Sunday, 3 May 2026

Blog

విశాఖపట్నం

గాజువాక టిడిపి కార్యాలయంలో హిందూ శక్తి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

విశాఖ గాజువాక జనవరి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన హిందూ శక్తి న్యూస్–2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హిందూ శక్తి న్యూస్ ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక అంశాలు విస్తృతంగా వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, బాధ్యతాయుతమైన జర్నలిజంతో సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, హిందూ శక్తి న్యూస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్

స్లీప్ అప్నియాను అర్థం చేసుకోవడం: వృద్ధులపై ఒక ప్రధాన అధ్యయనం నుండి అంతర్దృష్టులు

1/12/2026న నవీకరించబడింది వృద్ధులలో స్లీప్ అప్నియా ప్రభావం అధ్యయనం యొక్క అవలోకనం ఒట్టావా హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 45 నుండి 85 సంవత్సరాల వయస్సు గల 30,000 కంటే ఎక్కువ మంది వృద్ధులతో విస్తృతమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధన నిద్రలో శ్వాసలో అంతరాయాలతో కూడిన సాధారణ నిద్ర రుగ్మత అయిన స్లీప్ అప్నియా యొక్క ప్రాబల్యం మరియు చిక్కులను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. కీలక ఫలితాలు అధ్యయన జనాభా: 30,000 కంటే ఎక్కువ మంది పాల్గొనేవారు, ప్రధానంగా వృద్ధులు, సగటున మూడు సంవత్సరాల కాలంలో పర్యవేక్షించబడ్డారు. స్లీప్ అప్నియా వ్యాప్తి: పాల్గొనేవారిలో దాదాపు 7,500 మంది స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని నిర్ధారించారు, ఇది వృద్ధాప్య జనాభాలో దాని గణనీయమైన ఉనికిని హైలైట్ చేస్తుంది. స్లీప్ అప్నియాను అర్థం చేసుకోవడం స్లీప్ అప్నియా సాధారణ నిద్ర విధానాలను ప్రభావితం చేస్తుంది, ఇది విచ్ఛిన్నమైన నిద్ర మరియు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ రుగ్మత తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది: హృదయ సంబంధ సమస్యలు: అధిక రక్తపోటు మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. జ్ఞాన క్షీణత: తగినంత నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా పనితీరులో లోపాలు. పగటిపూట అలసట: రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసే అధిక పగటిపూట నిద్రపోవడం. పరిశోధన యొక్క ప్రాముఖ్యత వృద్ధులలో నిద్ర రుగ్మతలకు సంబంధించిన అవగాహన మరియు జోక్య వ్యూహాల యొక్క అత్యవసర అవసరాన్ని ఈ మైలురాయి అధ్యయనం నొక్కి చెబుతుంది. స్లీప్ అప్నియాను పరిష్కరించడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలు మరియు జీవన నాణ్యతకు దారితీస్తుంది. ముగింపు స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వృద్ధులలో గణనీయమైన సంఖ్యలో ఉన్నందున, మెరుగైన స్క్రీనింగ్ మరియు చికిత్స ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న పరిశోధన చాలా కీలకం. 45-85 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు స్లీప్ అప్నియాతో సంబంధం ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి నిద్ర ఆరోగ్యాన్ని పర్యవేక్షించడాన్ని పరిగణించాలి.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు , విజేతలకు ముఖ్యఅతిధి గా హాజరైన మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సంక్రాంతి పండుగ సంబురాలను పురస్కరించుకుని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన ఆడబిడ్డలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ తమ ఇంటి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ రైతన్న ఇంట పంట చేరే సందర్భంలో ఆనందాన్ని తీసుకొస్తుందని, అందుకే పల్లెల్లో ఈ పండుగను అందరూ సంతోషంగా ఘనంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆడబిడ్డలు వేసిన ముగ్గుల్లో విభిన్న పద్ధతులు, సంస్కృతులు, ఆచారాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు శ్రేయస్కరమైన సందేశాలు ప్రతిబింబించేలా కళాత్మకంగా ఆకట్టుకున్నాయని అన్నారు. ఆ ముగ్గులను చూస్తే ఆడబిడ్డల శక్తి, సృజనాత్మకత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, ఆదినారాయణ గారు, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గారు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వైరా లో విలేకరుల సమావేశం లో మాట్లాడిన బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు వైరా లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ గ్రామీణ ముఖచిత్రం మారబోతోందని * ఉపాధి హామీ ఇక 125 రోజులు * కాంగ్రెస్ కుట్రలపై ‘కాషాయ’ కన్నెర్ర: అబద్ధాలను పాతరేస్తాం.. అభివృద్ధిని పరిగెత్తిస్తాం * రైతన్నకు భరోసా.. కూలీకి దిశానిర్దేశం. * మోదీ సర్కార్ సంచలన చట్టం ‘విబి జి రామ్ జి’ * గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట.. పంచాయతీలే ఇక సుప్రీం అని నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, గ్రామీణ పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్): విబి జి రామ్ జి అధినియమ్, 