Monday, 4 May 2026

Blog

తిరుపతి

తెలంగాణ సీఎంకి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి నియోజిక వర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా తిరుమలలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తొండమనాడులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, కుమార్తె పవిత్ర రెడ్డి, మనవడు దేవస్కంద రెడ్డిలు స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్రి సుదర్శన్ రెడ్డి, జై చంద్రారెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేష్, సుబ్బానాయుడు కండ్రిగ వేణు, జయ కృష్ణ రెడ్డి, బలరాం, చంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా శ్రీ వైకుంఠనాథ స్వామీవారి ఏకాదశి మహోత్సవం

శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వైకుంఠనాథ స్వామీ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు, కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులతో వేడుకలను నిర్వహించి భక్తులకు తీర్ధ, ప్రసాదాలు, అందజేయడంతో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఆనందానుభూతిని పొందారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారి ముక్కోటి ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా ఏకాదశి మహోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఏకాదశి వేడుకలను ఘనగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్య సన్నిధిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు

శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీ కాళహస్తీశ్వరా స్వామీవారి అమ్మ వార్ల దర్శనార్దం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు తన కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం నాడు ఆలయానికి వెచ్చేశారు. వీరికి ఆలయాధికారులు, స్థానిక భాజపా నాయకులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయ వేదపండితుల చేత ఆశీర్వాదం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భార్య పై దాడి భర్తకు 14 రోజులు రిమాండ్

ఉదయగిరి లోని రజక విధిలో ఈ నెల 28న చి పీ నాపీ తిరుపతమ్మ పై భర్త గురవయ్య చాకుతో దాడి చేశాడు నిందితుడైనా ఆమె భర్త గురవయ్యను ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో హాజరుపరిచారు గురవయ్యకు జడ్జి జె, అంజయ్య 14 రోజులు రిమాండ్ విధించారనీ ఉదయగిరి ఎస్ఐ అల శ్రీను పేర్కొన్నారు నిందితుడీనీ ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించారు.

యాదాద్రి భువనగిరి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఉప్పల లింగస్వామి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు

ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు ట్రిపులు రైడింగ్ మద్యం సేవించి రోడ్ల పైకి అనవసరంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి

*ఎల్లంకి కాశమ్మ కుటుంబానికి భరోసాగా నిలిచిన చలమల కృష్ణారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థన్నా రాయణపురం మండలం సర్వేల్ (మర్రిగూడెం) గ్రామానికి చెందిన కామ్రేడ్ కీ”శే,ఎల్లంకి మారన్నా తల్లి ఎల్లంకి కాశమ్మ మరణించిన వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబానికి భరోసాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది

యాదాద్రి భువనగిరి

* వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

* మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన–కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి–

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 11 వ వార్డులో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి, 11వ వార్డు సభ్యులు చింతల శైలజ సత్యనారాయణ లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బల్గురి శివ, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ, రాచకొండ రమేష్ బాబు, భూపని బలరాం, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, బోయ శంకరయ్య, బొడ్డు పెళ్లి లోకనాథం, ఈసం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.