Sunday, 3 May 2026

Blog

E-పేపర్

తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహణ తాటిపర్తి గ్రామంలో నేడు మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు, సమాజ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలం రమేష్ ఝాన్సీ, ఉప్ప సర్పంచ్ ముప్పిడి రమేష్, ముప్పిడి మధుసూదన్ (సహాయ సమాచార పౌర సంబంధాల అధికారి, రంగారెడ్డి జిల్లా), వార్డు మెంబర్ ఏనుగొండ శివ, గ్రామ యువకులు తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, స్త్రీలకు చదువు అవసరం లేదన్న మూఢనమ్మకాలపై పోరాడి మహిళా సాధికారతకు దారి చూపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారని కొనియాడారు. విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని ఆమె జీవితం ఈ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

దశదినకర్మలో పాల్గొని నివాళులు అర్పించిన సెస్ డైరెక్టర్ సందు పట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు పొట్ల పెళ్లి కిషన్ గారి తండ్రి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు మాజీ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ షాడో శ్రీనివాస్ నామాపురం గ్రామ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ అధ్యక్షులు అవునూరి నవీన్ కె టి ఆర్ సేన మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ఏపీ హంస టేబుల్ క్యాలెండర్ ఘన ఆవిష్కరణ

పున్నమి ప్రతినిధి – నెల్లూరు 03.01.2026 నెల్లూరు, మినీ బైపాస్ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఏపీ హంస కోవూరు తాలూకా ప్రెసిడెంట్ సోలా ఉమా , తాలూకా సెక్రెటరీ షేక్ ఆసియా బేగం గార్లు మాట్లాడుతూ గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ, ఉద్యోగుల అభ్యున్నతికి సహకరిస్తున్నారు అని కొనియాడారు, వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం లకు యాప్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లి యాప్స్ సంఖ్య తగ్గించే విధంగా కృషి చేయాలని ఏఎన్ఎం లకు వెంటనే పదోన్నతులు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమానికి ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు , జిల్లా పబ్లిసిటి సెక్రటరీ మజాహర్ , కోవూరు తాలూకా అసోసియేట్ ప్రసిడెంట్ టి. రాఘవేంద్ర , పబ్లిసిటీ సెక్రటరీ ఎస్కే. షబీనా, ట్రెజరర్ ఈ.రమణమ్మ మరియు వైస్ ప్రసిడెంట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్ , జి.కామాక్షి ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.వేణు , మహిళా సెక్రటరీ సిహచ్.హైమవతి తో బాటుగా నెల్లూరు సిటీ ప్రసిడెంట్ సయ్యద్ .గౌస్ భాషా, సిటీ సెక్రటరీ బి. మంజరి తదితరులు టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు .

విశాఖపట్నం

జాతీయ రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా 04-01-2026న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. రహదారి మరియు భవనముల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, జీ.వి.ఎం.సి (GVMC), నేషనల్ హైవే విభాగం, ఏపీ ఎస్‌ఆర్‌టీసీ, రవాణా శాఖ, డీఎం & హెచ్‌వో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నేషనల్ హైవేలు మరియు ప్రధాన రహదారులపై రోడ్ ఇంజనీరింగ్ డిజైన్ మార్పులు, అవసరమైన ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, స్పష్టమైన రోడ్ మార్కింగ్స్, పాదాచారుల భద్రతకు హెచ్చరిక సూచికలు, వేగ పరిమితి బోర్డులు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రవాణా శాఖ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నేషనల్ హైవేల్లో ప్రయాణించే ఆటో రిక్షా డ్రైవర్లు, లెర్నింగ్ లైసెన్స్ దారులు మరియు ప్రజలకు రహదారి నియమాలు, వేగ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై PPT ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

యాదాద్రి భువనగిరి

శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో ముందుకు –ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03: సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం.శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

యాదాద్రి భువనగిరి

శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో ముందుకు –ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03 :సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం. శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

మహిళ విద్యకు బాటలు వేసి సమాజ సేవకు అంకితమైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే

ఈరోజు ముస్తాబాద్ మండలంలో నామాపురం గ్రామం చౌరస్తా ప్రాంగణం లో ముదిరాజు సంక్షేమ సంఘం ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె సేవను కొని ఆడారు రాజన్న సిరిసిల్ల జిల్లా బి సి డబ్ల్యూ అధ్యక్షులు దిశ బిక్షపతి మాట్లాడుతూ దేశంలో మహిళా విద్యకు బాటలు వేసిన భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలని మరియు సామాజిక సంఘసంస్కర్త అని భారతదేశంలో ఉన్న కుల వివక్షత లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి దేశంలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన మహానీయురాలను ఆమెను కొనియాడారు బాలికల విద్య సమాజ అభివృద్ధికి ముఖ్యమని నమ్మి ఎన్నో ఆటంకాలు అవమానాలు ఎదుర్కొని పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు వెలుగు అందించిన పుణ్యమూర్తి మహిళ సావిత్రిబాయి పూలే గారు మాట్లాడుతూ విద్య ద్వారా మాత్రమే సమానత్వం స్వేచ్ఛ ఆత్మగౌరవం సాధ్యమని ఆమె చూపిన మార్గమే నేటి తరానికి స్ఫూర్తి దాయకం ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మన అందరి బాధ్యత అంటూ వారి సేవల్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిమ్మల చంద్రం రాజుగారు దేవయ్య శ్రీనివాసు నామాపూర్ ఉప సర్పంచ్ తాడేపు కొమురయ్య ముదిరాజ్ సంక్షేమ సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులు పిట్ల విట్టలు గారు అధ్యక్షులు రాంగోపాల్ గారు పుల్లూరి రవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు

మహాదేవి (విభాగం-2)

ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి,మహాదేవుని గుడికి వెళ్లి మహాదేవునితో ఇలా చెప్పింది” ఓ మహాదేవ! ఎందుకు నా భర్తను నాకు దూరం చేశావు, నా కడుపులో ఉన్న నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా” అని మహేశ్వరి మహాదేవునితో చెప్పింది. అలా ఆరోజు అంతా గుడి దగ్గరే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు గుడికి వచ్చి,తనను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులకు మహేశ్వరి ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరి తన ప్రాణాలను కోల్పోయింది. మహేశ్వరి కి పుట్టిన పాపను తన తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉన్నది. ఆ పాపని ఈశ్వరమ్మ తన ఇంటికి తీసుకు వెళ్ళింది. కొన్ని రోజులకు ఆ పాపకి బారసాల చేసి నామకరణం చేశారు. ఆ పాపకు ‘మహాదేవి’ అనే పేరు పెట్టారు. మహేశ్వరి తన భర్త దేవా జ్ఞాపకంగా ఈ మహాదేవి జన్మించింది అని ఈశ్వరమ్మ భావిస్తుంది. మహాదేవికి అమ్మమ్మ అయ్యిన ఈశ్వరమ్మ మహాదేవికి ఎప్పుడు, ఎక్కడ ఏం కావాలన్నా కొని ఇచ్చేది. కానీ మహాదేవికి తల్లి, తండ్రి లేని లోటు మాత్రం తీర్చలేకపోయింది. కొన్ని రోజులకు మహాదేవి నిద్రలో “ఓం నమః శివాయ” అని తలుచుకుంటూ ఉండేది. ఇది తెలుసుకున్న వాళ్ళ అమ్మమ్మ, మహాదేవిని పూజారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ పూజారి ఈశ్వరమ్మ తో ఇలా చెప్పాడు” అమ్మ! నీ మనవరాలు శివునికి చాలా ఇష్టమైన భక్తురాలు, ప్రతిరోజు నువ్వు తనను శివుని గుడికి తీసుకు వెళ్ళు, అలాగే తన చేత అభిషేకము నైవేద్యము చేయించు, ఈ పనులు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో, చాలా నిష్టగా చేయించు” అని ఆ పూజారి ఈశ్వరమ్మ తో చెప్పాడు. అప్పటినుంచి ఈశ్వరమ్మ తన మనవరాలు మహాదేవతో రోజు శివునికి అభిషేకం, పూజలు చేయించేది.తన చేత నైవేద్యం కూడా చేయించేది. ఇలా మహాదేవి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మమ్మ చెప్పినది చేస్తూ వచ్చింది. అప్పటికి మహాదేవికి పదేళ్లు వచ్చాయి. అప్పటినుంచి తనకు తాను ఎవ్వరి సహాయం లేకుండా, రోజు శివుడు గుడికి వెళ్లి శివునికి పూజలు చేసే నైవేద్యం వండి తీసుకువెళ్లేది. ప్రతి సోమవారం శివుని గుడిలో శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలు చేసే ముందు రోజు ఆదివారం శివుని గుడిని శుభ్రం చేసి, పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసేది. అలా కొన్ని సంవత్సరాలు తర్వాత మహాదేవి తన చదువును పూర్తి చేసుకొని పెళ్లీడుకి వచ్చింది.

యాదాద్రి భువనగిరి

*ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం,* –ఎక్కడ అవసరం ఉంటే అక్కడే సర్పంచ్ గారి పాలన –* –ఇదే ప్రజలకు కావాల్సిన నిజమైన నాయకత్వం.*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03 :సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం. శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

రాంబిల్లి మండలం సెజ్ లో ఎస్విఎస్ కెమికల్స్ లో పేలుడు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సెజ్ లో ఎస్విఎస్ కెమికల్స్ లో పేలుడు పేలుతున్న నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ పీపాలు వరుసగా ఆయిల్ డ్రమ్ముల పేర్లు తొండడంతో కమ్మేసిన పొగ ఎగసిపడుతున్న మంటలు భారీగా విస్తరించిన పొగ Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.