Monday, 4 May 2026

Blog

E-పేపర్

జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు

జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల సంఘాల JAC

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ రైల్వేకోడూరు డిసెంబర్ 31 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ .ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం .

అన్నమయ్య

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

-నూతన ఏడాది వేళ అంగరంగ వైభవంగా వేడుకలు | పొంగుబాలతో మొక్కులు తీర్చుకోనున్న భక్తులు | రోజంతా అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు చిట్వేలు, డిసెంబర్ 31: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఈ క్షేత్రంలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బుధవారం (జనవరి 1న) స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారికి విశేష అభిషేకములు, ఫలపుష్ప అలంకరణలు మరియు హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. నూతన ఏడాది తొలిరోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. -ముగియనున్న పొంగుబాలు ముక్కు బడులు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ‘పొంగుబాలు’ సమర్పించడం ప్రధానమైనది. భక్తులు తమ కోర్కెలు సిద్ధించాలని లేదా నెరవేరిన కోర్కెలకు కృతజ్ఞతగా ఆలయ ప్రాంగణంలో పొంగుబాలు (పాలు పొంగించి నైవేద్యం వండటం) సమర్పించి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఆకర్షణీయంగా చెక్కభజనలు.. నిరంతర అన్నదానం భక్తి పారవశ్యాన్ని పెంచేలా ఉదయం 9 గంటల నుండి కళాకారులచే చెక్కభజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా **అన్న ప్రసాద వితరణ (అన్నదానం)జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -భక్తులకు విన్నపం నైవేద్యాలు, ప్రసాదాలతో స్వామివారిని సేవించి, ఆయన కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ కోరింది. భక్తులు క్రమశిక్షణతో క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, పవిత్రమైన ఈ వేడుకను జయప్రదం చేయాలని గ్రామ పెద్దలు ప్రార్థిస్తున్నారు.

కామారెడ్డి

ఘన వైకుంఠ ఏకాదశి వేడుకలు

కామారెడ్డి, 30 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. రామారెడ్డి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవలు పలు వీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేశారు. రామారెడ్డి మండల బండరాలలోని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆకర్షణ కేంద్రంగా మారింది. భక్తుల ఉత్సాహం తండోపతండాలుగా వచ్చిన భక్తులు అభిషేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిటికిటలా డాయి. ప్రత్యేకంగా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది.జిల్లా వ్యాప్తంగా పలు ఆలయల్లో వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30, 2025) పర్వదినం మార్మోగాయి.భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం పొందారు.పూజా విధానాలు భక్తులు దైవిక నిష్ఠతో ఉపవాసం, జాగరణం, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయాల్లో భక్తులకు మంచి నీరు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్వం వైకుంఠ ప్రాప్తికి మార్గం అని భక్తులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్రీ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీ హన్మొయ్యొల్ల నవీన్, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, రంజిత్, రాజు, మాజీ సర్పంచ్, దండబో యిన సంజీవ్, మాజీ ఎంపీటీసీ నామాల యాదగి రి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Blog E-పేపర్ Featured Others ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పశ్చిమ గోదావరి పిల్లలకు విద్య విజ్ఞానం

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:➡️ 09 జనవరి 2026 దరఖాస్తు ఫీజు:🔹 జనరల్: ₹1600/-🔹 BC / EWS: ₹1300/-🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/- అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.inwww.apset.net.in

పశ్చిమ గోదావరి

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య

ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది.

పశ్చిమ గోదావరి

రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ

రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ ▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు. రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని ‘రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది.

అన్నమయ్య

శ్రీ సౌమ్యనాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న అతికారి కృష్ణ ​గౌరవప్రదంగా స్వాగతం పలికిన యెద్దల విజయ సాగర్ ​టీడీపీ నాయకులను పరిచయం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్

​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయ విశిష్టతను వివరించిన విజయ సాగర్: దర్శనానంతరం యెద్దల విజయ సాగర్ ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక విశిష్టతను అతికారి కృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నందలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీకు చెందిన నాయకులను, కార్యకర్తలను అతికారి కృష్ణకు పేరుపేరునా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి కృష్ణ మాట్లాడుతూ: అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ​ఈ సందర్భంగా యెద్దల విజయ సాగర్ మాట్లాడుతూ: “వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ సౌమ్యనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరం అని. నందలూరు క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది అని. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా నిలవాలని కోరుకుంటున్నాము అని. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని” ఆయన తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో మండల జనసేన మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామారెడ్డి

మానసిక దృఢత్వం, మత్తు పదార్థాల నిరోధంపై కస్తూర్బా బాలికల విద్యాలయంలో అవగాహన

కామారెడ్డి 31 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళ వారం మానసిక సమస్యలు, పరీక్షా కాలంలో జాగ్ర త్తలు, మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వనిత ఈ కార్యక్రమాన్ని సమీకరిం చారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మానసిక దృఢ త్వం తప్పనిసరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి న జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ మానసి కంగా దృఢంగా ఉండాలని సూచించారు. “అప్పుడే మీ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు” అని తెలిపారు. టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను వివరిం చుతూ, పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలని, మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దని ఆయన అన్నారు. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాల ని సలహా ఇచ్చారు. మానసిక సమస్యలు తలెత్తి నా తమను సంప్రదించాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.యువత మత్తు పదార్థాలు వద్దు.. బంగా రు భవిష్యత్తు కోల్పోకండిఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, టీనేజీలు మత్తు పదార్థాల కు లోనై, విలువైన జీవితాలను వృధా చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కలిగే అనర్థాలను ఇంట్లో చెప్పాలని సూచించారు. రామారెడ్డి మండలంలో డ్రగ్స్ వాడ కానికి బానిసైన వ్యక్తులను ఇప్పటికే పట్టు కొని, మందలించి, కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. “కుటుంబం, సమాజాన్ని కాపాడటం మీ బాధ్యత.. మీరు కూడా భాగస్వాములవ్వండి” అని యువత కు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పీఎచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, సైకియా ట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్, ఉపాధ్యాయులు పద్మ, గంగలక్ష్మి, రజిత, అరుణలు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

ఊరందూరు కాల్వలో తేలిన మహిళ మృతదేహం

శ్రీకాళహస్తి పున్నమి క్రైం న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి మండలం ఊరందూరు చెరువు దగ్గర ఉన్న ఎస్టీ కాలనీలో ఊరందూరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనది. ఆమె వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చునని పంట పొలాల్లో ఉండే రైతులు ఆ మృతదేహం గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి తెలియగాజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసు వాళ్ళు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తరలించారు. మృతదేహం చేతులపై హిందీలో అక్షరాలు ఉండడం గమనించిన పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు cell:9154141891 , cell:7330823611.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.