Monday, 4 May 2026

Blog

E-పేపర్

VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందు పడుతున్న పట్టించుకోని VI

Vi (సిగ్నల్) నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బంది… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో ని నక్కర్త మేడిపల్లిలో గ్రామంలో VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు

కామారెడ్డి

కాంగ్రెస్ సఖ్యం ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు హేయమైన చర్య! కామొరెడ్డి, 28 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం భారత మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు.గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధా ని మోడీల ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా ఖండించా రు. గాంధీ ఆదర్శాలను కాపాడాలని కాంగ్రెస్ కార్య కర్తలు పిలుపునిచ్చారు.ఈ చర్య గాంధీవాద సిద్ధాంతాలకు అవమానమని అన్నారు.దేశ తల్లి కాంగ్రెస్‌కు అగౌరవమని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. రామారెడ్డి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశం స్వాతంత్ర్యం పొందింది. గాంధీజీ స్వప్నాల్లో భాగంగా మనం మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తీసివేయడం దేశ చరిత్రకు మచ్చగా నిలుస్తుందని ఆరోపించారు. గ్రామస్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ న్నారు.కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను గుర్తు చేసుకునే ఈ దినోత్సవం మహా ఆందోళనలు, సమావేశాలతో సార్వత్రికంగా జరు గుతోంది. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా పేదలకు ఆధారం కాలిగించినప్పటికీ, గాంధీ పేరు తొలగింపు తెలంగాణ ప్రజల్లో కోపాన్ని రేకెత్తిస్తోంద ని అన్నారు. అనంతరం మండలంలో నూతన సర్పంచ్లకు సన్మానం ఘనంగా చేశారు. కాంగ్రెస్ నాయకులు మరిన్ని ఆందోళన లకు సిద్ధమవుతున్నారని చెప్పారు అనంతరం నూతన సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ ఎండి రావుఫ్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ముఖ్య సలహాదా రులు చీలాసాగర్, పిప్పరి లింగం, ఏఎంసీ డైరెక్టర్ బట్టు సత్యనా రాయణ, బి పేట రంజిత్, రామారెడ్డి సర్పంచ్, ప్రవీణ్ కుమార్, కన్నాపూర్ సర్పంచ్ గొల్లమహేశ్, గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకీ లచ్చాయ్యా, రామారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త లు రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ గొల్ల పల్లి సర్పంచ్ కిషన్ యాదవ్ ఇసనపల్లి సర్పంచ్ డోకి లచ్చయ్య, కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ యాదవ్, రామారెడ్డి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నామాల రవి,3వా వార్డు సభ్యులు పిప్పిరి లింబాంద్రీ, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేషన్ బియ్యం దొంగ లించిన దొంగలకు 14 రోజులు రిమాండ్

ఉదయగిరి గౌడ్ న్ లో సంస్థ గోదాంలో రూ 2.10 కోట్ల విలువైన రేషన్ సరుకులు నొక్కేసిన ముగ్గురికి ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ 14 రోజులు పాటు రీమండ్ విధించినట్లు ఎస్ ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు అంనంతరం నిందితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు మునీఫ్, షాహిద్, రఫీని, ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ

ఈ రోజు ఆత్మీయత సేవా సొసైటి గత 8 సంవత్సరాలుగా ఎంతో మంది…

నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా నిస్వార్థంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం ఫౌండేషన్ ఫౌండర్ Dr.చక్రవర్తి గారు హైదరాబాద్ లో డైరెక్టర్ రేలంగి నరసింగరావు చేతుల మీదులుగా “Best Seva Golden Nandi National Award – 2025” అనే అవార్డు ని అందించారు. ఈ సందర్బంగా ఆత్మీయత సేవా సొసైటి ఫౌండర్ మరియు అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ అవార్డు ని బహుకరించిన మనం ఫౌండేషన్ చైర్మన్ Dr. చక్రవర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ అవార్డు రావడానికి కారకులైన సేవా చేయడానికి ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్న నా భార్య సంధ్యారాణి గారికి,ఆత్మీయత సేవా సభ్యులకు మరియు సొసైటికి ఎల్లవేళలా సహాయం అందిస్తుస్తున్న దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఆత్మీయత సేవా సొసైటి సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. 🙏🙏💐

