Sunday, 3 May 2026

Blog

కామారెడ్డి

మోషంపూర్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ నిధులు ఎక్కడా!!

కట్ట మట్టి పోసినా నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రజలు ఇబ్బంది! నిధులపై విచారణ చేస్తారా లేదా?!? కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పథకం కింద బాగా మట్టిపోసినా, కట్టలో చీలికల వల్ల నీళ్లు ఉదకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న తుమ్ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి, బతుక మ్మ మెట్లు కట్టలేదు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. నీటిపారుదల అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజేం దర్ ఎక్స్ లిఖించిన లేఖలో, “చెరువు కట్టపై మట్టి పోసారు కానీ, చిన్నతూమ్ వద్ద నీళ్లు ఉదగొచ్చి పోతున్నాయి. బతుకమ్మ మెట్లు కూడా కట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిధులు ఎప్పుడు, ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలాయి? వివరాలు రాతపూర్వకంగా ఇవ్వండి” అంటూ మనవి చేశారు. లేఖలో మోషం పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులు బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కట్టలో చీలికలు, మెట్లు లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు వృథా అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన చెరువు ఇలా వదిలిపెట్టడం దారుణం. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి.అంటు నీటిపారుదల అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల అధికా రి కామారెడ్డి ఆఫీసుకు లేఖ ఇచ్చిన రాజేందర్, పూర్తి వివరాలు రాకముందు పనులు పూర్తి చేయా లని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామస్తులు పెద్ద కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మిషన్ కాకతీయ నిధులు సరి గ్గా ఉపయోగించాలని, ప్రజల ఆవేదనలు తీర్చాల ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం

సంక్రాంతి వేళ ఖమ్మం రోడ్లు నిర్మానుషం.. బస్టాండ్‌లో మాత్రం ప్రయాణికుల కిటకిట

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఖమ్మం నగరం నిర్మానుషంగా మారింది. పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లడం, విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సోమవారం నుంచే ఖమ్మంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌తో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. అయితే నగర రహదారులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతోంది. పండుగ ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సమయంలో తెలంగాణలో ముందుగా ఖాళీ అయ్యే నగరంగా హైదరాబాద్ ఉంటే, రెండవ స్థానంలో ఖమ్మం నిలుస్తుందని చెప్పుకోవచ్చు.

ఖమ్మం

దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: – ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్, బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రి పూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. పోలీసుల సూచనలు.. 👉 ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. 👉 ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్ట కూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. 👉 విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. 👉 బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. 👉 ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 👉 రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూ ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. 👉 అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. 👉 మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట 4 దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. 👉 స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది 👉 చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. 👉 ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. 👉 ప్రతీ ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలి: గల్లా సత్య నారాయణ

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు శాశ్వత ఆదర్శమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆలోచనలు, సందేశాలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఖమ్మం

ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి*

ఖమ్మం జనవరి (పున్నమి జిల్లా స్థాఫర్) ఖమ్మం నగరంలో బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువతకు వివేకానందుని ఆదర్శాలు మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో అల్లిక అంజయ్య యాదవ్, జ్యోతుల యుగంధర్ నాయుడు, డీకొండ శ్యాం, గజ్జల శ్రీనివాస్, పాశం శ్రీనివాస్ రెడ్డీ, దాసరి మధు, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సీఐ), ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

కామారెడ్డి

ఇసన్నపల్లి గ్రామంలో ఇంత ఘోరమా??!!

కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : ఇసన్నపల్లి గ్రామంలో ఇంత ఘోరమా? అని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం ఇస్న్నపల్లి గ్రామం 19 పంచాయతీల్లో ఒకటి. గ్రామపంచాయి తీ ఇమెయి ల్: gpissannapally@gmail.com, ఫోన్: 9347995602. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్ ఉన్నా ప్రాథమిక సదుపాయాలు లోపం, డ్రైనేజీ దుస్థితి రోడ్ల ఇరువైపులా డ్రైనేజీలు ఉన్నా మురికి పీదకలు కారణంగా నీరు రోడ్లపైనే ప్రవహి స్తోంది. మహిళలు బట్టలు ఉతకడం, మంచి నీరు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.వాటర్ పైప్ లీకేజీలు కాలనీల్లో వాటర్ పైప్లైన్‌లకు క్యాపులు లేకుండా ఘోరంగా నీరు ప్రవహిస్తోంది.ఈ లీకేజీలు డ్రైనేజీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. తాగునీరు వృథా అవుతూ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సిబ్బంది వైఖరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ లీకేజీలను అదుపు చేయలేకపోతు న్నారు.ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లే దు. “ఏం చేస్తున్నారు?” అని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు.అధికారులపై ఒత్తిడి మండలాధికారి నాగేశ్వరావు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మధన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్ళాలని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనం ప్రచురితమైన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశపడుతు న్నారు. గ్రామస్తులు తక్షణ పరిష్కారాలు పైప్లైన్‌ల కు క్యాపులు వేసి మరమ్మత్తులు చేయాలి. డ్రైనేజీ లు శుభ్రం చేసి రోడ్లు పట్టించాలి. గ్రామ సభలో చర్చించి బడ్జెట్ కేటాయించాలి. అధికారులు వెంట నే స్పందించాలి. జిల్లా అధికారులు వెంటనే ఇస్స న్నపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కది ద్దాలని వేడుకుంటున్నారు.

