Sunday, 3 May 2026

Blog

విశాఖపట్నం

దువ్వాడ ప్లాట్ఫారం నెంబర్ వన్ దగ్గర వ్యక్తి ఆత్మహత్య

విశాఖ… గాజువాక… దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం -1 ట్రాక్ పై పెదగంట్యాడ ప్రాంతంకి చెందిన నీలాపు వెంకట రెడ్డి @సైనికుడు అనే వ్యక్తి ఆత్మహత్య… కదిలే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న మృతుడు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు… Uploaded Video:

తెలంగాణ

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్

పున్నమి జనవరి 03: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం,96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు,తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలసి ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి,శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి,స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్,ఈవో టి.శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి,తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే,జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి,ఆర్ కె సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

సిద్ధిపేట

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది

*సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* నంగునూరు మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపించడం జరిగింది 👉*అనంతరం సర్పంచ్ సానాదుల బాల పోషయ్య గారు* మాట్లాడారు సావిత్రిబాయి ఫూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, కవయిత్రి, ఆమె భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి బాలికల విద్య మరియు అణగారిన వర్గాల విద్యావ్యాప్తి కోసం పోరాడారు, 1848లో పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించి, కుల, లింగ అసమానతలను వ్యతిరేకించి మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. ఆమె సామాజిక అసమానతలపై కవితలు రాసి, సత్యశోధక్ సమాజ్‌లో కీలక పాత్ర పోషించారు, కరువు, ప్లేగు వంటి విపత్తులలో పేదలకు సేవ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు , రాగుల కృష్ణ, చంద్రమౌళి, అరే శీను, మాల మహానాడు అధ్యక్షుడు దాసరి రమేష్, బడే రాజయ్య , ఉల్లి మల్లయ్య, పులి రవి, దేవులపల్లి కనకయ్య, దాసరి పెంటయ్య, మల్లేశం, సాయి శ్యామ్, రాకేష్, అఖిల్, నర్సింలు, పవన్ , చందు ,రఘువరన్, సంతోష్, దాసరి మహేష్,పాల్గొనడం జరిగింది. Uploaded Video:

E-పేపర్

బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా సంగెం రాజు

పున్నమి ప్రతినిధి: బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా సంగెం రాజు ఇబ్రహీంపట్నం బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షునిగా యాచారం మండలానికి చెందిన నానక్ నగర్ గ్రామానికి చెందిన సంగెం రాజు నియమితులయ్యారు.శనివారం ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సంగెం రాజును ప్రకటించి ఆర్ .కృష్ణయ్య ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బీసీ సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీల హక్కు కోసం ఆర్.కృష్ణయ్య చేసే ప్రతి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. బీసీల ఐక్యత, బీసీ సమస్యల పరిష్కారం, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో నానక్ నగర్ సర్పంచ్ సంగెం చైతన్య, ప్రవీణ్ అభిలాష్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

వనిత (మహిళ)- కవిత – డాక్టర్ బద్రి పీర్ కుమార్

జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మహిళ’ పద అక్షరములలోని విశ్లేషణాత్మక భావన ఈ కవిత *వ* వయస్సు ఆధారంగా తన ఉనికిని ఉన్నతం చేసుకుంటూ… *ని* నిరంతరం తరంతరం కొనసాగిస్తూ… *త* తను లేనిదే జీవనం నిర్జీవం అని మానవజాతి తలచే దేవత వనిత. *మ* మనిషి పుట్టుకకు మనుగడకు మూలం *హి* హితోక్తుల భావజాలానికి బలం *ళ* కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం మహిళ

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో పాత నేరస్తులపై అదనపు ఎస్పీ తనిఖీలు!

