Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు

ఉదయగిరి హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ నుంచి శివాలయం మీదగా టీటీడీ కళ్యాణ మండపం వరకు హిందూ సమ్మేళన శోభాయాత్ర నిర్వహించారు చిన్నారులు పెద్దలు యువకులు జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు మహిళల కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీచర్స్ కు సావిత్రి భాయి పూలే ఆదర్శం

ఉదయగిరి మండలంలోని కృష్ణం పల్లి జడ్పీ హై స్కూల్లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఆమె చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల మాల వేసి నివాళురూపించారు Hm షేక్ సత్తార్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి టీచర్ సావిత్రి భాయి పూలే అన్నారు టీచర్ల అందరికీ ఆమె ఆదర్శం ప్రయమని కొనియాడారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎనబై ఇళ్ళ నిర్మాణాలు లోపాలను తేల్చినా క్వాలిటీ కంట్రోల్ అధికారులు

ఉదయగిరి హౌసింగ్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు శనివారం హౌసింగ్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు గంగిరెడ్డి పల్లీ ప్రభుత్వ లే అవుట్లు గుత్తేదారుడు నిర్మించిన 141 ఇళ్ళల్లో 80 ఇళ్ళు నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తెలిచినట్లు ఎంపిడిఓ తెలిపారు గుత్తేదారుడు వారంలోగా 80 ఇళ్లకు సంబంధించిన నిర్మాణలు , నాణ్యత ప్రమాణాలు పాటించి సరి చేయాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ తెలుగు మహాసభల్లో డా పెరుగు రామకృష్ణ కు పురస్కారం

జనవరి (పున్నమి ప్రతినిధి) నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రం లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మూడు రోజులు జరుతున్నాయి.సభల్లో తొలి రోజు రెండవ సదస్సు తెలుగు అనువాద సాహిత్య సదస్సు కు అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షత వహించారు.భారతీయ ఇతిహాస సాహిత్యం అనుసృజన తోనే ఆరంభమైనదని, 78 ఏళ్ల స్వాతంత్ర్య అనంతరం కూడా మన గొప్ప సాహిత్యం ప్రపంచ భాషల్లో అనువదించు కోవడం లో మనం వెనకబడ్డామని, ప్రాంతీయ భాషలు గల ప్రభుత్వాలు అనువాద అకాడెమీ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు సాహిత్యం ఇతర భారతీయ భాషల్లో ఇంకా ప్రపంచ వ్యాప్తం కావడం కు అవకాశం ఉంటుందని అన్నారు. ఇటువంటి సభలు అటువంటి తీర్మానాలు చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలని కోరారు.అనంతరం డా పెరుగు అను వాద సాహిత్యంలో చేస్తున్న విశేష కృషిని ప్రశంసించి ఆంధ్ర సారస్వత పరిషత్ తరుపున సదస్సు సంచాలకులు పంతుల వెంకటేశ్వర రావు, ఇతర సాహితీ ప్రముఖులు కలిసి రామకృష్ణను ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం, పతకం, ప్రశంసాపత్రం లతో ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా పలువురు డా పెరుగు రామకృష్ణ ను అభినందించారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజా ముద్రతో పట్టా దారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన చెంచాల బాబు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాజా ముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నదని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పి, పెంచల బాబు యాదవ్ అన్నారు శనివారం ఆయన ఉదయగిరి మండలంలోని గుడి నర్వ గ్రామంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం రూపొందించదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ తెలుగు మహాసభలకు డా పెరుగు రామకృష్ణకు ఆహ్వానం

పున్నమి ప్రతినిధి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు లో జనవరి 3-5 వరకు జరిగే 3 వ ప్రపంచ తెలుగు సభలకు నెల్లూరు నుంచి అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆహ్వానం అందుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం 12.00 నుండి 1.00 వరకు జరిగే అనువాద సాహిత్య సదస్సుకు సభాధ్యక్షులుగా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి, గౌరవ అతిథి గా వంశీ రామరాజు వక్తలుగా వెన్నా వల్లభరావు, అంబికా అనంత్, డా తుర్లపాటి రాజేశ్వరి, కొంపెల్ల బాల సుబ్రమణ్యం శర్మ అనువాద సాహిత్య వివిధ అంశాలపై ప్రసంగిస్తారు . ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణను సారస్వత సేవా పురస్కారం కు ఆంధ్ర సారస్వత పరిషత్ ఎంపిక చేశారు..!

అమరావతి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సోమనాథ్ రాజీనామా ఆలోచన?

అమరావతి : (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతిక సలహాదారుగా నియమితులైన డా. ఎస్. శ్రీధర పణిక్కర్ సోమనాథ్ తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది నెలల క్రితం నియమితులైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు, కార్యాలయం కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్పేస్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన సోమనాథ్‌ను పట్టించుకోకపోవడం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కామారెడ్డి

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా వేడుకలు

– మద్దికుంట సర్పంచ్ తాండ్ర మనీషా.. కామారెడ్డి 3 జనవరి (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తాండ్ర మనీషా – రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయు లు, అంగన్వాడీ టీచర్లను ఘనంగా సత్కరించారు. సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యా కార్యక్రమాలకు చేసిన అమోఘ కృషిని కొనియాడుతూ, ఆమె ఆచరణలను గ్రామీణ మహిళలకు ఆదర్శంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో వార్డు సభ్యులు,పి.ఆర్.టి.యు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాలకిషన్, కృష్ణమోహన్, లక్ష్మణ్, తాండ్ర రామస్వామి, రాములు,వడ్ల కిష్ట య్య, గ్రామ కార్యదర్శి, డ్వాక్రా సంఘ మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వనపర్తి

సావిత్రిబాపూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయులు

*సావిత్రిబాపూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయులు* *పున్నమి ప్రతినిధి వనపర్తి* *జిల్లా తేదీ 3/01* /2026* *సావిత్రిబా పూలే జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడి మాడ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప మరియు ఉపాధ్యాయ బృందం పూలమాలతో ఆమె సేవలను కొనియాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులనుదేశించి మాట్లాడారు*

తెలంగాణ

ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేసిన: కలెక్టర్

నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ మున్సిపాలిటీ వార్డుల్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డ్ నెంబర్ 28 శ్రీకృష్ణ నగర్ లో స్థానికులతో ముఖాముఖి నిర్వహించి పారిశుధ్య, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. డ్రైన్ల శుభ్రత, చెత్త నిర్వాణపై, ఆదేశాలు జారీ చేశారు. అమృత2 క్రింద మోతికుంట బండ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.