అల్లూరి సీతారామరాజు

అరకు: ఒకే రకమైన వస్త్రదారణలో ఆకట్టుకున్న మహిళలు

అరకులోయ మండలం, కొత్తభల్లుగుడ పంచాయితీ, కొర్రగుడ గ్రామంలో శనివారం ఘనంగా ఐక్య క్రిస్మస్ జరుపుకున్నారు. ఈ మేరకు గ్రామ చర్చ లో ప్రత్యేక ప్రార్ధనలు పాస్టర్ శ్యాంసన్ నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణలో తమలోని ఐక్యతను చాటుకున్నారు. యువతీ యువకులు ఆట పాటలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

విశాఖపట్నం

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల

జ్యోతిర్గమయ మిషన్ కింద 20 మంది ట్రాన్స్‌జెండర్లకు జీవీఎంసీ పొరుగుసేవల నియామక పత్రాలు. * ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడపాలి . *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖ నగరంలో గల ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సుముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అయిన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 20 మంది ట్రాన్స్ జెండర్స్ కు జీవీఎంసీ పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులుగా నియమామక పత్రాలను శంఖబ్రత భాగ్చి తో కలిసి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాంజెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నగరంలో ఉన్న ట్రాంజెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవం ప్రియతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ చొరవతో 20 మంది ట్రాన్స్ జెండర్లకు మిషన్ జ్యోతిర్గమయ ద్వారా పొరుగు సేవl పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లను అందరిలో గౌరవప్రదంగా ఉండేలా గౌరవప్రదమైన జీవితం జీవించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు భిక్షాటన , వివాదాలకు జోలికి పోకుండా గౌరవప్రదంగా బతకాలని ఆయన తెలిపారు. నగర మేయర్, జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి కృషితో 20 మందికి పొరుగు సేవల పద్ధతిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగ కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

ఏపీఈపీడీసీఎల్ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*ఏపీఈపీడీసీఎల్ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం సాగర్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సాయి తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కేవలం భద్రత మాత్రమే కాదని, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను గుర్తించి సేవాభావంతో పని చేయాల్సిన కర్తవ్యమని అన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల దైనందిన జీవితాలకు నేరుగా సంబంధం ఉన్న కీలక బాధ్యత అని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పని చేయాలని సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వారు తమ కుటుంబాలకు ఆసరా కావడమే కాకుండా, సమాజానికి కూడా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గాజువాక నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఉపకేంద్రాల పనితీరు, పెదగంట్యాడ విద్యుత్ ఉపకేంద్రానికి సంబంధించిన అంశాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మార్పిడి, భూగర్భ కేబులింగ్ పనులు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. గాజువాకలోని పలు ప్రధాన రహదారుల్లో చేపట్టిన భూగర్భ కేబులింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ప్రమాదాల వల్ల చోటుచేసుకుంటున్న దుర్ఘటనలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, కరెంట్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు ఆదేశించారు. అపార్ట్‌మెంట్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు, పరిహార అంశాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యుత్ శాఖలోని సమస్యలను దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆర్ ఎస్ ఎస్ దేశానికి పట్టిన విషం సినీ నటుడు ప్రకాష్ రాజ్