కామారెడ్డి, 03జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పీ) ఐ.నర్సింహారెడ్డి శనివా రం రామారెడ్డి మండల పరిధిలోని పాత నేరస్తుల ను పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసు సిబ్బంది గైడేన్స్ తో హిస్టరీ షీట్లు, పెండింగ్ కేసులు, ప్రస్తుత కార్యకలాపాలు మొదలైనవి తప్ప కుండ తనిఖీ చేశారు. ఈ తనిఖీల ముఖ్య లక్ష్యం మండలంలో నేరాలను నివారించడం, పాత నేర స్తులను పర్యవేక్షణలో ఉంచడమేనని అధికారులు తెలిపారు.పాత నేరస్తులు ఏరకమైన కార్యకలాపా ల్లో భాగమవుతున్నారు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అనేవి వివరంగా తెలుసుకున్న అదనపు ఎస్పీ, స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రామారెడ్డి మండలం గ్రామీణ ప్రాంతం గా ఉండటంతో పాత నేరస్తుల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. ఇలాంటి తనిఖీలు గ్రామ ప్రజల్లో భయం తగ్గించి, భద్రతా భావనను పెంచుతాయని స్థానికులకు తెలిపారు.గ్రామ ప్రజల్లో ఆనందం.. భద్రతా చర్య లు మరింత పెరిగే అవకాశం ఈ తనిఖీలతో మం డలంలో ఇప్పటికే ఉన్న పోలీసు పెట్రాలింగ్, పర్య వేక్షణ మరింత బలపడుతుందని అధికారులు అంచనాలు,మండలంలో అన్నారం, కన్నాపూర్, పోసానిపేట వంటి గ్రామాల్లో ప్రజలు ఈ చర్యలకు స్వాగతం పలికారు. జిల్లా పోలీసు వ్యవస్థ గ్రామీణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని పోలీసులు చెపుతున్నారు.

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో ఘనంగా సన్మానం.

– పాలకులు అధికారులకు గౌరవం కామారెడ్డి, 03 జనవరి, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పాలకవర్గం సభ్యులు ఆమె కు హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఈ మహత్తరోహణ వేడుకల్లో మండల అధికారులకు అసాధారణ సత్కారం జరిగింది.వేడుకల సమ యంలో పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ,మన మండల అధికారుల ప్రజాసేవలకు గ్రామ పాలక వర్గం తరపున ఘన సన్మానం నిర్వహించామని అన్నారు. తహసీల్దార్ ఉమలత, ఎస్ఐ రాజశేఖర్, ఎంపీడీఓ నాగేశ్వరరావును శాలువాలతో, ఘనం గా సన్మానించామని అన్నారు.అధికారులు స్పంది స్తూ, ప్రజల మన్ననలు మాకు గొప్ప శక్తి. ఉన్నత శిఖరాలు అదిరోహించి, మహోన్నత జీవితం గడుపుతామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ సుమలత మాట్లాడుతూ, గ్రామీణ సంక్షేమంలో తమ కృషి ఫలితాలే ముఖ్యమని చెప్పారు. ఎస్ఐ రాజశేఖర్ పోలీసు సేవల్లో ప్రజల సహకారాన్ని ప్రశంసించారు.ఈ సన్మానం మండలంలో పాలకు లు-అధికారుల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించిం దని అన్నారు. గ్రామస్తులు సంతోషంగా పంచుకు న్నారు. ఇలాంటి ఘటనలు మా మండలాన్ని మరింత ముందుకు దూసుకెళ్తాయని అన్నారు. సావిత్రి బాయి పూలే ఆదర్శాలు, ప్రజాసేవలు ఈ వేడుకల్లో మరింత ప్రకాశింపజేశాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలంలోని బద్వేలు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య అధికారులు,ఎంపీడీవో జలజాక్షి, ఎమ్మార్వో రమాదేవి, పాల్గొన్నారు,అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి, భూ హక్కుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.

నిర్మల్

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 03: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం,96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు,తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో కలసి ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి,శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి,స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్,ఈవో టి.శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి,తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే,జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి,ఆర్ కె సాగర్ తదితరులు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కషాయం జెండాలతో మునిగి పోయిన ఉదయగిరి

ఉదయగిలో హిందూ సమ్మేళనం ఘనంగా జరుగుతోంది ఈ నేపధ్యంలో పట్టణ ప్రధాన పురవీధులను కాశాయి రంగు జెండాలతో నింపేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ స్థాపించి వందేళ్లు పూర్తియిన సందర్భంగా హిందూ సమ్మేళన సమితి ఆధ్యర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు అలాగే రుక్మిణి కళ్యాణం సైతం జరిపించనున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.