Saturday, 2 May 2026

Blog

వనపర్తి

ఘనపూర్ బాలికల ప్రార్థన సమయాన్ని పరిశీలి పరిశీలించిన జిల్లా టీం సభ్యులు

*బాలికల ఉన్నత పాఠశాల ఘన్పూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై న జిల్లా తనిఖీ టీం సభ్యులు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల ఘనపూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై పరిశీలించారు ప్రార్థన సమయంలో విద్యార్థులు క్రమశిక్షణగా వివిధ ఎక్సర్సైజులు, సూక్తులు, నేటి ప్రశ్న, ప్రతిజ్ఞ ,మంచి మాట తదితర విషయాలను చాలా చక్కగా వివరించారని టీం సభ్యులు శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మునావర్ సుల్తానా, ఫిజికల్ డైరెక్టర్ జి .ఇందిర, ఉపాధ్యాయ బృందం మరియు టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్, వేణుగోపాల్ రెడ్డి, అక్బర్, లక్ష్మీదేవి, రవి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు*

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ సరళతరం చేయాలని రిసోర్స్ పర్సన్ పిలుపు

*డిజిటల్ విద్య ద్వారానే హిందీ సరళతరం చేయాలని ఉపాధ్యాయులకు సూచన* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా ఘనపూర్ బాలికలు జిల్లా తనిఖీ విభాగం, వనపర్తి హిందీ తొమ్మిదో తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు, డిజిటల్ బోధన పద్ధతులను ఉపయోగిస్తే హిందీ విద్యార్థులకు సులభంగా సరళతరంగా అర్ధమవుతుందని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ సరళతరం చేయాలని రిసోర్స్ పర్సన్ పిలుపు

*డిజిటల్ విద్య ద్వారానే హిందీ సరళతరం చేయాలని ఉపాధ్యాయులకు సూచన* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా ఘనపూర్ బాలికలు జిల్లా తనిఖీ విభాగం, వనపర్తి హిందీ తొమ్మిదో తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు, డిజిటల్ బోధన పద్ధతులను ఉపయోగిస్తే హిందీ విద్యార్థులకు సులభంగా సరళతరంగా అర్ధమవుతుందని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

విశాఖపట్నం

🔴 థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఆవిష్కరణ దినోత్సవం – ఎలక్ట్రీషియన్ డే గా వేడుకలు

విశాఖపట్నం: జనవరి (పున్నమి ప్రతినిధి) నేటి ఆధునిక జీవనశైలికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన రోజు నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రీషియన్ డే ను ఘనంగా జరుపుకుంటున్నారు. విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న ఎలక్ట్రీషియన్లకు గౌరవం తెలుపుతూ ఈ దినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 1879లో థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించడం ద్వారా ప్రపంచానికే వెలుగు చూపించారు. ఆయన ఆవిష్కరణ మానవ జీవితాన్ని సంపూర్ణంగా మార్చింది. నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అది బాటలు వేసిన చారిత్రక ఘట్టంగా నిలిచింది. విశాఖపట్నంలో కూడా ఈ సందర్భంగా పలు చోట్ల ఎలక్ట్రీషియన్లను సన్మానిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యుత్ సరఫరా, మరమ్మత్తులు, ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్ళు శ్రమించే ఎలక్ట్రీషియన్ల సేవలను పలువురు ప్రశంసించారు. విద్యుత్ రంగంలో వారి పాత్ర అమూల్యమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు ఎలక్ట్రీషియన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికతను అవలంబిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వెలుగులతో నింపిన ఎడిసన్ ఆవిష్కరణకు నివాళిగా – నేడు ఎలక్ట్రీషియన్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సచివాలయంలో వైభవంగా గణతంత్ర దినోత్సవం

​నందిపాడు (దుత్తలూరు మండలం): నందిపాడు గ్రామ సచివాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించబడ్డాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి, భారతావని కీర్తిని చాటుతూ నాయకులు, అధికారులు మరియు విద్యార్థులు సెల్యూట్ చేశారు. ​కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు: ​ఈ వేడుకకు గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు హాజరై శోభను చేకూర్చారు:ఈ కార్యక్రమం లొ ​ఉండేలా నాగమ్మ గారు: రెడ్లదిన్నె సర్పంచ్ ​రవీంద్ర బాబు గారు: మాజీ ఎంపీపీ ​మండవ మధు గారు: సొసైటీ ప్రెసిడెంట్ ​గ్రామ కార్యదర్శి: సచివాలయ పాలనా అధికారి ​సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులు: అందరూ కలిసి ఈ వేడుకను విజయవంతం చేశారు

రాజన్న సిరిసిల్ల

నామ పూర్ గ్రామంలో తాడేపు అనిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ కుటుంబ శ్రేణులు

