Wednesday, 29 April 2026

Blog

వనపర్తి

సోలిపూర్ ఉన్నత పాఠశాలలో సందర్శించిన హిందీ రిసోర్స్ పర్సన్

*సోలిపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఇన్స్పెక్షన్ టీం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 09/ 02/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోలిపూర్ ఈరోజు పాఠశాలను జిల్లా ఇన్స్పెక్షన్ టీం సందర్శించడం జరిగింది అందులో ఆరవ తరగతి హిందీ పండితులు కే. వెంకటేష్ గారి బోధన అభ్యసన ప్రక్రియలను సందర్శించడం రికార్డులను తనిఖీ చేయడం పిల్లల్లో ద్విత్వాక్షర, సంయుక్తాక్షరముల పరిచయం, పిల్లలు హిందీ భాషలో ఆత్మ పరిచయం మొదలగు అభ్యసన ప్రక్రియ ద్వారా యాక్టివిటీస్ బోధన పద్ధతి ద్వారా హిందీ సులభంగా నేర్చుకోవచ్చని హిందీ రిసోర్స్ పర్సన్ ఎమ్ ఎన్ విజయ కుమార్ తెలియజేశారు. అలాగే రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి కష్టపడి హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించుకొని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.*

తిరుపతి

ముక్కంటి సన్నిధిలో సినీ సంగీత దర్శకుడు తమన్

శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల దర్శనార్ధం ఆదివారం నాడు ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్, గాయకులు శ్రీకృష్ణ విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం శ్రీ మేధా గురుదక్షణమూర్తి స్వామి సన్నిధిలో ఆలయ వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో శరవేగంగ స్వర్ణముఖి నది ప్రక్షాళన పనులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వర్ణముఖి నది శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గతంలో చెత్తాచెదారంతో నిండిపోయి, దుర్వాసనతో అపరిశుభ్రంగా మారిన స్వర్ణముఖి నది పరిసరాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించిన అనంతరం వేను వెంటనే నది ప్రక్షాళన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ప్రతి నిమిషం సమన్వయం చేస్తూ, పనులు వేగవంతం చేసి అద్భుతంగా నదిని ప్రక్షాళన చేయించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో (“శివం టు శివం రోడ్డు”) పనులను కూడా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, నిర్ణీత కాలానికి ముందే పూర్తి చేస్తున్నారు. పనుల సమయంలో పట్టణ ప్రజలకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్వర్ణముఖి నూతన నది ఘాట్లు, పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రపరచబడటంతో పాటు, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన స్వర్ణముఖి, ఇప్పుడు సుందరంగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇబ్బంది పడకుండా అభివృద్ధి పనులు పూర్తి కావడంపై ఎమ్మెల్యే బొజ్జల నాయకత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా ద స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు పవర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహ మూర్తి, సినీ నటులు కె. వి. ప్రదీప్, సరస్వతి హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యక్తలు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారో ఏమి చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వ్యక్తిత్వం, క్రమశిక్షణతో గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ సంస్కారవంతంగా ఎదిగితే ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలు అందుకుంటారని బిడ్డలకు తల్లిదండ్రులు ఉన్నత విలువ లతో కూడిన విద్యను అందించడమే ఆస్తులు కన్నా మిన్న అని సినీ యాక్టర్ ప్రముఖ మోటివెటర్ ప్రదీప్ కుమార్, కె.వి. సరస్వతి అన్నారు. అనంతరం డిఎస్పీ నరసింహ మూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి సంస్కారవంతగా, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డాక్టర్ అర్చన పవర్ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు- ఇంచార్జ్ యం.ఆర్.ఓ

శ్రీకాళహస్తి: జిల్లాలో మండలం, డివిజన్, జిల్లాస్థాయిలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌ను రద్దు అయినట్లు శ్రీకాళహస్తి ఫుల్‌అడిషనల్‌ ఇన్‌ఛార్జి తాసిల్దార్ అనిల్‌కుమార్‌ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా సమాచారం తెలిపారు. ప్రకటనలో ఆయన వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌విధానంలో రాష్ట్ర సచివాయలం నుంచి మంత్రులు, ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో కలిసి వర్చువల్‌గా జిల్లా, డివిజన్,మండల, గ్రామస్తాయి అ«ధికారులతో సమీక్షిస్తారని అందుకేపీజీఆర్‌ఎస్‌ను రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఎవరూ వ్యయప్రయాసలకు ఓర్చి పీజీఆర్‌ఎస్‌కు రావద్దని ఆయనకోరారు.

