Monday, 4 May 2026

Blog

నాగర్‌కర్నూల్

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..!

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..! వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్డండ మండల కాంగ్రెస్ నాయకుడు పీఏసీఎస్ చైర్మన్ పదవీ పై ఆశలు పెట్టుకున్నట్టు సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సహకార పరపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని, నామినేటెడ్ పద్దతిలో పాలక మండలాల‌ను వచ్చే సంవత్సరం జనవరి లో ప్రకటించనున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు వెల్డండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవీ కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మంతనాలు కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే చైర్మన్ పదవీ దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ

రబి సీజన్ లో యూరియా సరఫరాకు ఇబ్బందులు లేవు : రెవిన్యూ అదనపు కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) రబి సీజన్లో యూరియా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరతలేదని, యాప్ ద్వారా రైతులు సులభంగా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్సై హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సై శివ రాకేష్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అశాంతి సృష్టించడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు తావిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సంయమనంతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రంతా ప్రత్యేక తనిఖీలు, ప్యాట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు.

E-పేపర్

*ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ*

*శాసన సభ్యులు వనమాడి కొండబాబు* కాకినాడ జిల్లా కాకినాడ సిటీ :కాకినాడ నగర ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 32, 33,34,35 డివిజన్లకు సభందించి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగాణంలో మధ్యాహ్నం 27,28,29,30,31, డివిజన్లకు సంబంధించి అన్నదాన సమాజంలోనూ ప్రజాధర్భర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం మార్గాలు చేపట్టడమే కొరకు ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని, నగర అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై ఫిర్యాదులు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం పిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, టిపిఆర్ఓ శైలజ, డిసిపి కృష్ణారావు, డి కనకారావు, స్థానిక కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, SK రహీం బాబు, గుజ్జు దుర్గ లక్ష్మణరావు, బంగారు సూర్యావతీ సత్యనారాయణ, చింతలపూడి రవి, రిక్క లక్ష్మి, పొంగ బుజ్జి, పసుపులేటి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బూరయ్య, కోడూరి పెద్ద, రెడ్డనం సత్తిబాబు, నేమాని సత్యనారాయణ, చిట్టిబాబు, మనోహర్ గుప్తా, అమలకంటి బలరాం, పొంగా సత్య, గబ్బర్ సింగ్, బాక్సర్, తోట రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పురస్కారాలకన్నా ముందున్న వ్యక్తిత్వం – డాక్టర్ ప్రసాద్

