Sunday, 3 May 2026

Blog

E-పేపర్

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య బోరబండ సమీపంలో ఒక యువతిని దారుణంగా హతమార్చిన యువకుడు

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య బోరబండ సమీపంలో ఒక యువతిని దారుణంగా హతమార్చిన యువకుడు గతంలో బంజారాహిల్స్ సమీపంలో ఉన్న ఒక పబ్‌లో ఇద్దరికి పరిచయం కాగా ఇటీవల ఊర్వశి బార్‌కు షిఫ్ట్ అయిన యువతి దీంతో తనను పట్టించుకోవడంలేదని కోపంలో, మాట్లాడదామని పిలిచి యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ సమస్యలకు డయల్ యువర్ ఎస్స్ఈ కార్యక్రమం

నెల్లూర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిస్కారానికి ప్రతి సోమవారం డయాల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తూనట్లు సూపర్డెంట్గ్ ఇంజనిర్ కె రాఘవేంద్ర,తెలిపారు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు నెo, 0861-2320427 నంబర్ కీ ఫోన్ చేసి నేరుగా తెలియజేయవచ్చు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చెప్పటినట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🏏 మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతిని, బొమ్మిరెడ్డి పర్వతీశ్వర్ రెడ్డి, ద్వితీయ బహుమతిని, మోపూరు ధనంజయ రెడ్డి, తృతీయ బహుమతిని మర్రి శశిధర్ రెడ్డి, లా సహకారంతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేస్తామని కార్యనిర్వాహకులు తెలిపారు.

నారాయణపేట

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం- కున్సి గ్రామంలో క్రికెట్ కిట్ పంపిణీ

నారాయణ పేట జిల్లా, కృష్ణ మండలం , కున్సి గ్రామంలో యువకులకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల ద్వారా యువత శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలని గ్రామ స్థాయి మండల, జిల్లా స్థాయిలో మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదగాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే నారాయణ, బి శరణ్ , ఎన్ శ్రీనివాసులు, ఎస్ నారాయణ, జి శరత్, కే మల్లేష్ ,పి రామచంద్ర, బి అశోక్, కే మహాదేవప్ప, ఈ రాజు, ఏ మహదేవ్, బి, వెంకటేష్, కె,సంజీవ్, ఈ కాసింగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రాహ్మశ్వేరంలో గ్రామoలో ఇంటిoటి క్యాన్సర్ సర్వే

దుత్తలూరు మండలం బ్రాహ్మశ్వేరంలో గ్రామoలో జరుగుతున్న ఇంటిoటి క్యాన్సర్ సర్వే కార్యకమాన్ని దుత్తలూరు PHC వైద్యాదికారి ఆయాజ్ అప్సర్ పరిశీలించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి స్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ షుగర్, బీపీ, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గర్భశాయ ముఖద్వారా క్యాన్సర్ ఉన్న అనుమానితులను గుర్తించి వారిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు పంపారు

అనకాపల్లి

ఘనంగా సంక్రాంతి సంబరాలు – ముగ్గుల పోటీలకు హోంమంత్రి అనిత పిలుపు..!

జనవరి 10, అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఉన్న హోంమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండవది రూ.15 వేలు, మూడవది రూ.10 వేలు అందజేయనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంక్రాంతి పండుగ సందర్బంగా క్రికెట్ పోటీలు ప్రారంభం

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మై దానంలో సంక్రాంతి పండుగ సందర్బంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం మాజీ ఎమ్మెల్యే చేంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రందాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువతను ప్రోత్సహిoచ్చే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అదునిక సాగుతోనే రైతులకు మేలు

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానని అందిపుచ్చుకొని రైతులు మెరుగైన లాభాలు సాదించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని పరిశీలించారు పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పని తిరిను అడిగి తెలుసుకున్నారు ఇలాoటి పద్ధతులను గ్రామంలోని ఇతర గ్రామలో వివరించాలని అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి

దొంగల భయం గ్రామీణ ప్రాంతాల్లో.. ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి వెంటనే చర్యలు !

కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం సంఘటన గ్రామ ప్రజల్లో భయాన్ని సృష్టించింది. ఈ కేసులో బాధితురాలి ఇంటికి ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి త్వర గా చేరుకొని వివరాలు సేకరించడం ప్రశంసలు అందుకుంది. స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా కానిస్టేబుల్‌తో పాటు గ్రామస్థుల సాంద్రతలో ఈ పరిశీలన జరిగింది.బాధిత ఇంటి ముందు ఏ.ఎస్. పి చైతన్య రెడ్డి బాధితురాలితో మాట్లాడుతూ, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామంలో ని ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఇలాంటి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోని దొంగతనానికి పాల్పడడం నీచమైన చర్యగా పరిగణించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల దొంగతన కేసులు పెరుగుతున్నాయి. ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపిన సమాచా రం ఆధారంగా, ఈ పరిశీలన ఆ కొత్త దర్యాప్తులకు దారితీస్తుందని అంచనా. బాధితురాలు, ఆమె కుటుంబం ఈ దొంగతనంలో ఎక్కడి వస్తువులు కోల్పోయారో వివరించారని సమాచారం. పోలీసు చర్యలు, గ్రామస్థుల స్పందన ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి దొంగలను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.గ్రామీణ ప్రాంతా ల్లో పెట్రోలింగ్‌ను పెంచి, భద్రతా చర్యలు తీసుకుం టామని పోలీసులు హామీ ఇచ్చారు.బాధిత కుటుం బానికి ఆర్థిక సహాయం, చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే గ్రామ పంచాయి తీలు, పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.ఈ దొంగతనం రామారెడ్డి మండలంలోని ఇతర గ్రామాల్లో భయాన్ని పెంచింది. గతంలో ఉప్పల్వాయి, మద్దికుంట వంటి ప్రాంతాల్లో ఇలాం టి కేసులు జరిగాయి. పోలీసులు ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తుతో నేరస్థులను పట్టుకుంటే ప్రజలు మరింత ధైర్యం చెందుతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి

ఇసన్నపల్లి గ్రామంలో అకాల మరణాలు

మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి కుటుంబాలకు సహాయం కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి అనారోగ్యంతో మరణించిన గ్రామస్తుడు ఎర్రబాబు కుటుంబానికి రూ.2,000నగదు,50 కేజీలబియ్యం కామారెడ్డి నీటితోట్టిలో పడి మరణించిన చిన్నారు డు బుద్ధ రణవీర్ కుమార్ కుటుంబానికి రూ.3,000, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ గ్రామంలోనే జరిగిన అకాల మరణాలకు సంతాపం వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబా ద్రి తన సొంత ఆర్థిక సహకారంతో కుటుంబాలను ఆదుకున్నారు.ఇసన్నపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల్లో దుర్భాగ్యకర ఘటనలు జరిగాయి. మొద ట, గ్రామానికి చెందిన ఎర్రబాబు అనారోగ్యంతో చనిపోవడం చాల బాదాకరం అన్నారు.అదే గ్రామా నికి చెందిన చిన్న పిల్లవాడు బుద్ధ రణవీర్ కుమార్ ఆడుకుంటూ కామారెడ్డి లో నీటితోట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది.ఈ సంఘటనలు గ్రామంలో భద్రతా చర్యల అవసరాన్ని తలెత్తించా యి. ముఖ్యంగా, నీటితోట్టిల పరిసరాల్లో రక్షణా చర్యలు, అనారో గ్యాలకు వైద్య సహాయం వంటి అంశాలపై గ్రామ ప్రజలు చర్చిస్తున్నారు. మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కష్టాల్లో పడితే సహాయం చేయడమే నా బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంశాల్లో సహకారం ముందుంటామని చెప్పారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.