ఆర్ ఎస్ ఎస్ దేశానికి పట్టిన విషం పోరాటాలతో కార్పొరేట్ల దోపిడీ నియంత్రణ సీఐటీయూ నాకిష్టమైన సంఘం సినీ నటుడు ప్రకాష్ రాజ్ *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి:- * “100 ఏళ్ళ ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ నుంచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారి ఒక్క పేరు చెప్పగలరా.? ఈ వందేళ్లలో చెడ్డీ ల నుంచి ప్యాంటు లకు వచ్చారు తప్ప సాధించింది ఏమీ లేదని ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ ఎద్దేవాచేశారు. కమలం పువ్వు కింద ఉన్న విషపు వేళ్లను చూస్తే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఈ దేశానికి పట్టిన విషం. అని అన్నారు. భారతదేశం సరోవరం అయితే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ ఎస్ ఎస్ అని వ్యాఖ్యానించారు. సీఐటీయూ అలిండియా మహాసభలు 31 నుంచి జనవరి 4వరకూ విశాఖ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న సందర్బంగా 27న శ్రామిక్ ఉత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖకు శనివారం విచ్చేసిన అయన దసపల్ల హోటల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.. కార్మికుల కోసం పోరాడే వారంటే నాకెంతో ఇష్టం. సీఐటీయూ పిలవగానే వచ్చేశాను అని తెలిపారు. నేను నటుడుని మాత్రమే కాదు. అభ్యుదయ ఆలోచనలు ఆందోళనలకు అండగా ఉంటాను అన్నారు. సీఐటీయూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావడం నా బాధ్యత… చెమట చుక్కకి ఓటమి ఉండదన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించడంపై స్పందిస్తూ అమ్మేవాడు ఒకడు కొనేవాడు ఒకడు.. కళ్ళముందే వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటె ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడు పోయారు కాబట్టి అని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా విమాన యాన రంగం పెద్దోళ్ళు చేతుల్లో ఉండడం వీరికి ప్రభుత్వాలు అమ్ముడు పోవడం కల్లారా చూసామని విమర్శించారు.. ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులు రాజ్యాంగ యంత్రం వారి చేతిలో ఉన్నాయి కదా పిడి చట్టాలు పెడతారు, స్థాన్ స్వామికి స్ట్రా కూడా ఇవ్వరు, గౌరీ లంకేశ్ ని చంపిన వారు బెయిల్ పై బయటకి వచ్చేస్తారు.. వారికి ప్రశ్నించే వారు వుండకూడదు. ప్రజలు నిరంతరం ప్రశ్నించడమే మార్గమన్నారు. మెడికల్ కాలేజీలని ఏపీలో పి పి పి పేరుతో అమ్మడం ప్రజలకు నష్టం అని, అసలు ప్రజలు ఎన్నికల్లో ఎవరిని బల పరచాలో నేర్చుకోవాలన్నారు.. కర్ణాటక లోని బెంగళూరు లో 1007 ఎకరాల వ్యవసాయ భూమిని ఇది వరకు ఒకసారి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నపుడు ప్రజలంతా కలిసి పోరాడి అప గలిగారన్నారు. మీ డియా కూడా అమ్ముడు పోయిందని ఎంతో కొంత ఇండిపెండెంట్ మీడియా పని చేస్తుందన్నారు. సినిమాలు మీడియా ద్వారా 90శాతం చెత్తను పాలకులు ఎక్కిస్తున్నారని కేరళ ఫైల్స్ అనే సినిమా తీయించి స్వయంగా మోడీ యే రూ కోట్లు ఖర్చు చేసి సినిమా చూడాలనే కాంపెయిన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.. అబద్దాలతో భయాన్ని కలిగించే సామ్రాజ్యాన్ని దేశంలో పాలక శక్తులు నిర్మిస్తున్నాయని ప్రజలు అనునిత్యం పోరాడాలని ఈ వ్యవస్థ ను అర్ధం చేసుకుని పోరాడేలా సీఐటీయూ వంటి సంస్థ లు చేస్తున్నాయని అభినందించారు.. శివాజీ మాటలపై ఆగ్రహం ఆడవాళ్ళ పై శివాజీ మాటలు అహంకారం తో కూడినవి అని అన్నారు. వేదికల మీద మాట్లాడేప్పుడు ఒళ్ళు, భాష జాగ్రత్తగా ఉండాలన్నారు.అనసూయకు నా మద్దతు….అని ప్రకాష్ రాజ్ అన్నారు..మహిళలను కు సంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ళ అవయవాలు మాత్రమే కనిపిస్తాయి…..అన్నారు ఐ బొమ్మ రవి దొంగ తనం చేశాడు…. దొంగ…దొంగే….? అంటూ స్పందించారు.. టికెట్ధ ధరలు పెరిగితే ప్రజలు సినిమాలు చూడొద్దు అని సలహా ఇచ్చారు. మావోయిస్టుల ఎన్ఈకౌంటర్ పై మాట్లాడుతూ.. వారు ఎందుకు ఆలా మారారో తెలుసుకుని చర్చలు జరపాలి తప్ప టెర్రరిస్ట్ ల మాదిరి కాల్చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు.. ఈ సమావేశం లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నరసింగరావు, అధ్యక్షులు మాజీ ఎమ్ ఎల్ ఏ ఎమ్ ఏ గపూర్, అలిండియా సీఐటీయూ నాయకులు కందారపు మురళీ పాల్గొన్నారు.

