట్రాక్టర్‌కు మేలు చేసే విధంగా ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ మీల్స్ సిస్టమ్‌ను వెంటనే రద్దు చేయాలి. ఈ సందర్భంలో, ఒక మెమోరాండం గౌరవ భారత రైల్వే మంత్రి గారికి, రైల్వే బోర్డు చైర్మన్ గారికి న్యూఢిల్లీకి పంపబడింది. మరో మెమోరాండం స్థానిక సమస్యలపై డీఆర్‌ఎం–వాల్తేరు గారికి సమర్పించబడింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ శ్రీ పాణికుమార్, అఖిల భారత గార్డ్స్ కౌన్సిల్ డివిజనల్ సెక్రటరీ శ్రీ వర్మ, ఈ.కో.ఆర్.ఎస్‌.యూ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.సి.సాహో, జోనల్ ప్రెసిడెంట్ శ్రీ సంపత్ తదితరులు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. AILRSA జోనల్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.కె. హూబే, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి.ఎస్.వి.బి. రాజు దీక్ష ముగింపు సభలో ప్రసంగించి, అన్ని డిమాండ్ల సాధన కోసం ఐక్య పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు. విశాఖపట్టణ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, CITU విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, 21-12-2025 నుండి 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం, లోకో రన్నింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు. 48 గంటల నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని అభినందిస్తూ వారికి నిమ్మరసం అందించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమం శ్రీ ఎస్.సి. పాణిగ్రాహి (డివిజనల్ ప్రెసిడెంట్), బివి.ఎస్.వి. రాజు (సెంట్రల్ జాయింట్ సెక్రటరీ), హరికృష్ణ (జాయింట్ డివిజనల్ సెక్రటరీ), ఎం. చిన్నోడు (AILRSA, వాల్తేరు) నాయకత్వంలో నిర్వహించబడింది.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం జోన్ – 4 కార్యాలయం లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం*.

*దక్షిణ నియోజకవర్గం జోన్ – 4 కార్యాలయం లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవం*. *డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ గారు* *ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన జిల్లా స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు*. *కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*. *విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- * ఈరోజు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు…..వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందులో భాగంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గత 5 సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలను సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే గారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరగకుండా పారదర్శకంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రథమ లక్ష్యం……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మొదట నిలబడాలనేదే ప్రధమ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలత్తకుండా క్యూ లైన్ భక్తులు ఆగకుండా వెళ్లే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు….

