Monday, 4 May 2026

Blog

తిరుపతి

కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మీయ సమావేశం

రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకలకొండ నందు పాత,కొత్త ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల నందు గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, మరియు బదిలీ పై ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయునికి మరియు ప్రమోషన్ పై వివిధ పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు, మరియు ఇదే పాఠశాలలో పనిచేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు అందుకున్న ఉపాధ్యాయునికి, ఇదే పాఠశాలలో ప్రమోషన్ పొందిన వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు నూతనంగా 2025 DSC ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, మరియు ఎంఆర్సి సిబ్బందికి, ఆత్మీయ సమావేశం ఘన మరియు సన్మానం ప్రధానోపాధ్యాయులు P. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో MEO – 1 పి.రమేష్, ఏ. సుభాషిని, ఎస్ తులసీరామ్ రెడ్డి, సమీరా బేగం, ప్రతాప్, నరేష్, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మము లాభి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మయ్య, మహేష్, మోహన్ రావు, సూరా రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, ఎమ్మార్సీ సిబ్బంది మౌనిక రెడ్డి, ధర్మారెడ్డి హజరత్ రెడ్డి,జలీల్ పాల్గొన్నారు

తెలంగాణ

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం నల్గొండ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ

జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మసీద్ సెంటర్ వద్ద నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు నేరుగా అందించడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత సమర్థంగా చేరుతున్నాయో ఈ కార్యక్రమం స్పష్టంగా చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్కరూ కూడా ప్రభుత్వ సహాయం నుండి దూరం కాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిజంగా అమలవుతున్నాయనే విషయానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నెట్టెం శివరామ్, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కోరకుటి సైదులు, 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరకుటి బొబ్బిలి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతోస్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మునగచర్లలో రూ.115 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 9 పనులకు శంకుస్థాపన చేయగా, వీటి అంచనా వ్యయం రూ.115 లక్షలుగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి సదుపాయాలతో గ్రామాల రూపురేఖలు మారతాయని, ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మునగచర్లలో సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం

నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో బుధవారం సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, సామాజిక భరోసా పెన్షన్లు పేదలు, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల గడప దాటే పాలన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని, గ్రామాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, గ్రామ సర్పంచ్ పంగులూరి నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిన దార్శనికుడు*

** (పున్నమి ప్రతినిధి) ఆర్థికలోటులోనూ అవకాశాలను సృష్టించిన ఘనుడు చంద్రబాబు* కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు తీసింది. కూటమి ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని అభివృద్ధితో చాటిచెప్పింది.* సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పై ప్రతిపక్షాలు చేసిన అర్థరహిత విమర్శలు తేలిపోయాయి.* యువగళం హామీలను నెరవేర్చేందుకు నారా లోకేష్ అనుక్షణం తపనపడ్డారు. దేశ, విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించారు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించారు.* రాజధాని లేని రాష్ట్రంగా, భావితరాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో… పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడే స్థాయి పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తెచ్చింది.* ఆర్థికలోటుతో అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్రంలో తన అపార అనుభవం, ప్రధాని మోదీ సాయం, పవన్ కళ్యాణ్ సహకారంతో వెలుగులు నింపారు చంద్రబాబు.* — MLC బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, (నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు)* మెగా డీఎస్సీ హామీని నెరవేర్చుతూ తొలి సంతకంతో 15941 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యారంగం బలోపేతానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. 5757 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంతో పాటు స్టైఫండ్ ను 12.5 వేలకు పెంచింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 50,000కోట్ల రూపాయలను(ఏడాదికి 33000 కోట్లు చొప్పున, నెలకు 2750కోట్లు) పింఛన్ల రూపంలో ఇప్పటివరకు లబ్దిదారులకు అందించింది కూటమి ప్రభుత్వం. 46 లక్షల రైతులకు లబ్ది చేకూరుస్తూ 6310 కోట్ల రూపాయలను “అన్నదాత సుఖీభవ పథకం” ద్వారా అందించి రైతన్నలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పేరిట 67.27 లక్షల విద్యార్థులకు మేలు చేకూర్చేలా వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల జమతో పాటు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్స్ ను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. 1144 కోట్ల వ్యయంతో, స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల బస్సు ప్రయాణాలను రాష్ట్ర మహిళలకు ఉచితంగా కల్పించింది కూటమి ప్రభుత్వం. 2.90లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15 వేల చొప్పున 436 కోట్లు సాయం జమ చేసింది. ప్రతీ ఏటా 3 గ్యాస్ సిలిండర్ లు అందించాలన్న లక్ష్యంతో దీపం – 2 పథకం ద్వారా 2684 కోట్లు వెచ్చించి ఇప్పటివరకు 2 కోట్ల సిలిండర్ లను పేద, మధ్య తరగతి మహిళలకు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలను పేదలకు నామమాత్రపు ధరకు అందించింది. మైనారిటీ సంక్షేమం కోసం 3670 కోట్లు కేటాయింపు తో పాటు ఇమామ్ లకు 10 వేలు, మౌజన్ లకు 5 వేలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో 8427 పాస్టర్లకు 5 వేల చొప్పున 51 కోట్ల రూపాయలు, దేవాలయాల్లోని పురోహితులకు 15 వేలు, నాయీ బ్రాహ్మణులకు 25 వేలు చొప్పున 90 కోట్లు అందించింది. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టడమే కాకుండా, 3 వేల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మించింది కూటమి ప్రభుత్వం. “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” ద్వారా 84 లక్షల టన్నుల చెత్త సేకరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వ చొరవతో జరిగిన సీఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు జరుగగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16.13 లక్షల ఉద్యోగాలు మరియు 13 ఎస్.ఐ.పి.బి.సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కు శంకుస్థాపన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం పనుల్లో పురోగతి వచ్చింది. వెలిగొండ వేగం పుంజుకుంది. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు పడటంతో అమరావతి పనులు ఊపందుకున్నాయి. పల్లె పండుగ పథకం ద్వారా గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. 13326 గ్రామ సభలను నిర్వహించి 3 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం లో రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ జరిగింది. ధాన్యం అమ్మిన 24 గం.ల్లోనే రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేసింది. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 3050 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 కోట్లమంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా “అమరజీవి జలధార పథకం” ద్వారా మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందిస్తోంది కూటమి ప్రభుత్వం.

ఎన్ టి ఆర్ జిల్లా

వాసవి మాత జన్మస్థలం ‘వాసవి పెనుగొండ’గా గుర్తింపు – హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం

పెనుగొండ క్షేత్రంలో జన్మించిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలాన్ని “వాసవి పెనుగొండ”గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని యన్.టి.ఆర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం నేత పారేపల్లి సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలో అధికారులు “వాసవి పెనుగొండ”గా సూచిక బోర్డు ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను గౌరవిస్తూ ఈ కీలక తీర్మానం చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని కొనియాడారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.