Monday, 4 May 2026

Blog

E-పేపర్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం యాచారం: డిసెంబర్ 30 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న వేళ కళలు–కళాకారులను ప్రోత్సహించాలనే సదుదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025” కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో తెలంగాణ నలుమూలల నుంచి 536 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాచారమ మండలం మొండిగారెల్లికి చెందిన పర్శమోని శ్రీను ముదిరాజ్ పాటల పోటీలో పాల్గొని విశేష గుర్తింపు సాధించారు. డింపుల్ డ్రీమ్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ రచన, స్వరకల్పన, దర్శకత్వం వహించిన “డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ” అనే అవగాహనాత్మక గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు తెలంగాణ ప్రముఖ చలనచిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు, ప్రముఖ గాయని మంగ్లీ, సింగర్ మోహన భోగరాజు చేతుల మీదుగా ఘనంగా సత్కారం లభించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగి, సామాజిక అంశంపై సందేశాత్మక గీతంతో గుర్తింపు సాధించిన శ్రీను ముదిరాజ్‌కు గ్రామ ప్రజలు, కళాభిమానులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్షముని శ్రీను కుటుంబ సభ్యులు.నక్క బాలరాజా సంగీత తమ కుమారులు. విజయ్ టీచర్. శ్రీనివాస్ గుప్తా. తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా. రాపర్తి రామకృష్ణ.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30: గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

విజయం సాధించిన కుమ్మర నాయకులను సన్మానించిన : రాష్ట్ర, జిల్లా నాయకులు

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర, జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల కులదేవత శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ధర్మేశ్ పురం లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ లు, సర్పంచ్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కుమ్మరు నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘం ఐక్యతను చాటారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం

పున్నమి ప్రతినిధి కామారెడ్డి – 29 డిసెంబర్ 2025* *కామారెడ్డిలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం* ==================================== కామారెడ్డి జిల్లా స్థాయిలో గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల అధ్యక్షతన, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం గారి పర్యవేక్షణలో స్థానిక గంజ్ హైస్కూలు నందు గణిత ప్రతిభా ఫోటీ పరీక్షల కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో 225 మంది విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. డీ.ఈ.వో రాజు గారు మాట్లాడుతూ మనిషి జీవితంలో గణితం లేకపోతే మనకు మనుగడే లేదన్నారు. విద్యార్థులకు గణితమంటే చాలా భయం ఉంటదని ఆ అపోహలను గణిత ఉపాధ్యాయులు తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులు గణితం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి గణిత ఫోరం ప్రతిభా పోటీల విజేతలు *తెలుగు మీడియంలో* ప్రథమ స్డానంలో బి.రాంచరణ్ – బోర్లం హైస్కూలు ద్వితీయ స్థానంలో జే.శ్రీకాంత్ – బుడ్మి హైస్కూలు తృతీయ స్థానంలో యం.గీత హంగర్గా హైస్కూలు *ఇంగ్లీషు మీడియం విభాగంలో* ప్రథమ స్డానంలో కే.సాయి వర్షిణి చుక్కాపూర్ హైస్కూలు ద్వితీయ స్థానంలో కే.విష్ణు ప్రియ – మాచారెడ్డి హైస్కూలు తృతీయ స్థానంలో జి మ.ప్రదీప్ – చుక్కాపూర్ హైస్కూలు *ఉర్దూ మీడియంలో* ప్రథమ స్డానంలో షేక్ మారిన్ గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ ద్వితీయ స్థానంలో ఫాతిమా గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ తృతీయ స్థానంలో బుష్రానాజ్ గల్స్ హైస్కూలు కామారెడ్డి *మోడల్ స్కూల్ & రెసిడెన్షియల్ స్కూల్స్* విభాగంలో ప్రథమ స్డానంలో జి.లక్ష్మణ్ మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఎర్రాపహడ్ ద్వితీయ స్థానంలో యస్.మానస సోషల్ వెల్ఫేర్ గల్స్ స్కూల్ దోమకొండ తృతీయ స్థానంలో కే శ్రీజ మాడల్ స్కూల్ ఎల్లారెడ్డి. పోటీలలో ప్రతిభ కనపరచి విజేతలైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ రాజు గారి చేతుల మీదిగా అందించడం జరిగింది. అనంతరం ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవి పొందిన ఈ.నివేదిత గారికి, అశోక్ గారికి, బసంత్ రాజ్ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించిన రాజేంద్ర గారికి, స్కౌట్ మాస్టర్ గారికి, రాధాదేవి మేడంకు మొ,, వారికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ గారు, జిల్లా సైన్స్ అధికారి సిద్దారాం రెడ్డి గారు, ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతాప్ రెడ్డి గారు, నరేందర్, లక్ష్మణ్, మంజుల, మరియు జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విధ్యార్థులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది.