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/ జనవరి ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సేన ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ గారు హాజరై అనిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, మైనార్టీ సెల్ అధ్యక్షులు వకీల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బాలచంద్రం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సురేష్, కేటీఆర్ సేన జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ సురోజుల నరేంద్ర చారి, కేటీఆర్ సేన ఉపాధ్యక్షులు గుణాల రాజు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు శివరాత్రి రాజు, భూస శ్రీశైలం, నిమ్మ విజయ్, మెరుగు పవన్, షేక్ షఫీ, తప్పెట రాజబాబు, జాలగం రాజలింగం, గుగ్గిల బన్నీ, జంగిటి మల్లేశం, శేఖర్ తదితరులు పాల్గొని తాడేపు అనిల్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అనిల్ గారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

“కె ఎస్ జవహర్ 60 వ పుట్టినరోజు వేడుకలు 60కేజీ ల కేకు “

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ 60 వ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరులోని ఆయన నివాస ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ కు చెందిన చైర్మన్లు ,డైరెక్టర్లు నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై జవహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్లపూడి మండలానికి చెందిన జిల్లా తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ మరియు సిద్ధన రాధాకృష్ణ ఆధ్వర్యంలో 60వ జన్మదిన వేడుక గుర్తుగా 60 కేజీల భారీ కేక్ ను ఏర్పాటు చేసి జవహర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో జవహర్ ఎమ్మెల్యే , మంత్రిగా మరియు పార్లమెంటు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రతి ఏటా ఇదే తరహాలో భారీ కేకును ఏర్పాటు చేసేవారు ఈ భారీ కేక్ ను నాయకులు మరియు అభిమానులు సమక్షంలో జవహర్ తో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జవహర్ ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

గవర్నర్ తేనెటి విందులో మురళీమోహన్ రాజు

అమరావతి జనవరి (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదిత్యంతో విజయవాడ లోని లోక్ భవన్ నందు సోమవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువతకు ఉపయోగపడే ఎన్నో స్ఫూర్తి దయాకమైన సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, యువ రచయిత కె.మురళీమోహన్ రాజు గవర్నర్ తేనేటి విందులో పాల్గొన్నారు. ఈసందర్భంగా మురళీమోహన్ రాజును పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

పోలీసులపై అసభ్యపదాలు… మద్యమత్తులో ఇద్దరు అరెస్ట్!

కామారెడ్డి, 26 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : పోలీసులపై అసభ్యపదాలు… ఇద్దరు మద్య మత్తులో అరెస్ట్!రిమాండ్‌కు పంపారు. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పోలీస్ పరిధి లో భారీ ఘటన చోటుచేసుకుందని రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్ వెల్లడించారు. పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌పై మద్యం మత్తులో ఇద్దరు రగిలే వాళ్లు అసభ్య పదాలతో దూషించి, విధులకు ఆటంకం కలిగించారు. వెంటనే కేసు చేసీ దర్యాప్తు చేసి కోర్టు జడ్జి ముందు నిలబెట్టి వాళ్లను బందీఖానాలో దించేశారు పోలీసులు 23-24 జనవరి 2026 రాత్రి ఇసన్నపల్లి గ్రామంలో పోలీసులు పేట్రోలింగ్ చేస్తుంటే… మద్యం మత్తులో మసూరి అనిల్ కుమార్, భూపల్లి రాజు అనే ఇద్దరు గ్రామ స్తులు దిట్టించి, అసభ్య పదజాలంతో దూషించా రు. విధులు చేయకుండా తోసివేసే ప్రయత్నం చేశారు. ఈ హీరోలందరూ ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారు కదా!పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అక్కడే రిమాండ్‌కు పంపారు. నిందితులు: 1) మసూరి అనిల్ కుమార్ (ఇసన్నపల్లి), 2) భూపల్లి రాజు (ఇసన్నపల్లి). వీళ్లపై గతంలోనూ కేసులు ఉన్నవి! జిల్లా పోలీస్ శాఖ స్పష్టంగా హెచ్చరిక: పోలీసుల విధులకు ఆటంకం కలిగించితే చట్ట చర్యలు తప్పవని హెచ్ఛారించారు. ప్రజల రక్షణ, సమాజ శాంతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. అందరూ సహకరించండి అని విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

10th లో 70% నుంచి 80% మార్కులు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్తు “

తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి)జనవరి 27: కొవ్వూరులోని పి.ఎం.ఎం.ఎం (PMMMM) పాఠశాలలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు జెండాను ఆవిష్కరించారు. ​అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువు ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. “పదో తరగతి అనేది కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు” అని ఆయన పేర్కొన్నారు. ​ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పాస్ మార్కులు సరిపోవని, కనీసం70% నుండి 80% మార్కులు సాధిస్తేనే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సమయాన్ని వృధా చేయకుండా, చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో చైర్ పర్సన్ భావన రత్నకుమారి. టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, దాన రామకృష్ణ, అర్జీల్లి రామకృష్ణ , పోట్రూ మురళి, బేతిన నారాయణ,వేమగిరి వెంకట్రావు మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.