Thursday, 30 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నం-శరవేగంగా శివం-టు-శివంరోడ్డు పనులు

శ్రీకాళహస్తి ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నం-శరవేగంగా శివం-టు-శివంరోడ్డు పనులు శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పట్టణంలోని జాతీయ రహదారి (NH) నుండి నేరుగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వరకు నిర్మిస్తున్న ‘శివం టు శివం’ రహదారి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కాబోతుండటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ. 42 కోట్ల ప్రతిపాదనల నుండి రూ. 22 కోట్లకే కార్యాచరణ: గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ‘శివం టు శివం’ రోడ్డు ప్రాజెక్ట్‌కు సుమారు రూ. 42 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, పనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్ట్‌ను కేవలం రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇది నిధుల సద్వినియోగానికి, ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులతో రోడ్డు నిర్మాణంతో పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థను STP ప్లాంట్‌కు అనుసంధానించే పనులు కూడా చేపట్టారు. పనులపరిశీలన,అభివృద్ధికిప్రణాళికలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అధికారులతో కలిసి రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలపై తగిన సూచనలు చేశారు. ఈ రహదారి పొడవునా నది వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్‌లు వంటివి ఏర్పాటు చేసి పర్యాటక శోభను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి శ్రీకాళహస్తిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ‘విజన్-2029’ ప్రణాళికలో ఈ రోడ్డు నిర్మాణం ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. తగ్గనున్నట్రాఫిక్ఇక్కట్లపైహర్షంవ్యక్తంచేస్తున్నప్రజలు ‘శివం టు శివం’ రోడ్డు పూర్తయితే, తిరుపతి, చెన్నై వైపు నుండి వచ్చే భక్తులు, ప్రయాణికులు పట్టణంలోకి రాకుండానే నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. దీనివల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, ప్రజలకు, భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. కూటమి ప్రభుత్వ వేగవంతమైన చర్యలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.

తిరుపతి

కేంద్ర మంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసిన- కోలా ఆనంద్

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ కేంద్ర కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఆహ్వానం అందింది. శనివారం నాడు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రిని బీజేపీ నాయకులు కోలా ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ప్రాశిస్త్యాన్ని మంత్రికి కోలా ఆనంద్ వివరించి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తూ ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. లోకకళ్యాణార్థం జరిగే ఈ పవిత్ర కార్యక్రమాలకు హాజరై భోళాశంకరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అందుకు మంత్రి శ్రీనివాస వర్మ సానుకూలంగా స్పందిస్తూ, స్వామివారి సేవలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రప్ప, సుబ్రహ్మణ్యం రెడ్డి, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఉపాధ్యాయులు బాలు విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన

తొట్టంబేడు, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: మండలంలోని దిగువ సాంబయ్య పాళెం గ్రామంలో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా ఫౌండేషన్ స్కూల్ లో ప్రధానోపా ధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడే బొమ్మతో వివిధ రకాల జంతువులు, పక్షులు,వాహ నాలు ధ్వనులను ,గేయాలను అనుకరిస్తూ విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంట్రిలాక్విజం అనేది విభిన్నమైన కళ అని దాని ద్వారా విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శన చేయడం వలన వారిలో సృజనాత్మ కత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం పిల్లలు బంక మట్టితో వివిధ ఆకృతులో బొమ్మలు తయారు చేసి రోజంతా ఉల్లాసంగా గడిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో బొజ్జల బృందమ్మ అకస్మిక తనిఖీలు

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి ప్రభుత్వాఏరియా ఆసుపత్రిలో శనివారం నాడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ అకస్మిక తనిఖీలు చేయపట్టారు. ఆసుపత్రి పనితీరు, రోగులకు సమయానికి వైద్యం అందుతోందా, అందుబాటులో ఉన్న సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను ఆమె స్వయంగా పరిశీలించారు. శానిటైజేషన్, బాత్రూమ్స్, వార్డులు, రూమ్స్‌లోని ఎక్విప్మెంట్స్‌ను పరిశీలించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వైద్యశాల సిబ్బందికి సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో బొజ్జల బృందమ్మ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే తమాకు తెలియలని, తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అంటూ రోగులకు భరోసా ఇచ్చారు. రోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఆమె, డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి కూడా వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల

కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకార్ జిల్లాలో జరుగుతున్న సీఐటీయూ, సీడబ్ల్యూఎఫ్ఐ జాతీయ సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర ప్రతినిధులు దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, ఉద్యోగ భద్రత కోల్పోతున్నారని, కార్మిక చట్టాల రక్షణ పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఐటీయూ నాయకత్వం పిలుపునిచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలకు, కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ – ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరారు. కార్మికుల కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పన, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జనగాం

జనగామ మున్సిపల్ 5వ వార్డు అభ్యర్థి రేణుకుంట్ల మురళి

5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా:తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల మురళి —————————————————- జనగామ, ఫిబ్రవరి7,పున్నమి న్యూస్: జనగామ మున్సిపల్ ఎన్నికలలో 5వ వార్డు నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న రేణుకుంట్ల మురళి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు,తెలంగాణ ఉద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త,కవి,గాయకులు,రచయిత, సామాజిక సేవకులు మాట్లాడుతూ 5వ వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని,అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను సావధానంగా వింటూ,నోట్ చేసుకుంటూ నిత్యం అందుబాటులో ఉండి సేవచేయడానికి సిద్ధంగా ఉంటానని శపథం చేస్తూ,ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అధిక మెజారిటీతో గెలుపిస్తారని ధీమా వ్యక్తం చేశారు

సిద్ధిపేట

దుబ్బాక మున్సిపాలిటీ 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన

దుబ్బాక 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన దుబ్బాక /పున్మమి ప్రతినిధి /ఫిబ్రవరి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ నుండి 13వ వార్డు అభ్యర్థిగా మోత్కుపల్లి ప్రతిభ కరుణాకర్ పోటీ చేస్తున్నారు ఈ 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వుపై తనకు అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు 13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహిస్తాం. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తాం అని హామీ ఇచ్చారు అదేవిధంగా మన వార్డులో యువకులకు చదువుకునే విధంగా గ్రంథాలయం మరియు మన వార్డు ఆడబిడ్డల పెళ్ళికి 10,116 రూ”సహకారం వార్డులో చెత్తకుండీలను ఏర్పాటు చేయడం మురికి కాలువలను రోజువారి శుభ్రత చేయించేలా చూడటం కొత్త డ్రైనేజీ కాలువలను నిర్మించడం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందివ్వడం ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు తన బాధ్యతగా చేస్తానని మాట ఇచ్చారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు

హెల్త్ టిప్స్

బిర్యానీ ఆకు – చిన్న ఆకు, పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు

బిర్యానీ ఆకు వంటలకు సువాసన కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, శ్వాస సమస్యలలో ఉపశమనం ఇస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బిర్యానీ ఆకుతో చేసిన కషాయం శరీరాన్ని శుభ్రపరిచి డిటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. రోజూ పరిమితంగా వంటల్లో వాడితే దీర్ఘకాల ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

హెల్త్ టిప్స్

రాగిజావ – సంపూర్ణ పోషకాహారం, సంప్రదాయ ఆరోగ్య రహసం

రాగిజావ మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అనుకూలమైన ఆహారం. రాగిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా శక్తిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చాలా సురక్షితమైన ఆహారం. జీర్ణక్రియను మెరుగుపరచి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రోజూ ఉదయం రాగిజావ తాగితే శరీరం తేలికగా ఉండి, రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

హెల్త్ టిప్స్

నేరేడు పండు – మధుమేహానికి సహజ రక్షణ

నేరేడు పండు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన కాలానుగుణ ఫలం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి ఆకలిని నియంత్రిస్తాయి. చర్మ సమస్యలు తగ్గి చర్మం మెరుస్తుంది. నేరేడు పండు మాత్రమే కాకుండా దాని గింజల పొడిని కూడా ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది దీర్ఘకాలంగా తీసుకుంటే మధుమేహ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.