Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి *: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్*: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి * నగరంలో పర్యాటకుల తాకిడి తో ఉదయం నుంచే మ్యూజియంలు తెరవాలి * ఆదేశాలు జారీ చేసిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ * **విశాఖపట్నం డిసెంబర్ 27 పున్నమి ప్రతినిధి * విశాఖకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో వి ఎం ఆర్ డి ఎ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఎండలో బారులు తీరటాన్ని గమనించి, వారిని విశ్రాంతి గదిలో సేద తీరాలని సూచించారు. ఆదివారం మాత్రమే ఉదయం నుంచి తెరిచి ఉంచుతామని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి తెరుస్తామని అధికారులు చెప్పటంతో పర్యాటక సీజన్ కావటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారని, అందువల్ల వి ఎం ఆర్ డి ఎ పరిధిలో అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే తెరవాలని ఆదేశించారు. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట బారులు తీరుతున్న నేపథ్యంలో క్యూ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు రోప్ లని ఉపయోగించాలని సూచించారు. అలానే మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని మ్యూజియంల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో రక్షిత తాగు నీటిని అందుబాటులోకి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి*

*సేవ్ – కే జీ హెచ్ (SAVE KGH) : ప్రియాంక దండి* *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- ఉత్తరాంధ్ర పేద ప్రజల సంజీవని కే జీ హెచ్,రోజుకి సుమారు 2500 మందికి పైగా ఓపి నమోదు అవుతారని, 20 పైగా పెద్ద ఆపరేషన్లు అవుతాయని, నేను గతంలో పలు మార్లు కే జీ హెచ్ కి వెళ్ళాను, అక్కడ పరిస్థితులు చూసి బాధకలిగి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ ద్వారా ” *సేవ్ కే జీ హెచ్* ” నినాదంతో సుమారు జేడీ ఫౌండేషన్ మరియు లిటిల్ హాండ్స్ ఆర్గనై్సేషన్ సంయుక్తంగా 10 లక్షల రూపాయలతో కే జీ హెచ్ లో పలు వార్డులలో మరమ్మత్తు పనులు చెప్పటామని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. పలువులు వ్యాపార ప్రముఖులు మా ద్వారా ఆసుపత్రికి ఫ్యాన్లు, లైట్లు, రోటరీ క్లబ్ సహకారంతో 70 వీల్ చైర్లు అందించామని ఆమె తెలిపారు, ఆర్ ఓ ప్లాంట్ మరమ్మతు చేసాము, పాత్ర ఇండియా వారు 5 లక్షల విలువ చేసే పరికరాలు ప్రసూతి విభాగానికి తమ సి ఎస్ ఆర్ నిధులతో అందించారు, అప్పటి కలెక్టర్ మల్లికార్జున స్పందించి,తమ నిధులు 50 లక్షలు కేటాయించి ఐసీయూ నవీకరించారు. కే జీ హెచ్ లో ఉన్న సమస్యలను అప్పటి ప్రభుత్వ సలహాదారుడు (నాడు-నేడు) కి, ప్రస్తుత తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అకునూరి మురళి దృష్టికి తీసుకువెళ్లగా మా సహకారంతో అప్పటి కే జీ హెచ్ సూపరింటెండెంట్ మైథిలితో మాట్లాడి కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయగా ఆసుపత్రి పై నివేదిక తయారు చేసి పంపారు వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి 600 కోట్లు ఆమోదించారు, అమలు కావడంలో జాప్యం జరగడంతో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయిందని,అప్పటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు కూడ మేము చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చేసిన పని అభినందించి, నాకు కే జీ హెచ్ పై బాధ్యత ఉంది, మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కే జీ హెచ్ ని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు, ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రమంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు మరియు ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ తీసుకొని నిధులు తీసుకువచ్చి కే జీ హెచ్ లో సిదిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే బాధ్యత తీసుకోవాలని ప్రియాంక ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

విశాఖపట్నం

జనావాసాలపై రేడియేషన్ ముప్పు..! దువ్వాడలో సెల్‌ఫోన్ టవర్‌పై ప్రజల తిరుగుబాటు**

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) దువ్వాడలో జనసాంద్రత ఉన్న నివాస ప్రాంతం నడుమ సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా టవర్ నిర్మాణం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా, ముందస్తు ప్రజాభిప్రాయం లేకుండా టవర్ పనులు చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే విషయంపై అధికార యంత్రాంగం మౌనం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే టవర్ పనులు నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం

అల్లూరి పార్కును సందర్శించిన జీవీఎంసీ సీఈ సత్యనారాయణ రాజు

పెద గంట్యాడ : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న అల్లూరి సీతారామరాజు పార్కును జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు శనివారం సందర్శించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పార్కు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ప్రస్తుతం గార్డెన్ అభివృద్ధి పనులు మరియు బాక్స్ క్రికెట్ మైదానం ఏర్పాటు పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. త్వరలోనే అల్లూరి సీతారామరాజు పార్కును ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు తెలిపారు. ఈ పార్కు ప్రారంభంతో ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు వ్యాయామ సౌకర్యాలు లభించనున్నాయని ఆయన అన్నారు.

