Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రేమ పేరుతో మోసగించిన నిందితుడుకి రిమాండ్

ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిని జైలుకు పంపినట్లు ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు సీతారామపురం మండలానికి చెందిన యువతిని ఉదయగిరి మండలం బోడు బండ ఎస్సీ కాలనీ కీ చెందిన అఖిల్ ప్రేమ పేరుతో మోసం చేశాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు న్యాయాదికారి అంజయ్య నిందితుడుకి రిమాండ్ విధించారు అనంతరం ఆత్మకూర్ సబ్ జైల్కు తరలించారు.

చిత్తూరు

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం.

శ్మశాన వాటికను అద్భుతంగా పునరుదరిస్తాం…!)స్మశానo మరింత అభివృద్ధికి అక్కడే ఏర్పాటైన సమావేశాలు!!) విరివిరిగా విరాళాలు అందిస్తున్న గాండ్ల కులస్తులు స్మశానం..ఈ పదం వినగానే ఒక లాంటి నిర్లిప్తత…..ఏదో తెలియని భయం ఆవహిస్తుంది ఎవరికైనా ….. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా అటువైపుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించారు. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉండే స్మశానాలకు తప్పనిసరి పరిస్థితులో వెళ్లాల్సివస్తే…… చనిపోయిన వారు కైలాసానికో.. వైకుంఠానికో… వెళుతారో లేదో కాని దహన సంస్కారాలకు వెళ్ళిన వారు మాత్రం కాస్తా వణకడం ఖాయం. అంత్య క్రియలకు ఆరు గజాల స్థలం సంపాదించడం దగ్గరి నుంచి…..మృత దేహాన్ని ఖననం చేసేదాకా..కాటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్మశాన వైరాగ్యం…..అంటే ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందుకే అక్కడికి మహిళలని, పిల్లలని అనుమతించరు. నిజానికి చివరి మజిలీలు ఇంత భయంకరంగా వుండాలా? స్మశానం వల్లకాడులా…..కనీస సౌకర్యాల లేమితో స్మశానములు ఎందుకుండాలి? మన ఆప్తులను మురికి కూపంగా వున్న స్థలంలో ఖననం చేసే ఖర్మ మనకేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులుగా చెప్పాలనే… ఓ మంచి ఆలోచనలతో బృహత్తర ప్రణాళికలతో  పలమనేరు పట్టణ మందలి పాతపేట హిందూ స్మశాన వాటికగా వున్న స్థలంలో అత్యధ్బుతంగా అభివృద్ధి పరచాలనే పట్టణ పెద్దలు, ప్రధానoగా గాండ్ల కుల పెద్దలు నిర్ణయించి గత డిసెంబర్ నెలలో 14 వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ మూడు పర్యాయాలు స్మశాన వాటిక స్థలం లోనే ప్రత్యేక శ్రద్ధతో పట్టణ గాండ్ల కుల పెద్దలు చంద్ర అనే బాలకృష్ణ,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆద్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి ఒకటే.. చండాలుండేటి మరుభూమి ఒకటే.. అంటూ మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి చేరతాడో ? అన్నమయ్య తన కీర్తనలలో వినిపించారు. అయితే ఆ మరుభూమి అందమైన మొక్కలతో, పచ్చిక బయళ్లతో, రహదారులతో,చూడచక్కని కట్టడాలతో.. ఉంటే మన మనిషిని గౌరవంగా సాగనంపినట్టుగా ఉంటుందనే ఆలోచనలతో ఇటీవలి కాలంలో కొన్ని నగరాలు,పట్టణాలలో స్మశాన వాటికలు రూపుదిద్దుకుంటున్నాయి.అలాంటి కోవలోకి మార్చాలని వీరు భావిస్తున్నారు. *పట్టణ, గాండ్ల పెద్దల నిర్ణయం* పట్టణాల్లో స్మశానాలను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి స్మశాన వాటికలను పోలినట్లుగా ఉండాలని, ఒక ఎకరo పైగా విస్తీర్ణంలో గల స్మశాన వాటికను ఆదర్శంగా ఏర్పాటు చేయడంలో భాగంగా అందులో హరిచంద్రుని ఆలయం,అంతిమ సంస్కారం చేసే బంధువులకు ఓ బృందావనo లాంటి అనుభూతి కలిగించేలా మార్చి పుష్కలమైన నీటి సౌకర్యములతో రెండు రూముల నిర్మాణం,ఫ్రీజర్ బాక్స్,వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు తక్కువ ఖర్చుతో ప్రత్యేక వాహనం ఏర్పాటు వంటి సౌకర్యాలు అందించి అక్కడి నిర్వహణ కోసం అభివృద్ధి కమిటీని వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఇలా గత రెండు వారాలుగా స్మశాన వాటిక పునరుద్ధరణ పనులు కార్యరూపం దాల్చి వేగవంతంగా పారదర్శకతతో జరుగుతున్నాయి.ఇందుకోసం గాండ్ల కులస్తులు స్వచ్ఛందంగా దాతల రూపంలో ముందుకు వచ్చి ఆర్థికoగా ఆదుకుంటుండగా,కొన్ని నిర్మాణ పనులు దాతలే చేపడుతూ ఆనందిస్తున్నారు.మరింత మంది చందాలు ఇచ్చి ఆదుకోవాలని సంఘం పెద్దలు కోరారు. *సొంత ఇంటి పనులలా పర్యవేక్షణ* కాగా తమ సొంత ఇంటి నూతన నిర్మాణ పనులను చూస్తున్నట్లు నిత్యం స్మశాన వాటికలోనే కుర్చీలు వేసుకొని ఇక్కడి గాండ్ల కులస్తులు పర్యవేక్షణ చేయడం విశేషం. పెద్దలు చంద్ర,అమరేంద్ర బాబు, వ్యాపారవేత్త బాబుల ఆలోచనలకు అనుగుణంగా మునిసిపల్ కౌన్సిలర్ కోదండరామయ్య,ఏ.ఆర్.కుమార్, మూర్తి,టి.ప్రకాశ్ బాబు, కృష్ణమూర్తి,శ్రీధర్ బాబు, కేశవులు,జె.సి.రవి,ఆర్.కె.రమేష్ కుటుంబం,రాజేశ్, కె.వి.శ్రీనాథ్ తదితరులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.