విశాఖపట్నం

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి*

‎ *నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3000రు వెంటనే చెల్లించాలి* ‎ ‎ *జనవరి 1 ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.* ‎ ‎ *అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం*. *‎విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి * ‎ ‎ *ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్చుత రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3 వేల రూపాయల చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికీ నిరుద్యోగ భృతి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెల గడుస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవకాయిక ఫెస్టివల్ కి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా పేరుతో వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటమైన ప్రకటనలు ఇస్తున్న ఈ 19 లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీసీ ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసే ఉన్న నిరుద్యోగులకు నేటి వరకు రుణాలు మంజూరు చేయలేదని, 2025 -26 సంబంధించిన స్వయం ఉపాధి పథకం రుణాలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని బీసీ కార్పొరేషన్ అధికారులు నిలిపివేయడం జరిగిందని చెప్పారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరి నెలలో పెద్ద ఎత్తున యువకులను సమీకరించి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు రెడ్డి, కెల్లా రమణ, రాజు, మురళి లక్ష్మణ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి

క్లాప్ వాహనాలు నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాలు సేకరించాలి – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం డిసెంబర్ 27పున్నమి ప్రతినిధి *: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్*: ప్రతి ఇంటి నుండి నిత్యం క్లాప్ వాహనాలు వ్యర్థాలను సేకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ 24వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సౌత్ జోన్ పరిధిలో కె.జి.హెచ్. వద్ద ఉన్న అన్నా కాంటీన్ ను అయా జోనల్ కమీషనర్లు రాము, మల్లయ్య నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ క్లాప్ వాహనాల ద్వారా వ్యర్ధాలను ప్రతిరోజు ఇంటింటి నుండి సేకరించాలని జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం ప్రదర్శించరాదని, వార్డులలో పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వెను వెంటనే ఆ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కి తరలించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పనిముట్లు, యూనిఫామ్ లు అందించారా అని ఆరా తీశారు. క్లాప్ వాహనాలు రోజు ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలు సేకరించి తరలిస్తున్నారని, ఒక్కొక్క క్లాప్ వాహనం పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయని క్లాప్ వాహనాల డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే వీధుల్లో ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు వ్యర్ధాలు సేకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో డంపర్ బిన్నులు నిండి వ్యర్ధాలు అధికంగా కింద పడుతున్నాయని, వ్యర్ధాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాలుగవ జోన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఫలహారం భుజిస్తున్న వారిని ఆహార నాణ్యత ఎలా ఉందని ఆరా తీయగా, ఆహారం నాణ్యత చాలా బాగుందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని అదనపు కమిషనర్ తెలిపారు. అన్న క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ ను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించడంతోపాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి కృష్ణంరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.