కుటుంబం అనే బలమైన పునాదిపై నిలబడి, బాల్యం నుంచే క్రమశిక్షణ, కష్టపడి చదవాలనే తపన, ఇతరులకు ఉపకారం చేయాలనే సేవాభావాన్ని అలవర్చుకున్న వ్యక్తి డాక్టర్ ప్రసాద్. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చినా, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఒక జీవంత ఆదర్శంగా నిలుస్తోంది. బాల్య దశలోనే తల్లిదండ్రులు నాటిన విలువలు — నిజాయితీ, వినయం, బాధ్యత, మానవత్వం — ఇవే ఆయన వ్యక్తిత్వానికి పునాదులయ్యాయి. చదువులో ప్రతిభ చూపుతూ, ఒక్కో అంచెలో తన లక్ష్యానికి దగ్గరవుతూ ఎదిగిన డాక్టర్ ప్రసాద్, వైద్య విద్యను కేవలం వృత్తిగా కాకుండా ఒక మహత్తర సేవగా భావించారు. యూరాలజీ వైద్యుడిగా అనేక విజయాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు, జాతీయ స్థాయి గుర్తింపులు ఆయనను వరించాయి. అయితే ఈ అన్నిటికన్నా ముందుగా ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన స్వభావమే. రోగితో మాట్లాడే తీరు, వారి బాధను అర్థం చేసుకునే మనసు, నమ్మకాన్ని నింపే మాటలు — ఇవే ఆయనను నిజమైన “డాక్టర్”గా నిలబెట్టాయి. పురస్కారాలు గోడలపై అలంకరణలైతే, రోగుల నమ్మకం ఆయన జీవితానికి అసలైన సత్కారం. విజయ శిఖరాలను అధిరోహించినప్పటికీ నేలమీద నిలబడి ఉండే వినయం, నిరంతరం నేర్చుకోవాలనే తపన, సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే త్యాగభావమే డాక్టర్ ప్రసాద్ గారిని మరింత గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. కుటుంబం ఇచ్చిన విలువలు, బాల్యం నుంచే అలవర్చుకున్న క్రమశిక్షణ, అంచెలంచలుగా సాధించిన విజయం — ఇవన్నీ కలిసే డాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి. అందుకే ఆయనకు దక్కిన ప్రతి గౌరవం కేవలం వ్యక్తిగత విజయం కాదు; అది విలువలకు దక్కిన గౌరవం. విజయాన్ని పండగగా మార్చే స్నేహం డాక్టర్ ప్రసాద్ గారికి వచ్చిన ప్రతి గౌరవం ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదు. ఆయనతో పాటు చదివిన స్కూల్ మిత్రుల హృదయాల్లో వెలిగే ఆనంద దీపం. “మాలో ఒకడు ఎదిగాడు” అనే గర్వమే ఆ దీపానికి నూనె. విజయం వస్తే పండగలా చేసుకోవడం, బాధ వస్తే భుజం ఇచ్చి ధైర్యం నింపడం — ఇదే వారి స్నేహానికి నిర్వచనం. ఎవరిదైనా సంతోషం అందరిదీ అవుతుంది. ఎవరిదైనా బాధ అందరూ పంచుకుంటారు. అందుకే ఆ స్నేహం కాలాన్ని, దూరాన్ని దాటి నేటికీ అలాగే నిలిచింది. డాక్టర్ ప్రసాద్ గారి స్కూల్ మిత్రులందరూ నేడు వివిధ రంగాల్లో, వివిధ ఖండాల్లో ప్రత్యేక స్థానాల్లో రాణిస్తుండటం విశేషం. పోలీస్ సుధాకర్, సుధా, శ్రీ, త్రినాధ్, రమేష్, మూర్తి, కేఎం, ఎమ్మెస్ ఎస్, మహేష్, సాల్మన్, కిషోర్, వెంకట్, కుమార్, గోవింద్, బలివాడ, చిన్ని తదితరులు తమ తమ రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే వారిలో ఒకరిద్దరు మాత్రమే సాధారణ దిగువ–మధ్యతరగతి జీవితాల్లో ఉన్నప్పటికీ, ఈ మిత్రుల సాంగత్యంతో వారు ఒంటరితనాన్ని కాదు — ధైర్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి కారణం వారి మధ్య ఉన్న అపూర్వమైన స్నేహభావమే. ఫిట్‌నెస్‌కు స్ఫూర్తిగా పోలీస్ సుధాకర్ ఈ మిత్రబృందంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోలీస్ సుధాకర్. క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహనతో ఆయన ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా నిలుస్తున్నారు. తన ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని సమానంగా చూసుకుంటూ, మిత్రులకు కూడా ఫిట్‌నెస్‌పై ప్రేరణగా మారుతున్నారు. ఇది వారి స్నేహ బంధానికి మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. పురస్కారాలు డాక్టర్ ప్రసాద్ గారి పేరును ప్రపంచానికి చెబితే, ఆ విజయానికి నిజమైన అర్థం ఇచ్చేది ఆయన మిత్రుల అనుబంధమే. ఎందుకంటే నిజమైన గౌరవం అవార్డుల్లో కాదు… స్నేహ హృదయాల్లో ఉంటుంది.

విశాఖపట్నం

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం.

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం. విశాఖపట్నం,డిసెంబర్ 30 పున్నమి ప్రతినిధి:- విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సేవలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా, ఇప్పుడు డైడెక్టర్‌ జనరల్‌గా (డీజీ) ప్రమోషన్‌ ఇచ్చింది. అయితే అదే హోదాలో విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించాలని సూచించడం గమనార్హం.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ -ఏపీఎంఎఫ్ విశాఖపట్నం యూనియన్ శంక బ్రత బాగ్చి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. లత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేశానపల్లి.కిరణ్ కుమార్,కార్య దర్శి బేర.సురేష్ ,సహాయ కార్యదర్శి అప్పలరాజు, కోశాధికారి వాసుపల్లి రాజు , అలాగే కమిటీ సభ్యులు శంకర్, ప్రసాద్ యాదవ్, మీనా, జెమిని న్యూస్ ఎడిటర్ సారా, అనుపమ యాదవ్ , అర్జున్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలను అంద జేశారు.

తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి ఇల్లు మొత్తం దగ్ధమైంది. గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు RND

E-పేపర్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామంలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి RND

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో బాలకోటయ్యకు ఘన సత్కారం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొతుల బాలకోటయ్య కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కమిటీ చైర్మన్ కొట వీరబాబు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పి.మీరా హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో బాలకోటయ్య ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిరుమామిళ్ళ నానాజీ, జర్నలిస్టులు పఠాన్ సైదాఖాన్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని బాలకోటయ్య సేవలను ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.