E-పేపర్

పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన

పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన పుల్లంగేరు నుండి పుల్లంపేట, మరియు పుత్తనవారిపల్లి చెరువులుకు ఎన్నో దశాబ్దాలుగా నీళ్లు రాని తరుణంలో రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు,కు.డా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఈరోజు పుల్లంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కాలువ పనులను పరిశీలించి,అనంతరం అప్పయ్య రాజుపేట పంచాయతీ పెరయవరంఅరుంధతి వాడ దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను, మరియు పుల్లంగేరు ప్రవాహాన్ని పరిశీలించారు. పుల్లంగేరు నుండి నుండి కాలువలు పూడిపోయి చెరువులకు నీళ్లు రాకుండా ఉంటే పరిశీలించి, తమదృష్టికి తీసుకురావాలని,కాలువలతో అన్ని చెరువులు నిండేటట్లు చూడాలని ఇరిగేషన్ ఏ.ఈ. ఈ నాగేంద్ర నాయక్ ను ఆదేశించారు. అలాగే పుల్లంపేట మండలంలో చెరువులకు ఎక్కడైనా గండ్లుపడి నీరు వృధా అయ్యే పరిస్థితి ఉంటే ప్రమాదాన్ని ముందే గమనించి తగు చర్యలు తీసుకోవాలని పుల్లంపేట మండల తహసిల్దార్ పుల్లారెడ్డిని ఆదేశించారు.కలెక్టర్ గారు జోరువర్షాన్ని కూడా లెక్కచేయకుండా పుల్లంపేట మండలంలో పర్యటించినందుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు ధన్యవాదములు తెలియజేశారు. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కారూపానంద రెడ్డి గారు, పుల్లంపేట మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని,అందులకు కలెక్టర్ గారు కూడా సహకరించి పుల్లంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని కోరగా అందులకు కలెక్టర్ నిశాంత్ కుమార్,సబ్ కలెక్టర్ సి.హెచ్ భావన గారు సానుకూలంగా స్పందించి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టరు పర్యటన లో ఏ.వో శ్రీధర్ రెడ్డి,ఆర్.ఐ రాజశేఖర్ మరియు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేలపాటి రామచంద్రయ్య నాయుడు,మాజీ మండలాధ్యక్షులు ఆరే సుధాకర్ నాయుడు,పోలూరు కృష్ణమ నాయుడు,బత్తిన వేణుగోపాల్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ చుండు ఈశ్వర్ నాయుడు,యూనిట్ ఇన్చార్జి అణపాలచంద్ర, సెక్రటరీ జీ.కేసుబ్బారెడ్డి,ఆదినారాయణ రెడ్డి,శంకర్ రెడ్డి,రామచంద్రారెడ్డి, మాదినేనిబలరామయ్యనాయుడు,పోలు ప్రేమకుమార్,కుప్పాల రామకృష్ణయ్య,మల్లికార్జున,ఒలేటి వెంకట్,బాలకృష్ణ,రామయ్య, మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు యన్.డి.ఏకూటమి నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై కమిషనర్ సమీక్ష

జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై కమిషనర్ సమీక్ష విశాఖపట్నం డిసెంబర్ 04 పున్నమి ప్రతినిధి:- నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికే పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధానకార్యాలయం సమావేశ మందిరంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం పై అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ నగరంలో జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ వర్క్లు, మెకానికల్ పనులు, తాగునీటి సరఫరా మొదలైన వాటిపై సుధీర్ణంగా చర్చించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అలాగే అభివృద్ధి పనుల అంచనాలను తయారు చేసేటప్పుడు పూర్తి వివరాలను పొందుపరచాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులకు అదనంగా స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారని, సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రాంట్లు, బడ్జెట్లకు అనుగుణంగా అవసరం ఉన్నచోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సంబంధించి ఎంత కేటాయింపు జరిగింది ఎంత ఖర్చు చేశారు. ఎంత విడుదల కావలసి ఉంది అని అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ఆలస్యంపై కమిషనర్ అధికారులను అడిగి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పి.జె.ఆర్.ఎస్. లో రోడ్లు పై గుంతలు కాలువలు తాగునీటి విభాగంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి చార్జీలు, భూగర్భ డ్రైనేజీ చార్జీలు వసూలు చేయాలని, సుదీర్ఘకాలం నీటి చార్జీలు చెల్లించని వారి నీటి కనెక్షన్లకు ముందుగా నోటీసులు జారీ చేసి అనంతరం తొలగించాలని ఆదేశించారు. అనంతరం బీచ్ రోడ్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రాజెక్టుల అమలుపై ఎస్ ఆర్ యు టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కమిషనర్ తిలకించారు. APUIML, SRU టీం, ఇంజనీరింగ్ విభాగంతో సంయుక్తంగా విశాఖ నగర అభివృద్ధికి పలు వినూత్న ప్రాజెక్ట్ లను సూచించి తగు ప్రణాలికలను సిద్దం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీవీఎంసీ కార్యనిర్వహక ఇంజనీర్లు ఉపకార్య నిర్వహణ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం 

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

*శ్రీకాకుళం డిసెంబర్ 4( విశాఖ పున్నమి ప్రతినిధి)* విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పైడిభీమవరం వద్ద ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేసిన మంత్రి నారా లోకేష్. కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఫోటోలు దిగిన మంత్రి శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన పార్టీ నాయకులు, ప్రజలు ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం కూన ప్రమీల, జనసేన ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.