తిరుపతి

రెడ్డివారి గురవారెడ్డిని ఘంగా సన్మానించిన కూటమి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డివారి గురవారెడ్డిని నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దశరధాచారి మాట్లాడుతూ.. నాటి వైసిపి ప్రభుత్వ అరాచక చర్యలను ఎదుర్కొని నిలబడి, జగన్ రెడ్డిని గద్దె దించడానికి ముందుండి పోరాటాలు చేసిన బిసి, యస్సీ, యస్టీ, మైనారిటీ వర్గాలకు అటు నామినేటెడ్ పదవులలో ఇటు తెలుగుదేశం పార్టీ యొక్క వివిధ కమిటీలలో ఇప్పుడు ఇస్తున్న దాని కన్నా మరింతగా వారి ప్రాతినిధ్యం పెంచి, వారి త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా చూసే బాధ్యత ఎన్డీయే కూటమి లోని తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీత రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల త్యాగాలే తెలుగుదేశం పార్టీకి మూలధనం అని, జగన్ రెడ్డి యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎదుర్కునే క్రమంలో తమ మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప కార్యకర్తలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని అటువంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనందుకు తాను గర్వంగా భావిస్తున్నానని, తనకు వచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీ విజయం కొరకు కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తనపై ఎంతో నమ్మకంతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారని వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా గ్రంథాలయ సంస్థ ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా, వారి కష్టనష్టాలకు పరిష్కారంగా నిలిచి, వారిని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముక్త కంఠంతో సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ, బిజెపి నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,యస్వీ రమణ,వజ్రం కిషోర్,మునిరాజా యాదవ్,కోట చంద్రశేఖర్,ప్రముఖ న్యాయవాదులు సురేంద్ర ముదిరాజ్,అంకయ్య, బిసి, యస్సీ విభాగం విభాగం నాయకులు జనార్థన్ రెడ్డి,మణి,కుమార్, కూలి సన్నీ, రామకృష్ణ, సంజాకుల మురళీకృష్ణ,సుజిత్, సాయి నాయుడు, రమేష్, కృష్ణమూర్తి, నాగరాజు, శేఖర్,శంకరయ్య,పూల శేఖర్,సులేమాన్,భాస్కర్,ఆనంద్,గాజుల భగత్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

విద్యా జ్యోతి పాఠశాలలో వీర బాల దివస్ కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యా జ్యోతి పబ్లిక్ స్కూల్ నందు వీర బాల దివస్ కార్యక్రమాన్ని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 9న 2022వ సంవత్సరం ఈ మేర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు, చరిత్రపుటల్లో అనేకమంది భరతమాత స్వేచ్ఛ కోసం సంస్కృతి యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని ఆకోవలో పెద్దలే కాదు చిన్నారులు కూడా ఉన్నారని వారే బాబా జోరవర్ సింగ్, బాబా పతే సింగ్ వీరు పదవ సిక్కు గురువు అయినటువంటి శ్రీ గురు గోబింద్ జీ చిన్న కుమారులు ఆ చిన్నారుల ధైర్య సాహసాలని, త్యాగనిరతిని స్మరించుకుంటూ అటువంటి వీరపుత్రులను కన్న మాతృమూర్తులను నమస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా 26 డిసెంబర్ న వీర బాల దివస్ గా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు కండ్రిగ ఉమా, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించిన సిని హిరో సుమన్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్దం శనివారం నాడు ప్రముఖ సిని నటుడు సుమన్ విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వాహన అధికారి బాపిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

జూమ్లే పీర్ దర్గా పాల్గొన్న తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న జూమ్లే పీర్ దర్గా గందోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచన మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఉరుసులో పాల్గొని దర్గాలో చద్దర్, బూంది సమర్పించి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన తరపున ఈ గందోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గందోత్సవం రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్న శ్రీకాళహస్తి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్.S.M షఫీ,దేవస్థానం పాలక మండలి సభ్యులు గాదిపాకుల గోపి,వార్డ్ ఇంచార్జ్. పోలూరు శ్రీనివాస్ రెడ్డి,ఐటీడీపీ. ఖాదర్,నియోజకవర్గం మైనారిటీ ఉపాధ్యక్షులు షఫీ, మీర్జా. ప్రధాన కార్యదర్శి.C.S. మస్తాన్,అధికార ప్రతినిధి జహీర్,కార్యదర్శి నయీమ్. రఫీ బాయ్. సాజిద్. జాకీర్. షాబుద్దీన్ హర్షద్. నాయకులు. దొరబాబు బుజ్జి. ఆర్ముగం. రూకేష్. తదితర నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

భారతీయ న్యావాదుల సంఘం సబ్యునిగ ఎన్నికైన అంకయ్య

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (AILU) సభ్యునిగా కేసి అంకయ్య ఎంపిక శ్రీకాళహస్తి : ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇటీవల నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో (ఐలు) ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ యూనియన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఈనెల ఎనిమిదో తేదీన జిల్లా కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో తిరుపతి నుండి పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి చల్లా వెంకటయ్య, భాను సుందర్, చిత్తూరు నుండి సుగుణ శేఖర్ రెడ్డి, మదనపల్లి నుండి షాజహాన్ భాష, పీవీ ప్రసాద్, సోమశేఖర్, శ్రీకాళహస్తి నుండి కాకి చిన్న అంకయ్య లను 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక జరిగే వరకు వీరు కొనసాగుతారని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థి సత్తు అంకయ్యకు తప్ప మరెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. యూనియన్ తో సంబంధం లేని వారికి తాము మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అభ్యర్థి సత్తు అంకయ్యకు ఐలు కార్యకర్తలు, న్యాయవాదులు తమ ప్రాధాన్యత ఓటు వేసి ఐలు అభ్యర్థి గెలుపుకు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉరుసు ఉత్సవంలో తెలుగుదేశం నాయకులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.