Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

విశాఖపట్నం రూరల్‌లో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025 వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహణ

విశాఖపట్నం రూరల్ మండలం, కే.కోటపాడు సమీపంలోని చంద్రయ్యపేట గ్రామం దరిదాట్ల లేఅవుట్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం మరియు లలితా గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025” పేరుతో వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అలాగే రాష్ట్ర అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి, అధికార ప్రతినిధి డా.పెంట శేషుబాబు శర్మ, రాష్ట్ర కోశాధికారి దంతుర్తి కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు న్యాసావఝ్జల ప్రశాంత్, భాస్కర పట్ల సత్యప్రసాద్ శర్మ, గంటి భాస్కర్, దంతుర్తి కాశీ విశ్వనాథ శర్మ, దూర్వాసులు సాయి, చామర్తి కేశవాచార్యులు, రాచకొండ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులకు జీతభత్యాలను క్రమబద్ధంగా అందించడమే కాకుండా, ఇనాం భూముల ఆదాయాన్ని అర్హులైన అర్చకులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని బండారు సత్యనారాయణమూర్తి సభాముఖంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది బ్రాహ్మణులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని వనసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ ఉత్తర్వుల ప్రదానం

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS)లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ అయ్యారు.ఈ సందర్భంగా సోమవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో అప్గ్రేడ్ ఉత్తర్వులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, శాఖ అధికారులతో కలిసి కార్యకర్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు మహిళా, శిశు సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో తల్లి–శిశు ఆరోగ్యం, పోషణ, విద్యా అవగాహన పెంపొందించడంలో వారి సేవలు అమూల్య మైనవని ప్రశంసించారు.అంగన్వాడీ కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ అప్గ్రేడ్ ప్రక్రియ అభినందనీయమని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు*

*చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు* *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మూడు వ‌రుస స‌మావేశాలు *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలో బాల‌ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర‌ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన చైల్డ్ వెల్ఫేర్ & ప్రొటెక్షన్ కమిటీ, సిఫారసుల కమిటీ, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ స‌మావేశాలు జ‌రిగాయి. వీటిల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్, సీడ‌బ్ల్యూసీ క‌మిటీ స‌భ్యులు, అధికారులు భాగ‌స్వామ్య‌మ‌య్యారు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ కు సంబంధించి తుది నమోదు సర్టిఫికెట్ల జారీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సిఫారసులు క‌లెక్ట‌ర్ చేశారు. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్, సంరక్షణ, రక్షణ, పునరావాసానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ వివిధ అంశాల‌పై మాట్లాడారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు, బాలల అక్రమ ర‌వాణ‌ నిరోధానికి, బాల్య వివాహాల నివారణకుచ, పిల్లల పునరావాసం కోసం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాల కార్మిక వ్యవహారాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, బాల్య వివాహాల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. డ్రాప్‌ఔట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని టీకాలు సమయానికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. బాల‌, బాలిక సంర‌క్ష‌ణ గృహాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాలని, వ‌స‌తులు క‌ల్పించాల‌ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు సూచించారు. పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో సేవ‌లందించాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రామలక్ష్మి శాఖాపరమైన అంశాలపై వివరించారు. అనంత‌రం అధికారులంతా క‌లిసి పోస్ట‌ర్ను ఆవిష్క‌రించారు. ఈ సమావేశాల్లో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువెనైల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*

*జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి* *అధికారుల‌కు, దాత‌ల‌కు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు సాయం చేయాల‌నే దృక్ప‌థంతో నెల‌కొల్పిన సంజీవ‌ని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వ‌చ్ఛంద విరాళాలు అందించాలని, అధికారుల‌ను, దాత‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ విజ్ఞ‌ప్తి చేశారు. నూతన సంవత్సరం – 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్న‌వించారు. అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలపడం సందర్భంగా పూలు, పండ్లు, కేకులు, మొక్కలు తదితరాలను అందించడం కన్నా.. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని ప్ర‌త్యేక సందేశం ద్వారా సోమ‌వారం విజ్ఞప్తి చేశారు. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’ ద్వారా సేకరించిన విరాళాలు జిల్లాలోని అవసరమైన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా, సమాజంలో బాధితులకు అండ‌గా నిల‌వ‌డంతో పాటు, సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలవగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవని స్పష్టం చేస్తూ, సేవాభావంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని జిల్లా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. విరాళాలకు సంబంధించిన‌ వివరాలు: నిధి పేరు: SANJEEVANI NIDHI – District Relief Fund ఖాతా సంఖ్య: 50100500766040 బ్యాంకు & IFSC: HDFC Bank – HDFC0009179