చిత్తూరు

*ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు*

*ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అటవీ మరియు వైద్య అధికారులు* నూతన ఏడాది సందర్భంగా పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని పలమనేరు అటవీ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ మరియు పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా ఆదివారం కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చాలు, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఎమ్మెల్యేను కలసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎఫ్ఆర్వో నారాయణ తో పాటు ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు, ఎలిఫెంట్ ట్రాకర్స్, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిదంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతా రాణి, డైరెక్టర్ లు నాగరాజు, సుధాకర్ లతో పాటు వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు గుంటల కారణంగా అక్కంపేట వద్ద కారు ప్రమాదం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) అక్కంపేట–మితాత్మకూరు రోడ్డు వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంటల కారణంగా ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన చోటుచేసుకుంది. కారులో భార్యాభర్తలు, వారి పిల్లలు ప్రయాణిస్తున్నారు. వారు అలహాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారికి స్వల్ప గాయాలు కాగా, అక్కంపేట గ్రామ ప్రజలు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామ ప్రజలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమవుతుందని పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

యూరియా సమస్యను యాప్ తో కాదు రైతులకు అందిస్తూ పరిష్కరించాలి

ఈరోజు ముస్తాబాద్ బి ఆర్ ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబంధు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విప్లమవుతుందని ఆయన పేర్కొన్నారు యూరియా యాప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి రైతులను మోసం చేస్తుందని ప్రభుత్వం పైన విమర్శలు చేశారు గత వర్షాకాలంలో రైతులకు సకాలంలో యూరియా అందించక రైతులను అనేక కష్టనష్టాల గురి చేసిందని రైతులు వేసిన పంటకు సరైన సమయంలో యూరియా అంధక అధిక దిగుబడి రాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతులకు ఫోను వాడకం ఎలాగో తెలియదు దాని వలన ప్రభుత్వం ఏర్పడు చేసిన యాపు ద్వారా మరింత సమస్యలు వస్తున్నాయని వివరించారు యాప్ లో యూరియాను ఏ విధంగా బుక్ చేసుకోవాలో రైతులకి తెలియకపోవడం ద్వారా యూరియా సమస్య మరింత పెద్ద సమస్యగా మారిందని ఆయన వివరించారు యూరియా యాప్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులకు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిపక్షంలో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేయడానికి మేము సిద్ధం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఎత్తండి నరసింహారెడ్డి నూతన సర్పంచులు మా చిట్టి లచ్చయ్య చిగురు నరేష్ బొమ్మన ఆంజనేయులు కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షులు మేంగని మనోహర్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు ఎండి నవాజ్ చిలువేరి ప్రశాంత్ దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండ రామపురంలో మహా రుద్ర యాగం .

