Monday, 4 May 2026

Blog

తెలంగాణ

రబి సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన: మంత్రి

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు(సోమవారం) రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో, రబీ సీజన్లో యూరియా పంపిణి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

కామారెడ్డి

రెడ్డిపేటలో ఉచిత నట్టల నివారణ శిబిరం

1404 జీవాలకు మందులు…… కామారెడ్డి, 29డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గొర్రెల పెంపకం దారులు ఉచిత నట్టల నివారణ మందుల శిబిరాలను సద్వి నియోగం చేసుకోవా లని మండల పశువైద్యాధికారీ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరాలు రైతులకు గొప్ప ఆశీస్సుగా మారాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారీ, సర్పంచ్ చేతుల మీదుగా రెడ్డిపేట గ్రామంలో ఉచిత నట్టల నివారణ శిబిరాన్ని ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, నారాయణ జేవీఓ, రమేష్ వీఏ , సిబ్బంది ఆంజనేయులు, బలమని, గోపాల మిత్ర హారిక, స్వామి, గొర్రెల పెంపకం దారులు రాములు, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వరుస దొంగతనాలతో హడలిపోతున్న కోళ్ల పెంపకం దారులు

కృత్తివెన్ను మండలం సీతనపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామం లో 25 వ తారీకు అర్ధరాత్రి జరిగిన కోళ్లు దొంగతనం కేసులో కొప్పర్తి. అచ్చిబాబు s/o లక్ష్మణరావు గుడ్లవల్లేరు మండలం, పేరం కొండలరావు s/o దుర్గారావు, గుడ్లవల్లేరు మండలం అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి 10కోడిపుంజులు, బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్టు కృత్తివెన్ను SI పైడిబాబు తెలిపారు. ఇటు బంటుమిల్లి లో కూడా షుమారు 6 లక్షలు విలువ చేసే 10 కోడిపుంజులను ఆదివారం తెల్లవారు జామున దొంగలు అపహారించినట్టు సమాచారం. సంక్రాంతి సమీపిస్తుండడం తో కోళ్లు దొంగతనాలు జరగడం అవి లక్షల ఖరీదు చేసేవి కావడం తో కోళ్ల పెంపకం దారులు హడలెత్తిపోతున్నారు.

సిద్ధిపేట

యూరియా కోసం రైతుల తిప్పలు పట్టనట్టున్న ప్రభుత్వం

మిరుదొడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. యూరియా వస్తుందని తెలవడంతో భారీగా తరలివచ్చిన రైతన్నలు. యూరియా కోసం ఓ షాప్ ముందు భారీగా లైన్ కట్టిన అన్నదాతలు. వచ్చిన యూరియా అందరికీ సరిపోక నిరాశకు గురైన రైతన్నలు. పున్నమి ప్రతినిధి మిరుదొడ్డి మండలం మల్లేశం . సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి ఉదయం 6 గంటల నుంచి ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు యూరియా కోసం లైన్లో నిల్చొని ఉన్నారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇచ్చిన స్టాక్ లేదని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వింత నిబంధనాలతో రైతులను ఇబ్బంది పెడుతూ యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల ఫర్టిలైజర్ యాప్ తీసుకు రావడంతో గందరగోళంలో పడిన రాష్ట్ర రైతాంగం. అయితే ఈ యాప్ లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తీసుకోకపోతే మళ్లీ 15 రోజుల వరకు యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధనలు తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. యాప్ లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అడగడంతో కౌలు రైతులకు. రైతుబంధు నిధులు వేస్తారేమో అని ఆందోళనలో ఉన్న భూ యజమానులు. ఈ నేపథ్యంలో తమకు భూమినీ కౌలికి ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కౌలి రైతులు. యూరియా తీసుకునే లిమిట్ పెట్టిన ప్రభుత్వం. పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ షాపుల్లో లేని యూరియా యాప్ లో ఎలా అని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతన్నల పైన కక్షపూరిత వైఖరి మాని అన్నదాతలకు యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు డిమాండ్ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ

బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కొత్తపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చందర్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) మరియు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై, కూటమి నాయకులతో కలిసి చందర్లపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.128.00 లక్షలుగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లు, గోడలు వంటి మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

E-పేపర్

పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

​పెద్ద అవుటపల్లి, పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి పుణ్యక్షేత్రంలో బ్రదర్ జోసెఫ్ తంబి 81వ వర్ధంతి మహోత్సవాల గోడ పత్రికను గుడి పెద్దలు, సంఘ పెద్దలు మరియు మీడియా మిత్రుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవరి 13, 14, 15 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​దేశవ్యాప్తంగా తరలిరానున్న ఈ మహోత్సవాలకు కర్ణాటక, కేరళ, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ​అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ​ ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరిస్తున్న పోలీస్, వైద్య, ఫైర్, ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులకు మరియు సిబ్బందికి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ​ బ్రదర్ జోసెఫ్ తంబి ఈ గ్రామంలోనే నివసించి, ఇక్కడే సమాధి అయ్యారని, ఆయన సమాధి చెంత ప్రార్థనలు చేయడం వల్ల ఎంతోమంది భక్తులకు అద్భుతాలు జరిగాయని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ​ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర బాధ్యులు, గ్రామ పెద్దలు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే మూడు రోజుల ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాము.