తిరుపతి

కల్తీ నెయ్యిలో అసలుసూత్రధారులు జగన్ సుబ్బారెడ్డేలే-ఉమేష్ రావు,కోట చంద్రశేఖర్

శ్రీ కాళహస్తి నియోజిక వర్గ దేలుగుదేశంపార్టీ నాయకులు టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్ లు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యిలో విషయంపై పత్రిక ప్రకటన విడుదలా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా అత్యంత పవిత్రంగా స్వీకరించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించడం వెనుక అసలు సూత్రధారులు మాజీ సియం జగన్ రెడ్డి, అతని బాబాయ్ వైవి సుబ్బారెడ్డిలని ఆరోపించారు. తిరుమల లడ్డూని రసాయనాల లడ్డూగా మార్చింది నిజమే అని జగన్ బాబాయ్, నాటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని,ఆ లడ్డూలో ఏయే రసాయనాలు కలిసాయి అన్నది సీబీఐ, సిట్ ల దర్యాప్తు నివేదిక స్పష్టంగా చెప్పినప్పటికీ జగన్ & కో జనాన్ని మోసం చేయడానికి కథలు చెబుతూనే ఉన్నారని 2019-24 మధ్యకాలంలో ఐదేళ్లపాటు తిరుమల వెంకన్న ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ధారించడంతో దేశమంతా హిందువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, హిందూ మతంపై కక్షతో జగన్ రెడ్డి మరియు అతని బృందం శ్రీవారి సన్నిధిలో పాల్పడిన మహా పాపాలను జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా… కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసి బుకాయించడానికి సిగ్గు లేదని నిలదీశారు. 2022 వ సంవత్సరంలోనే లడ్డూ తయారీలో జరిగిన కల్తీ పై CFTRI రిపోర్ట్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ పై చర్యలు తీసుకోకుండా,దాన్ని తొక్కి పెట్టి, లడ్డూ కల్తీని కొనసాగించి మహా అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కాని నెయ్యిలో జంతువుల కొవ్వు, పామాయిల్ ఉన్నట్లు NDDB నివేదిక ఇచ్చిందని… ఇవి ముఖ్యమంత్రి చేసినవి ఆరోపణలు కావని వారు గుర్తు చేశారు. శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్‌ ఉపయోగించి తయారు చేసిన నెయ్యిని కలిపిన మహా పాపం శ్రీశైలంలోనూ జగన్ రెడ్డి యొక్క వైసీపీ పాలనలోనే జరిగిందని, మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేసిన జగన్ గ్యాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ఏ నివేదిక లోనూ క్లీన్‍చిట్ ఇవ్వలేదని, NDDB రిపోర్ట్ లో ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉందని రిపోర్ట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారని సిట్ తేల్చింది.ఈ కల్తీ లడ్డూలే అయోధ్యకి కూడా పంపించి మహా పాపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు బిసి విభాగం నాయకులు గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏ.పి. సీఎంని కలిసిన బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరిబాబు

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజిక వర్గ తెదేపా నాయకులు, తిరుపతి పార్లమెంట్ బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్నవరం హరిబాబు అమరావతి రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. మాజీ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాండ్ల, తెలికుల బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షితో కలసి ఎలక్షన్ ముందు గాండ్ల కులస్తులకు ఇచ్చిన బిసి డిక్లరేషన్ లో భాగంగా డిమాండ్ల వినతి పత్రాన్ని హరిబాబు సీఎంకి అందజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పత్రిక ప్రకటన ద్వారా కన్నవరం హరిబాబు తెలిపారు.

జనగాం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించండి:తీన్మార్ మల్లన్న

టీఆర్పి అభ్యర్థులను గెలిపించండి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ————————————— జనగామ, ఫిబ్రవరి 08,పున్నమి న్యూస్: ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకులను,అభివృద్ధికి పాటు పడే విద్యావంతులను ఎన్నుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న తెలిపారు. జనగామ పట్టణం మున్సిపాలిటీ 5,10,13,23 వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి 5వ వార్డు లో పో పోటిచేస్తున్న రేణుకుంట్ల మురళి బైండ్ల కు మద్దతుగా ప్రజల వద్దకు వెళ్ళి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీ లకు అనేక సార్లు అవకాశం ఇచ్చారని అయినప్పటికీ మున్సిపాలిటీ లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే మిగిలి పోయాయని అన్నారు. ఈ ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే రాజకీయాలు మారడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.ఎప్పుడూ ప్రజల ‌మధ్య ఉండి,వారి అభివృద్ధి కై నిరంతరం పనిచేసే నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులని మల్లన్న తెలిపారు.మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిలదేనని అందుకు ప్రజలు తమ ఓటు కత్తెర గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.జనగామ మున్సిపల్ కౌన్సిల్ లో డ్రెయినేజీ,రోడ్లు,వీధి దీపాలు,తాగునీరు ఏర్పాటు కు గట్టి పోరాటం చేస్తామని అన్నారు.ప్రచారంలో మల్లన్న తో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా ,మండల,పట్టణ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజుకు ఘన జన్మదిన సన్మానం

ముస్తాబాద్ / పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి స్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు గారి జన్మదినం సందర్భంగా ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే.కే. మహేందర్ రెడ్డి గారు పాల్గొని గజ్జెల రాజు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం రాజు గారు చేస్తున్న సేవలను మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. ముస్తాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

E-పేపర్

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల సర్కిల్ జిహెచ్ఎంసి ఫిబ్రవరి 8: ఆదిభట్ల సర్కిల్ కార్యాలయ పరిధి మంగళపల్లి ప్రధాన రోడ్ లో గల సాహస అర్బన్ డైన్ ఇన్ హోటలను శనివారం గ్రేటర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇతనికీలో తేల్చారు. నిషేధిత పదార్థాలతో తయారుచేసిన ఆహారాన్ని పడేశారు వినియోగదారులకు రుచికరంగా ఉండేందుకు నిషేధిత టెస్టింగ్ ఉప్పు ని వాడినట్లు గుర్తించారు. హోటల్లో శుభ్రత పాటించట్లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళ అధికారి ఎన్ వనిత అక్కడి పరిస్థితిని తన చరవానీ లో రికార్డు చేస్తుండగా హోటల్ సిబ్బంది తనను బెదిరించారని చరవాణిని లాక్కున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.