Saturday, 2 May 2026

Blog

తూర్పు గోదావరి

10th లో 70% నుంచి 80% మార్కులు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్తు “

తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి)జనవరి 27: కొవ్వూరులోని పి.ఎం.ఎం.ఎం (PMMMM) పాఠశాలలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు జెండాను ఆవిష్కరించారు. ​అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువు ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. “పదో తరగతి అనేది కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు” అని ఆయన పేర్కొన్నారు. ​ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పాస్ మార్కులు సరిపోవని, కనీసం70% నుండి 80% మార్కులు సాధిస్తేనే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సమయాన్ని వృధా చేయకుండా, చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో చైర్ పర్సన్ భావన రత్నకుమారి. టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, దాన రామకృష్ణ, అర్జీల్లి రామకృష్ణ , పోట్రూ మురళి, బేతిన నారాయణ,వేమగిరి వెంకట్రావు మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. Uploaded Video:

E-పేపర్

ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*

*ఆదిబట్ల సర్కిల్ గ్రామం కొంగరకలాన్ డివిజన్(54) ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* పున్నమి న్యూస్ ప్రతినిధి: 26 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : *ప్రధానోపాధ్యాయులు B.రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది* *భారత రాజ్యాంగం ఆమోదించబడినది 1949 నవంబర్ 26* *అమలోకి వచ్చింది 1950 జనవరి 26* *ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్.బాబాసాహెబ్* *అంబేద్కర్ రాజ్యాంగని రచించారు* *భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు లిఖిత రాజ్యాంగాలలో ఒకటి 448 అధికరణలు 12 షెడ్యూల్స్ ఉన్నాయి సామజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం స్వాభ్రమతం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలని చదివి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగం అమలోకి వచ్చిన తర్వాతే ఈ దేశంలో మనుషులుగా గుర్తింపబడ్డాం* *చదువుతో పాటు విద్యార్థులు విద్యార్థినిలకు ఆటల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి బాహుమానాలు ఇవ్వడం జరిగింది* *ఈ యొక్క కార్యక్రమం లో* *అమ్మ ఆదర్శ పాఠశాల* *చైర్మన్ సునీత రెడ్డి* *మాజీ వార్డు సభ్యులు కాకి.రవీందర్ ముదిరాజ్* *ముద్దం శంకర్ గౌడ్* *శివాజీ* *బంగరిగళ్ళ మహేందర్ ఇన్ చార్జీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ* *ఉపాధ్యాయుల బృందం విద్యార్థి విద్యార్థునులు గ్రామ యువతి యువకులు పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు*

E-పేపర్

జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్ ఉప సర్పంచ్ నుకం రాజు

* *జాతీయ జెండా ను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* *ఉప-సర్పంచ్* *నుకం రాజు** * ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* పున్నమి న్యూస్ ప్రతినిధి: 26 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం *ఆరుట్ల గ్రామంలో గణతంత్ర దినోత్సవం* సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలలో మరియు యువజన సంఘాల సభ్యులు పలు కాలనీలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన *జాతీయ జెండా* ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని *జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్* ఉప-సర్పంచ్ *నుకం రాజు * వార్డ్ సభ్యులు పంది శేఖర్, కొండిగారి శ్రావణ్, అనంగళ్ల జగన్నాథం, మంకు మమత – వినోద్, మంద మాధవి – మోహన్ రెడ్డి, *పునం రాము*, రావుల జంగయ్య, మానిపాటి భాను ప్రసాద్, మాడ్గుల బాలమణి -కృష్ణ గౌడ్, మొర్రి పద్మ – ఐలయ్య, M.D ఇమ్రాన్, లాలగారి మనమ్మ, సాతిరి సత్యం , ఈ సందర్భంగా నూతన పాలకవర్గం గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు లొ ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

