Sunday, 3 May 2026

Blog

విశాఖపట్నం

గాజువాక ఏసీపీ వెంకట్రావుపై విజిలెన్స్ దర్యాప్తు ఆదేశాలు జీవీఎంసీ ఖజానాకు కోట్ల నష్టం… టౌన్ ప్లానింగ్‌లో తీవ్ర అవకతవకలు

విశాఖపట్నం గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కె.వెంకట్రావుపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టిన అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మెమో నెంబర్ 3098470/Vig-1/2026, తేదీ 08-01-2026తో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు, పీనాల్టీలు, అభివృద్ధి చార్జీలు వసూలు చేయకపోవడం వల్ల జీవీఎంసీ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. గాజువాక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్ల నిర్వహణ, బిల్డింగ్ ప్లాన్ల ఆమోదం, అనుమతుల మంజూరులో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదోవ పట్టించారా? విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం జరిగిందా? అన్న అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో దోషాలు నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.

విశాఖపట్నం

మంగలంపాలెం జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలనీలో జివిఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 88వ వార్డ్ మంగలంపాలెంలో జివిఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. స్థానిక వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకే కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగలంపాలెం వార్డులో క్రైస్తవ, ముస్లిం సోదరులకు వేరువేరుగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పిల్లలు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త అంగనవాడి కేంద్రం, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే రేషన్ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రసాదుల శ్రీనివాస్, కాలనీ టీడీపీ అధ్యక్షులు ముమ్మడివరపు రాము, స్థానిక నాయకులు బాబా, రాజు, శ్రీను తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. Uploaded Video:

కామారెడ్డి

ఘనంగా అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : దక్షిణ కాశి కాలభైరవ ఆలయ సన్నిదిలో అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం రామారెడ్డి – ఇసనపల్లి గ్రామ శివారుల్లో వెలి సిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ కాలభైరవ స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అద్భుతంగా నిర్వహించారు. భక్తుల ఉల్లాసంతో, శ్రీ కాలభైరవ స్వామి ఆశీస్సులతో కూడిన ఈ కార్యక్రమం గ్రామవాసుల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం వద్ద గడిపిన బాల్య జ్ఞాపకాలు, ఆలయ చరిత్ర అనంతరం ప్రధాన అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రసంగించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, ఈ ఆలయం నా బాల్యంలోనే ప్రత్యేక స్థానాన్ని పొందింది. గ్రామ శివారుల్లో స్వయంభూగా వెల్లివచ్చిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి స్థానం అని తెలిపారు. ఆలయ పూర్వ విశేషాలను వివరిస్తూ, పదవులు శాశ్వతం కావు. ధర్మకర్తల మండలి సభ్యులు సేవనే బాధ్యతగా తీసుకుని పనిచేయాలి. ఆధ్యా త్మిక చింతనతో ఉండి, పూర్వజన్మ సుకృతంగా సేవా భాగ్యాన్ని పొందాలని సూచించారు. ఆయన మాటలు భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నూతన చైర్మన్ చింతల శంకర్ సంకల్పం నూతన చైర్మన్ చింతల శంకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడుతూ, ఈ పదవి నాకు వరించిన గొప్ప అవకాశం. దీన్ని దుర్వినియోగం చేయకుం డా, సేవనే లక్ష్యంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సంకల్పం తెలిపారు. గ్రామస్తుల నుంచి మార్గదర్శకత్వం, భక్తుల నుంచి మద్దతును పొందు తానని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ సౌక ర్యాలు, దేశ స్థాయి ఆకాంక్షలు ఆలయ ఈవో ప్రభు మాట్లాడుతూ, ఆలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలకు తక్షణమే నిధులు మంజూరు చేసి, భక్తులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ ప్రసంగంలో, దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న ఈ శ్రీ కాలభైరవ స్వామి ఆలయా నికి దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని కల్పించాలి. ఇక్కడి భక్తి సాంప్రదాయాలు అందరినీ ఆకర్షిస్తా యి అని అభినందించారు.ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని పలువురు వ్యక్తం చేశారు ఈ మహోత్సవంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తు లు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. కల్చరల్ టీo విజయభేరి…………

తరుణీ తరంగాలు… విజయవాడ వారు జనవరి 7.8….2026 న నిర్వహించిన పోటీలలో…. ఏక పాత్రాభినయం…. మొదటి బహుమతి జానపద గీతం…… రెండవ బహుమతి జానపద నృత్యం…… రెండవ బహుమతి జాతీయ గీతం….మూడవ బహుమతిని గెలుపొందారు..ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ VV SUBRAMANYA కుమార్ గారు కల్చరల్ విద్యార్థులను….. కో ఆర్డినేటర్ శ్రీమతి రత్నశ్రీ ని అభినందించారు.