E-పేపర్

నూతన సంవత్సరం సందర్బంగా…. నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా

నూతన సంవత్సరం సందర్బంగా…. నవ తెలంగాణ క్యాలెండర్ నీ విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా మరియు మేడిపల్లి గ్రామ శాఖ కార్యదర్శులు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు…

కామారెడ్డి

రామారెడ్డి బస్టాండ్‌ లో వివేకానంద ఆణిముత్యాలు.. జయంతి వేడుకలు

యువతకు స్ఫూర్తి పంచిన జయంతి వేడుకలు రామారెడ్డి, 12 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది.. ఆత్మవిశ్వాసం విజయపథానికి దారి తీస్తుంది! స్వామి వివేకానందుని అమర వాక్యాలతో మార్గదర్శకత్వం చేసిన జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గల బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి బిందువులు చల్లారని పలువు రు వక్తలు ప్రసంగించారు.వివేకానంద విగ్రహం ముందు జరిగిన కార్యక్రమంలో వక్తలు యుగాచా ర్యుని ఆణిముత్యాలను ఒక్కొక్కటిగా వివరిం చారు.ప్రయత్నం చేసి ఓడిపోకూడదు. ప్రయత్నం చేయకుండా ఓడిపోకూడదు అని, కెరటం నాకు ఆదర్శం.. పడినా లేచి నిలబడటానికి అని ప్రతి వాక్యం యువతను కుంగదీసింది.జాతి వ్యక్తిత్వం పరిరక్షణ: ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది.. ప్రతి దేశానికీ, జాతికీ ఉంటుంది. దాన్ని కాపాడుకో వాలి, లేకపోతే జాతి నశిస్తుందని వక్తలు హెచ్చరిం చారు.ఏ పని అల్పం కాదు: ఇష్టమైన పని వస్తే మూర్ఖుడు కూడా సాధిస్తాడు. అన్ని పనులను తనకు నచ్చేలా మలచుకునేవాడే తెలివివాడని చెప్పారు. ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు: దేవునిపై నమ్మకం కాదు, ఆత్మవిశ్వాసమే నిజమైన భక్తి అని వివేకానందుడు బోధించాడని గుర్తు చేశారు.పదిమంది యువకులు చాలు పదిమంది యువకుల్ని ఇస్తే దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అనే మాటలు యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించా యి.శ్రమించేవాడిని ఓటమి భయపడుతుంది. నిరంతర శ్రమతో చీకటిని తరిమితం చేసినట్టు ఓటమిని జయించాలని పిలుపునిచ్చారు. విశ్వాస మే బలం, బలహీనత మరణం. వెంటనే ప్రారంభిం చి క్రమక్రమంగా అభివృద్ధి సాధించాలని, అపజ యాలతో నిరుత్సాహపడకుండా వేయి సార్లు ప్రయత్నించాలని వక్తలు సూచించారు. మహిళలు, పురుషుల ఘనకార్యాలకు ఆత్మవిశ్వాసమే మూల శక్తని కొనియాడారు.వివేకానందుని అమితవీర్యం 162 సంవత్సరాల క్రితం ఈ పుణ్యభూమిపై జన్మిం చిన యుగపురుషుడు పాశ్చాత్యులకు హిందూ ధర్మ వైశిష్ట్యం, ‘వసుధైక కుటుంబం’ భావనను తెలియజేసినవాడు. ఒక పాశ్చాత్య స్త్రీకి “నన్ను దత్తత తీసుకో.. నీ కోరిక తీరుతుంది” అని, క్రైస్తవ సోదరికి “నీవు నిజమైన హిందువుగా, ముస్లింగా లేదా క్రైస్తవుడిగా జీవించు.. మతమార్పిడికి రాలే దు” అని సమాధానం ఇచ్చిన మహనీయుడు.ఈ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని వక్తలు అన్నారు. స్థానికులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగుతామని సంకల్పం తెలిపారు.

నిర్మల్

అట్టహాసంగా సాగుతున్న మీడియా క్రికెట్ టోర్నీ

పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 12: ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతోంది. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ ఉప సర్పంచ్ సుభాష్ టాస్ ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.అదే విధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు పట్టణాలకు చెందిన క్రికెట్ జట్లు సైతం పాల్గొంటూ గట్టి పోటీనిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో క్రికెట్ పోటీలు విద్యార్థులు, యువకులకు కనువిందు చేస్తున్నాయి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ప్రతిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. క్రీడాకారులు సైతం ఎంతో ఉత్సాహంగా తమలోని క్రీడా నైపుణ్యాన్ని క్రికెట్ టోర్నీలో ప్రదర్శిస్తూ ఆహా అనిపిస్తున్నారు. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధిక సంఖ్యలో క్రికెట్ జట్లు టోర్నీలో భాగస్వాములు అయ్యాయి. క్రికెట్ టోర్ని క్రీడా పండుగను తలపిస్తుంది. వారం రోజులపాటు జరిగే క్రీడా సంబరాలు విద్యార్థులు- యువకులు-స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సెలవుల్లో మరిన్ని టోర్నీలను నిర్వహించి గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వేదికగా మార్చాలని స్థానికులు ఆకాంక్షించారు. నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ నాయకులు తాటేవర్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్,మదన్ పటేల్, గంగాధర్,మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుండి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరిన ఊర్మిళ ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్లు బదిలీ చేసిన ఊర్మిళ ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.