పిల్లలకు

మహాదేవి ( విభాగం -1)

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వాయు లింగేశ్వరపురం. ఆ ఊరిలో మహేశ్వరి, దేవా అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా వీళ్ళకు పిల్లలు లేరు. అందుకు వీరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ ఊరికి వచ్చి, అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకుని,ఆ దంపతులు ఇద్దరూ ఉన్న ప్రదేశం గుండా అతను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి వచ్చి ఆ దంపతులతో ఇలా చెప్పాడు ” తల్లీ నీవు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నావు కదా ” అని ఆ ఋషి వాళ్లను అడిగాడు. మహేశ్వరి ” అవును! మీకు ఎలా తెలుసు” అని అడిగింది. ఋషి ” అంతా ఆ మహాదేవుని మహిమ” అని చెప్పాడు. తరువాత ఆ ఋషి మహేశ్వరి తో ఇలా చెప్పాడు ” తల్లి నీవు ఈ క్షణం నుంచి మహాదేవుడిని పూజించు, అతనికి భక్తి శ్రద్ధలతో శ్రమించుకో ఇలా నువ్వు చేయడం ద్వారా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది” అని ఆ ఋషి చెప్పాడు. అప్పుడు తన భర్త దేవాతో ఈ విషయాన్ని గురించి చెప్పింది. అలా రోజు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్న శివాలయంనందుకు వెళ్లి రోజు పూజలు చేసి, అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించి, చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో మహా దేవుడిని పూజించారు. ప్రతి సోమవారం వారు ఇద్దరూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి,ఆ రాత్రి అక్కడే ఉండి జాగారం చేసి, తెల్లవారి జామున లేచి, అక్కడే ఉన్న కోనేరు లో స్నానం చేసి, మహాదేవుడిని దర్శించుకుని వారి ఇంటికి వెళ్లారు. తరువాత కొన్ని రోజులకి మహేశ్వరి తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు తన వెళ్ళిన రెండో రోజు తను తల్లి కాబోతుంది అని తెలిసింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది మహేశ్వరి. మహేశ్వరి మరియు తన భర్త దేవా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి మహాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆరోజు మొత్తం వారు ఇద్దరు గుడిలో ఉండి అన్నదానం కార్యక్రమం చేసి, రాత్రి జాగారం చేశారు. కొన్ని నెలల తరువాత మహేశ్వరి శ్రీమంతం చేసుకుంది. అలా అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు మహేశ్వరి తన భర్త అయినా దేవాతో కలిసి మందుల కోసం పట్నం వెళ్ళారు. అప్పుడు దేవా రోడ్డును దాటబోతు ఉండగా ఒక లారీ వచ్చి అతనిని ఢీ కొట్టింది. అప్పుడు అతనిని వైద్యశాలకు తరలించారు. దేవా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే మహేశ్వరిని అదే వైద్యశాలలో చేర్పించారు. అప్పుడు తన స్థితి చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అని వైద్యులు చెప్పారు. తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం ఉందని చెప్పారు.

నాగర్‌కర్నూల్

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..!

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..! వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్డండ మండల కాంగ్రెస్ నాయకుడు పీఏసీఎస్ చైర్మన్ పదవీ పై ఆశలు పెట్టుకున్నట్టు సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సహకార పరపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని, నామినేటెడ్ పద్దతిలో పాలక మండలాల‌ను వచ్చే సంవత్సరం జనవరి లో ప్రకటించనున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు వెల్డండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవీ కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మంతనాలు కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే చైర్మన్ పదవీ దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.