విశాఖపట్నం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు*

*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు* *ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు ఈ రోజు 110 ఫిర్యాదులు రావడం జరిగినది* ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., గారు ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 110 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ గారికి అందజేసినారు. సిపి గారు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

విశాఖపట్నం

బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు*

*బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు* *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *9 మంది మత్స్యకారులకు పదివేలు(10000/రూ) మరియు 4000 విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ*అదేవిధంగా బోటు యజమానికి 10000 మరియు నిత్యావసర వస్తువుల అందజేసిన ఎమ్మెల్యే మరియు అసోసియేషన్ సభ్యులు* *మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే* *మత్స్యకారుల విడుదలకు నిరంతరం పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ పెద్దలకు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే* ఈరోజు ఫిషింగ్ హార్బర్ లో ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు పోషణ నిమిత్తం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు అసోసియేషన్ పెద్దలు శ్రీ లక్ష్మణరావు గారు అప్పారావు గారు సహకారంతో మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. 9 మంది మత్స్యకార కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు చ (10000) చొప్పున ,ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మరియు 4000 రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు . అదేవిధంగా బోటు యజమానికి 10000 రూపాయలు మరియు నిత్యాసర వస్తువులను అందజేశారు .కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 9 మంది మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు. మత్స్యకార కుటుంబీకులు అపోహలకు పోకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు. బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్న ఇటీవల సంఘటన నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు కొంత ఆలస్యం అయిందని అతి త్వరలో వారిని వెనక్కి రప్పించే బాధ్యత కేంద్ర మంత్రి, విశాఖ ఎంపీ భరత్ గారు, విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలను నిరంతరం పర్యవేస్తున్నామని తెలియజేశారు. మత్స్యకారులకు తాము అండగా ఉన్నామని వారి కుటుంబ సభ్యులు అధైర్య పడకూడదని ఎమ్మెల్యే వంశీ గారు తెలిపారు . మత్స్యకారుల కుటుంబ సభ్యుల పోషణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా 20000 రూపాయలు ఇవ్వాలని తాము నివేదించానని వివరించారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు….

విశాఖపట్నం

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ. *జనవరి 1 నుండి అన్ని జోనల్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం. * జోనల్ కమిషనర్లు జనవరి 1న జోనల్ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో 2026 జనవరి 1వ తేదీ నుండి పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలను కార్యచరణ ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్ లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న జోనల్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి జోనల్ కార్యాలయాలు, అధికారులు,సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 2026 జనవరి 1 వ తేదీ నుండి 10 జోనల్ కార్యాలయాలు పనిచేయాలని అందుకు సంబంధించిన ఫైల్స్, రికార్డులు తారుమారు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఆయా జోన్లకు తీసుకువెళ్లాలన్నారు. ఇకపై సిబ్బంది, అధికారులు ఆయా జోనల్ కార్యాలయాల నుండి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా జోనల్ కార్యాలయం పరిధిలో ఉన్న వార్డులు, సచివాలయాలు ప్రజలకు తెలిసే విధంగా సచివాలయాల వారీగా వార్డు కార్యదర్శులు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లను, అధికారులను కమిషనర్ ఆదేశించారు. “” జివిఎంసి క్రొత్త జోన్ల వివరాలు”” భీమునిపట్నం జోన్ – వార్డులు: 1, 2, 3, 4 – మొత్తం 4 వార్డులు – 58.884 చ.కి.మీలు, మధురవాడ జోన్ – వార్డులు: 5, 6, 7, 8, 98 – మొత్తం 5 వార్డులు – 95.668 చ.కి.మీ లు, ఈస్ట్ జోన్ – వార్డులు: 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 28 – మొత్తం 15 వార్డులు – 48.527 చ.కి.మీ లు, నార్త్ జోన్ – వార్డులు: 14, 24, 25, 26, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55 – మొత్తం 17 వార్డులు – 19.928 చ.కి.మీలు, సౌత్ జోన్ – వార్డులు: 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41 – మొత్తం 13 వార్డులు – 9.698 చ.కి.మీలు, వెస్ట్ జోన్ – వార్డులు: 40, 52, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 89, 90, 91, 92 – మొత్తం 14 వార్డులు – 72.937 చ.కి.మీలు, పెందుర్తి జోన్ – వార్డులు: 88, 93, 94, 95, 96, 97 – మొత్తం 6 వార్డులు – 75.038 చ.కి.మీలు, గాజువాక జోన్ – వార్డులు: 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 86, 87 – మొత్తం 15 వార్డులు – 108.115 చ.కి.మీలు, అగనంపూడి జోన్ – వార్డులు: 77, 78, 79, 85 – మొత్తం 4 వార్డులు – 102.830 చ.కి.మీలు, అనకాపల్లి జోన్ – వార్డులు: 80, 81, 82, 83, 84 – మొత్తం 5 వార్డులు – 41.079 చ.కి.మీలు గా విభజించడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇకపై జీవీఎంసీ కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాలు ,సేవలు ఆయా జోనల్ కార్యాలయాల ద్వారా పొందవచ్చునని తెలిపారు

విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు. – జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 100 వినతులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరం లో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 100 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 06, మధురవాడ జోన్ కు 16, ఈస్ట్ జోన్ కు 15, వెస్ట్ జోన్ కు 07, నార్ట్ జోనుకు 06, సౌత్ జోన్ కు 12, పెందుర్తి జోన్ కు 07, అగనంపూడి జోన్ కు 02, గాజువాక జోన్ కు 07, అనకాపల్లి జోన్ కు 01, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 21 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 14, రెవెన్యూ విభాగమునకు 11, ప్రజారోగ్య విభాగమునకు 06, పట్టణ ప్రణాళిక విభాగమునకు 43, ఇంజినీరింగు విభాగమునకు 18, మొక్కల విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 05 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, సిసిపి ఏ.ప్రభాకర రావు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎమ్.దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, కార్యదర్శి బివి రమణ ,స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, సిపి, డిసీపీ లు, ఏసీపీ లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,బయాలజిస్ట్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?*

పున్నమి ప్రతినిధి: *కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?* *మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ దండెం రాంరెడ్డి మీడియా సమావేశంలో దండెం రాంరెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? అనేది ప్రజలకు అర్ధం కావడం లేదు అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉంది అన్నారు, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను తెచ్చి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపారు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ని జీహెచ్ఎంసీ లో కలపడం వలన ఆయా గ్రామాల ప్రజల మీద తీవ్ర టాక్స్ భారం పడుతుంది, అందువలన ఏం అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు, ఎల్బీనగర్ జోన్ లో ఉన్న పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ లను నాగోల్ సర్కిల్ లో కాకుండా పక్కనే ఆనుకొని ఉన్న హయాత్నగర్ సర్కిల్ లో ఈ డివిజన్ల ను కలపాలి అని అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల లోని ఓటర్ల వ్యత్యాసం, పెద్ద అంబర్ పేట్ డివిజన్ లో 55 వేలకు పైచిలుకు, కుంట్లూరు డివిజన్ లో 12 వేల పైచిలుకు ఓటరు వ్యత్యాసం ఉంది అన్నారు, అదేవిధంగా కుంట్లూరు రెవెన్యూ ఏ లేదు దానిని ఒక డివిజన్ గా చేశారు అన్నారు, కుంట్లూరు తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ గా చేయాలని తెలిపారు, ఈ విషయమై కమిషనర్ గారికి మెమోరాండం కూడా అందజేయడం జరిగింది అన్నారు, రంగారెడ్డి జిల్లా లోనే సీనియర్ శాసన సభ్యుడిని అని చెప్పుకునే మన ఎమ్మెల్యే కి ఈ మాత్రం అవగాహన లేదా అని ప్రశ్నించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న అన్ని డివిజన్ల లో లోపాలు సరిచేసి అన్ని డివిజన్లు సరిసమానంగా ఏర్పాటు చేయాలని అన్నారు, దీని మీద స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగా తేల్చుకుంటాం అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ అర్చన దామోదర్, తాజా మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేసారం బాలకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ పిల్లి నగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు. దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

E-పేపర్

*అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి

పున్నమి ప్రతినిధి: అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి* *గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి* *ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) బృందం* గ్రేటర్ హైదరాబాద్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీవోలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాలలో ప్రధాన పత్రికలలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు నలుగురికి అక్రిడిటేషన్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూరల్ మండలాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆవేదనలు దృష్టిలో ఉంచుకొని జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. *సానుకూలంగా స్పందించిన కమిషనర్* గ్రేటర్ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్య పై పౌర సంబంధాలు అండ్ సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వడం న్యాయ బద్ధమైనదని తెలిపారు. త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీని ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.