జోగులాంబ గద్వాల

ఆధార్‌లో 05 మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్*

గద్వాల్ డిసెంబర్ 29(పున్నమి ప్రతినిధి) ఆధార్‌లో 05 మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న 05 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన పిల్లలకు ఆధార్‌లో బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మార్గదర్శకాల ప్రకారం, ఈ వయస్సులలో పిల్లల వేలిముద్రలు (Fingerprints), కంటి మణులు (Iris Scan), ఫోటో మార్పులకు లోనవుతాయని దృష్టిలో ఉంచుకొని, ఆధార్ వివరాల ఖచ్చితత్వాన్ని నిలుపుకోవడానికి ఈ నవీకరణ అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా లోని ఆధార్ సెంటర్ లలో తల్లిదండ్రులు / సంరక్షకులు తమ పిల్లల ఆధార్ నవీకరణను సమీపంలోని ఆధార్ నమోదు / నవీకరణ కేంద్రంలో సంబంధిత దృవీకరణ పత్రాలతో తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించడమైనది. సకాలంలో బయోమెట్రిక్ నవీకరణ చేయించుకోకపోతే, భవిష్యత్తులో పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ పథకాలు, పరీక్షలు మరియు ఇతర సేవలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పిల్లవాడి ఆధార్ బయోమెట్రిక్ నవీకరణను వెంటనే పూర్తి చేయించుకోవాలని సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని, ఆధార్ నిర్వాహకులు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల కలకలం: పేలుడులతో కుక్క మృతి,

గ్రామస్తులు భయాందోళనలో… జిల్లా ప్రజలు కామారెడ్డి, 29 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా గర్గుల వంటి గ్రామాల్లో నాటు బాంబుల పేలుడు ఘటనలు కలకలం రేపాయి. శనివారం పొలం నాటు పనులలో నిమగ్నమై ఉన్నారు ఒక్కసారిగా ఈ పేలుడులతో ఒక కుక్క మృతి చెందడంతో స్థానికులు భయంగా మారారు. ఈ ఘటన గ్రామంలో ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించింది.గర్గుల గ్రామంలో ఉదయం10 గంటల సమయంలో ఆకస్మికంగా నాటు బాంబులు పేలా యి. ఈ పేలుడుల సౌండ్‌తో గ్రామస్తులు షాక్‌లో పడ్డారు. సమీపంలో ఉన్న ఒక కుక్క ఈ పేలుడు లతో తీవ్రంగా గాయపడి మరణించింది.ఈ ఘటన గ్రామంలోని పొలాలు, రోడ్ల సమీపంలో జరిగినట్టు తెలుస్తోంది.స్థానికులు ఈనాటు బాంబులు ఎవరు, ఎందుకు అమర్చారో తెలియకపోవడంతో భయ పడుతున్నారు.ఈ బాంబులు పొరుగు గ్రామాల్లో నూ వినిపించాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుడులు దేశీయంగా తయారు చేసినవి కావ చ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో నాటు బాంబుల వాడకం పెరు గుతున్నట్టు హెచ్చరిస్తోంది. పొలాల్లో జంతువులు, పక్షులను తడబడటానికి ఈ బాంబులు ఉపయోగి స్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే, అనియంత్రితంగా వాడటం వల్ల ప్రమాదాలు జరు గుతున్నాయి. గత కొన్ని నెలల్లో ఈ జిల్లాలో ఇలాం టి ఘటనలు జరిగాయి.పోలీసులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్తులు ఈ బాంబులు తయారు చేసే వారిని గుర్తిం చి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిం చారు. ఈ ఘటనతో గర్గుల గ్రామంలో ఉద్విగ్నత మొదలైంది.

జోగులాంబ గద్వాల

జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం:జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

గద్వాల్ డిసెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో చైనా మంజా నిషేదం.. *నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు* జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో చైనా మంజా పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లా లో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని *జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు* ఒక ప్రకటనతో తెలిపారు. రాబోయే సంక్రాంతి పండగ సంద‌ర్భంగా చైనా mamjaa ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని, ఈ చైనా మంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడం తో పాటు చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , చైనా మంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. చైనా మంజాను ఉప‌యోగించి గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు కూడా ప్ర‌మాదానికి గురవుతారు. అదే క్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించాం అని ఎస్పి తెలిపారు. చైనా మంజా పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామనింతెలిపారు. జిల్లా పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.