దుత్తలూరు Date 26.1.2026 దుత్తలూరు మండలం సిద్ధార్థ స్కూల్‌ వారి ఆధ్వర్యంలో మిన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు ​నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, సిద్ధార్థ స్కూల్‌లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో దుత్తలూరు సెంటర్ మరియు స్కూల్ ప్రాంగణం మారుమోగిపోయింది. భారీ జాతీయపతాకం ప్రదర్శన అందరిని ఆకర్శించింది. ఈ కార్యక్రమం లొ మండలం తహసీల్దార్ గారు స్కూల్ కరెస్పాండంట్ శంకరరెడ్డి గారు స్కూల్ అధ్యాపకులు, మండలం అధికారులు పాల్గొన్నారు.

కడప

జోరుగా మద్యం అమ్మకాలు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం మాంస విక్రయాలు చేయకూడదని చట్టాలు చెబుతున్నాయి కానీ అవేవీ పట్టనట్లు మద్యము మరియు మాంస విక్రయాలు యదేచ్చగా కొనసాగాయి ప్రొద్దుటూరు లోని పలు బ్రాందీ షాపులు మద్యం విక్రయాలను చేశారు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు ఈ అధికారుల తీరుపై ప్రజలు వాపోతున్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు జెండా ఎగర వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

దుత్తలూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా తహసీల్దార్ నాగరాజు మన జాతీయ జెండా ఎగర వేసారు, ఆనంతరం,77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తహసీల్దార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం సృష్టించాడు జనవరి 26న మనకు పూర్తి స్వతంత్రం వచ్చినప్పటికీ మనదేశంలో కుల మత భేదాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని ఆనాడు మన దేశానికి త్యాగం చేసిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటున్నాం కనుక మన దేశంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నతమైన చదువుల్లో అభ్యసించి మనం అందరం కూడా వారి అడుగు జాడల్లో నడవాలని చదువుతున్న చిన్నారులు ఉన్నతమైన స్థానంలో ఉండాలని 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు సిద్ధార్థ స్కూల్ కరస్పాండెంట్ శంకర్, చిన్నారులు, టీడీపీ కార్యకర్తలు, తహసీల్దార్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్థాఫర్) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రాదోడ్, పోతుల వీర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 53వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ప్రతినిధి అన్నం శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, పిల్లల మర్రి వెంకట్, అల్లిక అంజయ్యలతో పాటు రెండవ పట్టణ బాధ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాస్థాయి రిపబ్లిక్ డే అవార్డు అందుకున్న గురువా రెడ్డికి మనుబోలు నుంచి అభినందనలు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వేడుకల్లో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గురువా రెడ్డి గారు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వకారణమని పొన్నూరు అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మనుబోలు సాగునీటి సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న పొన్నూరు అశోక్ మాట్లాడుతూ, గురువా రెడ్డి గారి సేవలు జిల్లాకు ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఈ అవార్డు మరింత సేవాభావంతో పనిచేయడానికి ప్రోత్సాహం కలిగిస్తుందని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo లో 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి, స్కూల్ చైర్మన్

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామంలోని ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తురకపల్లి స్కూల్లోని హెచ్ఎం సంధ్యారాణి, దత్తాత్రేయ, దుత్తలూరు మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, స్కూల్ చైర్మన్ పోల్ అంకిరెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి సింహాద్రి మరియు పోలు అంకి రెడ్డి వారు మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది 1950 జనవరి 26న భారతదేశ సార్వభౌమ రాజ్యాంగం ప్రకటించింది ఈ రోజున మన భారతదేశ స్వతంత్ర పొందిన తర్వాత మన దేశాన్ని ఒక గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకుంది మన దేశ స్వతంత్ర సమరయోధులను, మన దేశం స్వాతంత్ర తెచ్చిన వీరులను, మన దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నాం అని వారు మాట్లాడారు

ఆంధ్రప్రదేశ్

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కళాశాలలో పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం అసువులు బాసిన నేతల గురించి స్మరించుకోవడం జరిగింది వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవడం జరిగింది Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.