E-పేపర్

రేషన్ మాఫియా అక్రమ దందా : దొండపూడిలో బట్టబయలైన తూకంలో మోసం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలోని రేషన్ దుకాణంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులను పక్కదారి పట్టిస్తూ, తూకంలో కోత విధిస్తున్న వైనాన్ని ఒక సామాన్య పౌరుడు ధైర్యంగా నిలదీయడంతో ఈ ఉదంతం బయటపడింది. ఘటన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం.. దొండపూడి రేషన్ దుకాణ నిర్వాహకుడు మస్తాన్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడి తన లైసెన్సును రద్దు చేయించుకున్నారు. అయితే, ఉన్నతాధికారుల అండదండలతో తిరిగి పర్మిషన్ పొంది, యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపారని పలువురు ఆరోపించారు. వృద్ధులు, అమాయక ప్రజలకు అందాల్సిన పంచదార, బియ్యాన్ని తక్కువగా ఇస్తూ, మిగిలిన సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారుల మౌనంపై విమర్శలు స్థానిక రెవిన్యూ కార్యాలయ అధికారులకు భారీగా లంచాలు ఆశ జూపి, మస్తాన్ తన అక్రమ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకంలో మోసాన్ని పసిగట్టి ప్రశ్నించిన సామాన్యుడికి నిర్వాహకుడు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో లైసెన్స్ రద్దయిన వ్యక్తికి తిరిగి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను సరఫరా చేస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది డీలర్లు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. గతంలో తప్పు చేసి శిక్ష అనుభవించిన వారే మళ్లీ అదే స్థానంలో కూర్చోవడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలు తూకాల్లో జరిగే మోసాలను గుర్తించలేకపోవడం వీరికి వరంగా మారుతోంది. *గ్రామస్థుల డిమాండ్*…..జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దొండపూడి రేషన్ దుకాణంపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకుడి లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయాలని, అతనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుపేదల నోటి కాడ కూడును కొల్లగొడుతున్న ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు END Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాలి బాలు టోర్నమెంట్ పోటీలు ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు

ఉదయగిరి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వాలి బాల్ టోర్నమెంట్ పోటీలను రాష్ట్ర టీడీపీ మైనారిటీ నాయకుడు రియాజ్, ఉపాధ్యాయులు మాన్యూర్ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు పోటీల్లో విజేతగా నిలిచిన వారికీ మొదటి బహుమతి 30,000లు రెండో బహుమతి 20,000 మూడో బహుమతి 10,000 లు అందజేస్తాన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420 రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా.. మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు కోదండరాం కూడా మంచోడు అనుకున్నాము.. వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు బల్మూరి వెంకట్ పెద్ద దొంగ.. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు Uploaded Video:

E-పేపర్

తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ప్రభాస్ సినిమా రాజాసాబ్‌కు చివరి వరకూ వేధింపులు

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ప్రభాస్ సినిమా రాజాసాబ్‌కు చివరి వరకూ వేధింపులు చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాకు రెండు రోజుల ముందే అనుమతి మన శంకర వరప్రసాద్ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హౌసింగ్ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం* *లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు*

