Sunday, 3 May 2026

Blog

E-పేపర్

వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో కొన్నసాగుతున్న నిరసన మూడో రోజు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. వర్కింగ్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో కొన్నసాగుతున్న నిరసన మూడో రోజు చేరుకున్నాయి జర్నలిస్టులు న్యాయ సమ్మతమైన డిమాండ్లకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. END

E-పేపర్

ప్రవాసుల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ శక్తి.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ప్రవాస భారతీయుల దినోత్సవం *(జనవరి 9)* సందర్భంగా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు *ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.* ప్రవాస భారతీయులు కేవలం విదేశాల్లో నివసించే వారు మాత్రమే కాక, *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అని ఆయన అన్నారు.* పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పురోగతికి బలమైన పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. *ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ నేడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు.* అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోందని మంత్రి గారు అన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపదతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను *గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం కీలకమని పేర్కొన్నారు.* పెట్టుబడులతో పాటు, *పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెస్టినేషన్ ప్రమోషన్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా ప్రవాసులు రాష్ట్రానికి విలువైన భాగస్వాములుగా నిలవగలరని తెలిపారు.* హోటల్స్, రిసార్ట్స్, ఈకో, మెడికల్ & వెల్నెస్ టూరిజం రంగాల్లో వారి భాగస్వామ్యం ఉపాధి సృష్టికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. *“మీ మూలాలు ఇక్కడే – మీ భాగస్వామ్యం కూడా ఇక్కడే”* అనే భావనతో ప్రవాసులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి–పర్యాటకం – ఉపాధి రంగాల్లో ప్రభుత్వం–ప్రవాసులు కలిసి ఒక బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుందామని మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు “గౌ.కందుల దుర్గేష్” గారి కార్యాలయం (నిడదవోలు) END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈ నెల 12 తేదీన మాజీ ఉప రాష్ట్ర పతి నెల్లూరుకు రాక

నెల్లూరు జిల్లాలో మాజీ ఉప రాష్ట్రపతి ఎ, వెంకయ్య నాయుడు పర్యటన ఖారరైoది ఈ నెల 12 తేదీ నుంచి 17 తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమన్ శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు జనవరి 12న స్వర్ల భారత్ ట్రస్ట్కు వస్తారు 17 వ తేదీ మధ్యాహ్నం 12:30 నిమిషాలకు స్వర్ణ భారత్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేటి నుంచి సంక్రాంతి సెలవులు

జిల్లా లోని అన్ని యాజమాన్యం పాఠశాలలు, జూనియర్ కళాశాలకు నేటి నుంచి ఈ నెల 18 తేదీ వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డిఈ ఓ డా ఆర్ బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు సెలవులలో తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వం నిబంధనలు మేరకు సదర్ పాఠశాల పై చర్యలు చే పా డ తమని స్పష్టం చేశారు అన్ని యాజమాన్యం పాఠశాలలు, కళాశాల సిబ్బంది సహకరించగలరన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వర్షాలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేటి నుంచి అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిషే అవకాశం ఉందని ప్రజల సహాయార్థం కలెక్టరె ట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హిమన్ శుక్ల ఓక ప్రకటనలో తెలిపారు నేటి నుంచి 12 తేదీ వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు అత్యావసరం లో సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్స్ 0861-2331261,7995576699,1077 కు సంప్రదించాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగి మంటల్లో ప్లాస్టిక్ లు వేస్తే ప్రమాదకరం

టైర్స్, ప్లాస్టిక్ వస్తువులతో బోగి మంటలలో వేయవద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయాబ్ అప్సర్ తెలిపారు ఆయన మాట్లాడుతూ రానున్న బోగి, సంక్రాంతి పండుగలలో భాగంగా టైర్స్, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, టీబీ, చర్మ, కంటి జలుబు వచ్చే ప్రమాదం ఉందన్నారు సంప్రదాయబద్దంగా పండుగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన ఏంఈ ఓ

ఉదయగిరి మండలం గడ్డంవారి పల్లి హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏం ఈ ఓ తోట శ్రీనివాసులు తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తo చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనాన్ని అందించాలన్నారు పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు సెంట్రల్ జైలును తనిఖీ చేసిన హోం మంత్రులు అనిత

వెంకటాచలం మండలం చెముడు గుంట లోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు జైల్లోని వసతులను పరిశీలించారు ఖైదిలతో మాట్లాడారు వారు ఎదురుకొంటున్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేల్లి రామ కృష్ణ రెడ్డీ రిమాండ్ ఖైదీ గా ఉన్నారు వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ ఆవుతున్న నేపథ్యంలో ఆమె అకస్మికంగా తనిఖీలు ప్రాథన్యతను సంతరించుకుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పుల్లాయ పల్లి స్కూల్లో సంక్రాంతి సంబరాలు

ఉదయగిరి మండలం పుల్లాయ పల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు ఇంచార్జి హె చ్ ఎం ప్రశాంతి కుమారి అధ్యర్యoలో ముగ్గులు పోటీలు నిర్వహించారు విద్యార్థులుకు సంక్రాంతి విశిష్టతను వివరించారు అనంతరం కోలాటం నిర్వహించి వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులు అందజేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీడీఓ చెంచమ్మ అధ్యర్యలో వీధి దీపాలు ఏర్పాటు

దుత్తలూరు మండలం ఎంపీడీఓ చెంచమ్మ ఆదేశాల మేరకు అన్ని గ్రామల్లో వీధి దీపాలు ఏర్పాటుకు శుక్రవారం చర్యలు చేపట్టారు ఆయా పంచాయతీలా కార్యదర్శిలకు ఈ మేరకు ఆదేశాల జారీ చేశారు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తకుప్పలు తొలగించాలని సూచించారు పారిశుధ్యం మెరుగు పరిచి బ్లీచింగ్ చల్లి మౌలీక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.