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కోదండ రామపురంలో మహా రుద్ర యాగం – ప్రముఖుల పాల్గొనడం మనుబోలు మండలంలోని కోదండ రామపురం గ్రామంలో ఘనంగా నిర్వహించిన మహా రుద్ర యాగంలో ప్రముఖ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. శివభక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు యాగ మహిమను వివరించి, గ్రామ ప్రజలందరికీ శాంతి, శుభం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మహా రుద్ర యాగం సందర్భంగా కోదండ రామపురం గ్రామం భక్తి పరవశంతో కళకళలాడింది.

చిత్తూరు

గంటావురు బీసీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో జ్వాలా దీపోత్సవం, ఉంజల్ సేవ

​పలమనేరు మున్సిపల్ పరిధిలోని గంటావురు బీసీ కాలనీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో జ్వాలా దీపోత్సవం, ఉంజల్ సేవ (ఊయల సేవ) మరియు అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.​శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణలో భక్తులు భక్తి శ్రద్ధలతో జ్వాలా దీపాన్ని వెలిగించారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ చేసి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉంజల్ సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీపాల వెలుగులో గంగమ్మ తల్లి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో ఉంచి ఉంజల్ సేవను నిర్వహించారు. భక్తులు మంగళ హారతులు పాడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మురుగన్ మాట్లాడుతూ…, కాలనీ ప్రజలందరి క్షేమం కోరి, గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమికి ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసిపి నేత శ్యామల ను కలిసిన వైసీపీ యువ నేత పీఎంకే

సీతారామపురం జనవరి(పున్నమి ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల రెడ్డి ని శనివారం హైదరాబాదులోని ఆమె నివాసంలో సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైసిపి నేత శ్యామల కు బొకే ఇచ్చి స్వీట్ బాక్స్ ను అందించారు. అనంతరం సీతారామపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్యామలను కోరినట్లు ఆయన తెలిపారు. రాబోయే 2029 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అహర్నిశలు పనిచేసి గ్రామస్థాయి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వైసిపి జెండా ఎగురవేసేలా పనిచేయాలని, ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని శ్యామల రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం మండల వైసిపి యువ నాయకుడు కప్ప సురేంద్ర రాజు,వెంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

– జాగృతి కామారెడ్డి అధ్యక్షురాలు బి.వసంత కామారెడ్డి, 03 జనవరి ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ ఆవరణ లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి జాగృతి సభ్యు ల ఆద్వార్యాంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షు రాలు బి.వసంత మాట్లాడుతూ,స్త్రీ విద్య,సామాజి క సమానత్వానికి అంకితం సావిత్రిబాయి అగ్ని వలె పోరాడిన మహనీయురాలు అని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె ధైర్యం, త్యాగం నేటి తరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.ఈ సందర్భం గా ఆమె సామాజిక సంస్కరణలు, మహిళా శిక్షణ పోరాటాల గురించి వివరించారు. జీవితం శాశ్వత ఆదర్శంగా నిలిచిందని నాయకులు అభిప్రాయ పడ్డారు. జాగృతి సంస్థ ఇలాంటి కార్యక్రమాలతో సామాజిక జాగృతిని పెంపొందిస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు అల్తాఫ్, జైనాబ్ బేగం, ఆఫ్రిన్ బేగం, మానస్, క్రిస్టి యన్ విభాగం అధ్యక్షుడు దానియే లు, మైపాల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.