పున్నమి ప్రతినిధి నెల్లూరు రూరల్ రాఘవేంద్ర *హౌసింగ్ అధికారుల్లో తీవ్ర నిర్లక్ష్యం* *లబ్ధిదారుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు* *ఇళ్లను నాసిరకంగా కట్టడమే కాదు సిమెంట్, స్టీలు కూడా అమ్మేసుకున్నారు* *వైసీపీ పాలనలో వెలుగులోకి వచ్చిన తాత్కాలిక కాంట్రాక్టర్లు భారీగా దోచుకున్నారు* *బ్లాక్ లిస్టులో పెడతామని భయపెట్టేందుకు వారేమి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కాదు* *హౌసింగ్ శాఖలో జరిగిన అవినీతిపై లోతైన విచారణ జరగాల్సిందే* నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షలో శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ , ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్ల ,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు జిల్లా అధికారులు *ఈ సమావేశంలో బీద మాట్లాడుతూ* *నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ మారింది, విచ్చలవిడిగా వ్యవహరించి లబ్ధిదారుల జీవితాలను చిద్రం చేస్తోంది.* *శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి ఆన్ లైన్ లో హౌసింగ్ నిర్మాణాల గురించి పరిశీలించాము . ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది.* *బేస్ మెంట్ లెవెల్ ఇళ్ళకు శ్లాబులు వేసినట్టు కాంట్రాక్టర్లు చూపించారు. ఇళ్ళు ఇవ్వకుండానే బిల్లులు తీసుకున్నారు, థర్డ్ పార్టీ విచారణ లేకపోవడం వీరికి అనుకూలంగా మారింది.* *స్టీల్, సిమెంట్ ను కాంట్రాక్టర్లు ముందుగానే డ్రా చేసి అమ్మేశారు. ఇళ్లు మంజూరు అయిన విషయం కనీసం లబ్ధిదారులకు సైతం తెలీకపోవడం శోచనీయం.* *బ్లాక్ లిస్ట్ లో పెట్టి భయపెట్టేందుకు, సరి చేసేందుకు పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏమీ రెగ్యులర్ కాదు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా నమోదు కానివారు.* *ప్రభుత్వం ఏదైనా అధికారులలో మాత్రం నిర్లక్ష్యం తీవ్రస్థాయిలో ఉంది. దీనికితోడు చర్యలు తీసుకోకపోవడం వీరికి అలుసుగా మారింది.* *ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ.ఈ., డీ.ఈ. లు మారరు. సంబంధిత సమస్యలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్యుద్దాలు జరుగుతుంటే వీరు చోద్యం చూస్తుంటారు.* *నాణ్యత ఒక్కటే పరీక్షించి అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదు, మెటీరియల్(స్టీల్, సిమెంట్), ఫిజికల్ బెనిఫిషియర్ (లబ్ధిదారులు) వివరాలను సైతం పరిశీలించాలి.* *అల్లూరు మండలం హౌసింగ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై స్వయంగా విచారించి పి.డి. గారికి నేనే స్వయంగా ఫిర్యాదు చేశాను. లబ్ధిదారుల వివరాలతో పాటు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను.* *హౌసింగ్ నిర్మాణం, మంజూరైన ఇళ్ళు, లబ్ధిదారుల వివరాలపై విచారణ కమిటీ వేశానని పి.డి. గారు చెప్పారు… కానీ నేటికి వాటి గురించి రిపోర్ట్ నాకు అందలేదు.* *ఆన్ లైన్ లో ఇళ్లు మంజూరు అయ్యాయని చూపిస్తున్న కారణంగా ఏ పేదవాడు భవిష్యత్తులో ఇల్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, కేంద్రం ఎంత నిధులు ఇచ్చినా, కలెక్టర్లు కనికరించినా పేదవాడికి న్యాయం జరగదు.* *హౌసింగ్ నిర్మాణాలలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యం పై, లబ్ధిదారులకు జరగాల్సిన న్యాయం పట్ల కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి లోతైన విచారణ చేపట్టాలి. లేనిపక్షంలో పేదవాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోతాయి.

E-పేపర్

ఎస్సీ మహిళ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అభ్యంతరం కుల ధ్రువీకరణ పత్రాలపై తీవ్ర ఆరోపణలు

పున్నమి ప్రతినిధి : రిజర్వేషన్ ఉన్నట్టా లేనట్టా? మేడిపల్లి సర్పంచ్ ఎన్నిక న్యాయస్థానం మెట్లెక్కింది ఎస్సీ మహిళ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అభ్యంతరం కుల ధ్రువీకరణ పత్రాలపై తీవ్ర ఆరోపణలు పున్నమి న్యూస్ యాచారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారి న్యాయస్థానం వరకు చేరింది. మేడిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించగా, ముచ్చర్ల సుగుణ సుమారు 300 ఓట్ల మెజారిటీతో ఆలంపల్లి లావణ్యపై విజయం సాధించారు. అయితే విజయం సాధించిన సుగుణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో, ఎస్సీకి కేటాయించిన స్థానంలో ఆమె ఎన్నిక ఎలా చెల్లుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మేరకు ఆలంపల్లి లావణ్య భర్త నరసింహ యాచారం మండల తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన సమయంలోనే తాము అభ్యంతరం తెలిపినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం మారుతుందా? అని ప్రశ్నిం చారు. రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని ఆరోపించారు. సుగుణ కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసేటప్పుడు కుమారుడి కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేశారని, అదే ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేసినట్లు తహసీల్దార్ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే స్వలాభం కోసమే కుమారుడి కుల ధ్రువీకరణను ఉ పయోగించారని ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని, అఫిడవిట్లను సరిగా పరిశీలించలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తక్షణమే విచారణ జరిపి, అక్రమంగా గెలిచిన సర్పంచ్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో ఆలంపల్లి లావణ్యను అధికారికంగా ప్రకటించాలని కోరారు. అప్పటివరకు గ్రామపంచాయతీలో ఎలాంటి అధికారిక వ్యవహారాలు జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టరు కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.