2025’ చట్టం విప్లవాత్మకమైనదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్): విబి జి రామ్ జి అధినియమ్, 2025’పై మాట్లాడారు. దశాబ్దాలుగా ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, అన్నదాతకు, కూలీకి ఇబ్బంది లేకుండా రూపొందించిన ఈ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు . ప్రతిపక్షాల ఆరోపణలను ఎండగట్టారు. గ్రామాల్లో గందరగోళం సృష్టించి, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన దుయ్యబట్టారు . ఉపాధి దినాలు పెంపు.. ఆలస్యం అయితే పరిహారం* గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేవలం 100 రోజుల పని దినాలు మాత్రమే ఉండేవని, కానీ తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టం ద్వారా ఇకపై పేదలకు ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి గ్యారంటీ లభిస్తుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు . ఇది కేవలం పేరు మార్పు కాదని, గ్రామీణుల తలరాతను మార్చే చట్టమని ఆయన అభివర్ణించారు. పని అడిగిన నిర్ణీత సమయంలోగా ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భత్యం ఇవ్వడమే కాకుండా, ఒకవేళ వేతనాలు చెల్లించడంలో జాప్యం జరిగితే అదనపు పరిహారం కూడా చెల్లించేలా చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచామని ఆయన వెల్లడించారు . పేదవాడి కష్టానికి తగిన ప్రతిఫలం సకాలంలో అందాలన్నదే మోదీ గారి సంకల్పమని ఆయన గుర్తు చేశారు. *ఢిల్లీ పెత్తనం లేదు.. పంచాయతీలదే అధికారం* కొత్త చట్టం వస్తే పథకాలన్నీ ఢిల్లీ నుంచే నిర్ణయిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా నిజం లేదని నెల్లూరి కోటేశ్వరరావు మండిపడ్డారు. గ్రామాల్లో ఏ పని చేయాలి, నిధులు ఎలా ఖర్చు చేయాలనేది ఇకపై గ్రామ సభలు, గ్రామ పంచాయతీలే నిర్ణయిస్తాయని ఆయన తేల్చిచెప్పారు . కేంద్రం పెత్తనం ఏమాత్రం ఉండదని, కుటుంబాల నమోదు నుంచి జాబ్ కార్డుల జారీ వరకు, పనుల ఎంపిక నుంచి అమలు వరకు సర్వాధికారాలు గ్రామ పంచాయతీలకే కట్టబెట్టామని తెలిపారు . ఈ చట్టం కింద మంజూరయ్యే పనుల్లో కనీసం 50 శాతం పనులను నేరుగా గ్రామ పంచాయతీల ద్వారానే అమలు చేస్తారని, దీనివల్ల స్థానిక అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు సమకూరుతాయని ఆయన వివరించారు . *రైతుకు మేలు చేసేలా ’60 రోజుల విరామం’* వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. విత్తనాలు వేసేటప్పుడు, నాట్లు, కోతల సమయంలో వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో రైతులకు అండగా ఉండేందుకు ఏడాదిలో 60 రోజుల పాటు ఈ పథకం పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించామని తెలిపారు . దీనివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగదని, అటు రైతుకు, ఇటు కూలీకి ఉభయతారకంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు . *మహిళా సాధికారత.. పారదర్శకతకు పెద్దపీట* కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా, గ్రామీణ మహిళల నైపుణ్యాభివృద్ధికి ఈ చట్టం పెద్దపీట వేస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల కోసం షెడ్ల నిర్మాణం, సంతల ఏర్పాటు, నైపుణ్య కేంద్రాల స్థాపన వంటి పనులు చేపట్టి, మహిళలు గ్రామంలోనే గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు . అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ హాజరు, జిఐఎస్ ఆధారిత ధృవీకరణ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ప్రతి పనికి సోషల్ ఆడిట్ తప్పనిసరి చేశామని అన్నారు . ఈ పథకానికి వెన్నెముకగా నిలిచే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచామని, తద్వారా వారికి సకాలంలో గౌరవ వేతనం అందుతుందని హామీ ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలుమానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు, ప్రతి గ్రామానికి వెళ్లి ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు . ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు , నల్గొండ జిల్లా ఇంచార్జ్ సన్నీ ఉదయ ప్రతాప్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేష్ సీనియర్ నాయకులు,మందడపు సుబ్బారావు ,మనుబోలు వెంకటకృష్ణ సైదేశ్వర రావు ,మేకల నాగేందర్ ,ఆర్ వి ఎస్ యాదవ్ ,బోయల వెంకట్ ,చిన్ని కృష్ణ కళ్యాణ్ ,వరదరాజు , వెంకి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాలనీకి రోడ్డు మార్గం కోసం గిరిజనుల నిరసన.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గిరిజన కాలనీవాసులు రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. జగనన్న కాలనీలో 460 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనప్పటికీ సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వర్షాకాలంలో అంబులెన్స్, గ్యాస్, తాగునీటి వాహనాలు రాలేని పరిస్థితి ఉందన్నారు. నిరసనను గమనించిన సాగునీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్లు కాలనీవాసులను రమాదేవి వద్దకు తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హామీ ఇచ్చారు.

ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భోగి సంక్రాతి, కనుమ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీజేపీ శ్రేణులకి భోగి, సంక్రాతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.. మీ గల్లా సత్య నారాయణ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. ఖమ్మం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇరుసుమండలో బ్లోఔట్ నియంత్రణ! కంట్రోల్ టీమ్‌కు ఘన సత్కారం

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఇటీవల సంభవించిన బ్లోఔట్‌ను అతి తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నియంత్రించిన కంట్రోల్ టీమ్‌ను దుశ్శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించి, బ్లోఔట్ ప్రివెంటర్ (బీఓపీ)ను వేగంగా అమర్చి వెల్‌లోని ప్రమాదకర పరిస్థితిని పూర్తిగా నియంత్రించడం ద్వారా కంట్రోల్ టీమ్ తమ నైపుణ్యాన్ని నిరూపించింది. ఈ ఘటన వల్ల స్థానిక ప్రజలకు ఏర్పడిన ఆందోళన తొలగి, గ్రామంలో భద్రతా వాతావరణం నెలకొంది. ప్రజా భద్రతకు కట్టుబడి పనిచేసిన టీమ్ సేవలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసించారు.

ఖమ్మం

ధనియాకుల ఆధ్వర్యంలో 53వ డివిజన్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ శ్రీమతి శ్రీ లత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు డివిజన్‌లోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం

ధనియాకుల ఆధ్వర్యంలో 53వ డివిజన్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ శ్రీమతి శ్రీ లత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు డివిజన్‌లోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

LHMS యాప్ ను ప్రజల సద్విని యోగం చేసుకోOడి

సంక్రాంతి పండుగకు ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని నెల్లూరు ఎస్పీ డా, అజిత వెజండ్ల కోరారు ఊర్లకు వెళ్లే ప్రతీ ఒక్కరు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్ ను వాడాలని సూచించారు రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచమన్నారు మైనర్లు వాహనాలు నడపకుండ చూడాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు సంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు స్పష్టం చేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.